Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఎవరి స్వేచ్చ? ఎవరి వాణిజ్యం? ఎవరికి సబ్సిడీ?

సామ్రాజ్యవాదం Dil
నేను ముసుగులు బయట పడుతున్నాయి అని రాసిన పోస్టుపై వ్యాఖ్యానిస్తూ మిత్రుడు కిరణ్ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు ఈ పోస్టు. 1) ముందుగా నేను అమెరికాలో పత్తి రైతులకు ఇచ్చే సబ్సిడీ గురించి ఉటంకించిన గణాంకాలు తప్పు అయి ఉండవచ్చునను కిరణ్ అభిప్రాయపడ్డాడు. ఈ అంకెలను నేను యు.ఎన్.డి.పి వారు ప్రచురించిన మానవాబ్ధివృద్ధి నివేదిక (Human Development Report) 2005 నుండి తీసుకున్నాను. కింద screenshot ఇచ్చాను. ["అభివృద్ధి" అనేది ఆ పదానికి మనం ఇచ్చే నిర్వచనం పై ఆధారపడి [...]
పూర్తిగా చదవండి

నిజం కళ్ల ముందే నిలబడి ఉంది…

భారతీయం, సామ్రాజ్యవాదం Dil
షంషాబాద్ విమానాశ్రయం ప్రారంభోత్సవం భారతదేశ చరిత్రలో ఒక కీలక మలుపు అని కొన్ని పత్రికలు రాశాయి. అలా రాయడానికి వాటికి ఉన్న ప్రాతిపదిక వేరే కావొచ్చు కానీ నిజంగానే ఆ విమానాశ్రయం ప్రారంభోత్సవం దేశచరిత్రలో ఒక కీలక మలుపే. జాతి ప్రయోజనాలు ప్రైవేటు దొరల కాళ్లవద్ద మన పాలకులు ఎంత బాధ్యతారహితంగా తాకట్టు పెట్టారో నగ్నంగా ఆవిష్కృతమయిన సన్నివేశమది. ఈ దేశంలో జెండాలు మాత్రమే మారుతున్నాయని, అన్ని రాజకీయ పార్టీల ఎజెండాలు ప్రైవేటు, బహుళ జాతి సంస్థల  [...]
పూర్తిగా చదవండి

మూలస్థంభాలు నేలకొరుగుతున్నాయి

రాష్ట్రీయం, సామ్రాజ్యవాదం Dil
 నేను గతంలో రాసిన ఒక పోస్టులోనివీ మాటలు… “మన నేతలకు ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల కష్టాలు బాగా అర్థం అవుతాయి. అనేకానేక సమస్యలను తీసుకుని రోడ్డెక్కుతారు, ధర్నాలూ, రాస్తారోకోలూ, సభలూ ఓహ్! ఒక్కటేమిటి తమ చివరి రక్తపు బొట్టువరకూ ప్రజాశ్రేయస్సుకే అంకితమని ప్రతినలు పూనుతారు. కుర్చీ దక్కగానే సీన్ రాత్రికి రాత్రే మారిపోతుంది. అప్పుడు వారు చెప్పేవారు, ప్రజలు వినేవారు అవుతారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలు “త్యాగాలకు సిద్ధం కావాలని” పిలుపులిస్తారు, “మైండ్ సెట్ మార్చుకోవాలని” సలహాలిస్తారు, ప్రజాసమస్యలు [...]
పూర్తిగా చదవండి

మధించిన దున్నపోతుల స్వైరవిహారం

భారతీయం, సామ్రాజ్యవాదం Dil
1991లో ఆర్ధిక సరళీకరణ జరిగిన కొత్తల్లో స్టాక్ మార్కెట్ మధ్య తరగతి ప్రజలకు ఒక చక్కటి మదుపు సాధనం. తదనంతర కాలంలో కొద్దిమంది బడా వ్యక్తులు, సంస్థల చేతిలో అది బందీ అయిపోయింది. అమెరికా లాంటి దేశాల్లో వడ్డీ రేట్లు పెద్దగా లేని కారణంగా అనేకమంది విదేశీయులు మన స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఈ మధ్య వ్యవహారం తారాస్థాయికి చేరింది. అమెరికన్ డాలర్ విలువ రోజు రోజుకీ పడిపోతుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) [...]
పూర్తిగా చదవండి

చరిత్రపై మరో నెత్తుటి సంతకం!

సామ్రాజ్యవాదం Dil
తెగువగల మరో ఉపఖండపు నేత నేలకొరిగింది… సరిగ్గా యభై ఆరేళ్ల కిందట పాకిస్తాన్ తొలి ప్రధాని లియాఖత్ అలీఖాన్ ను హత్య చేసిన చోటనే నిన్న పాక్ మాజీ ప్రధాని బేనజీర్ కూడా హత్యకు గురి కావడం యాధృచ్చికమే కావొచ్చు కానీ స్వతంత్రం వచ్చి అరవై ఏళ్లు గడచినా పాకిస్తాన్ పౌరులకు ఇంకా ప్రజాస్వామ్యం ఒక అందని పండేనని మరో సారి రుజువైంది.
పూర్తిగా చదవండి

భూతల స్వర్గమా? భూతాలా స్వర్గమా?

సామ్రాజ్యవాదం Dil
 అమెరికాలో గత పక్షం జరిగిన రెండు కాల్పుల ఘటనలు, గత వారం ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటనల గురించి రాద్దామనుకుంటుండగానే మరో దారుణం జరిగిపోయింది. ప్రముఖ తెలుగు రచయిత, విప్లవ రచయితల సంఘం సభ్యుడు అల్లం రాజయ్య కొడుకు కిరణ్ కుమార్, అతడి స్నేహితుడు చంద్రశేఖర్ రెడ్డి లు దుండగులు జరిపిన కాల్పుల్లో అసువులు బాశారన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. రెండేళ్ల కిందట ఇటువంటిదే మరో సంఘటనలో ప్రముఖ పాత్రికేయుడు ఏ.బీ.కే ప్రసాద్ మనవడు [...]
పూర్తిగా చదవండి

ఇళ్లు తగులబెట్టుకుని బొగ్గులేరుకుంటున్నాం మనం

రాష్ట్రీయం, సామ్రాజ్యవాదం Dil
మన నేతలకు ప్రతిపక్షంలోకి రాగనే ప్రజల కష్టాలు బాగా అర్థం అవుతాయి. అనేకానేక సమస్యలను తీసుకుని రోడ్డెక్కుతారు, ధర్నాలూ, రాస్తారోకోలూ, సభలూ ఓహ్! ఒక్కటేమిటి తమ చివరి రక్తపు బొట్టువరకూ ప్రజాశ్రేయస్సుకే అంకితమని ప్రతినలు పూనుతారు. కుర్చీదక్కగానే సీన్ రాత్రికి రాత్రే మారిపోతుంది. అప్పుడు వారు చెప్పేవారు, ప్రజలు వినేవారు అవుతారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలు “త్యాగాలకు సిద్ధం కావాలని” పిలుపులిస్తారు, “మైండ్ సెట్ మార్చుకోవాలని” సలహాలిస్తారు, ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే రాజకీయ లబ్ది కొరకే అని విమర్శిస్తారు, [...]
పూర్తిగా చదవండి

ఒక యోధుని గురించి…

సామ్రాజ్యవాదం Dil
తీక్షణమైన ఆ కళ్లు, చురుకైన అతడి చూపులూ గత నలభై యేళ్లుగా కోట్లాదిమంది హృదయాలపై ముద్ర వేస్తూనే ఉన్నాయి. క్యూబన్ ఫొటొగ్రాఫర్ అల్బెర్టో కొర్డా తీసిన అతని చిత్రం ప్రపంచ చరిత్రలోనే అత్యంత పాపులర్ ఫొటో. అతని జీవితం గురించి ఏమీ తెలియని వాళ్లెందరో అతని బొమ్మ ఉన్న టీ షర్టు ధరిస్తుంటారు.
పూర్తిగా చదవండి

బ్రిటీష్ సామ్రాజ్యవాదం నుండి అమెరికన్ సామ్రాజ్యవాదం దాకా

భారతీయం, సామ్రాజ్యవాదం Dil
ప్రధమ భారత స్వాతంత్ర్య పోరాటపు 150వ, స్వాతంత్రపు 60వ వార్షికోత్సవం సందర్భంగా Incredible India వారు వెలువరించిన చిత్రం. ————————————————— నిన్న మధ్యాహ్నం బ్రేక్ ఔట్ ఏరియా లో కూర్చుని చాయ్ తాగుతుంటే అడిగాడు మా కొలీగ్, రేపు జెండా వందనం ఎక్కడ చేస్తున్నావని. ఆఫీసంతా మూడు రంగుల బెలూన్లు, జెండాలతో నింపేశారు. ఇక Happy Independence Day సందేశాలకయితే లెక్కే లేదు. అరవై వసంతాలయ్యింది కదూ మనకు స్వతంత్రం వచ్చి. మనుషులకయితే షష్టి పూర్తి అంటే జీవితపు చరమాంకానికి [...]
పూర్తిగా చదవండి

1,10,000 AK-47లు పోయాయట!

సామ్రాజ్యవాదం Dil
ఇరాక్ లో స్థానిక సైన్యానికి గత రెండేళ్లుగా అమెరికా సరఫరా చేసిన ఆయుధాలలో 1,10,000 AK-47లు, 80,000 పిస్తోళ్లు కనిపించట్లేదనే వార్త ఆందోళన కలుగజేస్తుంది. గడచిన అనేక దశాబ్దాలుగా ప్రపంచం లోనే అతిపెద్ద ఆయుధ బేహారిగా మారి, తాను ఉత్పత్తి చేస్తున్న ఆయుధాలు అమ్ముకోవడానికి లక్షలాది ఉసురు తీసే యుద్ధాలు మొదలు పెడుతున్న రక్త పిపాసి అమెరికా పొరపాటున చేసిందో కావాలనే చేసిందో కానీ ఈ తప్పిదం మాత్రం క్షమార్హం కాదు. అత్యంత పురాతన మెసొపొటేమియా నాగరికతకు నిలయమైన [...]
పూర్తిగా చదవండి

అంతులేని కథ!

రాష్ట్రీయం, సామ్రాజ్యవాదం Dil
కొత్త అభివృద్ధి నమూనాలో ఎన్నెన్ని వింతలో. మనం కొన్నాళ్ల కిందట ఫ్యాబ్ సిటీ గోల్ మాల్ వ్యవహారం గురించి మాట్లాడుకున్నాం కదూ. ఇప్పుడా సెం ఇండియా వినోద్ అగర్వాల్ కు ఒక్క రూపాయికి వంద ఎకరాలు (అవును 100 ఎకరాలే!) లీజుకు ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం అంతటితో ఆగక ఫ్యాబ్ సిటీ రెండో అంకానికి తెర తీసింది. స్టొరీ డిటోనే ….మరో దొంగ కంపెనీ…నిబంధనలకు పాతర…అస్మదీయులకు అప్పనంగా వరాలు…చదివి, విని మనకు విసుగుపుడుతుందేమో కానీ ఈ [...]
పూర్తిగా చదవండి

అమ్మకానికి ఆంధ్ర ప్రదేశ్!

రాష్ట్రీయం, సామ్రాజ్యవాదం Dil
చంద్ర బాబు హయాం లో “అభివృద్ధి” జోరుగా సాగుతున్న కాలంలో ప్రముఖ జర్నలిస్టు ఎన్ వేణుగోపాల్ గారు (kadalitaraga.wordpress.com) “అమ్మకానికి ఆంధ్ర ప్రదేశ్” అని ఒక పుస్తకం రాశారు. బాగా ప్రజాదరణ పొందిన ఆ పుస్తకం లో వేణుగారు ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యం లో మన రాష్ట్రం లో జరుగుతున్న “అభివృద్ధి” నమూనాను తూర్పారాబట్టారు. బ్రోకర్లు, కన్సల్టెంట్లు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కలిసి ఈ రాష్ట్రాన్ని ఎలా పంచుకు తినబోతున్నారో ఆ పుస్తకంలో విపులంగా రాశారు. [...]
పూర్తిగా చదవండి

ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్!

సామ్రాజ్యవాదం Dil
వర్జీనియా టెక్ యూనివర్సిటీ లో హత్యాకాండకు పాల్పడ్డ చో సీయుంగ్ హుయ్, ఎన్ బీ సీ వార్తా సంస్థకు పంపిన వీడియోలు, రాతలు చూస్తే ఎవరికైనా వెన్నులోంచి వణుకు రాక మానదు. డబ్బు బాగా ఉన్న వారిపై అతని వ్యాఖ్యలు చదువుతుంటే, అసమ సమాజం మనుషుల్లో ఎటువంటి ద్వేష భావాలు రగిలిస్తుందో అర్ధం అవుతుంది. “మెర్సిడెస్ లు, బంగారు చెయిన్లు ఉన్న వాళ్లు” అంటూ అతను చేసిన వ్యాఖ్యలు సమాజం లోని అంతరాలే అతన్ని ఉన్మాది గా [...]
పూర్తిగా చదవండి

నేరం ప్రేమరాహిత్యానిది

సామ్రాజ్యవాదం Dil
వర్జీనియా టెక్ యూనివర్సిటీ లో మొన్న జరిగిన ఘాతుకం చూస్తే అమెరికా భూతల స్వర్గం కాదనీ అది సాక్షాత్తూ “భూతాల” స్వర్గమే నని మరో సారి అనిపిస్తోంది. ఇంత మంది సాటి మనుషులను ఓ విద్యార్ధి అకారణంగా చంపేశాడంటే ఆ సమాజం లో మానవత్వం ఎంత మృగ్యం అయిపోయిందో కళ్లకు కడుతోంది. అమెరికా కున్న సవాలక్ష అవలక్షణాల్లో ఈ “విద్యార్ధుల హింస ఒకటి”. అక్కడి స్కూళ్లలో ఇటువంటి సంఘటనలు సర్వసాధారణం. గడచిన 15 సంవత్సరాల్లోనే [...]
పూర్తిగా చదవండి

సామాన్యుల రక్తమే ప్రగతి రధానికి ఇంధనం!

భారతీయం, సామ్రాజ్యవాదం Dil
ఎస్ ఈ జెడ్ ల పేరిట దాదాపు ఒక సంవత్సరం కింద మొదలైన అభివృద్ధి భీభత్సం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మనుషుల శవాలను పునాది రాళ్లుగా చేసుకునే స్థాయికి వచ్చింది.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS