Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బి.హెచ్‌.ఇ.ఎల్‌. లో తెలం’గానం’

సాహిత్య వార్తలు ప్రాణహిత
తెలంగాణ సాహిత్య సమాఖ్య - తెలం’గానం’ - తెలంగాణ కలాల గుండె చప్పుడు 27 జనవరి 2008 న బి.హెచ్‌.ఇ.ఎల్‌. మగ్దూం వేదిక పై హైదరాబాద్‌లో జరిగింది. ఈ కవుల సమావేశంలో సాహితీ ఉపన్యాసాల సెషన్‌లో అంతర్జాతీయ చలనచిత్ర దర్శకుడు బి. నరసింగరావు, నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, దేవదాసు, సి. అంజిరెడ్డి, వెంకట్‌ యాదవ్‌, భెల్‌ ఐ.ఎన్‌.టి.యు.సి అధ్యక్షులు ఎల్లయ్య పాల్గొన్నారు. ఈ సెషన్‌కి వఝుల శివకుమార్‌ అధ్యక్షత వహించారు.
పూర్తిగా చదవండి

అల్లం రాజయ్య నవలాసాహిత్యంపై సదస్సు

సాహిత్య వార్తలు ప్రాణహిత
విరసం సిటీ యూనిట్‌ ఆధ్వర్యంలో తేది 21-3-2008 రోజున ప్రెస్‌క్లబ్‌ హైద్రాబాద్‌లో అల్లం రాజయ్య - నవలాసాహిత్యం-1 అంశంపైన ఒక రోజు సాహిత్య సమావేశం జరిగింది. అల్లం రాజయ్య రచించిన నవలల మొదటి సంపుటిలో 3 నవలలు ఉన్నాయి. ఈ మూడు నవలలపై సమగ్రమైన సాహితీ చర్చ జరిగింది. మొదటి సెషన్‌లో ఎ.కె. ప్రభాకర్‌, రత్నమాల అల్లం రాజయ్య నవలాసాహిత్య వైశిష్ట్యంపై ఉపన్యసించారు. ఈ సమావేశానికి విరసం పినాకపాణి అధ్యక్షత వహించారు.
పూర్తిగా చదవండి

తైదల అంజయ్య ‘పూనాస’కు అవార్డ్

సాహిత్య వార్తలు ప్రాణహిత
తైదల అంజయ్య కవిత్వ సంపుటి ”పూనాస”కు 2007 సం|| ఉమ్మడి శెట్టి అవార్డు- యువ కవి మంజీరా రచయితల సంఘం రచయిత తైదల అంజయ్యకు 2007 సంవత్సరం ఉమ్మడిశెట్టి అవార్డు ఇవ్వనున్నట్లు అనంతపురం సాహితీ మిత్రులు శ్రీ రాధేయ ఒక ప్రకటనలో తెల్పారు. ఇప్పటికే సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సంతరిచుకున్న తైదల అంజయ్యకు ఈ అవార్డు రావడంపట్ల సాహితీమిత్రులు అభినందించారు. ఈ సాహిత్య పురస్కారాన్ని వచ్చే నెలలో అనంతపురంలో జరిగే సాహిత్య సమావేశంలో ప్రదానం చేస్తారు.
పూర్తిగా చదవండి

దుబాయ్‌లో తెలం’గానం’ తెలంగాణ గాయకుల సభ

సాహిత్య వార్తలు ప్రాణహిత
28-03-2008న దుబాయ్‌లో తెలం’గానం’ తెలంగాణా గాయకుల సభ అక్కడ పనిచేస్తున్న తెలంగాణా యువకులను ఉత్తేజిత పరిచింది. ఈ సభలో ప్రముఖ తెలంగాణా గాయకుడు, రసమయి బాలకిషన్‌, కవిత, విజయ, డోలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశపతి శ్రీనివాస్‌ తెలంగాణా అంశంమీద చేసిన ప్రసంగానికి అక్కడ నివసిస్తున్న తెలంగాణా ప్రజలు కరతాళధ్వనులతో స్వాగతించారు. రసమయి బాలకిషన్‌ పాటచే వారిని ఆకట్టుకున్నారు.
పూర్తిగా చదవండి

జాతీయ సదస్సు తొలిరోజు వేడుక

నిర్వాహకీయం, సాహిత్య వార్తలు తెలుగు సాహిత్య వేదిక
  “తెలుగు వ్యాకరణములు - పునస్సమీక్ష” అన్న అంశంపై హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వారు నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు (సెప్టెంబరు 12,13 తేదీలలో) ఈ రోజు ఉదయం 11.30 ని.లకు ప్రముఖుల సమక్షంలో, ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయింది. ఈ సదస్సు ప్రారంబోత్సవ సభకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భాషా శాస్త్రవేత్త, పూర్వాశ్రమంలో ఉప కులపతి అయిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు సభాధ్యక్షత వహించారు. ఈ [...]
పూర్తిగా చదవండి

మానవత్వంపై దాడి – మనుష్యులపై మారణకాండను ఖండిద్దాం!

సాహిత్య వార్తలు ప్రజాకళ
మొన్న మక్కా మసీదు, నేడు లుంబినీపార్క్ గోకుల్ ఛాట్ లలో బాంబుదాడులు మానవత్వంపై దాడి – మనుష్యులపై మారణకాండను ఖండిద్దాం! మనోనిబ్బరాన్ని ప్రదర్శించి, టెర్రరిజం ఓడిపోతుందని చాటిన ప్రజలకు బాసటగా నిలుద్దాం ! హైదరాబాదు లుంబినీ పార్క్, కోఠిలోని గోకుల్ ఛాట్‌లలో 25.08.2007 సాయంత్రం 7.40కి దుష్ట శక్తులు అత్యంత శక్తివంతమైన బాంబులు పేల్చారు. 44 మంది చనిపోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరి చర్యల్ని ఆంధ్రదేశం, ప్రపంచమంతా ఖండించింది. క్షతగాత్రులకు, బాధిత ప్రజలకు అందగా నిలుస్తూ [...]
పూర్తిగా చదవండి

భావప్రకటనా స్వేచ్ఛ పైన దాడిని వ్యతిరేకించండి !

సాహిత్య వార్తలు ప్రజాకళ
తస్లీమా నస్రీన్, జర్నలిస్టులపైన భౌతిక దాడిని ఖండించండి! హైదరాబాదు లో 9-8-2007 వ తేదీన ప్రెస్ క్లబ్బు లో పుస్తక ఆవిష్కరణ సభకు వెళ్ళిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ పైన మజ్లిస్ కార్యకర్తలు, ఎమ్మెలేలు భౌతికంగా దాడి చేశారు. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన జర్నలిస్టులు, ఫోటోగ్రాపర్లను గాయపరిచారు. ముస్లిం మత ఛాందసత్వం తలకెక్కిన మజ్లిస్ కార్యకర్తలు ఇలాంటి హేయమైన దాడికి పాల్పడటం సభ్యసమాజం తలవంచుకోవలసిన విషయం. మక్కామసీదులో బాంబుపేళ్ళులపై నిరసన తెలియజేసిన పాతబస్తీ [...]
పూర్తిగా చదవండి

పాలపిట్టల పాటలు ఆవిష్కరణ సభ:

పాటలు, సాహిత్య వార్తలు ప్రజాకళ
విప్లవకవి వరవరరావు ప్రసంగం: 1 ప్రసంగం: 2 కె.శివారెడ్డి ప్రసంగం యం.టి.ఖాన్ అల్లం నారాయణ ప్రసంగం 1 ప్రసంగం 2 ప్రసంగం 3 దేవకీదేవీ ప్రసంగం: సంధ్యక్క పాట పుష్ప పాట లగడపాటి పాట సౌజన్యం: మూసీ టీవీ http://www.musitv.com
పూర్తిగా చదవండి

కవితా వార్షిక-2006 రిపోర్టు:

సాహిత్య వార్తలు ప్రజాకళ
- జాన్ హైడ్ కనుమూరి సృజనలోకం, వరంగల్ ప్రచురించిన “కవితా వార్షిక -2006” ను 18 మార్చి 2007 తేదిన, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్, హనుమకొండ లో ఆవిష్కారించారు. అధ్యక్షులు: డాక్టర్ అంపశయ్య నవీన్ ముఖ్య అతిథి, ఆవిష్కర్త: డాక్టర్ పి. వరవరరావు ప్రధాన సంపాదకుడు: రామా చంద్రమౌళి అంపశయ్య నవీన్: తెలుగులో విరివిగావస్తున్నది కవిత్వం. కవిత్వానికుండే విస్తృతి కవిత్వానికుంది. 80 కవితలు ఎన్నికచేసి 2004లోను నాందీ ప్రస్తావన చేసాం. 99 కవితలతో 2005, ఇప్పుడు 92 కవితలతో 2006 వచ్చాయి. [...]
పూర్తిగా చదవండి

కవితా వార్షిక ప్రధాన సంపాదకుడు రామా చంద్రమౌళితో ముఖాముఖి

సాహిత్య వార్తలు ప్రజాకళ
కవితా వార్షిక-2006 ఆవిష్కరణ సందర్భంగా ప్రధాన సంపాదకుడు రామా చంద్రమౌళితో ముఖాముఖి ‘సృజనలోకం వరంగల్’ ప్రచురణగా అంతర్జాతీయ ప్రమాణాలతో గత మూడు సంవత్సరాల నుండి వెలువడుతూ తెలుగు వచన కవితను ప్రపంచవ్యాప్తం చేస్తున్న నేపథ్యంలో, కవితా వార్షిక-2006ను ప్రముఖ విప్లవకవి డాక్టర్ పెండ్యాల వరవరరావు 18 మార్చి 2007, ఆదివారం ఉదయం పదకొండు గంటలకు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్‌లో ఆవిష్కరించారు. కవితాభిమానులు ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘కవితా వార్షిక’ ప్రధాన సంపాదకులు [...]
పూర్తిగా చదవండి

రచయితలు, రచయిత్రులు, కవులు,సాహిత్యాభిమానుల పత్రికా ప్రకటన:

సాహిత్య వార్తలు ప్రజాకళ
నందిగ్రామ్ రైతులుపై సిపిఎం, కాంగ్రెసు ప్రభుత్వాల మారణకాండను ఖండించండి! మానవ హక్కులు, ప్రజాస్వామిక విలువలను కాపాడండి! పశ్చిమబెంగాల్ రాష్ట్రం నందిగ్రామ్ గ్రామంలో సిపిఎం సర్కారు పేద రైతులనుండి వేలాది ఎకరాల వ్యవసాయ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకొని ఇండోనేషియాకు చెందిన ‘సలీం గ్రూప్’ అనే ప్రెవేటుకంపెనీకి ఉచితంగా ఇస్తోంది. రైతుల, రైతుకూలీల జీవనోపాధి పైన దాడిచేస్తోంది. పచ్చని పచ్చని పొలాల మధ్య కాలుష్యాన్ని విరజిమ్మే కెమికల్ ప్యాక్టరీని ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది. జీవనోపాధిని కొల్లగొట్టే ప్రభుత్వవిధానాలను నిరసిస్తూ నందిగ్రామ్ రైతులు ఉద్యమిస్తున్నారు. మార్చి [...]
పూర్తిగా చదవండి

రైతు కథ కు ఆహ్వానం

సాహిత్య వార్తలు ప్రజాకళ
రైతు జీవితాల్ని ప్రతిబింబించే సాహిత్యం అసంఖ్యాకం గా వస్తున్నది. గతంలో రైతు జీవితాల్ని వ్యక్తీకరించిన కవితల్ని ఏర్చి కూర్చి “రైతు కవిత” సంకలనాన్ని వెలువరించాము. సాహిత్యాభిమానులు ఈ సంపుటిని ఎంతగానో ఆదరించారు. ఆ స్ఫూర్తి తో ఇప్పుడు “రైతు కథ” ను సంకలించదలిచాం. తొలినాటి నుండి రైతుల జీవితాల్ని స్పర్శించిన కథల్ని పంపించవలసింది గా కథకుల్ని, సాహిత్యాభిమానుల్ని అభ్యర్ధిస్తున్నాం. వివిధ పత్రికల్లొ, కథా సంపుటుల్లో ప్రచురితమైన కథల ఫొటొస్టాట్ కాపీలను కాని లేదా ఒరిజనల్స్ కాని పంపించాలి. ఈ [...]
పూర్తిగా చదవండి

మాక్సిమ్ ‌ గోర్కీ ‘అమ్మ’ నవల: సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు

సాహిత్య వార్తలు ప్రజాకళ
- డా. దార్ల వెంకటేశ్వరరావు మానవుడు ఉన్నతత్వం సాధించే పరిణామాన్ని వర్ణించిన నవల మాక్సిమ్ ‌ గోర్కీ ‘అమ్మ’ నవల అని ప్రజా సాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు అన్నారు . 09 - 03 - 2007 సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు లో జరిగిన సమావేశంలో ‘అమ్మ’ నవలపై ప్రత్యేక సంచికను ఆవిష్కరించి ముఖ్య వక్తగా ఆయన మాట్లాడారు . వ్యష్టి నుండి సమష్టికి పయనించటమే ‘అమ్మ’ నవల ధ్యేయం అని చెప్పారు. గోర్కీ బాల్యమే ఒక [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS