Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పిల్లనగ్రోవి కచేరి

అమెరికా నేల, ఏవైనా, సంగీతం నాగరాజా
ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్ రోనూ మజుందార్ గారి పిల్లనగ్రోవి (వేణువు) కచేరి రేపు సాయంత్రం మా ఊర్లో ఉంది. టికెట్టు వెల 15$. కొంత కాలం సంగీతం వెలగబెట్టాను కాబట్టి నేను కూడా వెళ్తున్నాను. రోనూ గారి సంగీతాన్ని ఇక్కడ వినవచ్చును. ఇక్కడ శుక్రవారం, ఆదివారంతో పాటు రాబోయే రోజుల్లో వేర్వేరు అమెరికా పట్టణాల్లో కచేరీలు ఉన్నాయి. వివరాలకు ఆయన వెబ్ సైటును సందర్శించండి. వారణాసి నగరంలో జన్మించిన రోనూ గారు మొట్టమొదట [...]
పూర్తిగా చదవండి

నేను విన్న మన పాటలు

భారతీయ సినిమా, సంగీతం సౌమ్య
గమనిక: ఈ అభిప్రాయాలు నేను నాకు తెలిసినంతలో గమనించినంతలో కలిగినవి మాత్రమే. వీటిలో పొరపాట్లు కూడా ఉండవచ్చు…బహుశా కాలం గడిచే కొద్దీ (rather, వయసయ్యే కొద్దీ) ఇక్కడన్న అభిప్రాయాలు మారొచ్చు కూడా. కనుక, ఇలా నాలుగు భాగాలు ఎలా చేస్తారు మీరు? నువ్వెవరు చెయ్యడానికి? వంటి ప్రశ్నలేస్తే జవాబులకోసం ఎదురుచూడొద్దని మనవి చేసుకుంటూన్నా. ఇక నా క్లాసిఫికేషన్ కి ప్రాతిపదిక అంటారా - నేను చూసిన సినిమాలలో పాత-కొత్త అని నేను ఎలా అర్థం చేసుకున్నానో అదే [...]
పూర్తిగా చదవండి

నిశాంత మహీజ …

కవిత్వం, పద్యాలు, సంగీతం, సినిమా కొత్త పాళీ
ముందొక సారి సంగీతంతో .. అటుపై సాహిత్యంతో నన్నొకటికి రెండుసార్లు పల్లిటీ కొట్టించిందీ పాట.భాగ...
పూర్తిగా చదవండి

గాన గంధర్వుడి గానవర్షం

Classical Music In Indian Movies, Hamsalekha, Miyan Ki Malhar, SP Balasubrahmanyam, నేను విన్న పాట, భారతీయ సినిమా, సంగీతం శ్రీరాం
మూడున్నరదాటి పదినిముషాలైనా బస్సు ఇంకా కదలలేదు. వేడిగానేకాదు ఉక్కగా కూడా ఉంది లోపల. ఫిబ్రవరి వచ్చింది కదా మా ఊరికి వేసవి వచ్చేసింది అనుకున్నాను. ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని ఎఫ్ఫెమ్ రేడియో వినడం మొదలుపెట్టా. “…బాలసుబ్రహ్మణ్యం” అన్నది మాత్రం అర్ధమైంది, ఆ రేడియోజాకీ మాటల్లో. బాలుగారి గాత్రం వినబడడం మొదలైంది. సన్నగా ఏదో రాగాలాపన మొదలైంది. మనస్సులో కాస్త ఉత్సాహం కూడా. పాట మొదలయ్యేప్పటికి బస్సుకూడా కదిలింది. “ఉమండు ఘుమండు ఘన్ గర్‌జే…” అంటూ హిందీలో సాగుతోంది పాట. [...]
పూర్తిగా చదవండి

శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం…

కబుర్లు, సంగీతం Sriram
“శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం లాగ…” అని మహాకవి వెక్కిరిస్తే వెక్కిరించాడు కానీ, ఆ ఆకాశవాణే కనక పోషించి ఉండకపోతే మన తెలుగునాట సంగీతమూ సంస్కృతీ ఈ మాత్రం కూడా నిలబడి ఉండే కావు అని నాకు అనిపిస్తుంది. ఐనా ఆ మాటకొస్తే భారతీయ సంగీతపు లోతులు తెలిసిన వాళ్ళకి దాని ముందు ఈ రేడియోలాంటివి ఏ మాత్రం గొప్ప అద్భుతాలు అనిపించక మానదు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే నాగరాజు మేస్టారుని సంప్రదించండి. అసలు అయనే [...]
పూర్తిగా చదవండి

గడచేనటే సఖీ… ఈ రాతిరీ…

వీ-డియో, సంగీతం రానారె
వెంకట్ సిద్ధారెడ్డి బ్లాగులో జరిగిన చిన్నపాటి చర్చకు నా అభిప్రాయాన్ని వీలైనంత బలంగా చెప్పే ప్రయత్నం ఈ టపా. అంతే కాకుండా, ఈ వీడియో చివరలో మల్లాది రవికుమార్ గారు ఆలపించిన ఓలేటివారి స్వరకల్పన... దివ్యం! అనగా దివినుంచి జాలువారినది అని తాత్పర్యం. నేనొక ఇరవైమార్లు విని, అందరూ మళ్లీమళ్లీ విని ఆనందించాలనే సదుద్దేశంతో యూట్యూబుకు చేర్చాను. [ఇది ముమ్మాటికీ కాపీహక్కుల ఉల్లంఘనే. మాటీవీ వాళ్లు నామీదకు
పూర్తిగా చదవండి

తమిళం……..

తెలుగు, సంగీతం venkat.siddareddy
నువ్వు గొప్పా? నేను గొప్పా? సమాధానం కష్టమే! కానీ తెలుగు వాడినయిన నేను చాలా సార్లు తమిళోల్లు మనకంటే గొప్పోల్లని తీర్మానించేసుకున్నాను;మనకంటే వారికి కాస్త కళా పోషణ ఎక్కువని నాకు అభిప్రాయం, అందుకే వారిని మనకంటే గొప్పోళ్ళని అనుకోవడం తప్పేమీ కాదేమో? మరి లైఫంటే కూసింత కళాపోషణ వుండాలిగా మరి.
పూర్తిగా చదవండి

Monday Morning Blues

Music, english, తెలుగు, సంగీతం venkat.siddareddy
కొత్త వారం, కొత్త నెల, కొత్త రోజు. నా లాగే మీరూ ఆఫీసులో పని చేసేవాళ్ళయితే ఈ రోజు ఎంత డల్ గా మొదలవుతుందో నాకు తెలుసు. మరో జీతం రావడానికి మరో 31 రోజులు, వారాంతరం ర్రవడానికి మరో ఐదు రోజులు. I know that its gloomy day, and you must be surely feeling blue. కాకపోతే మీ Monday morning blues ఇట్టే వదిలించెయ్యడానికి నా దగ్గర వున్న ఈ చిట్కా తప్పక పని చేస్తుందేమో అనిపిస్తుంది నాకు.
పూర్తిగా చదవండి

నినుకోరి…..మోహనం

తెలుగు, సంగీతం venkat.siddareddy
కర్ణాటక సంగీతం ఖచ్చితంగా విని తీరాల్సిందే లేకపోతే మీరు మన సంస్కృతికి పెద్ద అన్యాయం చేసినట్టే. కాకపోతే చాలా మందికి ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక, సరిగ్గా guide చేసే వాళ్ళు లేక కొంచెం కష్టాలు పడుతుంటారు. నేనూ మొదట్లో ఇలాంటి తిప్పలే పడినా ఇప్పుడు పరిస్థితి కొంచెం మేలయ్యింది.అందుకు చాలానే కారణాలున్నాయి. 1)అంతర్జాలం లో కర్ణాటిక్ సంగీతం గురించి వున్న వ్యాసాలు 2)www.musicindiaonline.com లో వున్న సంగీత సంపద 3)నా శ్రీమతికి కర్ణాటక సంగీతంలో మంచి ప్రవేశం వుండడం 4)పిల్లనిచ్చిన మామ గారు కర్ణాటక సంగీతం గురించి సమీక్షలు, విశ్లేషణలు రాయడం 5)అన్నిటికంటే ముఖ్యంగా మంచి సంగీతం వినాలన్న తపన
పూర్తిగా చదవండి

హేపీ డేస్ - పాటల పరిచయం

సంగీతం, సినిమా పాటలు, సినిమాలు Sriram
తెలుగునాట మిగిలిన ఏకైక కళ సినిమా అంటూ వాపోయాడు రాకేశ్వరుడు ఈమధ్యే. ఐతే, ఈ సినిమా అనేది 64 కళల సమ్మేళనం అన్న విషయం తెలియని వాళ్ళందరూ సినిమాలు తీస్తుండడమే పెద్ద సమస్య అనిపిస్తుంది నాకు. తెలుగుసినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఈ విషయాన్ని కాస్త వంటబట్టించుకున్నది శేఖర్ కమ్ముల అనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన వేరే విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, సంగీతం విషయంలో మాత్రం తన ఉత్తమ అభిరుచిని శేఖర్ తన సినిమాల ద్వారా [...]
పూర్తిగా చదవండి

వానపాటులు

కబుర్లు, భారతదేశం, సంగీతం, సినిమా పాటలు, సినిమాలు Sriram
మొన్న రాత్రి మా ఊళ్ళో ఎడతెగని వర్షం. నేను ఇంటికి చేరుకున్నాకే మొదలవ్వడంతో నేను చాలా ఆస్వాదించాను. చదువరిగారు చెప్పినట్టు చీమచతురత చూసి కాదులెండి. నాకిష్టమైన వానపాటని గుర్తు చేసుకుంటూ.  ప్రపంచ చలనచిత్ర చరిత్ర లో భారతీయచిత్రాలకి మాత్రమే ప్రత్యేకమైన ఈ వానపాటల్లో, నాకు ఈ పాటలో నేను నటించి ఉంటే బాగుండును అని అనిపించిన పాట అది. ఏమిటీ? మీ దృష్టి ఎటుపోయిందీ? ఈ పాట అనుకుంటున్నారా? ఐతే మీరు ఇది చూడలేదన్నమాటే!    సలీల్ చౌధురి ఖమాజ్ రాగంలో [...]
పూర్తిగా చదవండి

కర్నాటిక్ సంగీతం….It’s cool man!

తెలుగు, సంగీతం venkat.siddareddy
పొగ తాగని వాడు వచ్చే జన్మలో దున్నపోతై పుడ్తాడో లేదో తెలియదు కానీ, కర్నాటక సంగీతం వినకపోతే మాత్రం వచ్చే జన్మలో తప్పక గొర్రెగా పుడ్తారు; ఎందుకంటే వినని వాళ్ళు ఈ జన్మలోనే గొర్రెలు కనుక. వినని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే వుంటుందని తెలుసు. కానీ మన సంగీతాన్ని మనమే వినకపోతే ఎలా? అందుకే కొంచెం గట్టిగా చెప్తే అయినా వింటారేమో అని.... పూర్వజన్మలు, పునర్జన్మలు , గొర్రెలు, దున్నపోతుల సంగతి పక్కన బెట్టి సంగీతం విషయానికి వస్తే ఒకప్పుడు నేనూ చాలా మంది లాగే కర్నాటిక్ సంగీతమంటే కర్ణకఠోరంగా వుంటుందని ఫీల్ అయిపోయేవాడిని. అదృష్టవశాత్తూ సరైన వాళ్ళు సరైన సమయంలో పరిచయమయ్యి నా కళ్ళు తెరిపించారు.
పూర్తిగా చదవండి

తెలుగు ఆన్లయిన్ రేడియో - టోరి

టోరి, తెలుగు, పాటలు, సంగీతం Srinivas Ch
మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలుగువన్.కాం వారు ఒక ఆన్లయిన్ రేడియో TORI ని ఈ మధ్యే ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో ఏకకాలంలో 5 స్టేషన్లు 24 గంటలు కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. వీటిని మన కంప్యూటర్లో సులభంగా వినడానికి నేను ఒక చిన్న play list file తయారు చేసాను. కింద ఇచ్చిన వాక్యాలను ఒక ఫైల్లో కాపీ చేసి దానిని .pls ఎక్స్టెన్షన్ తో కాపాడండి. ఉదా TORI.pls అన్నమాట. దీనిని మీ కంప్యూటర్లో ఓపెన్
పూర్తిగా చదవండి

ముఖరితమైన ముఖారి

సంగీతం కొత్త పాళీ
ముఖారి రాగం శోకానికీ విషాదానికీ చిహ్నం అంటూ ఉంటారు. నవరసాల్లో శోకం లేదు. దానికి దగ్గరగా వచ్చే...
పూర్తిగా చదవండి

తంబూర చేకొని ..

సంగీతం కొత్త పాళీ
తోడి రాగలక్షణాలు చెబుతూ మహామహోపాధ్యాయ నూకల చిన్నసత్యనారాయణ గారు Ragas of Indian Music పుస్తకంలో ఇది శాంత, ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS