Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Doubts from Maidanam

తెలుగు, రచనలు, రచయితలు, సాహిత్యం venkat.siddareddy
లేచిపోయినానంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంతో వుంటుంది. ఇదివరకంతా యీ మనుషుల్లోంచి, నీతి వర్తనుల లోంచి వెళ్ళిపోయి, ఎడారిలో జీవించడంవల్ల నేను చేసినపని ఘోరత్వం, నీచత్వం బోధ్పడలేదు. ఆ జీవితమంతా సుందరమైన స్వప్నం వలె, ఆ ఎదారి పుణ్యభూమివలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళ హారతివలె తోచింది. ఇంటినే, మంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్నీ, మీరానీ అనుభవించిన తరువాత, మన చుట్టూ బతికే ఈ ప్రజలందరూ పురుషులేనా మనుష్యులేనా అనిపిస్తుంది నాకు. నేను బండి దిగేటప్పుడు వీళ్ళు చుట్టూ పోగై,
పూర్తిగా చదవండి

Saakshi

తెలుగు, రచనలు, సాహిత్యం venkat.siddareddy
"రేపు ఆఫీస్ లో కలుస్తా గురూ" వినయ్ కి వీడ్కోలు చెప్పి టైం చూసుకున్నాను. రాత్రి ఒంటి గంట కావస్తోంది. అమీర్‌పేట్ సత్యం సినిమా హాలునుంచి సెకండ్ షో సినిమా చూసి ఇంటివైపుకు నడుస్తున్న నాకు ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించి వెనక్కి చూశాను.రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.అక్కడక్కడా కుక్కలు మొరుగుతున్న శబ్దాలు తప్పితే అంతా నిశ్శబ్దంగా వుంది.దూరంగా వెలుగుతున్న వీధిదీపాల వెలుగులో ఎవరో ఒక వ్యక్తి నిల్చుని దిక్కులు చూస్తున్నాడు.
పూర్తిగా చదవండి

Waiting

తెలుగు, రచనలు, సాహిత్యం venkat.siddareddy
భూమి కంపించిపోలేదు గాలి స్తంభించలేదు నిన్న నువ్వు రాకపోతే... నా హృదయస్పందనలు ఆగిపోవు నా ఉచ్చ్వాస నిశ్వాసలు నిలిచిపోవు రేపు నువ్వు రాకపోతే...
పూర్తిగా చదవండి

Oka Prema katha

తెలుగు, రచనలు, సాహిత్యం venkat.siddareddy
“ఆరున్నరకల్లా గ్రీన్ పార్క్ హోటల్ కి వచ్చెయ్. కారుపంపించనా ఆఫీసుకి” అడిగాడు నవీన్. “వద్దులేరా.నేనే ఆటోలో వచ్చేస్తా!” అని ఫోను పెట్టేసి టైం చూసుకున్నాను.మూడు నలభై కావొస్తోంది.వున్న పని కాస్త ముగించుకుని ఇంటికి బయల్దేరాను. “అప్పుడే వెళ్ళిపోతున్నావా?” ఆడిగాడు పక్క సీట్లో కూర్చున్న కార్తీక్.
పూర్తిగా చదవండి

The Encounters

తెలుగు, రచనలు, సాహిత్యం venkat.siddareddy
ఇది నా నవల "ది ఎన్ కౌంటర్స్" లోని ఒక ఖండిక (Excerpt). సంవత్సరం క్రితం రాసి "స్వాతి" కి పంపించాను. అక్కడి పరివారానికి నచ్చలేదనుకుంటా! ఇప్పటికీ నా బీరువాలో చెదలుపడ్తుంటేను ఇక్కడకి తెచ్చే ప్రయత్నం చేసా!
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS