Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పిల్లలతో అర్ధనగ్న డాన్స్‌లా… హవ్వ

మన గురించి మనం నాగరాజా
ఈ మధ్యన ఏ టి.వి. చానల్ చూసినా, డాన్స్ బేబి డాన్స్ అనో, డాన్స్ హంగామా అనో పేరు ఏదయితేనేనేం, పిచ్చి పిచ్చి డాన్స్ ప్రోగ్రాములు వెల్లువెత్తుతున్నాయి. పెద్దవాళ్ళవరకు అయితే పరవాలేదు కాని, మరీ దారుణంగా చిన్నపిల్లలచేత కూడా అర్ధ నగ్నంగా ఎబ్బెట్టు కలిగేలా డాన్సులు చేయిస్తున్నారు. కనీసం వారు డాన్స్ చేసే పాటలకు అర్ధం కూడా తెలియకపోయినా, ఆయా సినిమాలలో హేరో, హేరోయిన్లను అనుకరిస్తూ వారు చేసే చేష్టలు చూస్తుంటే జాలి, కోపం ఒకే సమయంలో కలుగుతున్నాయి. ఎక్కడయినా పల్లెటూరిలో రికార్దింగ్ డాన్స్ జరిగితె పత్రికలు, మీడియా, పోలీసులు దాన్నో పెద్ద తప్పుగా చిత్రీకరిస్తారు. అవి చేసేవాళ్ళు పొట్ట కూటి కోసం చేస్తున్నాగాని. ఇక్కడ వాళ్ళని సమర్ధించడం నా ఉద్దెశ్యం కాదు గాని, అదే తప్పు బహిరంగంగా రాష్ట్రమంతటా అనేక కోట్ల మంది చూస్తుండగా ప్రసారం చేయడం నిజంగా తప్పే. పైగా అదేదో గొప్ప పనిలా ఆ పిచ్చి గంతులలో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు అంటు కొలతలొకటి.అన్నిటికంటే దారుణమయిన విషయం ఏమిటంటె తల్లితండ్రులు కూడా తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలియదు కాని, తమ ...
పూర్తిగా చదవండి

జీవిత సత్యం:

మన గురించి మనం నాగరాజా
ఎవరయినా మన జేబులో నుండి ఒక పది రూపాయిలు తీసారనుకోండి. వెంటనే వాడిని పట్టుకుని కొట్టేవరకు వెళ్ళిపోతాము. వీలు దొరికితే కొడతాము కూడా. కాని, ఎవడో తెలిసున్నవాడు వచ్చి వెయ్యి రూపాయిలు అప్పు తీసుకుని ఎగ్గొట్టేస్తాడు. వాడు తీర్చగలిగి కూడా మొఖం చాటేస్తాడు. కాని వాడినేమీ అనలేము. మన అవసరం కొద్దీ వేలాది రూపాయిలు లంచంగా ఇవ్వడానికి కూడా వెనుకాడము. వ్యాపారం చేసే వారయితే అరువులు ఇచ్చి, దర్జాగా సరుకు పట్టుకు పోయి తిరిగి ఇవ్వకుండా ఎగనామం పెట్టే వారిని ఏమీ అనరు. నిజంగా అవసరం కొద్దీ ఆకలి కొద్దీ డబ్బులు అడిగితే ఇవ్వడానికి మనసు ఒప్పదు. ముందు ఘరనాగా డబ్బులు ఎగ్గొట్టే ఇలాంటి వాళ్ళను పట్టుకుని నాలుగు తన్ని, అప్పుడు ఆ డబ్బుతో నాలుగు మంచి పనులు చెయ్యవచ్చేమో ఆలోచించండి.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS