Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తోటలోకి రాకురా

మహదేవన్, సినారె, సుశీల హాసిని
తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా గడసరి తుమ్మెదా మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది కన్నుసైగ చేయకురా కామినీ చోరా గోపికాజారా మా రాధ అనురాగం మారనిది అది ఏ రాసకేళిలోన చేరనిది జిలుగు పైట లాగకురా తొలకరి తుమ్మెద చిలిపి తుమ్మెదా కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది రోజు దాటి పోగానే జాజులు వాడునురా మోజులు వీడునురా కన్నెవలపు సన్నజాజి వాడనిది అది ఎన్ని జన్మలైనా
పూర్తిగా చదవండి

చాంగురే బంగారు రాజా

జిక్కి, సినారె హాసిని
చాంగురే...చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే.... అయ్యారే....నీకే మనసియ్యలని వుందిరా చాంగురే...చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది మేటి దొరవు అమ్మక చెల్లనీ సాటి ఎవ్వరునుండుట కల్ల చాంగురే...చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా కైపున్న మచ్చకంటి
పూర్తిగా చదవండి

వేణువై వచ్చాను భువనానికి

చిత్ర, సినారె హాసిని
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి ఏడుకొండలకైనా అండ తానొక్కడే ఏడు జన్మల తీపి ఈ బంధమే -2 నీ కంటిలో నలక లో వెలుగు నేననక నేను నేననుకుంటే ఎద చీకటి హరీ హరీ.....హరీ రాయినై ఉన్నాను ఏనాటికీ రామ పాదము రాక ఏనాటికీ.. వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
పూర్తిగా చదవండి

ఆనంద తాండవ మాడే

సినారె, సుశీల హాసిని
ఆ..ఆ..ఆ.. ఆనంద తాండవ మాడే - శివుడు అనంతలయుడు - చిదంబర నిలయుడు నగరాజ సుత - చిరునగవులు చిలుకంగ సిగలోన ఒగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ ప్రణవ నాదం ప్రాణం కాగా - ప్రకృతి మూలం తానం కాగా భువనములే రంగ భూమికలు కాగా భుజంగ భూషణుడు - అనంగ భీషణుడు పరమ విభుడు - గరళధరుడు భావ రాగ తాళ మయుడు సదయుడు ఏమి శాంభవ లీల - ఏమి తాండవ హేల అణువణువులోన దివ్యానంద రసడోల సుర గరుడులు - ఖేచరులు - విద్యాధ్రులు నిటల తట ఘటిత -
పూర్తిగా చదవండి

తొలికోడి కూసింది

సినారె, సుశీల హాసిని
తొలికోడి కూసింది - తెల తెలవారింది వెలుగులలొ జగమంతా జలకాలాడింది //తొలి// దూరాల ఆకాశ తీరాల బంగారు హారాలు వేసెను కిరణాలు ఈ వేళ విరిసే భావాల మెరిసే శ్రీ వేంకటేశుని చరణాలు//తొలి// అనురాగవల్లి - ఆతీగవల్లి - అలరారె తనపూల పాపలతో తొలిచూరులేగ తలవూపి రాగ - పులకించె గోమాత చేవులతో//తొలి// చిత్రం : తిక్క శంకరయ్య గానం : పి.సుశీల రచన : డా.సి.నారాయణరెడ్డి సంగీతం : టి.వి.రాజు
పూర్తిగా చదవండి

జోహారు శిఖిపించమౌళి

ఘంటసాల, సినారె, సుశీల హాసిని
జోహారు శిఖిపించమౌళి జోహారు రసరమ్య గుణశాలి! వనమాలి! కలికి చూపులతోనే చెలులను కరగించి కరకు చూపులతోనే అరులను జడిపించి నయగార మొకకంట! జయవీర మొకకంట! చిలకరించి చెలువుమించి నిలిచిన శ్రీకర నరవర! సిరిదొర //జోహారు// నీ నాదలహరిలో నిదురించు భువనాలు నీ నాట్యకేళిలో నినదించు గగనాలు నిగమాలకే నీవు సిగబంతివైనావు యుగయుగాల దివ్యలీల నెరసిన అవతారమూర్తి! ఘనసార కీర్తి //జోహారు// చకిత చకిత హరిణేక్షణా వదన చంద్రాకాంతు
పూర్తిగా చదవండి

ఇదిగో రాయలసీమ గడ్డ

బాలు, సినారె హాసిని
ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ ఈ గడ్డలో పగల సెగలొద్దురా ఈ మట్టిలో నెత్తురు వదలొద్దురా //ఇదిగో// పతిత పావనుడు తిరుపతి వేంకటేశ్వరుడు సర్వరక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు కొలువున్నది ఈ సీమలోనే రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం రణబేరి వినవింపు చంద్రగిరి దుర్గం నెలకొన్నదీ నేలలోనే //ఇదిగో// హరుని కంటికే కన్ను అర్పించిన కన్నప్ప భక్తవరుడు విజయనగర సామ్రాజ్య దురంతర కృష్ణరాయ భువిభుడు
పూర్తిగా చదవండి

పగటి పూట చంద్రబింబం

ఘంటసాల, సినారె, సుశీల హాసిని
పగటి పూట చంద్రబింబం అగుపించెను ఏదీ ఏదీ అందమైన నీ మోమే అదిగా కింకేది కానరాని మన్మధుడేమో కనుపించెను ఏడీ ఏడీ ఎదుటవున్న నీవేలే ఇంకా ఎవరోయీ వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ ఏవీ ఏవీ అవి నీ సిగలోనే ఉన్నాయి, పదును పదును బాణాలేవో ఎదను నాటుకుంటున్నాయీ ఏవీ ఎవీ అవి నీ ఓరచూపులేనోయీ //పగటి// ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు ఏమో ఏమో ఇరువురి మనసులు
పూర్తిగా చదవండి

రఘుకుల తిలకా,

సినారె, సుశీల హాసిని
రఘుకుల తిలకా నీ ఆనతి రచియించితి రామాయణ సత్కృతి ఆకృతి వరియించిన పతివి నీవే అతులిత కైవల్య గతివి నీవే!... జగమే రామమయం ! మనసే అగణిత తారక నామ మయం నీల జలద రమణీయ రూపం నిగమాంచల మందిర మణిదీపం సుందర జానకీ వందిత చరణం సురముని శరణం! భవతాప హరణం ఆ చిరునవ్వే అమృతపు జల్లు అఖిల జగములేలు ఆచేతి విల్లు అతని గానమున అలరారుకావ్యం అన్ని యుగాలకు నవ్య్యాతి నవ్యం ఎవని కమల కమనీయ పదము! చూ పించె అహల్యకు ముక్తి పదము! ఎవని
పూర్తిగా చదవండి

శ్రీ గౌరి …

సినారె, సుశీల హాసిని
శ్రీ గౌరి శ్రీగౌరీవే! శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసినా //శ్రీ గౌరి // సతిగా తన మేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరియించి పరమేశునికై తపియించి ఆ హరుమేన సగమై పరవశించిన //శ్రీ గౌరి // నాగకన్యగా తాను జనియించినా జగదంబయైనది హైమవతి సురలోకమున తాను ప్రభవించినా తరళాత్మమైనది మందాకిని ఒదిగి ఒదిగి పతిపదములందు నివసించి యుండు గౌరి ఎగిరి ఎగిరి పతిసిగను దూకి నటియించుచుండు గంగ లలితరాగ కలితాంతరంగ గౌరి చలిత జీవన
పూర్తిగా చదవండి

నన్ను దోచుకుందువటే…

ఘంటసాల, సినారె, సుశీల హాసిని
నన్ను దొచుకొందువటే నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దొచుకొందువటే తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు నన్ను దొచుకొందువటే నన్ను
పూర్తిగా చదవండి

ఏ పారిజాతమ్ములీయగలనో

బాలు, మహదేవన్, సినారె హాసిని
ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప ఏ కానుకలను అందించగలనో చెలీ గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు చంచలా వల్లికా తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా …. శరదిందు చంద్రికా,.,, నీవు లేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి నీవు లేని విరి పానుపు నిప్పులు చెరిగే కుంపటి విరులెందుకు సిరులెందుకు మనసు లేక మరులెందుకు తలపెందుకు తనువెందుకు నీవు లేక నేనెందుకు … నీవు లేక
పూర్తిగా చదవండి

తెలిసింది లే

ఘంటసాల, సినారె, సుశీల హాసిని
తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే|| చలిగాలి రమ్మంటు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే చలిగాలి రమ్మంటు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే ఏముంది లే ఇపుడేముంది లే ఏముంది లే ఇపుడేముంది లే మురిపించు కాలమ్ము ముందుంది లే నీ ముందుంది లే || వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా అవునందునా
పూర్తిగా చదవండి

అభినవ తారవో

బాలు, సినారె హాసిని
అభినవ తారవో...నా...అభిమాన తారవో అభినవ తారవో అభినయ రసమయ కాంతిధారవో అభినయ రసమయ కాంతిధారవో మంజుల మధుకర శింజాల సుమసరశింజినీ శివరంజని శివరంజనీ అది దరహాసమా మరి మధురమాసమా అది దరహాసమా మరి మధురమాసమా ఆ మరునికి దొరికిన అవకాశమా అవి చరణమ్ములా శశికిరణమ్ములా నా తరుణభావన హరిణమ్ములా అభినవ తారవో|| ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు ఆ నెన్నడుము ఆడినచాలు ఆ
పూర్తిగా చదవండి

తొలిసంధ్య వేళలో

సినారె, సుశీల హాసిని
తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం యెగిరొచ్చే కెరటం సింధూరం తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం యెగిరొచ్చే కెరటం సింధూరం జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం తొలిసంధ్య వేళలో........ సాగరమే పొంగుల
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS