Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రామ పదాబ్జముల్

చిక్కు ముడి, పద్యం, శార్దూలం Giri
రానారె కడప కేంద్రం నుంచి వెలువరించిన సమస్యకి నా పూరణ ఇదిగో - రావణుడికి హనుమంతుని హితబోధ ఇది. శా. కామాగ్నుల్ హరియించి పోవు తృటిలో, కైంకర్య మందేనురా, రా, మాయమ్మను భక్తితత్పరుడవై రామయ్యకందించగా రా, మా రామ పదాబ్జముల్ కొలువరారా, కీర్తి మిన్నందురా నీ మాన్యంబిక లోకమందు వెలుగున్ దేదీప్యమానంబుగా
పూర్తిగా చదవండి

పొలో!

పద్యం, శార్దూలం Giri
ఈ వారం పని మర్చిపోయి, సరదా ఎంజాయిమెంట్లో పడే పోవాలంటు, మరేమి బాధ్యతల బర్వూ లేని స్వేఛ్ఛాయువే కావాలంటు, యధేఛ్చగా తిరుగుతూ కాలం వృధా చేస్కునే ఆవారా పనిలో పడాలనుకునే, అయ్యాను సిధ్ధం! పొలో!! వచ్చే వారమంతా నేను హైదరాబాదులోనే ఉంటాను. ఈ మధ్య పెరిగిన పని వత్తిడి నుంచి కొంత విముక్తి కూడా - వీలు దొరికినప్పుడు విశాలాంధ్రాకి వెళ్ళి మంచి పుస్తకాలు కొన్ని కొనుక్కోవాలని అనుకుంటున్నాను, అంతకు మించి ఇంకేమీ
పూర్తిగా చదవండి

No country for old men

Coen brothers, Hollywood, Movies, పద్యం, శార్దూలం Giri
శా. నోకంట్రీ ఫరు ఓల్డుమెన్ను కదనంతొక్కింది ఆస్కారుకై, ఏకంగా మరి నాల్గుబొమ్మలకు కన్నేసింది, ఆస్కారమే లేకుండా తనసాటి బొమ్మలను తేల్చేసింది ఈ ఏడు చ క్కా కుందించి పడేసి వాటిని, తనే గైకొంది, వీగింది, పో! కుందించి అంటే కుదించి, అణగ త్రొక్కి అని అర్ధం వచ్చేలాగ రాస్తే వచ్చిన విమర్శల కారణంగా చివరి పాదం సవరించాను, చివర్లో పురస్కారముల్ అని వాడుక వల్ల పద్యం పూర్తిగా వ్యవహారికము కాక బాగుండదేమో అనే సంకోచం కొంత
పూర్తిగా చదవండి

Singapore wins Youth Olympics 2010 bid

Singapore, పద్యం, శార్దూలం Giri
నిర్వహణ విషయం గురించి సింగపూరుని.. శా. కాస్కో, ఓ చిరు దేశమా, ఎదురు రాగానే సరా గొప్పగా ఆస్కారమ్మిక లేదులే గెలువ, నీకా మోజు తీరేట్లుగా చూస్కో చిత్తుగ పిండికొట్టెదములే చూస్తుండగానే, అనెన్ మాస్కో, గెల్వగ చూచి తొట్టతొలి యవ్వనంపొలంపిక్కులన్*. కానీ అలా జరగలేదు. సింగపూరు చిన్నదైనా ప్రజాబాహుళ్యంలో ఈ ఆటలు నిర్వహించాలన్న తపన చూసి ఒలంపిక్కు కమిటీ వారు మాస్కోని వదిలి సింగపూరునే ఎన్నుకున్నారు. మాస్కోవాళ్ళు
పూర్తిగా చదవండి

చెత్త పాటలు రాసే తెలుగు సినిమా కవీ..

Movies, పద్యం, శార్దూలం Giri
శా. ఏంట్రా నీకిది కొంచెమైన సబబా? ఇట్లాంటి సాహిత్యమా? కంట్రీబ్రూటయి తెల్గు పాటలనిలాగా, పెంట సిన్మాలకై కంట్రోలన్నది గాలికొగ్గి భడవా, గార్బేజిలా కక్కుతా వేంట్రా? వెంట్రుకె ఉచ్చు నీకు వెధవా, వేళ్ళాడి ఊరేగరా.
పూర్తిగా చదవండి

అమెరికా, ఉంటా మరిక.. - 3

చంపకమాల, పద్యం, శార్దూలం Giri
సింగపురికి ఏ ఒడుదొడుకులూ లేకుండానే వచ్చి చేరాము..కొత్త (ప్ర)దేశం, కొత్త ఉద్యోగం.చ. కుదురుగ కొత్తచోట పని కూర్చుని పొందికగా తలొంచి చే సెదనని నే తలంచితిని సింగపురంబుకు వచ్చిచేరతూ ఇదివరకున్న రాజసమదిక్కడ చేయుట సాధ్యమవ్వజా లదని గ్రహించి తేరుకొన వ్రాయుట బ్లాగిక కష్టమవ్వదా?వ్రాయడానికి మున్ముందు ఎంత సమయం దొరుకుతుందో సమయమే చెపుతుంది. ఐతే, సింగపూరు ఏర్పోర్టులో దిగి ఇమిగ్రేషన్ కౌంటర్ కి వచ్చేసరికి మాదగ్గర నా
పూర్తిగా చదవండి

ఆంగ్ల వృత్తం, Visa headache

English పద్యం, పద్యం, శార్దూలం Giri
ఆంగ్లంలో ఓ వృత్తం రాయడం కోసము నేను చేసిన ప్రయోగం ఇదిగో. కష్టపడితే పరభాషనే వరించే గణరీతులతో మన మాతృభాషని అలంకరింపజేయడం కష్టమంటారా? శా. When I went to the Consulate for my Visa, the line there sna kin-nice-and-soporific in a low key way to people-sittin g-on-nice-and-heavily-cooled cushion, ignoring us all blithely in Chennai's heat very humid weather, OH! simply belittled me! గణాలు సరిగా
పూర్తిగా చదవండి

Om Shanti Om

Movies, తేటగీతి, పద్యం, శార్దూలం Giri
శా. మైహూనా - చవి చూపి చెత్తను, శిరోభారమ్ము పెంచేయగా నా హూనంబయినట్టి బుఱ్ఱకు ప్రమాణంబిస్తి, మళ్ళీ ఫరా కాహారంబెపుడూ తనవ్వదని; వాగ్దానాలు కల్లల్ కదా, ఆహా, నేడు సమీక్షలన్ చదివి, హైహై యంటి ఓంశాంతిఓం తే.గీ. చిత్రమును చూడ పంతము చేయ బుద్ది తానె గడ్డి మేసినదై; ఇదంత మీకు చెప్పు కారణమేమన, పప్పులోన కాలు పడకముందె నను ఆపాలి తమరె.మీలో ఎవరైనా ఈపాటికి ఓం శాంతి ఓం చూసి ఉంటే, పై పద్యంలోని 'మీరు' మీరే. Reviews
పూర్తిగా చదవండి

వర కట్టనము, వరుణ్ణి కొట్టడము

ఆటవెలది, తెలుగు, పద్యం, శార్దూలం Giri
ఇది చదవండి - అమెరికాలో ఉంటూ రెండు చేతులా ఆర్జిస్తున్నప్పటికీ వరకట్నపుమోజుతో చివరకు పెళ్ళే కాదు, గౌరవ భంగం కూడా చేసుకున్న ఒక దురాశాపరుడి కధ. (మితిమీరలేదనుకుంటే) వధువు కుటుంబం చేసినది మంచి పనే. లగ్న పత్రికలు ఎలాగు అచ్చు అయిపోయాయి కాబట్టి ఇక ఆడపెళ్ళివారు వెనుతిరగలేరనే ధిమాతో ఇలాంటి వెర్రివేషాలకు దిగజారే వారందరికీ ఇదొక గుణపాఠంగాను, అనవసరమైన వత్తిళ్ళకి గురవ్వు వధువుల కుటుంబాలకు ఇది మార్గదర్శకం గాను
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS