Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఏక్ నిరంజన్(రివ్యూ)

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
గత నెల రోజులుగా అమ్మా లేదు..నాన్నా లేదు ..ఏక్ నిరంజన్ అంటూ పాట వింటూ వింటూ అమ్మా..నాన్న ఆగమన్నా కూడా ఆ సినిమాకు వెళ్ళి తీరాలని ఫిక్స్ అయ్యా…వెళ్లా..ఏమైంది..మళ్లీ బుజ్జిగాడు దర్శనమిచ్చాడు. అదేంటి అప్పుడు చూసాంగా అంటే ఈసారి నేను బౌంటీ హంటర్ ని అన్నాడు. అలా వచ్చావా…కానీయ్ .. అయినా పూరీ సినిమాల్లో ఒకే క్యారెక్టర్ రిపీట్ అవుతూండటం కామనే కదా అని కూర్చున్నా. కాస్స్పటికి కథ,కథనాలను ప్రక్కన పెట్టి కేవలం డైలాగులను,పాటలను నమ్ముకుని ఏక్ [...]
పూర్తిగా చదవండి

ఎగిరే పావురమా – ఒక గొప్ప ప్రేమ సందేశం

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
1997లో విడుదల అయిన “ఎగిరే పావురమా” సినిమా నాకు బాగా నచ్చిన ప్రేమ కథా సినిమాలలో ఒకటి. ఇది ఏమాత్రం రొటీన్ ప్రేమ కథ కాదు. అన్ని ప్రేమ కథలకీ పూర్తి భిన్నమైన ప్రేమ కథ. పావురాన్ని పంజరంలో పెట్టినప్పుడు దాన్ని ఎంత ప్రేమగా చూసినా అది నిజమైన ప్రేమ కాదు. సినిమా ఈ సందేశం ఇస్తుంది కాబట్టే ఈ సినిమాకి “ఎగిరే పావురమా” అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో జ్యోతి (లైలా) తండ్రి ఒక తాగుబోతు. [...]
పూర్తిగా చదవండి

బెండు అప్పారావే సూపర్ హీరో

featured, lead, అల్లరి నరేష్, కామెడీ, తెలుగు, బెండు అప్పారావ్, భారతీయ సినిమా, రివ్యూ, సమీక్ష, హాస్యం నాగరాజా
పోయిన వారం బెండు అప్పారావు సినిమా చూడటం జరిగింది. సినిమా బాగుంది. మొదటి నుండి చివర వరకు నవ్వులే నవ్వులు. నవ్వకుండా ఉండలేము. నేను ఒక్కడినే కాదు హాల్ మొత్తం దిగువ టిక్కెట్ నుండి ఎగువ టిక్కెట్ వరకు పగల బడి నవ్వుతూనే ఉన్నారు. అంతకంటే ఒక సినిమాకు కావల్సినదేముంది? ఈ మధ్య మితృలు కొందరు మన తెలుగు సినిమాలో జనర్ అనే కాన్సెప్ట్ లేదు అంతా కలిపి కలగూరగంపలా రోట్లో వేసి రుబ్బటమే అని వ్రాశారు. [...]
పూర్తిగా చదవండి

స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
సినిమా కథ గురించి చదివే ముందు ఓ నిజ జీవితపు కథని చదవండి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన దేశంలో నేరస్త జాతుల చట్టం అనే చట్టం ఒకటి ఉందేది. ఆ చట్టం కింద ఉత్తర భారత దేశానికి చెందిన మీనా, పార్ధీ తదితర కులాల వాళ్ళనీ, దక్షిణ భారత దేశానికి చెందిన ఎరుకల, తెలగపాముల, ఎర్రగొల్ల తదితర కులాల వాళ్ళనీ అరెస్ట్ చేసే వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు గుంటూర్ జిల్లా స్టూవర్ట్ పురం గ్రామం దగ్గర [...]
పూర్తిగా చదవండి

బెండు అప్పారావు(రివ్యూ)

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
అప్పుల అప్పారావు,ఆ ఒక్కటీ అడక్కు వంటి ఎన్నో నవ్వొచ్చే కామిడీలు తీసిన ఇవివి కొత్త సినిమా రిలీజ్ అంటే ఉషారే. అయితే ఫిటింగ్ మాస్టర్,పెళ్లయింది కానీ..అంటూ వదిలిన సినిమాలు గుర్తుకు వచ్చి కాస్త భయం కలిగిన మాట వాస్తవం. అయితే ఆయన పాత సినిమాలతో పోల్చదగినదీకాదు.. మరీ అంత రోత పుట్టించే వ్యవహారం కాదు..ఈ బెండు అప్పారావు. ట్రీట్ మెంట్ (స్టోరీ)సమస్యగా వచ్చినా డైలాగులతో లాక్కెళ్ళిపోయాడు.అయినా ఏ డాక్టరూ లేనిచోట ఆర్.ఎంపి డాక్టర్ దేముడు [...]
పూర్తిగా చదవండి

The Blue Umbrella (2007)

featured, lead, vishal bharadwaj, భారతీయ సినిమా, సమీక్ష, హిందీ సౌమ్య
మొన్నోరోజు “ది బ్లూ అంబ్రెల్లా” సినిమా చూశాను – మళ్ళీ. మొదటిసారి చూసినప్పుడు నాకు ఓ మంచి హాయైన అనుభాతిని మిగిల్చింది ఈ సినిమా. ఇప్పుడంటే, విశాల్ భరద్వాజ్ పేరు మార్మోగిపోతోంది కానీ, మక్డీ, బ్లూ అంబ్రెల్లా – వంటి చిన్న పిల్లల సినిమాలు కూడా, ఓంకారా, కమీనే – వంటి సినిమాలు తీసిన మనిషే తీశాడంటే, కొంచెం వింతగానే ఉంటుంది నాకు ఇప్పటికీ. ఇదివరలో ఈ సినిమా గురించి ఓసారి వేరేచోట రాసాను – మొదటిసారి [...]
పూర్తిగా చదవండి

శంకరాభరణం (1979) – నా అనుభవం

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష సౌమ్య
ఆ మధ్యోరోజు పొద్దున్నే లేచి ఏమీ తోచక సీడీలున్న షెల్ఫ్ తిరగేస్తూ ఉంటే, కనిపించింది – శంకరాభరణం అన్న పేరు. నేను ఇదివరలో ఈ సినిమాని ఒకసారి చూశాను. పూర్తిగా చూడలేదనుకుంటాను. అయితే, “దొరకునా ఇటువంటి సేవ” నేను డైలీ బేసిస్ లో తల్చుకునే పాటల్లో ఒకటి కావడం వల్ల ఈ సినిమా అంటే నాకు ప్రత్యేకాభిమానం ఉంది. ఆ కారణంచేత ఈ సినిమాను మళ్ళీ చూడటం మొదలుపెట్టాను. చూసి మూడువారాలౌతోంది. అయినా, ఇంకా ఆ వావ్ [...]
పూర్తిగా చదవండి

నాన్ కడవుళ్ డవుళ్ వుళ్ ళ్ …

featured, lead, భారతీయ సినిమా, విశ్లేషణ కొత్తపాళీ
ఈ సినిమా వచ్చేసి చాలా కాలమైంది కాబట్టి ఇది సమీక్ష కాదు, దీన్ని మరీ లోతుగా తవ్వే ఓపిక నాకు లేదు కాబట్టి ఇది విశ్లేషణా కాదు .. సినిమా చూసిన ఒక సగటు ప్రేక్షకుడి ఘోష అనుకోండి. దివినించి శివుడి జటాజూటంలోకి దూకే గంగాప్రవాహంలాంటి ఒరవడితో మొదలై, అనేక వింత వింత మలుపులు తిప్పి, ఎన్నో విచిత్రాలున్నూ చూపించి, ఆఖరికి ఇంటెనక పిల్ల కాలవలా చడీ చప్పుడూ కాకుండా ముగిసిపోయిందీ విచిత్రమైన సినిమా. కానీ ముగింపొక్కటే సినిమా [...]
పూర్తిగా చదవండి

హా..మహాత్మా!!( రివ్యూ)

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
బ్యానర్: గోల్డెన్ లయిన్ ఫిలింస్ నటీనటులు: శ్రీకాంత్, బావన,జయప్రకాష్ రెడ్డి,ఉత్తేజ్,రామ్ జగన్,పరుచూరి వెంకటేస్వరరావు,జ్యోతి,ఆహుతి ప్రసాద్ తదితరులు. సంగీతం: విజయ్ ఆందోని కెమెరా: శరత్ ఎడిటింగ్ : శంకర్ ఫైట్స్ : విజయ్ డైలాగులు: పరుచూరి బ్రదర్శ్ కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కృష్ణవంశి నిర్మాత: సి.ఆర్.మనోహర్ రిలీజ్ డేట్: 09,అక్టోబర్ 2009 శశిరేఖా పరిణయం చూసాక ఇక కృష్ణవంశి సినిమాలు చూడకూడదని ఒట్టు పెట్టుకున్నా..అయితే మహాత్మా టైటిల్,పోస్టర్స్ చూసాక మనసాగక..మాట తప్పి ధియోటర్లో అడుగుపెట్టా..అయితే అందుకు తగిన ఫలితం స్పష్టంగా అనుభవించా. అసలే కృష్ణవంశి..ఆపై పరుచూరి వారి అండ దాంతో సినిమా బండ.. ఏతావాతా(వాతలు [...]
పూర్తిగా చదవండి

కధను డామినేట్ చేస్తున్న బ్యాక్‍డ్రాప్‍లు

featured, lead, భారతీయ సినిమా, విశ్లేషణ నాగరాజా
రెండేళ్ళ కాలంపాటు నిర్మాణమై ఎన్నో అంచనాలతో ఈ మధ్య విడుదలైన భారీ సినిమా మగధీర! రామ్‍చరణ్‍తేజ వారసత్వం, గీతా ఆర్ట్స్ నిర్మాణత్వం, రాజమౌళి దర్శకత్వం వంటి ఆకర్షణీయమైన ఎలిమెంట్స్ తో ఈ సినిమా కావల్సినంత పబ్లిసిటీని సాధించింది. ఇక సినిమా విడుదలైన తర్వాత ఇప్పుడు ఈ సినిమా వీటన్నిటినీ మించి మరో ’ఎలిమెంట్‍’తో చర్చనీయాంశం అయింది. అదే- ’చారిత్రక బ్యాక్‍డ్రాప్’! మరో మాటలో చెప్పాలంటే ’పిరియాడిక్ బ్యాక్‍డ్ర్రప్!’ ఇలా సినిమా కధను నిజంగానే సినిమాస్కోప్ స్ధాయిలో, భారీగా, [...]
పూర్తిగా చదవండి

అంతా మన మంచికే (1972)

bhanumathi, lead, అభిప్రాయాలు, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష సౌమ్య
ఒక ఆదివారం పొద్దున్నే ఏడు గంటలకి బోరు కొడుతూ ఉన్నప్పుడు ఈ సీడీ కనిపించింది – “అంతా మన మంచికే” అని. టైటిల్స్ వివరాలు చూసి, “అంతా మన భానుమతే” అనుకున్నాను. అవును మరి – ఇది భరణీ పిక్చర్స్ చిత్రం. దర్శకత్వం భానుమతి. సంగీతంలోనూ పాలు పంచుకున్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి…. ఇది కాక, ఈ సినిమాలో పాటలు కూడా పాడారని చూస్తూ ఉంటే అర్థమైంది. ఇంకా ఏమన్నా చేశారేమో తెలీదు కానీ, సినిమా మాత్రం [...]
పూర్తిగా చదవండి

ఉనైపోల్ ఒరువన్ / ఈనాడు

featured, lead, అభిప్రాయాలు, ఈనాడు, ఉన్నైపోల్ ఒరువన్, చూడదగ్గ చిత్రాలు, తమిళం, భారతీయ సినిమా నాగరాజా
ఈనాడు తెలుగు రీమేక్ గురించి క. మహేష్ గారు రాసిన టపాలో దీన్ని రెడ్ తో చిత్రీకరించారని చదివాక సినిమాని థియేటర్ లో చూడాలనిపించింది. జాక్సన్ విల్ తమిళ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో థియేటర్ లో చూసే అవకాశం ఈ రోజు కలిగింది. ప్రేక్షకుల్ని సినిమాలు చూడ్డానికి థియేటర్లకి పంపిస్తున్న నవతరంగం వ్యాసాలఖాతాలో మహేష్ (గారు వదిలేస్తానింక) వ్యాసం కూడా ఒకటి. నేను వెడనస్ డే చూడలేదు. తమిళంలో పాటకూడ కమల్ హాసనే పాడారు. [...]
పూర్తిగా చదవండి

బాణం-మూడోస్సారి!

featured, lead, భారతీయ సినిమా, విశ్లేషణ శిద్దారెడ్డి వెంకట్
నవతరంగంలో బాణం గురించి జరుగుతున్న చర్చ చూసి ఎలాగైనా ఈ సినిమా చూడాలనిపించింది. (నవతరంగం ఈ సినిమా బాగోలేదని వ్రాసిన సమీక్షలు చదివికూడా ఈ సినిమా చూడాలనుకుని చూసిన చాలామందిలో నేనూ ఒకడిని. ఆ విధంగా నవతరంగం రివ్యూ ఆధారంగా మాత్రమే ప్రేక్షకుడు సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించకోడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ) బాణం సినిమా చైతన్య దంతులూరి అనే నూతన దర్శకుని మొదటి ప్రయత్నం అని తెలిసిందే. ఇక ఈ సినిమా కథ [...]
పూర్తిగా చదవండి

ఈనాడు – సఫలం కాని రీమేక్

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష K మహేశ్ కుమార్
టెర్రరిజం భయంతో, ప్రభుత్వ అలసత్వం మీద నిరసనతో, ఈ పరిస్థితుల్లో  ఏంచెయ్యాలో తెలీని నైరాశ్యంలో జీవిస్తున్న సాధారణ జనంలోంచీ వచ్చిన ఒక ‘సామాన్యుడు’  వ్యవస్థ ఉలిక్కిపడే విధంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని instant justice అమలుజరిపే కథ ‘ఈనాడు’ చిత్రానిది. కథ కొత్తదికాదు. ఎన్నో సినిమాల్లో చూసిందే. కానీ విన్నూత్నమైన కథనం ఈ చిత్రానికి ఆయువుపట్టు. గత సంవత్సరం హిందీలో అనూహ్యమైన విజయం సాధించిన A Wednesday చిత్రానికి తెలుగు రూపం “ఈనాడు”. ఒక భాషలో [...]
పూర్తిగా చదవండి

బాణం

featured, lead, భారతీయ సినిమా, విశ్లేషణ నాగరాజా
అసలు సినిమాలు చూడడం , అందునా తెలుగువి చూడడం చాలా తగ్గించేసిన నేను , ఈవేళ ఒక స్నేహితుడి ఆవేదనను అర్థం చేసుకోవడానికి ఈ సినిమా చూడాల్సి వచ్చింది. నా స్నేహితుడు సినిమా అంటే పడిచచ్చిపోయేరకం. తానూ ఏదో కళాఖండం ఏనాటికయినా సృష్టిస్తానని మాతో ఆవేశపడిపోతుంటాడు. సరే… మిత్రుడయినా వాడు మంచి ఫిలింమేకర్‍ అవునో కాదో ఒక సినిమా తీసాక కానీ చెప్పలేము కాబట్టి , ప్రస్తుతానికి వాడికి ఆ అవకాశంరావాలని కోరుకుంటాం. ఈవేళ హఠాత్తుగా వాడినుంచి ఫోన్‍. [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS