Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మా వూరి బస్సు = మార్క్(MARC) ట్రైను

వర్తమానం చరసాల
నేను ఏడవ తరగతిలోనో ఎనిమిదిలోనో వున్నప్పుడు మా వూరి మీదుగా కడప నుండీ వేంపల్లెకు వయా లక్కిరెడ్డిపల్లె బస్సును వేశారు. పిల్లలకూ పెద్దలకూ బస్సు వస్తోందంటే అదేదో ఓ వుబలాటం, ఆనందం కలిగేవి. స్కూలుకు వెళుతున్నపుడో, తిరిగి వస్తున్నప్పుడో బస్సు ఎదురుపడితే బస్సు డ్రైవర్‌కు టాటా చెప్పకుండా వుండేవాళ్ళం కాదు. తిరిగి డ్రైవర్ చెయ్యి వూపితే కొండెక్కినంత సంతోషం. ఈ బస్సు మధ్యాహ్నం 11గం. సమయంలో కడపలో బయలుదేరి, వేంపల్లె వెళ్ళి వచ్చి, మళ్ళీ సాయంత్రం ఆరుగంటలప్పుడు రెండో [...]
పూర్తిగా చదవండి

అంతర్జాలంలో తెలుగు వెలుగులు

వర్తమానం చరసాల
ఏప్రిల్ తెలుగునాడి (అమెరికాలో తెలుగు మాస పత్రిక)లో సంపాదకీయం “అంతర్జాలంలో తెలుగు వెలుగులు” గురించి సంపాదకులు జంపాల చౌదరి గారు రాశారు. అలాగే ఇంతకు ముందు ఈనాడు ఆదివారంలో వచ్చిన “అంతర్జాలంలో తెలుగు వెలుగులు” వ్యాసాన్ని పునర్ముద్రించారు. ఈ సంతోష సమయంలో అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి అవిరళ కృషి చేస్తున్న నెజ్జనులకూ, బ్లాగరులకూ, వికీ వీరులకూ నా వందనాలు. –ప్రసాద్
పూర్తిగా చదవండి

దుంగల దొంగలకు చందన చర్చ?

ఆవేదన, వర్తమానం త్రివిక్రమ్ Trivikram
కడప జిల్లాలో సిద్ధవటం రేంజిలోని లంకమల అడవులు, పరిసరప్రాంతాల్లో ప్రపంచంలో మరెక్కడా దొరకని అరుదైన ఎర్రచందనం దొరుకుతుంది. (ఇది ప్రధానంగా కడప జిల్లాలోను, జిల్లా సరిహద్దుకవతల నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోను దొరుకుతుంది.) గతవారం నాకు పరిచయమైన ఒక సి.బి.సి.ఐ.డి. అధికారి దగ్గర మాటల సందర్భంలో దీనిగురించి ప్రస్తావిస్తే ఆయన "లంకమల అడవుల్లో గతంలో ఎర్రచందనం చెట్లు ఉండేవి. ఇప్పుడు అవి దాదాపుగా అంతరించిపోయాయి."
పూర్తిగా చదవండి

333.3 మీటర్లు అనగా ఆకాశవాణి జానపద కేంద్రం

వర్తమానం త్రివిక్రమ్ Trivikram
రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రేడియో కేంద్రాల్లో ఒకటైన కడప కేంద్రం మొదటి నుంచీ జానపద కార్యక్రమాల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది. జానపద కార్యక్రమాల నిర్వహణలో పలుమార్లు జాతీయ బహుమతులు పొందిన జానపదకార్యక్రమాల ప్రయోక్త ఆరవేటి శ్రీనివాసులు, జానపదగేయాల ఆడియో కేసెట్లలో ట్రెండ్ సెట్టర్, జానపదబ్రహ్మ గా పేరుపొందిన పల్లెపదాల సేకర్త, గాయకుడు కె. మునెయ్య (తెలుగు అకాడెమీ ప్రచురించిన "రాయలసీమ రాగాలు"
పూర్తిగా చదవండి

అంబేడ్కర్ కూడా మనిషే

వర్తమానం తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
"దురదృష్టవశాత్తూ అంబేడ్కర్ రాజ్యాంగం ఇలా రాశాడు కాబట్టి గానీ..."అంటూ రాజమండ్రి లోక్‌సభా సభ్యు...
పూర్తిగా చదవండి

సంబరపడాల్సినంతేం లేదిక్కడ!

వర్తమానం రానారె
"... మనం సంబరపడాల్సినంత పనేంలేదు అని చెప్పడానికున్న మరో కారణం -- ఇక్కడ రాజకీయ వ్యవస్థలోనూ, ఆర్థిక వ్యవస్థలోనూ మనం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు. అయినప్పటికీ మనం స్థిరంగా ఉండగలిగామంటే అదంతా రాజ్యాంగం చలవే." --- పూర్తి పాఠం ఈనాడులో రామచంద్ర గుహ. " ... మునుపెన్నడూ లేని ఈ రాజకీయ దగ్గరితనాన్ని పాకిస్తాన్‌తో పోల్చి చూసుకోవాలి. పాకిస్తాన్, అక్కడి ప్రజలతో అమెరికా నెరపిన మైత్రితో బేరీజు వేసుకోవాలి.
పూర్తిగా చదవండి

కర్నాటకం

వర్తమానం చరసాల
నాటకంలో మొదటి అంకానికి తెర లేచినప్పటినుండీ బ్లాగుదామనుకుంటున్నా వీలుపడింది కాదు. నాటకానికి తెర పడిందని అందరూ నిట్టూర్పు విడిచేంతలో మరో అంకం మొదలు! ఈ సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో నిస్సిగ్గుగా అధికారాన్ని పంచుకునే ప్రక్రియ జమ్మూకాశ్మీరుతో మొదలయ్యింది. ఇంతకు మునుపు వూహకైనా తట్టని ఆ ఆలోచన ఇప్పుడు ఎంతగా విస్తరించిందంటే పట్టుమని పదూర్లు లేని పంచాయితీ ప్రెసిడెంటు గిరీని కూడా ఏడాదికొకరని పంచుకుంటున్నారు. అయితే ఇదింకా సరిగ్గా వ్యవస్థీకృతం కాని కారణాన మొదటి [...]
పూర్తిగా చదవండి

న్యూయార్కులో నెల రోజులు

వర్తమానం చరసాల
మోర్గాన్ స్టాన్లీలో వుద్యోగం పుణ్యమాని నెలరోజులు న్యూయార్క్ నగరం నడిబొడ్డున నెలరోజులు నివాసం వుండే అవకాశం కలిగింది. న్యూయార్క్ గురించి విన్నాను మరియు ఇంతకు మునుపు వెళ్ళి వచ్చాను గానీ ఇన్ని రోజులు ఎప్పుడు గడపలేదు. న్యూయార్క్ జీవనం మిగతా అమెరికాతో పోలిస్తే చాలా భిన్నం. అమెరికాలో ఎక్కడయినా ఒకరికొకరు ఎదుపడినప్పుడు అపరిచితులైనా “హాయ్” లేదా “హలో” చెప్పుకుంటారు. జీవం వున్నదో లేనిదో ఓ చిరునవ్వు విసిరేస్తారు. మరీ పక్క [...]
పూర్తిగా చదవండి

కిమ్ కర్తవ్యమ్

వర్తమానం రానారె
ముఖ్యమంత్రి: "పాకిస్థాను, బంగ్లాదేశులలో మనకు నిఘావ్యవస్థలేదు. ఈ వైఫల్యం పోలీసుయంత్రాంగానిది కాదు." -- నేరం నాది కాదు, ఆకలిది. ప్రధానమంత్రి: "తీవ్రవాద బాధితులకోసం శాశ్వత సహాయ నిధిని ఏర్పాటు చేస్తా." -- ఏంజేస్తున్నావే కోడలా? ఉలగబోసి మల్లా ఎత్తుకుంటాండా అత్తమ్మా. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల అధికారి: "రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి." -- మొక్కై వంగనిది మానై వంగునా!? "ఈ ఘోరకలికి
పూర్తిగా చదవండి

సహనశీలతా? చేతగానితనమా?

నా ఏడుపు, వర్తమానం చరసాల
గుండెల మీద చెయ్యేసి చెప్పండి మనది సహనశీలతా? గుండె నిబ్బరమా? చేతగాని తనమా? ఖచ్చితంగా చేతగాని తనమే. ఇందుకు బోలెడన్ని ఋజువులు. నీవు తన్నగలిగిన వాడివై వుండికుడా తన్నలేదంటే అది సహనం. తన్నలేక శాంతి గురించి మాట్లాడితే అది బలహీనత. అప్పుడెప్పుడో అశోకుడు పటించింది అసలుసిసలు శాంతి మంత్రం. వాడెవ్వడో వచ్చి 18 సార్లు దండెత్తితే 17 సార్లు గెలిచామని చెప్పుకోవడం కాదు వాజమ్మల్లాగా, అసలు వాన్ని రెండోసారి మళ్ళి ఎలా తొంగిచూడనిచ్చామనేది అసలు ప్రశ్న. ఒక్కరా ఇద్దరా… రాజన్న [...]
పూర్తిగా చదవండి

ఉగ్రవాదం - ప్రభుత్వ వాదం

నా ఏడుపు, వర్తమానం చరసాల
హైదరాబాదులో లుంబీనీ పార్కు మరియు గోకుల్ చాట్ భండార్‌లలో జరిగిన బాంబు పేలుడులో అసువులు బాసిన ప్రతిఒక్కరికీ అశ్రునయనాలతో అంజలి ఘటిస్తూ… ***                               ***                                  *** మన ముఖ్యమంత్రిగారి స్పందన చూస్తుంటే రక్తం వుడికిపోతోంది. అసలీయన స్పందించడంలో (ప్రతిపక్షాలన్నట్లు ఎదురుదాడి చేయడంలో) సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. తర్వాతి ప్రభుత్వాలూ ఇదే పంధాలో వెళితే… అమ్మో భయమేస్తోంది. ప్రశ్న: ఈ సంఘటనకు భాధ్యులెవరు? ఇది ప్రభుత్వ నిఘా వైఫల్యం కాదా? జవాబు: ఎంతమాత్రం కాదు. దీనికి భాధ్యులు బంగ్లా/పాకిస్తానులో వున్న ఉగ్రవాద మూకలు. ఈ [...]
పూర్తిగా చదవండి

మనం పిల్లలకేమి నేర్పుతున్నాం?

నా ఏడుపు, వర్తమానం చరసాల
రోజూ హత్య వార్తలు, ఆత్మ హత్య వార్తలు, అత్యాచారాలు మామూలు విశయాలయిపోయి మనసు వాటికి స్పందించడం మానేసింది. అయితే ఇవాళ్టి ఈ వార్త “మితృణ్ని చంపిన పిల్లలు” చదివితే మన భవిష్యత్ సమాజం ఎలా వుండబోతోందో అన్న భయంకర వేదన మనసును మెలిపెడుతోంది. వాళ్ళ వయసు ఇంచుమించు ఎనిమిదేళ్ళు! కోపాలూ, తాపాలూ, శతృవులూ, మితృలూ అన్న భావనలు చిగురించే వయసు. ఉదయాన జరిగిన పోట్లాట సాయంత్రానికి మరచిపొయ్యే వయసు. ఆడుతూ పాడుతూ బతకాల్సిన ఈ వయసులో ఓ చిన్న [...]
పూర్తిగా చదవండి

వీడింకో విలన్

వర్తమానం చరసాల
మొన్న తస్లీమా తమకు వ్యతిరేకంగా రాసిందని ఆమె మీద భౌతికంగా మజ్లిస్ రౌడీలు ప్రెస్ క్లబ్ సాక్షిగా దాడికి పాల్పడితే ఇప్పుడు “ధాకరే”ను విలన్ అన్నందుకు “అవుట్‌లుక్” మీద శివసైనికుల మూక దాడి చేసింది. వీళ్ళు చేసే పనులన్నీ విలన్ పనులే కానీ ఆ మాట అంటే మాత్రం కోపం. థాకరే విలనో కాదో అతను లేదా అతని అనుచర మూక చేసే పనులే చెబుతున్నాయి. మళ్ళీ అదే మాట ఒక పత్రిక చెబితే అంత వులికిపాటు ఎందుకు? [...]
పూర్తిగా చదవండి

ఎవర్రా బేవకూఫ్ మతాన్ని కించపరిచింది?

వర్తమానం చరసాల
ఒరే ఒవైసీ, నీకు గానీ నీకు వంతపాడుతున్న ఆ వానరమూకకుగానీ అసలు బుద్దన్నది వుందా? ఓ మహిళ మీద అదీ విదేశీ మహిళ మీద భౌతికంగా దాడికి దిగి ఆ మతపు ప్రతినిధిగానో లేక ఆ మతావలంబుల ప్రతినిధిగానో చెప్పుకునే సిగ్గులేని XXX నీకు మతి అన్నది వుందా? మీరేమయినా తాలిబాను ప్రతినిధులమనుకుంటున్నారా? లేక లాడెను అనుచరులమనుకుంటున్నారా? ఇది భారతదేశమనుకుంటున్నారా లేక మీరుంటున్నది ఆఫ్ఘనిస్తాన్ పర్వత గుహల్లోనా? మీరు భారత ప్రజాస్వామ్యపు రాజ్యాంగం ప్రకారం ఎన్నికయిన ప్రతినిధులా [...]
పూర్తిగా చదవండి

వైరం వర్ధిల్లు గాక!

వర్తమానం చరసాల
ఈనాడు, కాంగ్రెస్‌ల మద్య ఇంచుమించు యుద్ద వాతావరణం నెలకొన్నట్లే వుంది. దాడులు, ప్రతి దాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఈ వినోదం మనకు చూడటానికి బాగానూ వుంది. నాకైతే ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి ఆరోగ్యకరం అనిపిస్తోంది.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS