Aug 03
మద్రాసు పిలిచింది కర్నూలు నుండి తిరిగొచ్చేసిన కొంత…
మా నాన్నగారి స్మృతు తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
మద్రాసు పిలిచిందికర్నూలు నుండి తిరిగొచ్చేసిన కొంతకాలానికి వెంకటేశ్వర్లుగారికి మద్రాస్ పచ్చయప్ప కళాశాలలో LL.B.తరగతిలో ప్రవేశం లభించింది.అది మద్రాస్ విశ్వవిద్యాలయానికి ఉన్న సొంత కేంపస్సుల్లో ఒకటి.అసలు మద్రాస్ విశ్వవిద్యాలయానికి మన విశ్వవిద్యాలయాల్లాగా ఒక కేంపస్సంటూ ఏమీ లేదు.హాస్టళ్ళు ఈనాటికీ లేవు.విద్యార్థులు తమ కళాశాలకి దగ్గరగా ఉన్న ప్రైవేటు ఇళ్ళలో గదులు అద్దెకి తీసుకుని వెళ్ళొస్తూండడమే.దానికి చెందిన వివిధ కళాశాలలు మద్రాస్ నగరమంతటా అక్కడక్కడా చెల్లాచెదురుగా ఉన్నాయి.మద్రాసు బీచి దగ్గర విక్టోరియన్ శైలిలో కట్టబడిన ఒక పాత కట్టడంలో దాని పరిపాలనా భవనమూ గ్రంథాలయమూ నెలకొని ఉన్నాయి.వెంకటేశ్వర్లుగారు మద్రాసు వెళ్ళిన కొత్తల్లో తాను కూడా ఒక గది తీసుకుని ఉన్నారు.ఆ జీవితం ఆయనకు బొత్తిగా నచ్చలేదు.ఇలా కాదనుకుని తన ఆప్త బంధువులైన ధారావారితో తన ఇబ్బంది చెప్పుకున్నారు."ఛీ ! గదుల్లో ఎందుకురా వెంకులూ, ఉండడం ? మద్రాస్‌లో మన కంపెనీ గెస్ట్ హౌస్ ఉందిగా !"అన్నారు ధారావారు.ధారావారికి ఒంగోలు కేంద్రకార్యాలయంగా పనిచేస్తున్న "ధారా అండ్ కంపెనీ"అనే పొగాకు గ్రేడింగ్ మరియు ఎగుమతుల సంస్థ ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి