Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పిల్లలూ, స్కూల్‍కి మూడు నెలలు శెలవు!

తెలుగు, వివిధ venkat.siddareddy
మరో మూడు నెలల వరకూ ఈ బ్లాగుకు శెలవు ప్రకటించడమైనది. దాదాపు ఆరు నెలలుగా ప్రపంచ సినిమాలను తెలుగు వారికి పరిచయం చేసే నా ప్రయత్నం ఫలించిందో లేదో తెలియదు కానీ, నాకు తెలిసిన విషయాల్ని నలుగురితో పంచుకోవాలనే ఆలోచనతో మొదలుపెట్టిన ఈ బ్లాగు వేరెవరికైనా వుపయోగపడిందో లేదో కానీ నా మదిలోని ఆలోచనలని ఇక్కడ వ్రాయడం ద్వారా నాకు తెలిసిందెంత, తెలియనిదెంత అని మాత్రం నాకు బాగా తెలిసి వచ్చింది. ఇన్నాళ్ళూ నా బ్లాగు చదివి మీ వ్యాఖ్యల ద్వారా ప్రోత్సాహం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మళ్ళీ ఫిభ్రవరిలో మరిన్ని సినిమా విశేషాలతో తిరిగి వస్తానని తెలియచేస్తూ అప్పటి వరకూ శెలవు తీసుకుంటున్నాను.
పూర్తిగా చదవండి

ఎక్కడ్నుంచి ఎక్కడికో!

తెలుగు, వివిధ, సినిమా venkat.siddareddy
గమనిక: ఈ వ్యాసం కొంచెం పెద్దది. ఓపిక వుంటేనే చదవండి. చాలా రోజులుగా Last life in the Universe అని ఒక సినిమా చూడాలని వున్నా ఎప్పుడూ ఏదో ఒక కారణం చేత పది నిమిషాలు చూడడం తర్వాత ఆపెయ్యడం జరిగేది. పోయిన వారం ఎలాగో ఓపిక చేసుకుని చూసా. బావుందా లేదా అని చెప్పడం కష్టం. నా దృష్టిలో ఒక మంచి ప్రయత్నం అని మాత్రం అనిపించింది. అదీకాకా ఈ సినిమా గురించి చాలా సినీ పండితుల నోట వినివుండడంతో కొంచెం expectations కూడా ఎక్కువయ్యాయేమో, కొంచెం నిరాశ కూడా చెందాను.
పూర్తిగా చదవండి

ఎందుకీ మొసలి కన్నీరు?

తెలుగు, వివిధ venkat.siddareddy
గమనిక:అసలీ వ్యాసం రాయాలా వద్దా అని చాలా సేపు అలోచించి చివరకి ధైర్యం చేసి రాస్తున్నాను.ఈ వ్యాసం రాయడంలో నా బ్లాగుకి నాలుగు హిట్లొస్తాయనే ఉద్దేశం ఎంత మాత్రమూ లేదు. దయచేసి గమనించగలరు. చిరంజీవి చిన్నకూతురు ఇంట్లో వాళ్ళ అనుమతి లేకుండా అర్య సమాజంలో పెళ్ళిచేసుకుందట! అయితే ఏంటి? ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు ఎక్కడ చూసినా ఇదే హడావుడి. నేను చూడలేదు గానీ మన ప్రదేశంలో ఆ-టివి, ఈ-టివి అని తేడాలేకుండా టివి-1 నుంచి టివి-100 వరకూ దీని గురించే పెద్ద గోళ చేస్తూ వుండివుంటారు.
పూర్తిగా చదవండి

మీకు తెలుసా?

తెలుగు, వివిధ venkat.siddareddy
మీకు తెలుసో లేదో కానీ ఈ రోజు బ్లాగ్ యాక్షన్ డే! ప్రపంచం మొత్తం మీద వున్న బ్లాగర్లు ఏకమై ఈ రోజు ఒకే విషయం మీద బ్లాగాల్సిన రోజు.ఈ రోజున ప్రపంచ బ్లాగర్లందరూ ఏకమై ప్రపంచ పర్యావరణాన్ని సంరక్షణ గురించి ఈ సారి బ్లాగుతున్నారు. రండి మనమూ ఒక పోస్టేద్దాం. పోస్టడమే కాదు ఇవాళ్టినుంచి మనమూ మన పర్యావరణాన్ని రక్షించుకునే దిశలో పయనిద్దాం.
పూర్తిగా చదవండి

desipundit

Blog-Of-The-Day, తెలుగు, వివిధ venkat.siddareddy
మొన్నా మధ్యన ఇక్కడ Telugu blog of the day అని ఒక శీర్షిక మొదలుపెట్టిన సంగతి మీకు తెలుసనుకుంటా! ఒక వారం పాటు సాగిన ఆ శీర్షిక నా సైటు నుంచి www.telugublogoftheday.wordpress.com కి మార్చడం కూడా మీకు గుర్తుండే వుంటుంది.రోజుకొక బ్లాగుని సమీక్షిస్తూ రాసిన కొన్ని వ్యాసాలకు మంచి స్పందనే లభించింది. ఇదంతా జరుగుతుండగా పోయిన వారం ఒక రోజు ఇస్మాయిల్ గారు గాడ్‌ఫాధర్ లెవల్లో నాకొక offer ఇచ్చారు. ఆయన అడగడం నేను refuse చేయడం కుదరదు కాబట్టి (He made me an offer that I couldn’t refuse) ఆయన చెప్పినట్టుగా desipundit సైటులో సభ్యునిగా చేరిపోయాను.
పూర్తిగా చదవండి

Lets change the world!

తెలుగు, రచయితలు, వివిధ, సాహిత్యం venkat.siddareddy
మొన్నా మధ్య నా సైటులో "rahi kaun Hain" అనే ఏరుతో నేనొక్క వ్యాసాని ప్రచురించాను. దాని ద్వారా నేను తెలియచేయాలనుకున్న విషయమేమిటంటే, మన తెలుగు రచయితలను, వారి వారి శైళిని ఒక్క వాక్యంలో "రహీ" గారు చెప్పడం నాకు బాగా నచ్చింది. నా దృష్టిలో అది చాలా కష్టమిన పని. ఒక రచయిత శైళిని వివరిస్తూ పేజీలు పేజీలు రాసెయ్యొచ్చు. కానీ ఒకటి లేదా రెండు వాక్యాల్లో చెప్పడం చాలా కష్టం. ఇక పోతే ఈ వ్యాసం ద్వారా నేను తెలుసుకోవాలనుకున్న విషయమేమిటంటే, ఈ "రహి" ఎవ్వరని?
పూర్తిగా చదవండి

Going fast, but where?

తెలుగు, వివిధ venkat.siddareddy
నిన్న సాయంత్రం ఆఫీసు నుంచి హడావుడిగా ఇంటికి తిరిగొస్తుంటే మా పక్క వీధిలో జనాలు పోగయ్యి వుండడంతో కాసేపు ఆగి అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. జన్నలంటే మరీ మన దేశంలో లాగా గుంపులు గుంపులు లేకపోయినా ఒక పది మంది ఒక దగ్గర చేరి వున్నారు. ఈ దేశంలో పది మంది ఒక రోడ్డు పై పోగవ్వడం ఒక విచిత్రమే!
పూర్తిగా చదవండి

How do I know what I know?

తెలుగు, వివిధ venkat.siddareddy
ఎందుకో తెలియదు గానీ ఒక్కోసారి మనకి కొన్ని విషయాలు తెలుసనుకుని నమ్మేస్తాం మనం. ఇంగ్లీషులో చెప్పాలంటే "we take certain things for granted". ఉదాహరణకు Times గ్రూపు వాళ్ళు చాలా రోజుల క్రితం "Sacred Chants of Siva" మరియు "Sacred chants of Budhdha" అని రెండు ఆడియో క్యాసెట్లు విడుదల చేశారు. అవి రెండూ వినడానికి బాగానే వుంటాయికానీ ఎందుకో కానీ అందులో పాడినా వారి సంగతే కొంచెం విచిత్రంగా వుంటుంది. మన భాష వచ్చీరాని విదేశియులెవరో పాడినట్టుగా వుంటాయి అందులోని శ్లోకాలన్నీ.
పూర్తిగా చదవండి

MyFI-Top 10

తెలుగు, వివిధ venkat.siddareddy
AFI, BFI వందల సంగతి తెలుసు గానీ ఈ MyFI సంగతి మీకు తెలియదు కదూ!MyFI అంటే My Film Institute అని అర్థం. 24ఫ్ప్స్ ద్వారా మంచి సినిమాల గురించి అందరికీ అందచెయాలన్న ప్రయత్నంలో మూడూ నెలల క్రితం 24fps స్థాపించినప్పుడు ఇంతమంది పాఠకుల(నేటికి 2500 ల పై చిలుకు visitors, 6000 visits, 15000 page views ) ఆదరణ లభిస్తుందని కానీ, నేను 75 రోజుల గడువులో 75 వ్యాసాలు రాస్తానని కానీ నేనూహించలేదు. ఇవాల్టికి 24fpsలో 75 వ్యాసాలు పూర్తయ్యాయి. 75 వ్యాసాలలో అత్యంత ఆదరణ కలిగిన 10 వ్యాసాలు ఇవే!
పూర్తిగా చదవండి

We the people

తెలుగు, వివిధ venkat.siddareddy
ఇక్కడ మా ఊర్లో(Reading,UK) ఊర్లో Art of Living వాళ్ళు సమావేశమవుతున్నారని తెలిసి నన్ను కూడ రమ్మని పిలిస్తే మొన్న వారాంతంలో వెళ్ళాను. అంతకు ముందు ఒక సారి వెళ్ళినప్పుడు కొన్ని యోగసూత్రాలు అవీ ఇవీ చెప్పరు. చేసినంతసేపు బాగానే ఉంది కానీ ఇంటికి వచ్చాక మర్చిపోయానా విషయాన్ని. ఈ సారి వెళ్లినప్పుడూ జనాలౌ కాస్త ఎక్కువే వున్నారు. ఒకాయన తన గానామృతంతో ప్రజల్ని పరవశింపజేశాడు. ఆయన చేస్తున్న శివుడు మరియు బుధ్ధుని మంత్రోచ్చారణల్తో పారవశ్యంలో మునిగిపోయి తన్మయత్వం చెందారు. అరమోద్పు కన్నులతో సగం మనసౌ మనుషుల మీద , సగం మనసు మనుషుల మీద పెట్టి అటూ ఇటూ అయిపోయాను.అక్కడి మనుషులను చూసి ఆశ్చర్యపోయానుమర్చిపోయానా విషయాన్ని. ఈ సారి వెళ్లినప్పుడూ జనాలౌ కాస్త ఎక్కువే వున్నారు. ఒకాయన తన గానామృతంతో ప్రజల్ని పరవశింపజేశాడు.
పూర్తిగా చదవండి

Joost-The new sensation

తెలుగు, వివిధ venkat.siddareddy
పైసా ఖర్చులేకుండా 100 TV ఛానళ్ళు చూడాలనుకుంటున్నారా? ప్రపంచంలోని నలుమూలల నుండి short films, feature films, music videos, documentaries లాంటి ఎన్నో కార్యక్రమాలను మీ కంప్యూటర్లోకి నేరుగా తీసుకొస్తుందీ Joost అనబడే కొత్త Software...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS