Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పైనాపిల్-చీజ్ సలాడ్

సలాడ్స్ జ్యోతి
పైనాపిల్ ముక్కలు 4 చీజ్ 1 కప్పు ఎర్ర క్యాప్సికం 2 వెనిగర్ 1 tsp ఉప్పు 1 tsp మిరియాలపొడి 1/4 tsp పైనాపిల్ ముక్కలు చేసి నీరు ఓడ్చి, చిన్నగా తరగాలి. చీజ్‌ని కూడా చిన్న ముక్కలుగా తరిగి పైనాపిల్ ముక్కలతో కలపాలి. సిమ్లా మిర్చిలో గింజలు తీసి సన్నగా తరగాలి. ఈ మూడింటిని కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. సర్వ్ చేసేముందు వెనిగర్,ఉప్పు, మిరియాలపొడి కలిపి ముక్కలు కూడా వేసి కలిపి చల్లగా సర్వ్ చేయాలి.
పూర్తిగా చదవండి

రష్యన్ సలాడ్

సలాడ్స్ జ్యోతి
బఠానీలు 1/2 కప్పు క్యారెట్ 125 gms బీన్సు 125 gms బంగాళదుంపలు 2 మయోన్నేస్ సాస్ 3/4 కప్పు ఉప్పు తగినంత మిరియాలపొడి 1/4 gms టొమాటోలు 2 కూరగాయలు (టొమాటోలు తప్ప) ముక్కలు తరిగి, ఉడికించి,చల్లారిన తర్వాత నీరు ఓడ్చి, ఆరబెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. సర్వ్ చేసేముందు ముక్కలపైన సాస్,ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి చల్లగా సర్వ్ చేయాలి.
పూర్తిగా చదవండి

ఉడకబెట్టిన కూరగాయలతో సలాడ్

సలాడ్స్ జ్యోతి
బంగాళదుంపలు 2 క్యారెట్ 2 బీట్‌రూట్ 1 క్యాబేజీ 1 కప్పు బఠానీలు 1/2 కప్పు మయొన్నేస్ సాస్ 1 కప్పు ఉప్పు తగినంత మిరియాలపొడి 1/2 tsp టొమాటోలు 2 నిమ్మకాయ రసం 2 tsp బంగాళదుంపలు, క్యారెట్టు, బీట్‌రూట్ అన్నీ పైన తొక్క తీసి చిన్న ముక్కలుగా తరిగి, క్యాబేజీ కూడ సన్నగా తరిగి, బఠానీలతో కలిపి ఉడికించాలి. ఉడికిన తర్వాత నీరంతా వార్చేసి చల్లార్చాలి. తయారుచేసిన సాస్ చల్లారిన ముక్కలపై పోసి , ఉప్పు, మిరియాలపొడి
పూర్తిగా చదవండి

ఉల్లిపాయల సలాడ్

సలాడ్స్ జ్యోతి
ఉల్లిపాయలు 2 నిమ్మకాయ రసం 2 tsp ఉప్పు తగినంత కారం 1 tsp కొత్తిమిర 2 tbsp ఉల్లిపాయలను గుండ్రంగా ముక్కలు తరిగి, ఉప్పు వేసి 5 నిమిషాలు కదపకుండా ఉంచాలి.తర్వాత ఉల్లిపాయలను నీటితో కడిగి, నిమ్మకాయరసం, ఉప్పు, కారం వేసి కలిపి పైన కొత్తిమిర చల్లి సర్వ్ చేయాలి.
పూర్తిగా చదవండి

గోల్డన్ సలాడ్

సలాడ్స్ జ్యోతి
క్యారట్ 3 కొబ్బరిపాలు 1/2 కప్పు కిస్‌మిస్ 2 tsp జీడిపప్పు 2 tsp యాలకుల పొడి 1 tsp పంచదార 2 tsp క్యారెట్ చెక్కు తీసి ముక్కలు తరిగి కొబ్బరి పాలు పోసి ఉడికించాలి. ఉడికించిన ముక్కలు వేరే గిన్నెలో పోసి, మూతపెట్టి ఫ్రిజ్‌లో వుంచి, సర్వ్ చేసే ముందు కిస్‌మిస్ జీడిపప్పు, పంచదార,యాలకుల పొడి వేసి కలిపిన తర్వాత చల్లగా సర్వ్ చేయాలి.
పూర్తిగా చదవండి

పెరుగు సలాడ్

సలాడ్స్ జ్యోతి
క్యారట్ 1 బంగాళదుంప 1 బఠానీలు 1/4 కప్పు పెరుగు 1 కప్పు కొత్తిమిర 2 tsp పుదీనా 2 tsp ఉప్పు తగినంత కారం 1/4 tsp గరం మసాలా 1/4 tsp మిరియాల పొడి 1/2 tsp జీలకర్ర పొడి 1/4 tsp క్యారట్, బంగాళదుంప,బఠానీలు మెత్తగా ఉడికించుకోవాలి.పెరుగులో ఉప్పు,కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాలపొడి వేసి,ఉడికించిన కూరగాయలు,సన్నగా తరిగిన పుదీనా కూడా వేసి బాగా కలిపిన తర్వాత కొత్తిమిర చల్లి చల్లగా సర్వ్ చేయాలి.
పూర్తిగా చదవండి

పెసలతో సలాడ్

సలాడ్స్ జ్యోతి
మొలకెత్తిన పెసలు 100 gms టొమాటో ముక్కలు 50 gms బంగాళదుంపలు 50 gms(ఉడికించినవి) పుదీనా చట్నీ 3 tsp ఉప్పు తగినంత కొత్తిమిర 2 tsp సన్నగా తరిగిన కూరగాయలన్నీ మొలకెత్తిన పెసలతో చేర్చి, పుదీనాచట్నీ, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి కొత్తిమిర చల్లి వడ్డించాలి. ఈ కొత్త సలాడ్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంది.
పూర్తిగా చదవండి

శనగ మొలకల సలాడ్

సలాడ్స్ జ్యోతి
మొలకెత్తిన సనగలు 1 1/2 కప్పులు వెల్లుల్లి ముద్ద 2 tsp పచ్చిమిర్చి 2 నిమ్మరసం 1 tsp ఉప్పు తగినంత కొత్తిమిర 2 tsp నూనె 1 tsp మూకుడులో నూనె వేడి చేసి, వెల్లుల్లి వేయాలి. కొద్దిగా వేగిన తర్వాత మొలకగింజలు వేసి, తగినంత ఉప్పు వేసి ఐదు నిమిషాలు సన్నని సెగపై వేగనివ్వాలి.నిమ్మరసం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కలిపి కొత్తిమిర చల్లి దింపేయాలి.
పూర్తిగా చదవండి

సెనగల సలాడ్

సలాడ్స్ జ్యోతి
సెనగలు రెండు కప్పులు బంగాళదుంపలు 2 ఉల్లిపాయలు 2 టమాట 1 నిమ్మకాయ 1 పచ్చిమిర్చి 1 కొత్తిమిర 1 tsp గరం మసాలా 1/2 tsp సెనగలని నానబెట్టాలి. బంగాళదుంప ముక్కలను,సెనగలను కుక్కర్‌లో ఉడికించాలి. నీరంతా వడకట్టి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమిర, నిమ్మరసం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. ఇష్టమైతే కొంచెం కొబ్బరి, పంచదార కలుపుకోవచ్చు. ఇదే విధంగా నానబెట్టి
పూర్తిగా చదవండి

వెజిటబుల్ ఫ్రూట్ సలాడ్

సలాడ్స్ జ్యోతి
క్యాబేజిముక్కలు 2 tsp క్యారట్ ముక్కలు 2 tbsp కీరా ముక్కలు 2 tbsp బీట్రూట్ ముక్కలు 2 tbsp నిమ్మచెక్క సగం తేనె 2 tsp దానిమ్మగింజలు 2 tbsp ఆపిల్ ముక్కలు 2 tbsp జామ ముక్కలు 2 tbsp అనాసముక్కలు 2 tbsp కూరగాయలు, పళ్ళు అన్నీ కలిపి తేనే , నిమ్మరసం వేసి మొత్తం కలియబెట్టి చల్లగా తీసుకోవాలి. ఇందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి.
పూర్తిగా చదవండి

బీన్స్ సలాడ్

సలాడ్స్ జ్యోతి
మొలకెత్తిన బీన్స్ 300 gms వెల్లుల్లి రెబ్బ 1 సోయాసాస్ 1/2 tsp నువ్వుల నూనె 1/2 tsp వేయించిన నువ్వులు 1 tsp క్యాప్సికం తరుగు 1/4 కప్పు ఉల్లికాడల తరుగు 1/4 కప్పు వెనిగర్ 1/2 tsp చక్కెర 1 tsp మొలకెత్తిన బీన్స్ బాగా కడిగి నీరులేకుండా జల్లెడలో వడకట్టాలి. పైన చెప్పిన దినుసులన్నీ వేసి బగా కలపాలి. పదినిమిషాలు ఆగి వడ్డించాలి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సోయాసాస్ ఇష్టం లేకుంటే టమాటా సాస్ వేయొచ్చు.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS