Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బ్లాగుల నుంచి తెలుగు సినిమా ఏం నేర్చుకోవచ్చు

filmmaking, unbiased, తెలుగు బ్లాగర్లు, మీతో నేను, సరదాకి, సినిమాలు శ్రవణ్
ఇల్లు కడితే చాన్నాళ్ళుంటుంది, మరి కంప్యూటర్లు ఎందుకు వూరికే క్రాష్ అవుతుంటాయి? ఈ విషయం మీద నేను ఎక్కడో ఇది చదివాను. “ఆపరేటింగ్ సిస్టంలు వచ్చి కొన్ని దశాబ్దాలు మాత్రమే అయ్యింది. దాంట్లో వాడే ‘ఎక్ష్పీరియన్సు’ తక్కువ విలువైంది. అదే ఇళ్ళు కట్టడానికి వాడే నాలెడ్జి కొన్ని యుగాలనాటిది. they have stood the test of time. కాబట్టి ఆ డొమైన్‌లో నాలెడ్జిని ఇక్కడ వాడుకోవాలి” అంటాడు ఒక పెద్దాయన. మరి, నేను బ్లాగు రాయడం మొదలుపెట్టి [...]
పూర్తిగా చదవండి

పంచాంగ ‘శ్రవణం’ — సెటై్‌ర్

controversial, ఉగాది, తెలంగాణ, పంచాంగం, మీతో నేను, మూఢనమ్మకాలు, రాజకీయాలు, సరదాకి, సెటైర్ శ్రవణ్
కొత్త సంవత్సరం ఠంచనుగా వచ్చేసింది. అలవాటుగా రంగురంగుల పంచాంగాలు కూడా తెచ్చింది. గులాబీ పంచాంగం ప్రకారం “తెలంగాణ” ఈ యేడాది వచ్చేస్తుంది. పసుప్పచ్చ పంచాంగం ప్రకారం ప్రజలు “తెలంగాణ” ఒక కల అని గుర్తిస్తారు. అదేంటో, ఆకుపచ్చ పంచాంగంలో “తెలంగాణ” గురించి లేనేలేదు. కాషాయపు పంచాంగానికి నార్త్ఇండియా, కర్నాటక గురించి తెలిసినంతగా తెలుగునాడు గురించి తెలియదు. సందట్లో సడేమియా: ఊరు ఉత్తరమంటే కాదు దక్షిణమన్నట్టు, ఈ యేడాది 3 గ్రహణాలని అన్ని పంచాంగాలూ చెబుతుంటే ఒకాయన కాదు నాలుగు అని చాలెంజ్ చేస్తున్నాడు. [...]
పూర్తిగా చదవండి

నాకో డౌటు

controversial, height, చిరు, జూనియర్ N.T.R, నాగార్జున, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మీతో నేను, వెంకటేష్, సినిమా హీరోలు, సినిమాలు, హీరో ఎత్తు శ్రవణ్
ప్ల్లీజ్……….నోటి దురద ఉన్నవాళ్ళు, కీబోర్డు తీట ఉన్నవాళ్ళు ఇది చదవడం ఇంతటితో ఆపేసి వేరే వేజీకి వెళ్ళమని ప్రార్ధన. (నా బ్లాగులో ఇంతవరకూ ఒక్క కమెంటు కూదా తీసెయ్యలేదు). ఇక డైరెక్టుగా పాయింటుకొస్తే… నాకో డౌటు, హీరోయిన్ల కొలతలు కూడా బయటి కొస్తాయి కానీ, ఈ హీరోల హైట్లు బయటి రావెందుకని? నాకు తెలిసిన డేటా ఇదీ. వేణు — 6′3″ మహేష్ బాబు & ఫ్రభాస్  — 6′2″ నాగార్జున & మోహన్‌బాబు — around 6′ నా ఫ్రెండు ఒకడు చిరుకి వీర ఫ్యాను. [...]
పూర్తిగా చదవండి

గ్రహణం — సినిమా గురించి కాదు

గ్రహణం, మీతో నేను, మూఢనమ్మకాలు, సరదాకి, సినిమాలు శ్రవణ్
ఈసారి ఒక చిన్న ఎపిసోడ్. ఆమధ్య ఒకసారి, మూడేళ్ళక్రితం అనుకుంటా, ఒక మిత్రుణ్ణి కలవడానికని వెళ్ళా (ఇది నిజంగా జరిగింది, ఇక్కడలా కథ కాదు). వాడు హైదరబాదులో భరత్‌నగర్‌లో వుంటాడు. నన్నో చిన్న హోటల్‌కి (పూటకూళ్ళ ఇంటికి) తీసుకెళ్ళాడు. మాటల్లో ఆ హోటల్ ఓనర్ “గ్రహణం” సినిమా ప్రొడ్యూసర్ అనో ఫైనాన్షియర్ అనో చెప్పాడు. తినడం మొదలు పెట్టబోతుండగా మావాడికి ఒక డౌటు వచ్చింది. ” ఆ ఫోటోలు ఇంతకు ముందు ఈవైపు ఉండాలి కదా, ఏంటి అటు వైపుకి [...]
పూర్తిగా చదవండి

రెండు సరదా సన్నివేశాలు

ట్రాఫిక్ కానిస్టేబు, డ్రైవింగు, మాతృదేవోభవ, మీతో నేను, సరదాకి, సినిమాలు శ్రవణ్
అవి నేను బైకు నడపడం కొత్తగా నేర్చుకుంటున్నరోజులు… వెధవ ఆవేశం… డ్రైవింగు వచ్చీరాకుండానే మొదటిసారి మెయిను రోడ్డుమీదకి బయలు దేరాను. నాకలే భయమెక్కువ. కొంచెం దూరంలో జంక్షను, ట్రాఫిక్‌లైట్లూ పక్కనే యమభటుడిలా ఒక ట్రాఫిక్ కానిస్టేబులు. ట్రాఫిక్ పోతూందీ… పోతూందీ… పోతూందీ… “దేవుడా రెడ్‌లైటు పడకుంటా ఉంటే బాగుణ్ణు” అనుకుంటుండగానే రెడ్‌లైటు పడటమూ నా బైకు ఆగిపోవటమూ కొంచెం అటూ ఇటూగా జరిగిపోయాయి. కొత్త బైకూ, కొత్త పెళ్ళామూ ఒక పట్టాన లైన్లో పడవంటారు. తగ్గట్టు డ్రైవింగు కొత్త. ఇంక చెప్పేదేముంది? గ్రీన్ లైటు [...]
పూర్తిగా చదవండి

Mid shot — ఉండవల్లి, రామోజీరావు

unbiased, ఉండవల్లి, తెలుగు బ్లాగర్లు, మీతో నేను, రాజకీయాలు, రామోజీరావు, సినిమాలు శ్రవణ్
ఈ మధ్య ఈ ఉండవల్లీ, రామోజీరావూ గొడవలు (ఒకటి కంటే ఎక్కువ కదా మరి) గురించి వింటూనే ఉన్నాం. బ్లాగుల్లో కొందరు biased గా రాసే అర్టికల్స్ చూస్తే ఒక నాలుగు లైన్లు రాయాలనిపించి రాస్తున్నా. నాకు అర్థం అయినంతవరకూ ఉండవల్లి అనదలుచుకున్నది ఇదీ. “అంతా చట్ట ప్రకారం జరుగుతున్నది. కాని కొంత న్యాయం(ధర్మం)గా లేదు”. So simple and so straight forward. ఉండవల్లికి కొవ్వుబట్టి అయినా అంబేడ్కర్‌ని ఇందులోకి లాగుండాలి, లేదా రామోజీరావుకి అయినా వళ్ళుబలిసి దీన్ని [...]
పూర్తిగా చదవండి

Options

unbiased, ఏకలింగం, భేతాలుడు, మీతో నేను, రాజకీయాలు శ్రవణ్
( ముందుగా “ఏకలింగం™ గురించి” చదవగలరు). అలా బ్రౌజింగ్ చేసి అలిసిపోయిన  ఏకలింగం సరదాగా క్యాంటీన్ కని బయలుదేరాడు. ఎంత వద్దన్నా భ్రౌజర్లోని భేతాలుడు ఏకలింగం బుర్రలో దూరేశాడు. భేతాలుడన్నాడు, “లింగం… ఏమంటావ్? శ్రవణ్ నిజంగా నవతరంగుల్ని విమర్శించాడా?”. లింగం కంఫ్యూషన్లో పడ్డాడు. “తెలిసికూడా చెప్పపోతే బుర్ర వెయ్యి వ్రక్కలవదు కదా?” అని. లింగం కంఫ్యూషన్ చూసి నవ్వేశాడు భేతాలుడు. “నీ డౌటు నాకర్థమయింది. అయినా నవతరంగులంతా స్పోర్టివ్‌గా తీసుకున్నాక ఆ discussion అనవసరం. సరే గానీ ఏంటీ టీ ఆర్డరు [...]
పూర్తిగా చదవండి

why will my roommate be a good husband

biased, క్రికెట్, మీతో నేను, సరదాకి శ్రవణ్
why will my roommate be a good husband 1. ఎంత మంచి ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ అయినా సరే వాడి ధ్యాసంతా ఆ తేజా T.V లో వచ్చే “కమీషనర్ నల్లరాయుడు” అనే డబ్బింగ్ సినిమా మీదే. ఇక అది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అయితే వాడి ధ్యాసంతా “కొడలు కొట్టింది” అనే సీరియల్ మీదే. 2. రోజుకు పదిసార్లు “ఆ గ్లాసు అక్కడెందుకుంది?” అని అడగందే వాడికి నిద్రపట్టదు. (ఆ గ్లాసు ఎక్కడున్నా సరే). 3. సాయంత్రం ఆరింటి కల్లా [...]
పూర్తిగా చదవండి

వార్తలు

chief minister, congress, exgratia, rajasekhara reddy, shame on you, unbiased, మీతో నేను, రాజకీయాలు శ్రవణ్
ఈ నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిన్న జరిగిన వేరు వేరు సంఘటనలలో 173 మంది మరణించారు. మరణించిన వారికి 2 లక్షల చొప్పున ఎక్ష్‌గ్రేషియాని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిన్న వేర్వేరు జిల్లాల్లో సుమారుగా 50 మానభంగాలు జరిగాయి. అన్నింటికీ గత ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు తెలిపారు. ఒక్కొక్కరికి లక్షరూపాయల ఎక్ష్‌గ్రేషియా  ప్రకటించారు. గుంటూరు జిల్లాలో ఎయిడ్స్ సోకిన వారి సంఖ్య నాలుగింతలు పెరిగింది. ఒక్కొక్కరికీ ముఖ్యమంత్రి ఒక లక్ష రూపాయల ఎక్ష్‌గ్రేషియా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్  పర్యటనలో ఉన్న సోనియాగాంధీ [...]
పూర్తిగా చదవండి

ఐఫోను

మీతో నేను, సాఫ్టువేరు శ్రవణ్
my prediction… ఐఫోను india కీ చాలాదూరంలో యేమీలేదు. hutch vodafone గా మారడమే దీని indication. ఈ మధ్య వీళ్ళు GPRS monthly rental  లేకుండా ఇచ్చి load టెస్టు చేస్తున్నట్టున్నారు.
పూర్తిగా చదవండి

Cricket is our religion (too)

క్రికెట్, మీతో నేను, రాజకీయాలు శ్రవణ్
మొత్తానికి నాకు ఒకందుకు సంతోషంగా వుంది. ఒక అనవసరపు రచ్చ మరుగున పడిపోయింది. నిన్నటి దాకా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒక పెద్దాయన బ్యాచ్‌కీ, ఆ నోట్లో నాలుకని తెగ్గొయ్యమన్న ఇంకొక పెద్దాయన బ్యాచ్‌కీ సమానంగా సంతోషాన్ని పంచింది నిన్నటి క్రికెట్ మ్యాచ్‌లో విజయం. మనకింత సంతోషంగా వుందికదా! If I am right, వాళ్ళీపాటికి “ఈ దరిద్రులు ఎందుకు గెలిచార్రా? ఎంత కష్టపడి ఒక ఇష్ష్యూ క్రియేట్ చేశాం” అని తెగ బాధపడుతుంటారు. ఇటువంటివాళ్ళని యేమి చెయ్యాలి? మీరేమంటారు?
పూర్తిగా చదవండి

తన్ని తగలెయ్యాల్సొస్తుంది

క్రికెట్, మీతో నేను, సరదాకి శ్రవణ్
“నాకు నువ్వంటే చాలా ఇష్టం” “నాక్కూడా మీరంటే చాలా ఇష్టం” “మరి నామాటవినొచ్చుకదా” “మీ కోసం నేను ఎన్ని త్యాగం చేశానో తెలుసా?” “నేను కాదన్నానా?” “మరింకేంటి?” “ప్లీజ్ నా మాట విను, ప్రతీదానికీ ఓ హద్దుంటుంది కదా!” “నాఅభిప్రాయం నేను చాలాసార్లు చెప్పాను…” “అయితే నా మాట విననంటావు.” “ఎందుకు వినాలి?” “ఎన్ని విమర్శలొచ్చినా నిన్ను తప్పు పట్టలేదు కదా.” “అయితే?” “ఇప్పటికే లేటయ్యింది. నా మాట విను, అదే అందరికీ మంచిది.” “నో వే” “నీకు పుణ్యముంటుంది, మర్యాదగా రిటైరవ్వు.” “మర్యాదగానా? అంటే విషయం ఇంతవరకూ వచ్చిందన్నమాట. అవ్వకపోతే?” “తన్ని తగలెయ్యాల్సొస్తుంది.”
పూర్తిగా చదవండి

మహేష్ బాబు

మీతో నేను, సినిమాలు శ్రవణ్
నాకు మహేష్ బాబు అంటే కొంత ఇష్టం. ఎందుకంటే, “మడిసన్న తర్వాత కూసంత కలా పోసనుండాల”న్నట్టు హీరో అన్న తర్వాత కాస్త వొడ్డూ, పొడుగూ, అందం, ఠీవీ, విగ్రహం వుండాలి. మహేష్ బాబు లో ఇవి పుష్కలంగా వున్నాయి.(బాబోయ్, మిగతావాళ్ళ గురించి నేనేమీ కమెంట్ చెయ్యలేదు, నన్నొదిలెయ్యండి). south heroes ని తెగ తిట్టే north వాళ్ళు మహేష్ బాబు దగ్గరికొచ్చేప్పటికి నోరు ముయ్యాల్సిందే. ఆ విధంగా అంధ్రాదే కాకుండా మొత్తం south india  పరువు కాపాడుతున్నాడు. ఇహ [...]
పూర్తిగా చదవండి

“డింగుటకా” — 2037 లో ఒక సినిమా రివ్యూ by Yo!man™

Uncategorized, మీతో నేను, సరదాకి, సినిమాలు శ్రవణ్
Dude, thanks for visiting blog.yo!man.com. ఇవాళ ఒక తెలుగు సినిమా చూసాను, పేరు “డింగుటకా”. అసలీరోజుల్లో ఎలాంటి సినిమాలొస్తున్నాYo!. మా టైంలో అయితే “బ్యాండ్ లీడర్” అనీ, “పరమ హింసా రెడ్డి” అనీ, ”దొరికితే చంపుతా” అనీ మంచి మంచి సినిమాలు వచ్చేవి. ఇప్పుడంతా ట్రాష్. “డింగుటకా” అంట అదొక పేరు, అదొక సినిమా. ఇక సంగీతం గురించి, అసలు ఒకప్పుడు ఎంత మంచి సంగీతం, ఎంత మంచి వచ్చేదనీ!. “బ్యాండ్ లీడర్” సినిమాలో అయితే “బీ యే ఎన్ [...]
పూర్తిగా చదవండి

గూగుల్ వాడి ప్రెజెంటేషన్ సాఫ్టువేరు

మీతో నేను, సాఫ్టువేరు శ్రవణ్
గూగుల్ వాడి ప్రెజెంటేషన్ సాఫ్టువేరు ఇవాళ్ళ రిలీజ్ అయ్యింది. నేను ట్రై చేశాను. వాడి మొహం లా వుంది. టెంప్లెట్స్ లేని ప్రెజెంటేషన్ సాఫ్టువేరు కూడా ఒక ప్రెజెంటేషన్ సాఫ్టువేరేనా? గూగుల్ రీడర్ 2nd version hit  అయ్యినట్టు దీనిక్కూడా 2nd version hit అవుతుందేమో చూద్దాం. 1st version  మాత్రం ఫ్లాపే. ఇక్కడ చూడండి.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS