1.పావుగంటగా ఆలోచనలేమీ లేవుయవ్వనం ఫోల్డర్ ఓపెను చేసా!నీ పరిమళం చుట్టుముట్టింది.*******2.కోరికకు సాఫల్యానికిమధ్య అగాధం.చితిలో ఇంకా నిప్పుంది.పోరాడాల్సిందే!*******3.నిన్నటి రోజాలుఎక్కడకు పోయినయ్?కుసుమం వికసించటంలోనేదాని చావుంది.*******4.భాయ్నేను చెప్పే ఈ విషయాన్నిప్రపంచం నమ్మటంలేదు.మనిద్దరం ఒకే వేర్లని కలిగి ఉన్నాం.********5.నగ్న తరువులు --పత్రాల, పుష్పాల దుస్తులు లేవు.వసంతం వస్తోంది.బొల్లోజు బాబా
పూర్తిగా చదవండి