Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఫ్రాగ్మెంట్స్ 4

కవిత్వం, ఫ్రాగ్మెంట్స్, సాహిత్యం... నాగరాజా
1"బాబూ! ఒక స్ట్రిప్ ఐ పిల్స్ ఇవ్వు"జీన్స్ లో ఆమెబైక్ పై అతను.రసాయిన సమానత్వం.*******2పాతికేళ్లలో ప్రపంచంఎంతమారిపోయినామావూరి తాటి ముంజెలకుఇంకా అదే రుచి.*******3సీసాలో ద్రవంలాఈ లోకపు అన్ని వంకరలనూఇముడ్చుకొన్న నాడుసంకెళ్లు కూడా సుఖంగా ఉంటాయి.*********4ఖాళీ చేసిన ఇంటివాసనగుండెగొంతులోబిలబిలా జారేసారాయి గరగర.*******బొల్లోజు బాబా
పూర్తిగా చదవండి

ఫ్రాగ్మెంట్స్ 3

కవిత్వం, ఫ్రాగ్మెంట్స్, సాహిత్యం... నాగరాజా
1.ఇక ఇప్పుడుసంభాషణ అంటేసెల్ పోను డిస్ప్లేలోనంబరుచూసుకొనిటాక్ బటను నొక్కడమే!నాగరికతానరకాన్ని ప్రేమిస్తానుకొలిమిలోకి ఒంటరిగా సాగనీ.******2.రాత్రినుంచి వానచినుకులుమంత్రాల్ని జపిస్తూ,ఆకులతో వల్లె వేయిస్తూన్నాయి.వానచినుకులచుంబనాలతో అలసినతడితడి పూలపెదవులపైవేకువ వెండివెలుగై పరచుకుంది.*****3నీ నిష్క్రమణతరువాత రోజులన్నీఒకేలా ఉన్నాయి.మరోసారిఏడవటం తప్పమరేం చేయగలను చిన్నమ్మా!*****4అలంకరణ అద్దంఆమె అందాన్నంతాతిరిగిచ్చేసింది.బొల్లోజు బాబా
పూర్తిగా చదవండి

ఫ్రాగ్మెంట్స్ 2

కవిత్వం, ఫ్రాగ్మెంట్స్, శకలాలు, సాహిత్యం... నాగరాజా
1.పావుగంటగా ఆలోచనలేమీ లేవుయవ్వనం ఫోల్డర్ ఓపెను చేసా!నీ పరిమళం చుట్టుముట్టింది.*******2.కోరికకు సాఫల్యానికిమధ్య అగాధం.చితిలో ఇంకా నిప్పుంది.పోరాడాల్సిందే!*******3.నిన్నటి రోజాలుఎక్కడకు పోయినయ్?కుసుమం వికసించటంలోనేదాని చావుంది.*******4.భాయ్నేను చెప్పే ఈ విషయాన్నిప్రపంచం నమ్మటంలేదు.మనిద్దరం ఒకే వేర్లని కలిగి ఉన్నాం.********5.నగ్న తరువులు --పత్రాల, పుష్పాల దుస్తులు లేవు.వసంతం వస్తోంది.బొల్లోజు బాబా
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS