Can't see Telugu? Learn here. More Questions? Ask here.

బతకమ్మ బతకమ్మ ఉయ్యాల

సింహావలోకనం లలితా స్రవంతి
అసలు నా బతుకు ఎలా అయ్యిందంటే నవరాతృలు వచ్చినా,పూర్తి అవుతున్నా నా అంతః,బాహ్య ప్రపంచకాలలో  మార్పేమి రాలేదు. అదే 3వ నంబరు బస్సు,అదే కండక్టరు బాబాయి,అదే కాలేజీ,అదే పక్క బెంచి పావని,అదే లూసు షర్టు హనుమంతరావు సారు. నేను నిద్ర లేవక ముందే మా ఇంట్లో ఏవో పూజల పేరిట దేవుడి ఊపిరి తీసేపనిముగించేస్తారు కాబట్టి ,నా వ్యక్తిగత జీవితానిలోనూ పెను తుఫాను ఏమీ లేదు.   మనం ఇలా ఉన్నాం,పక్క వాళ్ళెలా పండగ చేసుకుంటున్నారో అని పావని కి ఫోను చేసాను ఎలా [...]
పూర్తిగా చదవండి

మన తెలుగు సినిమా పయనం ఎటు?

సింహావలోకనం లలితా స్రవంతి
ఇదే విషయం నేను గత కొంత కాలం గా ఆలొచిస్తున్నా,బ్లాగు రాసేంతగా చేసింది నిన్న నేను చూసిన ఇంటార్వ్యు. అసలు కథ పట్ల మన దర్శకులకు ఎంత అభిమానం ఉందో అది చూస్తే అర్ధం అవుతుంది . అసలు ఈ మధ్య సినిమాల్లో కథ నిజం గా ఉంటోందా? ఈ ప్రశ్నకు ఠక్కున లేదు అనే జవాబే చాలా నోట్ల విన్నాను. నాకో చెడ్డ అలవాటు.ఎవరు సినిమా చూసా అని చెప్పినా,వెంటనే కథ చెప్పు అని ప్రాణం తీస్తా. ఈ మధ్య ఈ అలవాటుకి [...]
పూర్తిగా చదవండి

నేడు గురజాడ జయంతి

సింహావలోకనం లలితా స్రవంతి
ఈ పేరు వినగానె చటుక్కున గుర్తొచ్చేది “కన్యాశుల్కం” బాల్య వివాహల పై,వితంతు పునర్వివాహలపై ఆ నాటిక ఒక చంప పెట్టు ఆద్యంతమూ చమక్కులతో ఆ నాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టే నాటిక అది. ఆ నాటిక తెచిన మార్పు అంతా ఇంతా కాదు   “దిద్దుబాటు ” అని మార్పులు తెచ్చినా “చుట్ట తాగని వాడు దున్న పోతై పుట్టు ” అంటు సున్నిత హాస్యం తో కూడిన పద్యం చెప్పినా,”young beautiful,unfortunate widow ” అని బుచ్చమ్మను (ఆ నాటి స్త్రీ) ని [...]
పూర్తిగా చదవండి

ఎటు పోతున్నాం మనం?

సింహావలోకనం vaagdevi
 చదివాక ఈ కిందదీ ఎంతో సముచితం అని భావించి టపా రాస్తున్నా మా వీధి లో జరిగిన ఒక యధార్ధ సంఘటన మీ ముందు ఉంచుతున్నా “మేము ఉంటున్నది రైల్వే కాలనీ.ఇళ్ళన్నీ పక్క పక్కనే.గోడలు ఇళ్ళకు మాత్రమే,మా మనసులకి కాదు. రామారావు గారు,వారి భార్యకవిత ,3 పిల్లలు.కవిత గారిది చక్కటి రూపం. వాళ్ళ ఎదురింటిలో వెంకటయ్య గారు.రిటైరు అయ్యారు.4 అబ్బాయిలు రామా రావు గారు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళడం తో,వెంకటయ్య గారింట్లోనే కవిత కు కాలక్షేపం   ఈ క్రమం లో వెంకటయ్య గారి ఆఖరి అబ్బాయి [...]
పూర్తిగా చదవండి

“హే రాం”-2

సింహావలోకనం vaagdevi
ఆయనో నినాదం,ఆయనో వివాదం ప్రతి సంవత్సరం నోబెల్ బహుమత్తులో ప్రతి ఏట ఏ విభాగం గురించి ఆశపడక పొయినా,ప్రతి భారతీయుడు ఆయనకు రావాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తడు.రాక పోతే ఆ నోబెల్ బహుమత్తులో ఎదో రాజకీయం జరిగి ఉండి ఉంటుందని చూసినట్టు మల్లే వ్యాఖ్యానిస్తాం.  ఆయన ఫోటోను ఇళ్ళల్లో దేవుడి పటాల పక్కన  పెట్టుకుంటాం ఆయన మీద సినిమా వస్తే స్కూళ్ళకు శెలవు పెట్టించి మరీ పెద్దవాళ్ళు చూపిస్తారు.ఆయన మీద సినిమాకు ప్రభుత్వం ఏకం గా ఆర్ధిక సహాయం చేసేస్తుంది    శాంతి కపోతం అనీ,ఈ [...]
పూర్తిగా చదవండి

“హే రాం!!”

సింహావలోకనం vaagdevi
ఆయన పేరు దేశభక్తికి మారు పేరు మనం ఉగ్గు పాలతో ఆయన్ని జీర్ణించుకున్నాం నిత్య జీవితం లో ఆయన పేరు ఎంచని భారతీయుడు లేడేమో(కనీసం జాతీయ దినోత్సవాలలో అయినా).. మహాత్ముడనీ ,అహింసా మార్గం చూపించిన కలియుగ గౌతమ బుద్ధుడనీ ,  మన స్వాతంత్ర్య రథ సారథి గా,సత్యాగ్రహం పేరిట “రవి అస్తమించని సామ్రాజ్యాన్ని వణికించిన ” సర్వోత్కృష్టుడంటూ మన చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాసుకున్నాం ఇదంతా నాణానికి ఒక వైపు…. ఇంకో వైపు ను ఆవిష్కరించి వక్రీకరించిన వాస్తవ చరిత్రను వెలుగులోకి తెచ్చే చిన్న ప్రయత్నం [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS