Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మమ్మీకరణ - కొన్ని సంగతులు

మీకు తెలుసా! మీకు తెలుసా!
  మమ్మిఫికేషన్ - మమ్మీకరణ అనేది ఒక్క ఈజిప్షియనులకే పరిమితం కాలేదు. ఈజిప్టులో వున్న గ్రీకులు, రోమన్లు కూడా మమ్మీకరించబడ్డారు. క్రీ.శ.  5వ శతాబ్దము వరకూ ఈ మమ్మీకరణ ప్రక్రియ జరుగుతూనే వుంది. కానీ ఆ తర్వాత క్రైస్తవ మతము వేళ్ళూనుకొని బలపడేకొద్దీ సన్నగిల్లుతూ వచ్చింది. క్రీ.శ. 400 - 1400 మధ్యకాలంలో మమ్మియా అనేది శక్తి / వృద్ధి కారకముగానూ, అనేక వ్యాధులను తగ్గించ గలిగేది గానూ ...
పూర్తిగా చదవండి

ఆడవాళ్ళ సంగతులు కొన్ని(అమెరికా)

మీకు తెలుసా! మీకు తెలుసా!
అమెరికాలోని వుద్యోగుల్లో ౪౬ శాతం (46%) మంది ఆడవాళ్ళైనా, సైంటిస్టులు, ఇంజనీర్ల విషయాని కొచ్చేసరికి వారి శాతం కేవలం ౨౩ (23%) మాత్రమేనట. అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మగవారితో సమానంగా ఆడవారి సంఖ్య గనుక పెంచితే, ఐటీ లోవున్న ఖాళీలన్నీ నిండిపోతాయట. ౪ (4th) వ తరగతి వరకూ సైన్సూ, లెక్కల్లో ఆడపిల్లలకూ, మగపిల్లలకూ సమానమైన ఇష్టం వున్నా, ౮ (8th) వ తరగతికి వచ్చేసరికి ఆడపిల్లల్లో మగపిల్లల్లాగా సైన్సూ,లెక్కలూ చేయగలమన్న అభిప్రాయం తగ్గుముఖం పడుతుందిట. అంతేకాక, టీచర్లూ, తల్లిదండ్రులూ, తోటివారూ సైన్సూ, సాంకేతిక విషయాలకు దూరంగా వుండేటట్లు ప్రోత్సహిస్తారట. వీటికి తోడు మీడియా కూడా (ప్రచార) మహిళా శాస్త్రవేత్త్లకూ, సాంకేతిక నిపుణులకూ తక్కువ గుర్తింపునిస్తోందిట. ౧౯౮౪ (1984) లో ౩౭ శాతం (37%) మంది మహిళలు కంప్యూటర్ సైన్సులో పట్టా పుచ్చుకుంటే, అది ౧౯౯౯ (1999) లో౨౦ శాతం (20%) కన్నా తక్కువకు పడిపోయిందిట. కానీ తిరిగి ౨౦౦౨ (2002) లో ౩౪ శాతానికి (34%) కు పుంజుకున్నదట. ఓ సర్వే ప్రకారం ఐటీ రంగంలోకి ఆడవారు రావడానికి కారణం ...
పూర్తిగా చదవండి

కొన్ని చిత్రమైన సంగతులు

మీకు తెలుసా! మీకు తెలుసా!
ఎవరికి వారు తమ మోచేయిని నాకలేరట. తెలివైన వారి జుత్తులో జింక్, కాపర్‌ల శాతం ఎక్కువట. ఒక గంట సేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకొనటం వల్ల చెవిలో బాక్టీరియా శాతం 700 రెట్లు పెరుగుతుందట. ప్రపంచంలో 50% మంది ఇప్పటివరకూ ఒక్క ఫోన్ కాల్ కూడా అందుకోలేదట. పారిస్ లోని ఈఫిల్ టవర్ బరువు 1000 ఏనుగుల కంటే ఎక్కువట. ప్రతి 5 సెకన్లకూ ఒక కంప్యూటర్ వైరస్ బారిన పడుతూందిట. ప్రపంచంలో అతి పిన్న తల్లి తండ్రులు 1910లో చైనాలో నివసించిన 8 మరియు 9 యేళ్ళ వయసు గల ఓ పిల్ల జంటట. ఒక నిమిషంలో క్రికెట్ (చిమ్మెట అనుకుంటా) చేసే శబ్దాల్ని 2తో భాగించి, 9 కలిపి, మళ్ళా 2తో భాగిస్తే సెలిసియస్‌లో టెంపరేచర్ వస్తుందట. సముద్రంలో 800 మీటర్ల కన్నా లోతున వుండే చేపలకు కళ్ళుండవట. ద్రాక్ష పళ్ళు మైక్రోవేవ్ వోవెన్‌లో పెడితే విస్ఫోటనం చెందుతాయట. ఇద్దరి మధ్య ఫైటింగ్ (డ్యుయెల్లింగ్)అనేది పెరుగ్వేలో ఆ యిద్దరూ రక్త దాతలైతే న్యాయసమ్మతమేనట. ఇంగ్లండులో Speaker of the House మాట్లాడకూడదట. ఒక్క ఆదివారం తప్ప, మిగతా ...
పూర్తిగా చదవండి

కోఫీ అన్నన్ చెప్పిన కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు

మీకు తెలుసా! మీకు తెలుసా!
యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవెలెప్‌మెంట్ వాళ్ళు ప్రపంచ ప్రజల జీవన విధానాల గురించి రకరకాల సర్వేలు చేస్తూ వుంటారట. వాటిలో కొన్నింటిని కోఫీ అన్నన్ గారు బయటకు వెల్లడించారు. చూడండి.   ప్రపంచంలోని 225మంది అత్యంత ధనికుల (అందులో 60 మంది అమెరకన్లే)  మొత్తం ఆదాయాన్ని కలిపితే అది ఒక ట్రిలియన్ డాలర్ల కన్నా పైచిలుకే. ఇది ప్రపంచ జనాభాలో 47% బీదల సంవత్సరాదాయానికి సమానం.  అమెరికన్లు సంవత్సరానికి 260 పౌండ్ల మాంసాన్ని వాడతారు. అదే బంగ్లాదేశ్ లో ఆరున్నర పౌండ్లేనట. ఐరోపియన్లు ఐస్ క్రీమ్, తత్సంబంధిత పదార్థాల మీద 11 బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ప్రపంచ జనాభాకు ఒక సంవత్సరం వరకూ మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యమూ కల్పిచడానికయ్యే దానికన్నా 2 బిలియన్ల డాలర్లు ఎక్కువ. 48 తక్కువ అభివృద్ధి చెందిన దేశాల మొత్తం ఉత్పాదకత కన్నా, మొదటి ముగ్గురి ధనవంతుల ఆస్తుల మొత్తమే ఎక్కువ. అమెరికన్లు సంవత్సరానికి 8 బిలియన్ డాలర్లు సౌందర్య సాధనాలపై ఖర్చ చేస్తున్నారు.ఇది ప్రపంచం మొత్తానికీ సాధారణ అక్షరాస్యతకు అవసరం అయ్యేదానికన్నా 2 బిలియన్ ...
పూర్తిగా చదవండి

అనుకోనివి కొన్ని…

మీకు తెలుసా! మీకు తెలుసా!
* థీరీటికల్ గా ఆలోచిస్తే టెలివిజన్ సాధ్యమేమోగానీ, నా దృష్టిలో దాని సృష్టి అసాధ్యం. దాని డెవలప్ మెంట్ గురించి ఆలోచించడం కూడా వేస్ట్.                  - 1926లో టెలివిజన్ లో ముఖ్యభాగమైన కేథోడ్ రే ట్యూబ్ సృష్టికర్త లీ డే ఫారెస్ట్ * ప్రపంచం మొత్తం మీద ఐదుకన్నా ఎక్కువ కంప్యూటర్లకు మార్కెట్ లేదు.                  - 1946లో ఐ.బి.యం. సంస్థ చైర్మన్ థామస్ జె. వాట్సన్. * టెలిఫోన్ ను ఒక సమాచార సాధనంగా గుర్తించడానికి దానిలో చాలా లోపాలు వున్నాయి.ఇది మనకు ఏమాత్రం ఉపయోగం లేని వస్తువు.                  - 1876లో వెస్ట్రన్ యూనియన్ మేథావుల సంఘం * నా కాలంలోనే కాదు, ఇంకా ఎన్నో సంవత్సరాలకు గానీ మహిళలకు ప్రధానమంత్రి అయ్యే యోగం రాదు.                 - మార్గరెట్ థాచర్ * అసలు ఆ సౌండే మాకు నచ్చలేదు. గిటార్ మ్యూజిక్ త్వరలో కనుమరుగైపోతుంది.                 - 1962లో డెక్కా రికార్డింగ్ కంపనీ (గిటార్ ను ప్రధాన సంగీత సాధనంగా వినియోగిస్తున్న బీటిల్స్ ను తిరస్కరిస్తూ) * టీవీకున్న పెద్ద ప్రాబ్లెం ఏమిటంటే ప్రజలు టీవీ స్క్రీన్ కు కళ్ళప్పగించి చూడాలి. ...
పూర్తిగా చదవండి

ఏ మందాం వీటిని?

మీకు తెలుసా! మీకు తెలుసా!
మనం ఫార్వర్డ్ స్లాష్(Forward-slash) అని పిలుచుకొనే "/" సింబల్ పేరు స్లాష్ (Slash) మాత్రమే. బాక్‌స్లాష్ (Backslash) గా "\" సింబల్‌ను పిలుస్తాము. ఫార్వర్డ్ స్లాష్ అనేది లేదు. కొందరు ఈ గొడవంతా ఎందుకని స్ట్రోక్ (Stroke) అనీ అంటారు. మనం అప్పుడప్పుడూ వాడే PIN numberలోని PINను విశదీకరిస్తే ఏమవుతుందో తెలుసా ... Personal Identification Number number అలాగే, AC current అంటే Alternate Current current అని వస్తుంది. DC current అంటే Direct Current current అని వస్తుంది. ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి. మీకేమైనా తెలిస్తే తెలియజేయ గలరు. జూలై 28 - వీవెన్ PAN number - Permanent Account Number number
పూర్తిగా చదవండి

ఆర్.డి.ఎక్స్ (RDX) - ముంబై ప్రేలుళ్ళ నేపథ్యంలో…

మీకు తెలుసా! మీకు తెలుసా!
  RDX అంటే రాయల్ డిమోలిషన్ ఎక్స్‌ప్లోజివ్ (Royal Demolition Explosive). దీనినే Research Department (composition) X, మరియూ Research Department eXplosive గానూ పిలుస్తారు. సైక్లోనైట్, హెక్సాజెన్, T4 అనే పేర్లతో కూడా పిలవబడుతుంది.   దీని సాంకేతిక నామం సైక్లో-ట్రైమీథైలీన్-ట్రై-నైట్రమైన్ (Cyclotrimethylenetrinitramine). కెమికల్ ఫార్మ్యులా - C3H6N6O6. శుద్ధరూపంలో ఇది తెల్లటి ఘన పదార్థం. స్వతహాగా మండే గుణం గల దీనిని ఇతర మిశ్రమాలతో కలిపి అత్యంత శక్తి వంతమైన ప్రేలుడు పదార్థంగా వాడతారు.   C-4 high explosive,  is a mix of RDX and a plasticizer that makes it firm but pliable   1890లోనే హాన్స్ హెన్నింగ్ అనే జర్మన్ కనుక్కున్నా దీని వుపయోగం వైద్యానికి మాత్రమే పరిమితమయ్యింది. 1920లో మొట్టమొదటి సారిగా దీని ప్రేలుడు శక్తి తెలిసివచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో దీనిని విరివిగా ఇరుపక్షాలూ ...
పూర్తిగా చదవండి

కొన్ని ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ రికార్డులు

మీకు తెలుసా! మీకు తెలుసా!
  ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నేపథ్యంలో కొన్ని విశేషాలు... అత్యధిక గోల్స్ 1958లో ఫ్రాన్స్ కు చెందిన Just Fantain 13 గోల్స్ చేశాడు. 1954లో హంగరీ కు చెందిన Sandor Kocsis 11 గోల్స్ చేశాడు. 1970లో ఫ్రాన్స్-జెర్మనీ కు చెందిన Gerd Muller 10 గోల్స్ చేశాడు. 1966లో పోర్చుగల్ కు చెందిన Eusebio, 1950లో బ్రెజిల్‌కు చెందిన Ademir 9 గోల్స్ చేశారు. 1930లో అర్జెంటీనాకు చెందిన Guillermo Stabile, 1938లో బ్రెజిల్‌కు చెందిన Leonidas, 2002లో బ్రెజిల్ కు చెందిన Ronaldo 8 గోల్స్ చేశారు. 1974లో పోలాండ్ కు చెందిన Grzegorz Lato 7 గోల్స్ చేశాడు. మిగిలిన సంవత్సరాలలో హైయ్యెస్ట్ గోల్స్ ఆరు, అంతకన్నా లోపే.   ఇకపోతే, ఆడిదాస్ (Adidas) వారి గోల్డెన్ షూ అవార్డ్ (1982 నుండి) 1982 - Paolo Rossi (ఇటలీ) - 6 గోల్స్ 1986 - Gary Lineker (ఇంగ్లాండ్) - 6 గోల్స్ 1990 - Salvatore Schillaci (ఇటలీ) - 6 గోల్స్ 1994 ...
పూర్తిగా చదవండి

సూపర్ ఫాస్ట్‌‌ మైక్రో ప్రాసెసర్లు

మీకు తెలుసా! మీకు తెలుసా!
సూపర్ ఫాస్ట్‌, కాస్ట్‌ ఎఫెక్టివ్‌ మైక్రో ప్రాసెసర్లు వచ్చేస్తున్నాయి.   ఒకానొక ప్రయోగంలో సిలికాన్‌ ఆధారిత మైక్రో ప్రాసెసర్‌ రికార్డు స్థాయిలో దగ్గరదగ్గర సెకనుకు 500 బిలియన్ల ఆపరేషన్లు చేయగలిగింది. అంటే సాధారణ PC ల కన్నా కొన్ని వందల రెట్ల వేగం అన్నమాట.   జార్జియా ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కు చెందిన పరిశోధకులు మరియూ ఐబియం మైక్రోఎలెక్ట్రానిక్స్‌ లేబొరేటరీ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిప్‌లో సిలికాన్‌ మరియు జర్మేనియం అల్లాయ్‌ను వాడారు. ఈ అల్లాయ్‌లో ఎలెక్ట్రాన్స్‌ చాలా సులభంగా కదులుతాయి. అంతేకాదు చల్లబరిచినప్పుడు మరింత వేగం పుంజుకుంటాయి.   లిక్విడ్‌ హీలియం నుపయోగించి చిప్‌ను  -268.65' డిగ్రీలకు (ఆబ్సల్యూట్ జీరో కి కొద్దిగా క్రిందికి) తీసుకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరంగా ఆపరేటింగ్‌ స్పీడు 500GHz కు పైచిలుకు అందుకుంది. మామూలు గది ఉష్ణోగ్రత వద్ద కూడా సుమారు 300GHz స్పీడు నమోదు చేసింది. దీనంతటికీ కారణం చిప్‌ తయారీలో వాడిన ఆర్డినరీ సిలికాన్‌ పొర మరియు సిలికాన్‌-జర్మేనియం అల్లాయ్‌ పొరలు కలిగిన 'heterojunction bipolar transistors'   ప్రస్తుతానికి పరిశోధనలకే పరిమితమైన ఈ ...
పూర్తిగా చదవండి

అలెర్జీస్(Allergies) - ఒక చేదు నిజం

మీకు తెలుసా! మీకు తెలుసా!
ఇటీవల ఎలుకలమీద జరిగన పరిశోధనలో అతి ఆరోగ్యకర వాతావరణం (overly hygenic environment) అలెర్జీలకు, వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి దారితీస్తుందన్న విషయం వెలుగులోకొచ్చింది.   మామూలు ఎలుకలు, ప్రయోగశాలలో వున్న ఎలుకల రక్తాన్ని పరిశీలిస్తే తేలిన విషయమేమంటే .. (అతి)ఆరోగ్యకరమైన (ప్రయోగశాల) వాతావరణంలో పెరిగిన ఎలుకల కంటే, సహజ వాతావరణంలో పెరిగిన ఎలుకలలో వ్యాధి నిరోధక కారక ప్రోటీను సమృద్ధిగా కనిపిస్తోంది.   అమెరికాలో సుమారుగా 4-5 కోట్ల మంది రకరకాల అలెర్జీలతో బాధపడుతున్నట్లు ఒక అంచనా. ప్రాచ్య దేశాల (Eastern Countries) కంటే పాశ్చాత్య దేశాల్లోనే (Western Countries) అలెర్జీలెక్కువగా కనపడటం కొందరు శాస్త్రవేత్తలకు సందేహం కలుగజేసింది. ఫలితమే ఈ "హైజీన్ హైపోథీసిస్".   ఇందులోని విషయమేమిటంటే పంటలూ, పొలాలూ మొదలైన సహజ వాతావరణంలో పెరిగిన వారి శరీరం హానికారకం కాని మైక్రోబులు, పోలెన్‌లకూ అనుగుణంగా ట్రెయిన్ అవుతూ వస్తోంది. కానీ పాశ్చాత్య దేశాల్లోనివారు కృత్రిమమైన స్టెరైల్ వాతావరణంలో వుండటం వలన, ఇమ్యూన్ సిస్టాన్ని (వ్యాధినిరోధక వ్యవస్థ)  ప్రేరేపించే అలెర్జీన్స్‌కు  (Allergens) ఎక్స్‌పోస్‌ అవ్వటంలేదు. తద్వారా అనేక రకాలైన అలెర్జీలకు గురౌతున్నారు.  ...
పూర్తిగా చదవండి

మీకు తెలుసా? - 02 (ఆస్కార్స్‌)

మీకు తెలుసా! మీకు తెలుసా!
మే 1927 న ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ అవార్డ్స్) స్థాపించబడింది. మొదటి సంవత్సరంలో 36 మంది సభ్యులుంటే ఇప్పుడు 6000లకు పైగా గౌరవ సభ్యులున్నారు. 1953లో మొదటిసారిగా ఆస్కార్స్ TVలో ప్రదర్శించ బడ్డాయి. 2005వ సంవత్సరం వరకూ,ఆస్కార్ ఫంక్షన్ 32 సార్లు సోమవారం రాత్రి, 21 సార్లు గురువారం రాత్రి, 8 సార్లు బుధవారం రాత్రి, 6 సార్లు మంగళవారం, 2 సార్లు శుక్రవారం రాత్రి నిర్వహించబడ్డాయి. 1930 లో రెండు సార్లు (3-ఏప్రిల్, 5-నవంబర్) ఆస్కార్ నిర్వహించబడింది. అయితే 1933లో అసలు జరగనే లేదు. ఇంతవరకూ మూడు సార్లు ఆస్కార్ గెలుచుకున్న ఉత్తమ నటుడెవరూ (Best Actor) లేరు. కేథరీన్ హెప్‌బర్న్ (Katherine Hepburn) మత్రమే నాలుగు సార్లు ఉత్తమ నటి (Best Actress) గా ఆస్కార్ తీసుకుంది. లస్ట్ ఫర్ లైఫ్ (Lust for Life) చిత్రంలో పెయింటర్ పాల్ గాగిన్ (Paul Gaugin) గా నటించినందుకు ఆస్కార్ తీసుకున్న ...
పూర్తిగా చదవండి

మీకు తెలుసా? - 01 (పతాకాలు)

మీకు తెలుసా! మీకు తెలుసా!
  ప్రపంచంలో నేపాల్‌ దేశపు జెం(ఝెం)డా ఒక్కటే చదరంగా (rectangle) వుండనిది.ప్రపంచంలో లిబియా దేశపు జెండా ఒక్కటే ఏ రాతా, డిజైన్‌ లేకుండా ఒకే రంగుతో (ఆకు పచ్చ) ప్లెయిన్‌ గా వుండేది.   నలు చదరంగా (square) వుండేది ఒక్క స్విట్జర్లాండ్‌ (స్విస్‌) దేశపు పతాకం ఒక్కటే.   బెట్సీ రాస్‌ (Betsy Ross) మొట్టమొదటగా అమెరికన్ జెండాను కుట్టిన మహిళ.   ఫిలిప్పీన్స్‌ పతాకం ఒక్కటే యుద్ధ సమయంలో తల్ల క్రిందులుగా (upside down) ఎగురవేస్తారు.     ఇంకో విషయం. వెక్సిల్లోలజీ (vexillology) అంటే పతాక శాస్త్రం .. పతాకాలను సాంకేతికంగా అధ్యయనం చేసే శాస్త్రం.     జూన్‌ 10 న చేర్చబడినది.   జాతీయపతాకంలో దేశపటం గల ఏకైక దేశం సైప్రస్ (త్రివిక్రమ్‌ గారికి కృతజ్ఞతలతో)   ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS