Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అలిగిన వేళనే చూడాలి…

సరదా జ్యోతి
అలక ఆడవారికి సొంతం , అందం కూడా. అలక అనేది అందరిమీద పనిచేయదు కదా. తనవాల్లపైనే ఎవరైనా అలిగేది. ఆ అలక ముద్దుగా అందంగా ఉంటేనే బాగుంటుంది. శృతి మించితే గొడవలైపోతాయి. చిన్నపిల్లల అలక అందరికీ ముద్దుగానే ఉంటుంది. అమ్మ కాదు అన్నా అలిగిన బాబును చూసి ఎవరైనా తీర్చడానికి ముందుకొస్తారు. కాస్త పెద్దయ్యాక పిల్లలు అవి కావాలి ఇవి కావాలి అని అలుగుతారు. తిండి మానేస్తారు. పెళ్ళయ్యాక అంటే... అలగడం ఆలి ధర్మం, హక్కు కూడా. అది భర్తా మీద ఐతే చెల్లుబాటవుతుంది. పెళ్ళయిన కొత్తలో అంటే అలిగిన భార్యను మురిపించి లాలించి అడిగినవి ఇస్తారు భర్త మహాశయులు. తర్వాత అస్సలు పట్టించుకోరనుకోండి. అది వేరే సంగతి.. ఇక అలిగిన ఇల్లాలు ఎం చేస్తుంది. ఒక్కసారి పాత సినిమాలలోని సత్యభామని గుర్తు తెచ్చుకోండి. మరీ అంత భారీ సీను ఉండదనుకోండి. అలక పానుపు , అలక మందిరాలు లేకున్నా కూడా అప్పుడప్పుడు ఈ ...
పూర్తిగా చదవండి

బ్లా.భా. సం . బ్లాగ్భాదిత సంఘం

సరదా జ్యోతి
బ్లా.బా.సం...ఇదేంటా అని ఆశ్చర్యపోతున్నారా??? ఈ మధ్య తెలుగులో బ్లాగుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. ఊరికే కంప్యూటర్ ముందు కూర్చుని సమయం వృధా చేస్తున్నారని అనేట్టు లేదు . ఆటలు, చాటింగు, చెత్త వాగుడు గట్రా లేవు. . ఎంచక్కా తెలుగులో రాసుకుంటూ. చదువుకుంటూ ఉన్నారు. మంచిదే.. ఒకసారి మొదలెడితే అది వ్యాపకం బదులు వ్యసనం అయిపోతుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నేర్చుకోవడం, జాలంలో వెతకడం. ఇదేపని.. పక్కన ఉన్నవారు ఏమైనా వాళ్లకు పట్టదు. ఎదోలోకంలో మునిగిపోతున్నారు. ఎలా చచ్చేది ఈ బ్లాగర్లతో ..ఇవీ నేను తెలుసుకున్న కొందరు బ్లాగర్ల కుటుంబ సభ్యుల మనోభావాలు. ముఖ్యంగా మహిళా బ్లాగర్ల మీద ఈ ఆరోపణలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిసొచ్చింది. నాకు తెలీక అడుగుతాను. మగవాళ్ళు ఎంత సేపైనా భార్యాపిల్లలు అని పట్టించుకోకుండా ఎంత రాత్రి వరకైనా,ఎన్ని గంటలయినా పని చేస్తారు. అదేమని అడగొద్దు. ఎపుడు ఎం చేసేది,ఎక్కడున్నదీ చెప్పరూ. కాని భార్య ఇంటి పనులు పూర్తి చేసుకుని ...
పూర్తిగా చదవండి

తెలుగదేయన్న ..

సరదా నాగరాజా
గత నెలలో ఎయిర్ టెల్ వాడి ఫోన్ బిల్లు తెలుగులో పంపినట్టు గమనించాను. భలే భలే అనుకున్నా.. కాని ఒక...
పూర్తిగా చదవండి

పొగ, కాఫీ పురాణం

సరదా, సాహిత్యం... జ్యోతి
ప్రతి మనిషికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. అది వారికి ఇష్టమైన అలవాటైనా, మరి కొందరు అది దురలవాటు, వ్యసనమూ అని ఆక్షేపిస్తారు. కాని అలవాటు పడిన వారు మాత్రం ఆ అలవాట్లను సమర్ధిస్తారు. దానికి వ్యతిరేకంగా ఎవరేమన్నా వినరు. ఏ అలవాటుకైనా బానిసగా మారితే అది వ్యసనంగా మారుతుంది. ఈ అలవాట్లకు కవులు కూడా వశులే. కొందరు సమర్ధించారు, కొందరు వ్యతిరేకించారు.భుగభుగమని పొగలెగయగనగణితముగ నాజ్యధార లాహుతి కాగానిగమాది మంత్రయుతముగపొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ !!పొగ తాగితే అది భుగభుగమని గుప్పున ఎగిసిపడేలా ఉండాలి. వేదమంత్రాలతో యజ్ఞం చేస్తున్నంత దీక్షగా, పవిత్రంగా పొగ త్రాగనివాడు దున్నపోతై పుడతాడని ఆ కవి ఉవాచ. దీనికి మరో కవి తందానా అన్నాడు చూడండి.ఖగపతి అమృతము తేగాభుగభుగమని చుక్కయొకటి భూమిని వ్రాలెన్పొగ చెట్టయి జన్మించెనుపొగ త్రాగని వాడు దున్నపోతై ...
పూర్తిగా చదవండి

ఆహా ఏమి రుచి ???

నా మనోభావాలు, సరదా నాగరాజా
ఇపుడు వంటల వెబ్ సైట్ నిర్వహిస్తున్నానని, షడ్రుచులు బ్లాగు ద్వారా ఎన్నో వంటకాల గురించి అందరికీ ఉపయోగపడేలా చెప్తున్నానని నాకు మొదటినుండి వంటలు చాలా బాగా వచ్చు అనే భ్రమలో ఉండకండి . పెళ్లి జరిగినపుడు కప్పు టీ మాత్రమే సరిగ్గా చేయడం వచ్చు నాకు. హాస్చర్య పోతున్నారా??అదేనండిమరి .. పాపం మావారు కదా.ఎలా వేగుతూ వచ్చారో ఇన్నేళ్ళు ..ఫ్లాష్ బాక్ లో కి వెళితే....అమ్మా నాన్నకు ఒక్కదాన్నే గారాల కూతురిని. హాయిగా
పూర్తిగా చదవండి

ఆంధ్రా స్పెషల్స్ …

సరదా జ్యోతి

పూర్తిగా చదవండి

వంట ఎవరి సొత్తు???

నా మనోభావాలు, సరదా జ్యోతి

పూర్తిగా చదవండి

ఓ చాక్లెట్టిచ్చి ఈ టపా చదవండి …

అనుభవాలు, చాక్లెట్టు, నేను, సరదా నాగరాజా
చిన్నప్పటినుంచీ చాక్లెట్టులంటే స్పెషలింటరెస్టు నాకు.అన్నం లేకపోయినా ఫరవాలేదు కానీ చాక్లెట...
పూర్తిగా చదవండి

మీరు సినిమాలు చూస్తారా ? అయితే మీరే టైపో ?

వర్గాలు, సరదా, సినిమా, హాస్యం ప్రవీణ్ గార్లపాటి
సినిమాలు చూసేవారు రకరకాలు. సరదాకి వారిని విశ్లేషిస్తే అన్న ఆలోచన వచ్చింది నాకు. ఇక చూసుకోండి ...
పూర్తిగా చదవండి

నీకు గారెలు నాకు బూరెలు …

సరదా ప్రవీణ్ గార్లపాటి
బ్లాగులలో ఓ రోజు అ గారు: మీ టపా చాలా బాగుంది @ఆ గారు: కృతజ్ఞతలు @అ గారు గారు: ధన్యాభినందనలు..... బ్ల...
పూర్తిగా చదవండి

శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం…3

సరదా వింజమూరి విజయకుమార్
శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం) “ఏమౌద్దిలే శ్రీరామ్మూర్తీ. దాని ఖర్మానికది చచ్చింది. అన్నా. తేలికగా తీసిపడేసినట్టు నటిస్తూ.” నా ప్రక్కన భాస్కర్ వచ్చేనవ్వును బిగబట్టుకుంటున్నప్పటికీ అతడికీ నేను చెప్పబోయేదేమిటో వినాలనే వుంది. “సార్! మీరేదో నామీద మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు. నిజంగా మంత్రిగారేమంటారో చెప్పండి సార్.” శ్రీరామమూర్తి మాటల్లో కంగారు కంటే భయమే ఎక్కువగా
పూర్తిగా చదవండి

శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం…2

సరదా వింజమూరి విజయకుమార్
శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం కొద్దిపాటి అతిశయోక్తితో) “అయితే నువ్వు మాట్లాడేదట్లాగే వుంది మరి” అన్నాను. “అయ్యో రామ అంతమాటెలా అనగలనండీ. ఏదో మీతో నాకు చనువుంది గనక, మీరేదైనా మార్గం చెపుతారని మిమ్మల్ని అడుగుతున్నా” అన్నాడు శ్రీరామమూర్తి. “అయితే నిజంగా చెప్పమంటావా మార్గం” అడిగాను. “చెప్పమనేగదండీ నేనడుగుతున్నది. నిజంగా ఆ కుక్కతో నేను వేగలేకపోతున్నానండి” అన్నాడు శ్రీరామమూర్తి. ఇక నేను
పూర్తిగా చదవండి

శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం

సరదా వింజమూరి విజయకుమార్
శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం) ఆ రోజులు. అవి 1993 నాటి రోజులు. నా జీవితంలో అవి తిరిగిరాని రోజులు. పెళ్ళిగానప్పటి మధురమైన రోజులు. పెళ్ళాం గోల్డు కొనమని గోలెట్టని రోజులు. కుమారుడు కారు కావాలని కారుకూతలు కూయని రోజులు. ఉదయాన్నే ఆరు గంటలకు లేచి, రాత్రి పదిన్నర దాకా అడ్డమైన పన్లూ చేయాల్సిన అవసరం లేని రోజులు. మందు కొట్టకుండానే మాంచి నిద్రగొట్టే రోజులు. ‘బ్యాచిలర్’ గా వుంటూ నా రూమ్ కి నేనే
పూర్తిగా చదవండి

వేంకటేశ్వరుడు – గడప

సరదా వింజమూరి విజయకుమార్
వేంకటేశ్వరుడు – గడప ఇది నా స్వీయ రచన కాదు. ఒక స్నేహితుడిచ్చిన పాత సినిమా స్కిప్టులో చదివి రాస్తున్నా. ఏదైనా సినిమాలో ఈ విషయం చెప్పారో లేదో కూడా నాకు తెలీదు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిరంతరం భక్తుల సేవలందుకునే వేంకటేశ్వర స్వామి వారి గర్భగుడి ద్వారతోరణం దగ్గరి గడపకి ఓ రోజు ఓ ధర్మసందేహం కలిగిందట. సందేహం కలిగిన వెనువెంటనే ఆలస్యం చేయకుండా సదరు గడప శ్రీ వెంకటేశ్వర స్వామిని సందేహ నివృత్తి కోసం
పూర్తిగా చదవండి

కల

సరదా lalithag
(ఈ వారం బ్లాగ్విషయం) అన్నీ మరచి హాయిగా నిద్రపోతున్నప్పుడు, ఏదీ తోచక ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏదైనా కలల లోకంలో విహరించి వస్తాము ఆ కలలు నెమరు వేసుకుని ఆనందిస్తాము పీడ కలలు, పగటి కలలు అప్పటికి అవే నిజాలు అప్పటికి మాత్రమే నిజాలు కావచ్చు హెచ్చరికలు, కారాదవి తప్పటడుగులు అలసిన కన్నులకు సెలవునిచ్చి ఆశల తలుపులు తెరుచుకోనిచ్చి మనసు చేసే మాయలు, సేద తీర్చే ఉపాయాలు  మనసు పెడితే కావచ్చును కలలన్నీ నిజాలు
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS