Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రాలిన చింతపండు – కొత్త దుప్పటి

వ్యాసం, సమీక్ష పొద్దు
- స్వాతీ శ్రీపాద మామూలు గ్రామీణ వాతావరణంలో ప్రతిచిన్న విషయానికీ ప్రాముఖ్యత వుంది. గ్రామీణులు చిన్నచిన్న విషయాలలో కూడా ఎంత జాగ్రత్త, పొదుపరితనం పాటిస్తారో; అది వారికి ఎందుకు అవసరమో ఇదే రచయిత తన చినుకుల సవ్వడి నవలలో అద్భుతంగా చూపాడు. చెట్టు నుండి రాలే చింతపండు గురించి ఇంతవరకు ఎవరూ కథ రాయాలని అనుకుని వుండరు. దాన్ని కథాంశంగా ఎంచుకోవడం రచయిత సూక్ష్మదృష్టికి నిదర్శనం. “రాలిన చింతపండు” సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథాసంపుటి “కొత్త దుప్పటి”లోని ఐదవ కథ. [...]
పూర్తిగా చదవండి

మానవసమాజాల అధ్యయనం

విజ్ఞానశాస్త్ర రచనలు, వ్యాసం yasapala
సిరిసంపదలకూ, హోదాలకూ, అధికారాలకూ అప్పటిదాకా ఉండిన అర్థాలన్నీ తారుమారు కావడం, సమాజంలో ఏది గొప్ప, ఎవరు గొప్ప, గౌరవ మర్యాదలంటే అర్థమేమిటి మొదలైన ప్రశ్నలూ పరిశీలకులకు సవాళ్ళు అయికూర్చున్నాయి. గతంలో జరిగిన పరిణామాల గురించి చింతకులు వితర్కించుకోసాగారు.
పూర్తిగా చదవండి

శిఖామణి – చిలక్కొయ్య

వ్యాసం, సమీక్ష పొద్దు
- బొల్లోజు బాబా “మువ్వలచేతికర్ర” తో తెలుగు సాహిత్యలోకంలోకి ఒక మెరుపులా ప్రవేశించారు శిఖామణి. “చిలక్కొయ్య” ఆయన రెండవ కవితాసంపుటి. 1993 లో వెలువరించిన ఈ సంపుటిలో మొత్తం 33 కవితలున్నాయి. దేనికదే వస్తువైవిధ్యంతో, విలక్షణమైన అభివ్యక్తితో కనిపిస్తాయి. అనుభూతికి భాషనివ్వటం అంత తేలికేమీ కాదు. ఎందుకంటే కొన్ని అనుభూతులను వ్యక్తీకరించటానికి భాష సరిపోదు. ఈ రెంటినీ సమన్వయపరచి, ఒక అనుభూతిని అంతే శక్తిమంతంగా చదువరిలో ప్రవేశపెట్టటంలో శిఖామణి నేర్పరి. ఈ సంపుటిలో [...]
పూర్తిగా చదవండి

నాయకులకే కాదు ప్రజలకూ తెలియాలి పాలన

వ్యాసం నాగరాజా
రాజనీతి శాస్త్రం అంటే పొలిటికల్ సైన్సుకు, పాలన శాస్త్రం అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషనుకు పోలికగానీ తేడాగాని తెలియని సైన్స్ గ్రాడ్యుయేట్లను చూస్తుంటే మన చదువుల మీద చిరాకేస్తుంది. ఒకసారి పుస్తకాల పార్సిలు వి.పి.పిలో వస్తే విడిపించుకోవడానికి పోస్టాఫీసుకు వెళ్లాను. పదిహేను పదహారేళ్ల కుర్రాడొకడు స్టాంపుల కోసం కౌంటర్లో అడిగాడు. పోస్టల్ అసిస్టెంట్ ఆ కుర్రాడి మీద దయ చూపకుండా “ఏవి కావాలి? పోస్టల్ స్టాంపులా? రెవెన్యూ స్టాంపులా?” అని అడిగాడు. ఆ రెండింటికీ తేడా తెలియని ఆ [...]
పూర్తిగా చదవండి

వివేచనాత్మక సాహిత్యాన్ని కొత్త దృష్టితో చూపించే వ్యాసాలు

వ్యాసం నాగరాజా
నోబెల్ బహుమతి గ్రహీత, స్విస్ భాషా రచయిత హెర్మన్ హెస్ తన “సిద్ధార్థ” నవలలో నదిని వినడం ద్వారా సమస్తం తెలుసుకోగలుగుతామని బోధిస్తాడు. అయితే అంతకు చాలాకాలం ముందునుంచే బైబిలు భూమితో మాట్లాడితే మరిన్ని విషయాలపట్ల వివేచన కలుగుతుందని చెప్తుంది. విప్లవకవి వరవరరావు తన విమర్శ వ్యాస సంపుటికి అదే పేరు “భూమితో మాట్లాడు...” అనే ఖాయం చేశారు. ఆ పుస్తకాన్ని ఈ వారం పాఠకులకు పరిచయం చేస్తున్నాను. వరవరరావు అనగానే ఈ తరం పాఠకులకు విప్లవకవిగానే తెలుసు. [...]
పూర్తిగా చదవండి

ఎప్పుడూ భారతీయ ఆధ్యాత్మిక రాయబారి వివేకానందుడే

అనువాదం, వ్యాసం నాగరాజా
“పేదల, దీనుల కుత్తుకలపై పరమనీచముగా హిందూ మతమువలె కాలిడి తొక్కు మతమును లోకమున వేరు లేదు” (1). “బుద్ధుడు మొదలుకుని రామనోహనరావుల వరకును ప్రతి వ్యక్తియు వర్ణ వ్యవస్థతోపాటు మతమును – ధర్మమును – ధ్వంసము చేయబూని విఫలులైరి” (2). “ఇతరులపట్ల పరమ నికృష్టముగా అసూయపడుటలో, (హిందూ మతానికి) ఇంత పేరు ప్రతిష్ట జగత్తున లేదు” (3). “దక్షిణ (భారత)దేశమున అగ్రవర్ణాలు నిమ్నవర్ణాలను పెట్టు యమయాతనలు నా కన్నులార చూస్తినే! గుళ్లల్లో (అగ్రవర్ణజుల) ఏమి ఒడలెరగని సివము! పేదల దుఖస్థితిని తొలగింపజాలని మతము [...]
పూర్తిగా చదవండి

సౌమ్య టాక్స్

ఇంటర్వ్యూ, వ్యాసం పొద్దు
-స్వాతి కుమారి తాను చదివిన పుస్తకాల వివరాలూ, రివ్యూలు, నచ్చిన సినిమా పాటల విశేషాలే కాకుండా ఇతర భాషా కథల అనువాదాలూ, సొంత రచనా ప్రయోగాలూ అన్నిటినీ Sowmya writes అంటూ తన బ్లాగులోనూ, వెబ్ పత్రికల్లోనూ కుమ్మరించే వి.బి.సౌమ్య ఇప్పుడు కొన్ని సరదా కబుర్లని కూడా మనతో పంచుకుంటుంది. అంటే, నాకు అప్పుడప్పుడూ తిక్కరేగుతూ ఉంటుంది. అప్పట్లో అంతా ఏం చేయాలో తోచేది కాదు. ఈ మధ్యే 2009 మొదట్లో ఓ మార్గం కనిపెట్టాను. అదే ఈ నిశ్యాలోచనాపథం. [...]
పూర్తిగా చదవండి

An Apology of a Telugu fa(lu)natic

భాష, విమర్శ, వ్యాసం పొద్దు
Dear Telugu readers who cannot read this letter or who cannot understand all the words in this letter, please don't feel bad about it (in fact you have to be proud!). The fault is not yours, but mine. It is my fault of sticking to the same old rotten stinking language instead of writing it completely in English, or upgrading myself to the current Telugu language that can be understood by everyone.
పూర్తిగా చదవండి

ఒక్కవానచాలు

వ్యాసం పొద్దు
అచ్చ రాయలసీమ నుడికారంతో మొదలవుతుంది - 'రాత్రి పదిగంటలు దాటినా మా యవ్వారం ఆగలేదు' అంటూ. కథలు పురి విప్పడం, పద్యాలు గొంతుసవరించుకోడం, ఆకాశాన్ని ఎండిపోయి గవ్వలు బైటపడిన చెరువుతో పోల్చడం, దుప్పటి పొడవున్న నల్లటి మేఘపు తునక చందమామ వెన్నెల నవ్వుల్తో బయటకు రావడం లాంటి మాటల్లో రచయిత భావుకత్వం వెల్లడౌతుంది.
పూర్తిగా చదవండి

చరిత్ర రచనను కొత్త దారి పట్టించిన కోశాంబి

వ్యాసం meeruchadivaaraa
చరిత్ర అర్థశాస్త్రాలు చదువుకుని అధికారంలోకొచ్చిన ఒక పెద్ద మనిషి ఐటి, బిటిల గురించి అ,ఆ,ఇ, ఈ లు తెలియకుండానే చరిత్రను ఎద్దేవా చేస్తూ ఈ కాలం పిల్లలు ఇంకా చరిత్ర ఎందుకు చదువుకుంటున్నారో ఏమిటో అని వాపోయారట! చరిత్ర సమగ్ర అధ్యయనంతోటే సుందర భవిష్యత్తు నిర్మాణం సాధ్యం అన్న కోశాంబి మాటలు ఆయనకు చెప్పడం వృథాకూడా. ప్రజాస్వామ్య విలువలు, స్ఫూర్తిని ఉగ్గుపాలతో రంగరించడానికి వీలుకల్పించే విద్యర్థి ఎన్నికలను అన్ని కాలేజీల్లోనూ, యూనివర్శిటీల్లోనూ రద్దు చేసిన ప్రబుద్ధుడాయన. చరిత్ర అనగానే [...]
పూర్తిగా చదవండి

మార్పు మూలాల శోధన : ది టిపింగ్ పాయింట్

వ్యాసం meeruchadivaaraa
కొన్ని చిన్న నిచ్చ విషయాలే ఎంత పెద్ద పెద్ద మార్పులకు దారి తీస్తాయో వివరించి చెప్పే పుస్తకం “ది టిపింగ్ పాయింట్”ను ఈ వారం పరిచయం చేస్తున్నాను. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్కర్ టైమ్స్ పత్రికలకు విలేకరిగా పనిచేసిన మాల్కం గ్లాడ్వెల్ మార్పు ఎలా సంభవిస్తుందని చేసిన పరిశోధనలో వెల్లడైన సత్యాల ఆధారంగా రాసిందే ఈ పుస్తకం. మార్కెట్లో విడుదలైన కొద్ది రోజులకే ఎంతో సంచలనం సృష్టించింది. కొన్ని వారాలకే గ్లాడ్ వెల్ల్ కోటీశ్వరుడైపోయాడు. పుస్తకంలోని కీలక [...]
పూర్తిగా చదవండి

సమాజ శ్రేయమే వ్యంగ్య లక్ష్యం

వ్యాసం meeruchadivaaraa
వ్యక్తుల బలహీనతలను, రాజకీయ నాయకుల అరాజకత్వాన్ని, అధికారుల అవినీతి రీతులను కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడడమంటే జనమందరికీ భలే ఇష్టంగా ఉంటుంది. కాని ఆ వ్యక్తులకు, రాజకీయ శక్తులకు కోపం నషాళానికి అంటుతుంది. ఉన్నమాట అన్నవారిని, రాసిన వారిని శత్రువుల్లాగా చూస్తారు. ఇంతమంది శత్రువులను, మరెంతమందో స్నేహితులను సంపాదించుకునే ఈ నిజాలు నిజాయితిగా మాట్లాడడం అనితరసాధ్యమైన విద్య. ఇలా మాట్ఆడి, మాట్లాడి కొందరికదే ఓ బలహీనతగా మారుతుంది. నివురుగప్పిన నిప్పులాగా ఆ నిజానికి వ్యంగ్యం పూతపూస్తే, ఓహో… దానికి సాహిత్య [...]
పూర్తిగా చదవండి

“జర్నలిజంలో సృజనరాగాలు” : అక్షరంపై అంతులేని అనురాగం

Uncategorized, వ్యాసం meeruchadivaaraa
కథానిలయానికి ఈ మధ్యన అలా వెళ్లినపుడు కారా మేష్టారు కల్మషంలేని స్వచ్ఛమైన అదే చిరునవ్వుతో ‘మరో మంచి పుస్తకం వచ్చింది చదువుతావా?’ అని నాకో పుస్తకం అందించారు. సాహితీ జ్ఞానభాండాగారంలోంచి అందమైన పుస్తకం తీసిచ్చారు. ఒక అర్థం తెలియని సర్రియలిస్ట్ పెయింటంగ్ రమణ జీవిది ఆ పుస్తకం ముఖచిత్రంపై ఉంది. ‘పుష్పాలు - ప్రేమికులు - పశువులు’ కథల రచయిత మునిపల్లె రాజుగారి కథలలో వేదాంత భావనకు దాసోహమనని తెలుగు పాఠకులు వుండరమో. ఆ పుస్తకానికి ముందుమాట [...]
పూర్తిగా చదవండి

అన్ని ఉద్యమాలు మనిషిగా బతకడానికే

వ్యాసం meeruchadivaaraa
చాలా రోజుల కిందట మానవ హక్కుల వేదిక తన ఏడవ బులెటినును ప్రచురించింది. మళ్లీ ఆ విలువైన ఆ పుస్తకాన్ని ఒక మీటింగ్ కోసం రెండు వారాల కిందట చదివాను. ఆ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను. పుస్తకం పేరు మానవ హక్కులు - 2005 (7వ బులెటిన్). మరి చదవండి.
పూర్తిగా చదవండి

ప్రత్యేక రాష్ట్ర పరిశీలన పాపమేమీ కాదు

వ్యాసం meeruchadivaaraa
పొరిగింట్లో జామిచెట్టు కొమ్మ మన ఇంట్లోకి వాలిందనుకోండి. ఆ కొమ్మపై పళ్లు మనవా? వాళ్లవా? మనింట్లో జామిచెట్టు కొమ్మ పొరిగింటి పిట్టగోడ మీదుగా వెళ్లిందనుకోండి, అక్కడి పళ్లు మనవా? వాళ్లవా? ఎదురింటి వాళ్ల జామికొమ్మ వాల్ల పక్కింటిలోకి వాలితే ఆ పళ్లు ఎవరివి? చెప్పండి చూద్దాం.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS