Jul 03
సూఫీ కవిత్వం – – రూమి
అనువాదం, కవిత్వం, రూమి సాహిత్యం, సూఫీ కవిత్వం నాగరాజా
ఇస్లాం మతంలో ఒక ఆద్యాత్మిక అధ్యాయం సూఫీతత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందటం ధ్యేయం. ఐహిక బంధాల నుంచి విముక్తమై మనసును దేవుని వైపు ప్రయాణింపచేయటం సూఫీల జీవన విధానంగా ఉంటుంది.
సూఫీలు ఆడంబరాలకు దూరంగా ముతక దుస్తులు ధరించి స్వాములుగా జీవితాన్నిగడిపేవారు. సూఫీకవులు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, దైవచింతనను ప్రతిబింబిస్తూ అనేక రచనలు చేసారు. రూమీ, అత్తర్, హఫీజ్, జామీ, సనాయ్, సాదీ, రబియా మొదలగువారు ప్రముఖులు.
వారు వ్రాసిన కవితలలో నాకు నచ్చిన కొన్నింటి అనువాదాలు ఇవి. మిగిలినవారిగురించి మరో సారి......
జలాలుద్దీన్ మహమ్మద్ రూమి (1207-1273)
రూమి పదమూడవ శతాబ్ధానికి చెందిన పర్షియన్ కవి. దేవుని చేరటానికి కవిత్వం, సంగీతం, నృత్యం ప్రధాన సాధనాలని రూమీ భావించాడు. ఈతని కవిత్వం ఏమతానికి చెందక మానవత్వాన్ని ప్రతిబింబించటం ఒక ప్రత్యేకత. జీవితాన్ని అక్షరాలుగా మలచి అందించాడు రూమి. ఆయనకవితలలో మార్మికత, భావుకత, మానవత్వంపై అచంచల విశ్వాసం, దేవుని పై ఆరాధనా కనిపిస్తాయి. ఈ నాటికీ ప్రపంచవ్యాప్తంగా రూమీ కవిత్వానికి ఆదరణ ఉన్నదంటే దానికి ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి