Aug 21
ఒక డాక్టర్‌గారి కథ-3 శివ శివా !! : డాక్టర్ గారికి…
మా నాన్నగారి స్మృతు తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
ఒక డాక్టర్‌గారి కథ-3 శివ శివా !! : డాక్టర్ గారికి ఇద్దరు అన్నయ్యలు.( పూర్తి పేర్లెందుకులెండి !) వాళ్ళలో పెద్దాయన శర్మ. చిన్నాయన శాస్త్రి.ఆ రోజుల్లో L.C.E అనే ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సు ఒకటి ఉండేది.అది ఇప్పటి పాలిటెక్నిక్కుతో సమానం.వాళ్ళిద్దరూ మద్రాసు వెళ్ళి అక్కడ గిండీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆ కోర్సు చదివారు.అప్పట్లో దక్షిణ భారత దేశానికంతా కలిపి గిండీ ఒక్కటే ఇంజినీరింగ్ కళాశాల.దాన్నే ఇప్పుడు అణ్ణా యూనివర్సిటీ అంటున్నారు.తరువాత పెద్దాయన శర్మకి స్వగ్రామమైన రేపల్లె రైల్వేలోనే ఉద్యోగం వచ్చింది.అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాడు.ఆయన డాక్టర్ గారికి రక్తసంబంధ రీత్యానే కాక ఇతరవిషయాల్లో కూడా అన్నయ్యే.అయితే ఒక తేడా ఉంది.డాక్టర్ గారికీ సంప్రదాయానికీ ఆమడ దూరం.శర్మగారు మాత్రం ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి విభూతి పిండికట్లు దట్టించి పెట్టి నిష్ఠగా పూజలో కూర్చుని "ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ"అంటూ పెద్దపెద్దగా ఇల్లెగిరిపోయేలా ఓ గంటసేపు హంగామా ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి