Can't see Telugu? Learn here. More Questions? Ask here.

భూమిక పాఠకులకు, సాహితీ మిత్రులకు అంతర్జాతీయ మహిళాదిన శుభాకాంక్షలు.

సంపాదకీయం భూమిక
భూమికకు పదిహేనేళ్ళు నిండాయి. ఒక సీరియస్‌ స్త్రీల పత్రికకు ఎడిటర్‌గా నాకు పదిహేనేళ్ళు గడిచాయి. నిజానికి ఎంతో ఆనందంగా పదిహేనేళ్ళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భం.  భూమికకు పదేళ్ళు నిండిన సంవత్సరాన్ని ప్రత్యేక సంచికతో ఎంతో ఉత్సాహంతో నిర్వహించుకున్న విషయం మీకు గుర్తు వుండే వుంటుంది. పదిహేనేళ్ళ ప్రస్థానం ముగింపు దిశగా అడుగేయడం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇన్ని సంవత్సరాలు నా జీవితంతో పెనవేసుకుపోయిన భూమిక నా నుండి విడిపోతుందనే ఊహనే నేను భరించలేకపోతున్నాను. ఈ సంపాదకీయం రాస్తుంటే నా [...]
పూర్తిగా చదవండి

బ్లాగుల గురించి - నా మాట

మార్చి 2008, సంపాదకీయం వేలూరి వేంకటేశ్వర రావు
బ్లాగులు చదవడానికి కొంత ఓపిక, కాస్త శ్రమ అవసరం. పుస్తకం లాగానో, వార్తాపత్రికలో వార్తలాగానో, వ్యాసంలాగానో బ్లాగులు చదవలేం. అసలు బ్లాగులు అలాగ పొదగవు.
పూర్తిగా చదవండి

ఫిబ్రవరి 2008 : సంపాదకీయం

సంపాదకీయం ప్రాణహిత
Painting ‘Black History Month’ప్రాణహిత ఫిబ్రవరి సంచికకు స్వాగతం. ఈ నెలను బ్లాక్ హిస్టరీ మంత్ గా పిలుస్తారు. ఈ నెలంతా అమెరికా లో నల్ల జాతీయుల హక్కుల కోసం, స్వేచ్ఛా సమానత్వాల కోసం పోరాడిన వాళ్ళ జీవితాలనీ, చరిత్రలో ముఖ్య ఘట్టాలనీ తలుచుకుంటారు. అమెరికా చరిత్ర ని రెండు కోణాల్లో పరిశీలించవచ్చు.. ఒకటి సాధారణంగా ప్రధాన స్రవంతిలో ప్రచారంలో ఉన్న కోణం. ఇక్కడ పాలిస్తున్న వారి కోణం. ఇక్కడి ఆధిపత్య సమూహాల దృష్టి నుండి చరిత్రను [...]
పూర్తిగా చదవండి

జనవరి 2008 : సంపాదకీయం

సంపాదకీయం ప్రాణహిత
జనవరి ప్రాణహిత కు స్వాగతం. ప్రాణహిత పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.  21 వ శతాబ్దిలో మరో సంవత్సర కెరటం కాలసముద్రంలో కలిసిపోయింది. 2007 సంవత్సరం వెళ్తూ వెళ్తూ కొన్ని విషాదాలను మిగిల్చి పోయింది. మరీ ముఖ్యంగా సంవత్సరాంతంలో, మనందరికీ సుపరిచితుడు, ఆత్మీయుడూ అయిన ప్రముఖ నవలా రచయిత అల్లం రాజయ్య ఏకైక కుమారుడు అల్లం కిరణ్ కుమార్ అమెరికా లో లూసియానా స్టేట్ యూనివర్సిటీ కాంపస్ లో దొంగతనానికి వచ్చిన కొందరు దుండగులచే అతి దారుణంగా కాల్చి [...]
పూర్తిగా చదవండి

డిసెంబర్ 2007 : సంపాదకీయం

సంపాదకీయం ప్రాణహిత
చిత్రం: ఏలే లక్ష్మణ్ప్రాణహిత డిసెంబర్ సంచికకు స్వాగతం. ఈ సంచిక తీసుకు రావడంలో అనూహ్యంగా ఆలస్యమైనందుకు క్షంతవ్యులం. కొన్ని అనివార్య కారణాలు ఈ ఆలస్యానికి కారణం. ఐతే ఆలస్యమైనా ప్రాణహిత ఈ సారి అద్భుతమైన రచనలతో మీ ముందుకొస్తున్నది. తెలుగు నేల మీద జరుగుతున్న అపారమైన సాహిత్య కృషిని కొంతనైనా మీ ముందుకు తీసుకు రాగలుగుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈనాడు తెలుగులో వస్తున్న సాహిత్యం మీద మనం తరచూ కొన్ని అపవాదులు వింటూ ఉంటాం. [...]
పూర్తిగా చదవండి

డిసెంబర్ 2007 : సంపాదకీయం

సంపాదకీయం ప్రాణహిత
చిత్రం: ఏలే లక్ష్మణ్ప్రాణహిత డిసెంబర్ సంచికకు స్వాగతం. ఈ సంచిక తీసుకు రావడంలో అనూహ్యంగా ఆలస్యమైనందుకు క్షంతవ్యులం. కొన్ని అనివార్య కారణాలు ఈ ఆలస్యానికి కారణం. ఐతే ఆలస్యమైనా ప్రాణహిత ఈ సారి అద్భుతమైన రచనలతో మీ ముందుకొస్తున్నది. తెలుగు నేల మీద జరుగుతున్న అపారమైన సాహిత్య కృషిని కొంతనైనా మీ ముందుకు తీసుకు రాగలుగుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈనాడు తెలుగులో వస్తున్న సాహిత్యం మీద మనం తరచూ కొన్ని అపవాదులు వింటూ ఉంటాం. [...]
పూర్తిగా చదవండి

నవంబర్ 2007 : సంపాదకీయం

సంపాదకీయం ప్రాణహిత
నవంబర్ ఒకటి – ప్రముఖ సాహితీయోధుడు వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి. 1915 లో తెలంగాణ లోని ఒక పల్లెటూర్లో జన్మించిన ఆళ్వారుస్వామి, తన 46వ ఏట 1961 లో మరణించారు. తన 46 ఏళ్ల పరిమిత జీవితంలోనే అపరిమిత విజయాలు సాధించారు. జీవితకాలమంతా సాహిత్య జీవనం, సంఘ కార్యాలు తన రెండు బుజాలుగా పనిచేసారు. ప్రజల మనిషి’, ‘గంగు’ – రెండు నవలలు రాసారు. ‘జైలు లోపల’ మరికొన్ని ఇతర కథలు రాసారు. ‘రామప్ప రభస’ అనే [...]
పూర్తిగా చదవండి

విజ్ఞప్తి

సంపాదకీయం భూమిక
పదిహేను సంవత్సరాలుగా భూమికను ఆదిరిస్తూ, మాకు కొండంత అండగా నిలబడిన ప్రియపాఠకులకు నమస్కారం. భూమిక మాస పత్రికగా మారి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. వెబ్‌సైట్‌ కూడా ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారి ఆదరణ పొందింది. ప్రతినెల క్రమం తప్పకుండా కొత్త కొత్త అంశాలతో, ఆలోచనలు రేకెత్తించే ఆర్టికల్స్‌తో మీ ముందుకొస్తోంది భూమిక. ప్రత్యామ్మాయ, స్త్రీవాద పత్రికను నడపడంలోని ఇబ్బందులు విజ్ఞలైన మీకు తెలియనివి కావు. భూమికను మరింత బలోపేతం చెయ్యడానికి, ఆర్థికంగా కొంత నిధిని సేకరించడానికి [...]
పూర్తిగా చదవండి

ఫాంటసీ — రియాలిటీ

సంపాదకీయం వేలూరి వేంకటేశ్వర రావు
దక్షిణ ఆసియా విభాగాలున్న పది పన్నెండు అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధనాపీఠాలు నెలకొ్ల్పడానికి స్థానికంగా ఉన్న తెలుగు సంస్థలు పూనుకొంటే, దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సహకరిస్తే, దశాబ్దాలుగా ఈ ఆలోచనలు చేస్తున్నవారు ముందుకు వచ్చి కార్యసాధనకు నడుము కడితే, ఐదు సంవత్సరాలలో తప్పక ఈ పరిశోధనాపీఠాలు నెలకొల్పగలమని నానమ్మిక.
పూర్తిగా చదవండి

ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరి పోరాటం

సంపాదకీయం భూమిక
జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరసనని ప్రపంచానికి తెలియచెప్పింది. అంతకు మించిన దారేదీ ఆమెకు కన్పించలేదు. అంత తీవ్రమైన చర్యకి దిగితే తప్ప ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఎవరికీ అర్ధం కాలేదు. పోలీసులు, న్యాయవ్యవస్థ ఆమె పట్ల వ్యవహరించిన నిర్లక్ష్యవైఖరి ప్రపంచానికి తేటతెల్లం కాలేదు. ఎవరీ పూజా చౌహాన్? 2004లో పూజకి ప్రతాప్ చౌహాన్తో పెళ్ళయింది. ప్రతాప్ కూరగాయలమ్ముకుంట, పేపర్లు పంచుత జీవనం [...]
పూర్తిగా చదవండి

అక్టోబర్ 2007 : సంపాదకీయం

సంపాదకీయం ప్రాణహిత
సెప్టెంబర్ 9 ఆదివారం సాయంత్రం హైదరా‘బాధ’లో మరో దారుణం జరిగింది. నగరంలో, జనసమ్మర్దం తో అత్యంత రద్దీ గా ఉండే పంజగుట్ట లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ హఠాత్తుగా కూలిపోయింది. అనేక వాహనాలు కూలిన ఫ్లై-ఓవర్ కాంక్రీట్ దిమ్మలకింద నజ్జు నజ్జై పోయినయి. ఇద్దరు మరణించారు. పదుల కొద్దీ తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లై-ఓవర్ కూలడానికి కారణాలు వెదికే క్రమంలో, ఫ్లై-ఓవర్ నిర్మిస్తున్న గామన్ కన్‌స్ట్రక్షన్ కంపనీ తన తప్పేమీ లేదని, అంతా హైదరాబాదు మున్సిపాలిటీ, వాటర్ [...]
పూర్తిగా చదవండి

ప్రాచీనత గురించే మరోసారి!

సంపాదకీయం, సెప్టెంబర్ 2007 సురేశ్ కొలిచాల
ఎంతో అనుభవజ్ఞులైన తెలుగు సాహితీ వేత్తలు, విశ్వవిద్యాలయాధికారులు కూడా ఈ రకమైన సిద్ధాంతాలకు వత్తాసు పలకడంతో ఈ వాదాల అశాస్త్రీయతను ఎత్తిచూపిస్తూ మరోసారి రాయడంలో తప్పులేదనిపించింది.
పూర్తిగా చదవండి

నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…. ! (నిజంగానా?)

జూలై 2007, సంపాదకీయం వేలూరి వేంకటేశ్వర రావు
మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాలవాళ్ళూ, నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలూ అల్లేశారు, వల్లించేశారు. అదికొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరికొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది. - తెలుగు భాష అంతర్జాతీయ భాషగా గుర్తించాలి – అని.
పూర్తిగా చదవండి

TMAD, ఎర్రకోట, నవీన్, గడి

సంపాదకీయం పొద్దు
(గమనికః పొద్దులో ఈనెలలోను, కిందటి నెలలోను వచ్చిన రచనల కోసం పేజీ అడుగున చూడండిః) చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు…… ఏమిటో ఈ నెల అతిథి ఉప్పలపాటి ప్రశాంతి వివరిస్తున్నారు. వి.బి.సౌమ్య అంపశయ్య నవీన్ రచనల గురించి “నేను చదివిన నవీన్” వ్యాసంలో వివరిస్తున్నారు. గడి శీర్షికలో ప్రొఫెసర్ గారు [...]
పూర్తిగా చదవండి

ప్రజాకవి చెరబండరాజు సాహిత్యం

సంపాదకీయం ప్రజాకళ
రాజులను పొగిడి, దేవుళ్ళను కీర్తించి భరణాలను పొందిన కవులున్నారు. ప్రభుత్వాలను మెప్పించి అవార్డులు గెలిచిన రచయితలున్నారు. కానీ జనం గుండెల్లో బాధను అర్థం చేసుకొని, అన్యాయంపైన పోరాడి, ప్రజలకు ఒక విప్లవ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించిన కవులు కొందరే. విప్లవకవి చెరబండరాజు వారిలో ఒకరు. ప్రజాకవి చెరబండరాజు సంస్మరణలో భాగంగా, 25 వ వర్థంతి సందర్భంగా, ప్రజాకళ ఆయన రాసిన కొన్ని రచనలను ప్రచురించింది. ముఖ్యంగా చెర ప్రసిద్ధిగాంచిన “వందేమాతరం” కవిత రాసారు. “ఓ నా ప్రియమైన [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS