Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మనకు నిజంగానే స్వతంత్రం వచ్చిందా?

రాష్ట్రీయం Dil
రెండు రోజుల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయం నడుపుతున్న జీఎమ్మార్ సంస్థ తీసుకున్న రెండు నిర్ణయాలు, దాన్ని ప్రభుత్వ శాఖలు “జీ హుజూర్” అంటూ శిరసావహించిన వైనం చూసిన నేను ఈ రెండు ముక్కలు రాయకుండా ఊరుకోలేకపోయాను. మొదటిది మొన్నటి నుండి జీఎమ్మార్ విమానాశ్రయం వద్దకు ఆర్టీసీ బస్సులను రానివ్వవద్దని తీసుకున్న నిర్ణయం. బస్సులు ఉంటే సందర్శకుల తాకిడి ఎక్కువవుతుందనేది జీఎమ్మార్ ప్రతినిధులు ఇచ్చిన వింత వివరణ. వచ్చే అనేక దశాబ్దాల పాటు ప్రజల అవసరాలను తీర్చడానికి వేల కోట్ల [...]
పూర్తిగా చదవండి

మౌన సాక్షులమేనా?

రాష్ట్రీయం Dil
నిన్న పని ఉండి ఆఫీసుకు లీవ్ పెట్టాను. సాయంత్రం పొరపాటున ఏదో న్యూస్ చానెల్ చూస్తే అందులో శాసనసభలో పెద్ద దారుణం జరిగిపోయినట్టుగా బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. అప్పుడు మొదలుపెట్టి దాదాపు నాలుగు గంటల పాటు ఏ తెలుగు సినిమా ఇవ్వనంత లైవ్ వినోదం అందించారు మన ప్రజా ప్రతినిధులు. ఒకరి గోత్రాలు ఒకరికి బాగా తెలుసు కాబట్టి ప్రజలకు ఎదుటివాడి గుట్టు మట్లు తెలియజెప్తున్నారు. తమకన్నా ఎదుటివాడే పెద్ద దొంగ అని నమ్మించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. మొన్న [...]
పూర్తిగా చదవండి

నీరో చక్రవర్తి కూడ తెల్లబోతాడేమో!

రాష్ట్రీయం Dil
రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిని మనమెవరం చూసి ఉండక పోవచ్చు. ఆకాల వర్షాలు పడి రాష్ట్రం నలుమూలలా రైతులు, విద్యార్ధులు, ఇతర ప్రజనీకం అష్టకష్టాలూ పడుతుంటే మన అభినవ నీరో చక్రవర్తి గారు చూడండి వాన దేవుడికి చేతులెత్తి దండం పెడుతున్నాడు. మూడు రోజులు ఎడతెరిపి లేకుండా రాష్ట్రం అంతటా పడ్డ వర్షాలు రైతులకు ఎనలేని నష్టాన్ని కలుగజేసాయి. వరి, మిర్చి, ఇంకా ఇతర పంటలు నాశనమయ్యాయి. అధికారిక అంచనాల ప్రకారమే పంట నష్టం [...]
పూర్తిగా చదవండి

ఇప్పుడు మనందరం సాక్షులం!

రాష్ట్రీయం Dil
టీవీల్లో First Day First Show తరహా కార్యక్రమాలు చూసిన ప్రేరణతో ఇవ్వాళ మొదలైన “సాక్షి” పత్రిక తొలిరోజు సంచికపై నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. పేపర్ చేతిలోకి తీసుకోగానే నాకు అర్థమైన మొదటి విషయం ఇది కొంచెం “బరువైన” పత్రిక అని! ఇది మొదటి రోజు కాబట్టి ఇన్ని అనుబంధాలు ఇచ్చారో లేక ప్రతి రోజూ ఇలానే ఉండబోతుందో తెలియదు. రెండు రూపాయలకు ఇంత “బరువు” పత్రిక ఇస్తే చాలా మంది జనాలు పత్రికలో వార్తల కొరకు కాకపోయినా [...]
పూర్తిగా చదవండి

మూలస్థంభాలు నేలకొరుగుతున్నాయి

రాష్ట్రీయం, సామ్రాజ్యవాదం Dil
 నేను గతంలో రాసిన ఒక పోస్టులోనివీ మాటలు… “మన నేతలకు ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల కష్టాలు బాగా అర్థం అవుతాయి. అనేకానేక సమస్యలను తీసుకుని రోడ్డెక్కుతారు, ధర్నాలూ, రాస్తారోకోలూ, సభలూ ఓహ్! ఒక్కటేమిటి తమ చివరి రక్తపు బొట్టువరకూ ప్రజాశ్రేయస్సుకే అంకితమని ప్రతినలు పూనుతారు. కుర్చీ దక్కగానే సీన్ రాత్రికి రాత్రే మారిపోతుంది. అప్పుడు వారు చెప్పేవారు, ప్రజలు వినేవారు అవుతారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలు “త్యాగాలకు సిద్ధం కావాలని” పిలుపులిస్తారు, “మైండ్ సెట్ మార్చుకోవాలని” సలహాలిస్తారు, ప్రజాసమస్యలు [...]
పూర్తిగా చదవండి

రక్షించబడినది : రాజకీయమా వీరాభిమానమా?

రాష్ట్రీయం Dil
ఇది రక్షిత టపా కాబట్టి సంగ్రహం అందుబాటులో లేదు.
పూర్తిగా చదవండి

మన అభివృద్ధి అగ్రహారాల దాకా వచ్చింది

రాష్ట్రీయం Dil
నిన్న డక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన ఈ వార్త చదవండి (కింద). మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలో 1200 ఎకరాల్లో బ్రాహ్మణుల కొరకు ప్రత్యేకంగా “ధన్వంతరి అగ్రహారం” అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మించనున్నారనే వార్త మన సమాజం ఎటువైపు పయనిస్తున్నదో చెబుతోంది. స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడచినా ఇంకా కుల రక్కసి జడలు విప్పి నృత్యం చేస్తునే ఉంది. కుల వివక్ష అనేక రూపాల్లో కొనసాగుతూనే ఉంది. పైకి మేడి పండులా ఆర్ద్జిక [...]
పూర్తిగా చదవండి

ఇళ్లు తగులబెట్టుకుని బొగ్గులేరుకుంటున్నాం మనం

రాష్ట్రీయం, సామ్రాజ్యవాదం Dil
మన నేతలకు ప్రతిపక్షంలోకి రాగనే ప్రజల కష్టాలు బాగా అర్థం అవుతాయి. అనేకానేక సమస్యలను తీసుకుని రోడ్డెక్కుతారు, ధర్నాలూ, రాస్తారోకోలూ, సభలూ ఓహ్! ఒక్కటేమిటి తమ చివరి రక్తపు బొట్టువరకూ ప్రజాశ్రేయస్సుకే అంకితమని ప్రతినలు పూనుతారు. కుర్చీదక్కగానే సీన్ రాత్రికి రాత్రే మారిపోతుంది. అప్పుడు వారు చెప్పేవారు, ప్రజలు వినేవారు అవుతారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలు “త్యాగాలకు సిద్ధం కావాలని” పిలుపులిస్తారు, “మైండ్ సెట్ మార్చుకోవాలని” సలహాలిస్తారు, ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే రాజకీయ లబ్ది కొరకే అని విమర్శిస్తారు, [...]
పూర్తిగా చదవండి

పుట్టబాబా విశ్వ విరాట్ దర్శనం అట్టర్ ఫ్లాప్!

రాష్ట్రీయం Dil
సత్యనారాయణ రాజు ఉరఫ్ పుట్టబాబా లేటెస్ట్ గారడీ ప్రదర్శన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చంద్రునిలో “విశ్వరూపం” చూపిస్తానని డంబాలు పలికిన సదరు బాబాగారు విశ్వరూపం కాదుగదా అసలు ఉత్తి చంద్రున్నే చూపలేకపోయాడట. సాయంత్రం నుండీ బ్రేకింగ్ న్యూస్ అంటూ న్యూస్ చానెళ్లు ఊదరగొట్టాయి. సదరు బాబా మాటలు విని పోలోమని పుట్టపర్తి విమానాశ్రయానికి తండోపతండాలుగా తరలివెళ్లిన భక్తజనకోటికి సహజంగానే నిరాశే మిగిలింది.
పూర్తిగా చదవండి

శవాలూ, వాటిపై పేలాలూ…

రాష్ట్రీయం Dil
ఈపాటికే ఈ దుర్ఘటన గురించి టీవీల్లో చూసి, పేపర్లలో చదివి మళ్లీ బ్లాగుల్లో ప్రతిస్పందనలు చదివి ఉంటారు కాబట్టి మళ్లీ లోతుగా వెళ్లను. కానీ నిన్న జరిగిన రెండు సంఘటనలపై నా మనసులో మెదిలిన రెండు భావాలు మీతో పంచుకోవాలి. శనివారం (8 సెప్టెంబర్) ఉదయం ఇంకా నిద్రలేవక ముందే ఫోన్ వచ్చింది స్వర్ణకు. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ అయిన షీలా, నరేశ్ లు పూనే నుండి పని మీద హైదరాబాద్ వచ్చారట. అమీర్ పేటలోని [...]
పూర్తిగా చదవండి

అలా ముందుకు పొండి కామ్రేడ్స్!

రాష్ట్రీయం Dil
ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో భూపోరాటం చేసి అరెస్ట్ అయిన వామపక్షాల కార్యకర్తలు. వరంగల్ సెంట్రల్ జైలు ముందు క్యూ కట్టిన చిత్రం. స్వతంత్రం వచ్చి అరవై యేళ్లవుతున్నా చారెడు నేల కోసం ప్రజలు ఇలా జైలుకు వెళ్లవలసి రావడం మన దురదృష్టం. – రెండో దశ భూపోరాటంలో భాగంగా నిన్న వామపక్షాలు అటు రామోజీ, ఇటు సంఘీ భూముల్లో ఎర్ర జెండాలు పాతాయి. ముఖ్యంగా రామోజీ భూముల విషయంలో ఎన్నోసార్లు అధికారపార్టీ, వామపక్షాలను రెచ్చగొట్టే ప్రకటనలు చేసింది. ఫిల్మ్ [...]
పూర్తిగా చదవండి

ఖాసి రజ్వీ వారసుల దౌర్జన్యకాండ

రాష్ట్రీయం Dil
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తన పుస్తకం తెలుగు అనువాదం ఆవిష్కరించడానికి వచ్చిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ పై మజ్లీస్ గూండాల దాడి గర్హనీయం. పాత బస్తీ లో ముస్లిం లపై నానాటికీ పట్టు కోల్పోతున్న మజ్లీస్ పార్టీ మతతత్వ కార్యకలాపాలు, విద్వేషం రెచ్చగొట్టే పనులు చేయడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంది. అలనాడు నిజాం తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఖాసిం రజ్వీ నేతృత్వంలో ఏర్పరచిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ తదనంతర కాలంలో ఓవైసీ నాయకత్వం లో పూర్తికాలం [...]
పూర్తిగా చదవండి

తెలుగు బ్లాగులపై “ఈనాడు” ఆదివారం లో ప్రత్యేక కథనం

రాష్ట్రీయం Dil
తెలుగు బ్లాగుల పై మెయిన్ స్ట్రీం మీడియా ఈ మధ్య బాగానే దృష్టి పెడుతోంది. ఇవ్వాళ ఈనాడు ఆదివారం అనుబంధం ముఖచిత్ర కథనం…కింద చదవండి శోధన సుధాకర్ కు ప్రత్యేక అభినందనలు… బి అంటే బ్లాగు ఈ-కాలం చిత్రమైంది సుమీ! ఎంతలో ఎంత మార్పు? మొన్నటిదాకా మెయిల్‌ ఐడీ సృష్టించుకోవడమే గొప్ప. నిన్నంతా వెబ్‌సైట్‌ జపం. ఇవ్వాళ, ‘హేయ్‌ నీ బ్లాగ్‌ అడ్రస్‌ ఏంటి యార్‌?’ అని సంభాషణలు. ఇంటి అడ్రస్‌ తప్ప మరో చిరునామా తెలియనివాళ్లు వెర్రిముఖాలేసినా, [...]
పూర్తిగా చదవండి

ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ వ్యతిరేకత - శ్రీ బాగ్ ఒప్పందం

తెలంగాణ, రాష్ట్రీయం Dil
తెలంగాణా ఉద్యమకారులు తరచూ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడేప్పుడు జరిగిన “పెద్ద మనుషుల ఒప్పందం” గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రం తో కలిపే ముందు జరిగిన ఈ ఒప్పందం వంటిదే రాయలసీమ ప్రాంతాన్ని, సర్కారు జిల్లాలతో కలిపి ఆంధ్ర రాష్ట్రం కలిపే ముందూ జరిగింది. దీన్నే శ్రీ బాగ్ ఒప్పందం అంటారు. ఇది వరకు ఒక పోస్టులో ఈ రెండు ఒప్పందాల గురించీ నేను ప్రస్తావిస్తే ప్రసాద్ చరసాల గారు ఈ ఒప్పందాల వివరాలు [...]
పూర్తిగా చదవండి

ఈ మారణా హోమానికి స్క్రిప్ట్ రాసిందెవరు?

రాష్ట్రీయం Dil
అంతా అనుకున్నట్టుగానే జరిగింది! వామపక్షాల భూపోరాటం చిలికి చిలికి గాలివానై తుదకు రక్తసిక్తమైంది. అది నెల్లిమర్ల కావచ్చు, బషీర్ బాగ్ కావచ్చు, నందిగ్రాం కావచ్చు, గంగవరం కావచ్చు, ముదిగొండ కావచ్చు…పార్టీలు ఏవైనా కావచ్చు…తక్షణ కారణాలు ఏమైనా కావచ్చు… ప్రజలు ప్రశ్నలడిగిన ప్రతీ సారీ ప్రభుత్వాలు మాత్రం తూటాలతోనే సమాధానం ఇస్తున్నాయి. నిన్నటి బంద్ హింసాత్మకంగా మారి ఎనిమిది మందిని బలిగొంది. వామపక్షాలు, తెదేపా ఇతర ప్రతి పక్షాలూ ఆగ్రహంతో ఊగిపోయాయి. రాష్ట్రం లోనూ, కేంద్రం లోనూ ముదిగొండ కాల్పుల [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS