Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సత్తెకాలపు నా యెంకి

యెంకి పాటలు హాసిని
"నీతోటే వుంటాను నాయుడుబావా! నీ మాటే యింటాను నాయుడుబావా! సరుకులేమి కావాలె సంతన పిల్లా?" "నువ్వు మరమమిడిసి మనసియ్యి, నాయుడుబావా! సక్కదనమున కేమిత్తు సంతన పిల్లా?" "నువ్వు సల్లగుండు పద్దాక నాయుడు బావా! యేడనే నీకాపురమో యెల్తురుపిల్లా?" "నీ నీడలోనే మేడ కడతా నాయుడు బావా!" "నీ తోటే వుంటాను నాయుడు బావా! నీ మాటే యింటాను నాయుడు బావ ! రచన : నండూరి సుబ్బారావు ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
పూర్తిగా చదవండి

దూరాన నా యెంకి

యెంకి పాటలు హాసిని
యాడుంటివే, యెంకి యాడుంటివే? వూతోరి పందిట్లో సీతాయి యెల్తుంటే నీ తళుకు గేపగాన నా తల తిరిగిందోలె! యాడుంటివే,యెంకి యాడుంటివే? మామిడితోట కెల్లి మంచిపండోటి గోసి యేటోగాని, నోట్లేస్తే యిసమై పోయిందోలె! యాడుంటివే, యెంకి యాడుంటివే? పొత్తేళ్ళ జొన్న సేలో సిత్తరమై పోతాది గుమ్మమై వోసనొస్తే గుండెగిరి పోయెనోలె! యాడుంటివే, యెంకి యాడుంటివే? రచన : నండూరి సుబ్బారావు ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
పూర్తిగా చదవండి

యేటిదరి నా యెంకి

యెంకి పాటలు హాసిని
" యీ రేతి రొక్క తేవు యే మొచ్చినావే?" " ఆడు నే నిక్కడే ఆడినామమ్మ" "యేటి నురగల కేసి యేటి సూసేవే?" "మా వోడి మనసట్టె మరుగుతాదమ్మా!" "సెంద్రవొంకలో యేమి సిత్రమున్నాదే?" "వొంక పోగానే మా వోడొస్తాడమ్మా!" "ఆడు నేనిక్కడే ఆడినామమ్మా! మావోడి మనసట్టె మరుగుతాదమ్మా! ఆ వొంక పోగానే ఆడొస్తాడమ్మా!" రచన : నండూరి సుబ్బారావు ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
పూర్తిగా చదవండి

రావొద్దె

యెంకి పాటలు హాసిని
రావొద్దె నా పక్క రావొద్దె యెంకి! ఆ పొద్దె మన పొత్తు లయిపోయె నెంకీ! నీ మీద పాణాలు నిలుపుకొంటా వొచ్చి! అద్ద రేతిర్లో నె అడివంక తిరిగానె! రావొద్దె నా పక్క రావొద్దె యెంకి! ఆ పొద్దె మన పొత్తు లయిపోయె నెంకీ! గట్టెక్కి సూశాను? పుట్టెక్కి సూశానె! కల్లకపటము లేని పిల్ల వనుకున్నా నే! రావొద్దె నా పక్క రావొద్దె యెంకి! ఆ పొద్దె మన పొత్తు లయిపోయె నెంకీ! యేడ నువ్వుండావో యేళ్ళన్ని యీదానె! యేటి సేస్తుండావో
పూర్తిగా చదవండి

మాయదారి తమ్ముడు

యెంకి పాటలు హాసిని
నా సిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో! యేడుకొండలవోడ! యెంకటేశ్వరుడా! ఇంతోళ్ళ మప్పూడు యీడ నిలుచుంటేని నన్ను తరిమేసి మావోణ్ణి దాశావంట నా సిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో! యేడుకొండలవోడ! యెంకటేశ్వరుడా! ’యీసరికి మరిదీని నే సూడల” దాని యెంకి కూడా నిన్ను యేడుకోవొచ్చింది! నా సిన్ని తమ్ముణ్ణి నా కియ్యరయ్యో! యేడుకొండలవోడ! యెంకటేశ్వరుడా! ’పిల్లోణ్ణి వో పాలి బేగి తెమ్మన’మాని మాయమ్మ రేతిరి మరిమరి సెప్పింది! నా
పూర్తిగా చదవండి

నా యెంకి

యెంకి పాటలు హాసిని
నన్నిడిసి పెట్టెల్లినాడే! నా రాజు.... మొన్న తిరిగొస్తనన్నాడే! నీలుతేబోతుంటె, నీతోడె - వోలమ్మి! న యెంటె యెవరోను నడిసి నట్టుంటాదె! నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు.... అద్దములో సూత్తుంటె అది యేటో సిగ్గమ్మి! నా యనక యెవురోను నవ్వి నట్టుంటాదె! నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు.... సల్లని యెన్నెట్లో సాపేసి కూకుంటె... ఒట్టమ్మి - ఒల్లంత ఉలికులికిపడతాదె! నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు.... నీతైనవోడె,
పూర్తిగా చదవండి

నమిలి మింగిన నా యెంకీ

యెంకి పాటలు హాసిని
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! మెళ్ళో పూసల పేరు తల్లో పూవుల సేరు కళ్ళెత్తితే సాలు కనకాబిసేకాలు యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! సెక్కిట సిన్నీ మచ్చ సెపితే సాలదు లచ్చ! వొక్క నవ్వే యేలు వొజ్జిర మయిడూరాలు! యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! పదమూ పాడిందంటె పాపాలు పోవాల కతలు సెప్పిందంటె కలకాల ముండాల
పూర్తిగా చదవండి

కటిగ్గుండెల నా యెంకి

యెంకి పాటలు హాసిని
నీ వెల్లిప్యినావంటే పచ్చినై నేనెటో కొట్లాడుతుంటే యిరుగమ్మలక్కలతో నీవా నా యెంకి, యెకసక్కె మాడుతున్నావా! నిన్ను రచ్చించమంటానే పద్దాక, యెన్నో దణ్ణాలు పెట్టేనే! వొన్నె సీరలు గట్టి నీవా నా యెంకి, వోసుగా తిరుగుతున్నావా! పొద్దత్తమానాలు కాదే నీ వూసె, వొద్దన్ననూ మరపురాదే! అమ్మలక్కలతోటి నీవా నా యెంకి, సెమ్మ సెక్కలాడుతునావా! రేతిర్లో మన తోటకాడా వొక్కణ్ణి, నా తిప్ప లీశ్వరుడు లేడా! సీకు సింతా లేక నీవా,
పూర్తిగా చదవండి

తోట వూసు

యెంకి పాటలు హాసిని
తోట వూసంటే సీకాకూ యెంకి...... తోటి యెల్లే దాని సోకూ! బంతి సేమంతట్ల పరువంతా సూసింది మల్లెంటు మెల్లంగ మారుమొగ్గ మేసింది తోట వూసంటే సీకాకూ యెంకి...... తూర్పేపు మళ్ళేటి దుబ్బు దుట్రా యేటి అంటు మామిళ్ళేటి ఆ వొరస పళ్ళేటి! తోట వూసంటే సీకాకూ యెంకి...... గొడ్డూ గోదా బెంగ గొని సిక్కి పోనాయి! గడ్డిమేటిని సూత్తె కడుపె సెరువౌతాది! తోట వూసంటె సీకాకూ యెంకి....... నూతికాడే సోకు యేతాముదే సోకు! పోయి "
పూర్తిగా చదవండి

యెంకితో బద్రాద్రి

యెంకి పాటలు హాసిని
ఆడ నీ సుక్కాని యీడ నే గెడయేసి పడవెక్కి బద్రాద్రి పోదామా! బద్రాద్రి రాముణ్ణీ సూదామా! గోదారి గంగలో కొంగు కొంగూ గట్టి కరువుతీరా బుడక లేదామా! సరిగెంగ తానాలు సేదామా! కొత్త మడతలు కట్టుకోని పెజలో కెల్లి ’రామన్న రాముడో’ యందామా! రామకతలే పోయి యిందామా! సంబరము కెదురుంగ జంటగా నిలుసుండి సామీవోరికి దణ్ణ మెడదామా! సాప సుట్టుగ నేల బడదామా! ఈడ నీ సుక్కాని ఆడ నే గెడయేసి పడవెక్కి మన పల్లె కెడదామా! బద్రాద్రి
పూర్తిగా చదవండి

ఎఱ్ఱి సరదాలు

యెంకి పాటలు హాసిని
యెంకి వస్తాదాని యెదురు తెన్నులు కాసి దిగులుట్టి, తలదించి తిరిగి సూసెతలికి... యెంకి రావాలి నా యెదర నిలవాలి! కులుకుతా నన్నేటో పలకరించాలి! పిల్ల పొరుగూ రెల్లి మల్లి రాలేదని వొల్లంత వుడుకెత్తి వొక్కణ్ణి పొడుకుంటే.... ఘల్లుమంటా యెంకి కాలు పెట్టాలి! ’యెల్లి వొచ్చా’ నంట యెంకి నవ్వాలి! యెంకి కోపా లొచ్చి యే దేశమో పోయి కల్లోనా కాపడితె కళ్ళూ తెరిసేతలికి తళుకుమని యెంకి నా దరికి రావాలి! ’నిదర కాబో’ నంటు
పూర్తిగా చదవండి

యెంకి సూపు

యెంకి పాటలు హాసిని
పదిమందిలో యెంకి "పాట" నే పాడంగ గోడ సాటున యెంకి గుటక లేసే యేళ సూడాలి నా యెంకి సూపులా యేళ! సూడాలి నా యెంకి సోద్దే మా యేళ! "నా పాటె పా"టంట "నా మాటె మా"టంట నలుగురమ్మలు సేరి నను మెచ్చుతావుంటె, సూడాలి నా యెంకి సూపులా యేళ! సూడాలి నా యెంకి సోద్దే మా యేళ! పొరుగమ్మతో నేను వొరస లాడే యేళ పొలమెల్లి నే పొద్దు పోయి వచ్చే యేళ, సూడాలి నా యెంకి సూపులా యేళ! సూడాలి నా యెంకి సోద్దే మా యేళ! రచన : నండూరి
పూర్తిగా చదవండి

ఎఱ్ఱి నా యెంకి

యెంకి పాటలు హాసిని
"యెనక జల్మములోన యెవరమో" నంటి సిగ్గొచ్చి నవ్వింది సిలక...నా యెంకి! "ముందు మనకే జల్మ ముందోలే" యంటి తెల్ల తెల్ల బోయింది పిల్ల ...నా యెంకి! "యెన్నాళ్ళో మనకోలె యీ సుకము" లంటి కంట నీరెట్టింది జంట ...నా యెంకి! రచన : నండూరి సుబ్బారావు ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
పూర్తిగా చదవండి

యెంకి పయనం

యెంకి పాటలు హాసిని
పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ! కడుపులో సెయ్యేసి కదిపేసినాది! ఎడతెగని జలమంట నడమనో పడవంట! పడవెక్కి నా యెంకి పయన మయ్యిందంట! పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ! కడుపులో సెయ్యేసి కదిపేసినాది! యెంకేటో బ్రమ పుట్టి యెనక తిరిగిందంట! సందెగాలికి పడవ సాగిపోయిందంట పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ! కడుపులో సెయ్యేసి కదిపేసినాది! నీటి గాలికి యెంకి పైటెగురుతాదంట! పడిపోయి నట్టేటో పడవెల్లి నాదంట! పడుకుంటె
పూర్తిగా చదవండి

సాలు సాలు

యెంకి పాటలు హాసిని
మనిసే సాలు ! మనిసి మాటే సాలు! మనిసి వోసనే సాలు! మనిసే సాలు! ఏతాము కెదురుంగ యెంకుంటే సాలు! వొంటరిగ సిటికేసి కుంట కలిపేను!! మనిసే సాలు ! మనిసి మాటే సాలు! మనిసి వోసనే సాలు! మనిసే సాలు! యెంకి అందెల గలగ లినబడితె సాలు! కళ్ళు మూసుకు నీరు మళ్ళ కెత్తేను!! మనిసే సాలు ! మనిసి మాటే సాలు! మనిసి వోసనే సాలు! మనిసే సాలు! యెంకి గా లొకసారి యిసిరినా సాలు! తోటంత రాజల్లె తొవ్వి పోసేను!! మనిసే సాలు ! మనిసి మాటే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS