Can't see Telugu? Learn here. More Questions? Ask here.

‘పరుగు’ - ఒక సామాజిక విశ్లేషణ

పరుగు, పెళ్ళి, ప్రేమ, భారతీయ సినిమా, విశ్లేషణ K మహేశ్ కుమార్
ఇప్పటివరకూ ‘పరుగు’ సినిమా సమీక్షలు చాలానే చదవటం జరిగింది. కానీ ఇప్పుడే నేను సినిమా చూశా! నేను చదివిన సమీక్షలలో, “బొమ్మరిల్లు అంత బాగాలేదు” అనే తులనాత్మక జడ్జిమెంటో, లేక “పరుగు సినిమా స్పీడ్ తగ్గింది” అని సినిమా నడిపిన వేగం గురించో, మహా ఐతే “ఇది చిరంజీవి కూతిరి కథలా ఉంది” అనో సింపుల్గా తేల్చెయ్యడం జరిగింది. కానీ చూసిన వెంఠనే నా కనిపించిన మొదటి భావం “హమ్మయ్య మనుషులగురించి ఒక కమర్షియల్ హీరో సినిమా [...]
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా బాగుపడాలనీ !

తెలుగు సినిమా, భారతీయ సినిమా, విశ్లేషణ K మహేశ్ కుమార్
“తెలుగు సినిమా చెడిపోయిందహే!” అని అందరూ అనేసుకుని, కొందరు బాధపడి. ఇంకొందరు ప్రపంచ సినిమాని అవసరమున్నంత వరకూ చూసేసి “దీన్నుంచైనా నెర్చుకోరు” అని నిస్పృహని వెళ్ళగక్కి. (నాలాంటి) మరికొందరు, దొరికిన కాగితం ముఖాన తమ భావాల రంగుపూసో, బ్లాగులో చర్చలతో దుమారంరేపో నవతరంగం లో ‘టైంపాస్’ వెళ్లదీసేస్తున్నామని,కొంత మంది పోరడం జరిగింది. ఈ శ్రేయోభిలాషుల అభిమానకరమైన ఎత్తిపొడుపుల కింద ఖచ్చితంగా మర్మముంటుందని నమ్మి, ఆత్మారాముణ్ణి హాజరుపరచి ”కూసింత అంతర్మధనం అవసరమోయ్” అని, పిలిచి కూలేసి ఈ విషయాన్ని తనతో కలిపి మధించేసా ! సాగరమధనం తీరుగా… కొంచం అమృతం, మరింత [...]
పూర్తిగా చదవండి

Kantri Ante NTR anI

Kantri, NTR Jr, ఎంటీఆర్ జూనియర్, కంత్రి, భారతీయ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
పోకిరి సినిమా ఎందుకు హిట్టయిందో తెలియదు గానీ, ఈ సినిమాని కూడా అదే తీరులో తీసారు మన దర్శకులు. ఈ సినిమాలో రెండు పోకిరిలు ఉన్నాయి. మొదటి సగం ఒక పోకిరి, రెండో సగం ఇంకో పోకిరి. మీరు పోకిరి సినిమా చూడకపోయినచో (అంటే మీ నివాసం అంటార్కుటికా అయినచో), ఈ సినిమా చూసి ఆ పాపాన్ని కడిగేసుకోవచ్చు. ఈ సినిమా చూస్తే రెండు పోకిరిలు చూసినట్టు లెక్క. మొదటి సగం చివరిలో కథలో మెలిక ఉంటుంది, మన కంత్రి ప్రకాశ రాజు కొడుకు అని, అప్పుడు మీ మతి భ్రమిస్తుంది. అలా మిమ్మల్ని భ్రమింపజేసి రెండో సగం గడిపించాక, రెండో సగం చివరిలో ఆ మెలికను తిన్నం చేస్తాడు మన దర్శకుడు.
పూర్తిగా చదవండి

ఒంటరి గృహిణి - “చారులత”, సత్యజిత్ రాయ్ సినిమా

bengali cinema, bengali films, charulata, satyajit ray, చారులత, బెంగాలీ సినిమాలు, భారతీయ సినిమా, విశ్లేషణ, సత్యజిత్ రే విష్ణుభొట్ల లక్ష్మన్న
(భారతీయ సినిమాలోనే కాక, ప్రపంచ సినిమాలో అగ్రశ్రేణి దర్శకుల్లో ప్రత్యేక స్థానం బెంగాలీ సినిమా దర్శకుడు సత్యజిత్ రాయ్ ది. రాయ్ దాదాపు 26 సినిమాలు, 10 డాక్యుమెంటరీలకి దర్శకత్వం చెయ్యటమే కాక మరెన్నో సినిమాలకి తన సహాయం అందించాడు. ఆయన తీసిన సినిమాలు కొన్ని నవతరంగం పాఠకులకు పరిచయం చేద్దామని నా ప్రయత్నం. ఈ శీర్షిక కింద, “చారులత” సినిమా ముందు పరిచయం చేస్తున్నా.) ప్రపంచ సినిమాలో అతి ప్రముఖుడైన బెంగాలీ సినిమా దర్శకుడు సత్యజిత్ [...]
పూర్తిగా చదవండి

జోకర్ గాడి ఫ్యాన్…!(మొదటి భాగం)

ప్రముఖులు, భారతీయ సినిమా, విశ్లేషణ K మహేశ్ కుమార్
కిట్టి గాడు, చిరు గాడు,బాలకిట్టి గాడు, వెంకి గాడు, నాగ్ ఫ్యాన్స్ అంటూ స్కూలు కాలేజిల్లోని  విధ్యార్థులు గ్రూపులుపడటం, మన “సినిమాంధ్ర ప్రదేశ్” లో సర్వసాధారణ విషయం. ఇక బాలక్రిష్ణ,చిరంజీవి అభిమానుల వీరంగాలు జగద్విదితమే కదా! ఇలా సాగే ప్రహసనాల పరంపరల మధ్య, బహుశా స్కూల్లో అనుకుంటా, నా మిత్రులు కొందరు మన పిచ్చి గురించికూడా వాకబు చెయ్యడం జరిగింది.  అప్పటి వరకూ వరుసపెట్టి సినిమాలు చూడ్డమే తప్ప అభిమానాలు, అందునా హీరో పట్ల అభిమానాల్ని గురించి [...]
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా మరియు టి.వి మధ్య ’అక్రమసంబంధం’ !

చర్చ, టి.వి., భారతీయ సినిమా, విశ్లేషణ, సినిమా K మహేశ్ కుమార్
“మీడియా వార్” అంటూ, ’సాక్షి’ దినపత్రిక, ’ఈనాడు’ కొట్టెసుకుంటున్నాయని TV9 నిన్న రాత్రంతా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరేసింది. పత్రికావిలువలు, పాఠకుడి పట్ల నిబద్దత, పత్రికా స్వాతంత్ర్ర్యం మొదలగు విషయాల్ని గురించి మహామహుల్ని పిలిచి ఊదరగొట్టింపజేసారు. ఈ ప్రహసనం ఇలాసాగుతుండగా, ఇంకో ఛానల్లో ఈమధ్యనే ఫ్రెష్ గా ఫ్లాపైన సినిమాని బ్రహ్మాండమైన ఆదరణతో వందరోజులవైపు పరుగెడుతోందని నిరూపించే ప్రయత్నం నా కంటపడింది. అప్పుడనిపించింది, సినిమా ప్రేక్షకుడిపట్ల ఈ నిబద్దత ని సినిమాతీసేవాడితోపాటు, సినిమాతో అక్రమసంబంధం [...]
పూర్తిగా చదవండి

పెద్దలు - ప్రేమలు - సినిమాలు

చిత్రం, పెద్దలు, ప్రేమలు, భారతీయ సినిమా, విశ్లేషణ, సినిమాలు K మహేశ్ కుమార్
“దేవదాసు” కు దాస్యం చేసి, “మల్లీశ్వరి” ని రాణి ని చేసి, “సాహసం సేయరా ఢింభకా…రాకుమారి దక్కుతుందని” (పాతాలభైరవి) ప్రేమని ప్రోత్సహించిన తాతయ్య,బామ్మ ల తరం ఒకటైతే, “మేఘసందేశా”న్ని మధించి “ప్రేమాభిషేకా”న్ని పొంగించిన నాన్నలు,అమ్మల తరం మరోటి. కానీ,ఈ రెండు జనరేషన్లూ ప్రేమకు వ్యతిరెకమే.మళ్ళీ ఏమైనా ఆంటే “ఈకాలం సినిమాలున్నాయి చూసారూ…ఇవి పిల్లల్ని చెడగొట్టేస్తున్నాయి” అంటూ రాగాలు పోవడం పరిపాటి. నిజంగా సినిమాలు అంత మహత్తును కల్గి ఉంటాయా? మానవ సంభంధాలను అదీ ముఖ్యంగా ప్రేమను నిర్వచించి,ప్రోత్సహించే [...]
పూర్తిగా చదవండి

నా జీవితం లో ’రే’ సినిమా

charulata, charulatha, satyajit ray, చారులత, ప్రముఖులు, బెంగాలి, బెంగాలీ సినిమా, బెంగాళీ సినిమా, భారతీయ సినిమా, విశ్లేషణ, సత్యజిత్ రే K మహేశ్ కుమార్
సత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ ’రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ ’పథెర్ పాంచాలి ’ తోనో ’అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది. 1994 లో ఆంధ్ర దేశమనే [...]
పూర్తిగా చదవండి

కళ-సినిమా

భారతీయ సినిమా, విశ్లేషణ అతిధి
పరిచయ వాక్యం: ఇదంతా ఇప్పటి మాట కాదు. దాదాపు 60 ఏళ్లకు పై మాటే! ఆ రోజుల్లో, అంటే మనకు స్వాతంత్ర్యం రాక ముందన్నమాట, రూపవాణి అనే సినిమా పత్రిక వుండేది.ఈ పత్రిక లోని వ్యాసాలు కొన్ని ఇక్కడ ఆర్కైవ్ చేసి వుంచడంతో, ఆ రోజుల్లో మన వాళ్ళు సినిమాని ఏ విధంగా ఆదరించేవారో అని చదువుకుంటూ పొతే చదువుతున్న కొద్దీ ఆశ్చర్యం కలిగించేలా వుంది అక్కడి సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో [...]
పూర్తిగా చదవండి

ఉత్తమ సాంఘిక చిత్రం స్వతంత్రావారి ’ద్రోహి’

L V Prasad, LV Prasad, dhrohi, drohi, ఎల్ వి ప్రసాద్, ఎల్వీ ప్రసాద్, తెలుగు సినిమా, తెలుగు సినిమాలు, ద్రోహి, పాత తెలుగు సినిమా, పాత సినిమా, భారతీయ సినిమా, యల్ వి ప్రసాద్, విశ్లేషణ, సమీక్ష అతిధి
గమనిక: ఇది శ్రీ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1948 లో వచ్చిన ’ద్రోహి ’చిత్రం గురించి రూపవాణి పత్రికలో వచ్చిన ఫిలిం రివ్యూ. నేటి గాఢాంధకార తెలుగు చలనచిత్ర లోకంలో వెలుగును చూపించే ఉత్తమ సాంఘిక చిత్రం స్వతంత్రావారి ’ద్రోహి’ ప్రసాద్ దర్శకత్వము, నటన చాలా బాగున్నవి. పాములేని కొరతను శివరావు తీర్చాడు. లక్ష్మీ రాజ్యం ఆడగాంధిగా రాణించింది పాములూ, తేళ్ళూ, గాడిదలూ, గుర్రాలూ, దొంగలూ, దేవతలూ ఇత్యాది సామగ్రితో జానపద చిత్రాలు తీసి వాటియొక్క ప్రయోజనాన్ని గురించి తాము నమ్మలేక, [...]
పూర్తిగా చదవండి

Conceptual Integrity - A case study of Bollywood Title Songs

Songs, bollywood, krazzy 4, క్రేజీ ౪, పాటలు, బాలీవుడ్, భారతీయ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
మొన్ననే అంశనిజాయితీ మీద ఒక పరిచయ వ్యాసం వ్రాయడం జరిగింది. అక్కడే జల్సా సినిమాగా ఒక చిన్న ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. నిజాయితీ లేని సినిమాని, లేదా ఏ ఇతర కళాఖండాన్నైనా, వస్తువునైనా అశ్వాదించడం, లేదా వాడడం చాలా కష్టం. ఉదాహరణకు, సియర్సు భవంతి రూపంలో గుళ్ళు కట్టలేము. అదే విధంగా ఓ నవీన కార్యాలయాల్ని కూడా ద్రవిడ గోపుర శైలిలో నిర్మించలేము. అంతెందుకు మతాన్ని బట్టి దేవస్థాన కట్టడం వుంటుంది.అలానే సినిమాలలో కూడా, [...]
పూర్తిగా చదవండి

Conceptual Integrity - A case study of జల్సా

జల్సా నిజాయితి, భారతీయ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
జల్సా సినిమా నచ్చలేదని చాలా మంది యాంటీ ఫాన్సు అంటూనేవున్నారని చాలా మంది ఫాన్సుకు తెలిసినదే. దానికి కారణం సినిమా చెత్తగా వుండడం అని వారన్నా, మాకు అది నమ్మసక్యంగా లేదు. పవనం నటన, త్రివిక్రమం సంభాషణలు, ఇలియానా మఱియూ పార్వతీ మెలటను సొగసులు మొదలైనవి ఎన్నో వుండగా, ఈ సినిమా బాగోకపోవడమేమిటి అని. అలాంటి దృశ్య సంపదలతోఁ బాటు, రెండు మూడు కథలు, ఒక దానితో ఒకటి అల్లేసుకొని వుండడం; అత్యాధునిక కూర్పు సాంకేతికాలు; అర్భాటంగా [...]
పూర్తిగా చదవండి

హేండీక్యామ్ హారర్

blair witch project, cloverfield, cloverfiled, dairy of the dead, handhel horror, handhels camers films, horror, rec, ప్రపంచ సినిమా, విశ్లేషణ, హారర్ శిద్దారెడ్డి వెంకట్
మన తెలుగు సినిమా పరిశ్రమలో కానీ మరేదైనా సినిమా పరిశ్రమలోకానీ ఒక సినిమా విజయం సాధిస్తే ఆ సినిమానే అధారంగా తీసుకుని మరి కొన్ని సినిమాలు రావడం జరుగుతూనే వుండడం సహజం. ఉదాహరణకు, పోయిన సంవత్సరం సూపర్ హీరోల సినిమాల సీక్వెల్స్ తో హాలీవుడ్ సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి వచ్చిపడ్డాయి. ఈ సంవత్సరం విడుదలయిన క్లోవర్‍ఫీల్డ్ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమాలో ఉపయోగించిన టెక్నిక్ తో రాబోయే కాలంలో మరిన్ని సినిమాలు వచ్చే సూచనలు [...]
పూర్తిగా చదవండి

Women in Adoor Gopalakrishnan’s Cinema

భారతీయ సినిమా, విశ్లేషణ వారాల ఆనంద్
Adoor Gopalakrishnan, a name parallel to the artistic cinema of India is a versatile film maker with different shades and his films are centered in Kerala and Malayalam life. He concerts on the Human and societal relationships. Since his first film ‘one’s own choice’ (Swayamvaram) to the latest film ‘four women’ (Naalu Pennungal), all [...]
పూర్తిగా చదవండి

పల్ప్ ఫిక్షన్-పరిచయం

Pulp Fiction, World cinema, best screenplay, non liner narrative, quentin tarantino, top 100 films, పల్ప్ ఫిక్షన్, ప్రపంచ సినిమా, విశ్లేషణ శిద్దారెడ్డి వెంకట్
ప్రపంచాన్ని కుదించి కంప్యూటర్లో బంధించేసిన నేటి అంతర్జాలపు రోజుల్లో Pulp Fiction సినిమా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే వుండి వుంటారు. ఈ సినిమా చూడకపోయినా కనీసం వినైనా వుంటారు చాలామంది సినీ ప్రేమికులు. ఒక వేళ ఈ సినిమా గురించి మీరింకా వినలేదంటే ప్రపంచ సినీ జ్ఞానం మీ తలకింకా బాగా ఎక్కలేదన్న మాట సత్యం. తెలుగు సినిమా చరిత్రలో ఒక శివ లాగా, ఇటాలియన్ సినీ చరిత్రకు ఒక Bicycle Thief లాగా,ఫ్రెంచ్ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS