Can't see Telugu? Learn here. More Questions? Ask here.

12 angry men …

12 angry men, cinema, సినిమా, సినిమాలు ప్రవీణ్ గార్లపాటి
నిన్న 12 angry men అనే అద్భుతమయిన సినిమా చూసాను. చాలా మంచి సినిమా ఇది. ఈ సినిమా ఒక కోర్టు కేసులో జూరీ య...
పూర్తిగా చదవండి

మరిచిపోయిన మధురగీతం

సినిమాలు Sudhakar
ఎందుకో గానీ ఈ మధుర గీతం చాలా మందికి తెలియదు. గానీ ఈ పాట నేను సంవత్సరానికి ఒక్క సారైనా విని తీరుతాను. ఎమ్.యస్ రామారావు గారి అతి మధురమైన, అదో రకమైన మత్తుతో వుండే గొంతుతో పాడిన లాలి పాటలా వుండే ఈ పాట మీరూ వినండి మరి. చిమట సంగీత ప్రపంచపు లంకెలో చివరి పాటను వినండి. ఈ పాటకు మధురమైన సంగీతాన్ని ఓపీ నయ్యర్ జీ అందించారు. ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో... నిదురించు జహాపనా -  || పండు వెన్నెల్లో వెండి
పూర్తిగా చదవండి

మన సినిమాలు, తారల డాన్సులు …

డాన్సు, సినిమా, సినిమాలు ప్రవీణ్ గార్లపాటి
మన సినిమాలలో ఎంత లేదన్నా నాకు నచ్చేది డాన్సులు పాటలు. ఇతర భాషలలో వచ్చే సినిమాలలో కథ, కథనం, ఆక్ష...
పూర్తిగా చదవండి

కలగంటి…కలగంటి!!!

రాజకీయాలు, సరదాకి, సినిమాలు శ్రవణ్
ఎంటో… ఒహటే మెరుపు కలలు… చంద్రబాబు నాయుడు చేసిన ఒక్కతప్పయినా ఒప్పుకున్నట్టు, రాజశేఖరరెడ్డేమో మళ్ళీ సియం అయినట్టూ, రాహుల్ గాంధి ఇప్ప్డడప్పుడే పియం అవనట్టు, అద్వానీ దళితుల కోసం పాటు పడినట్టూ, జానారెడ్డి తేటతేట తెలుగులో మాట్లాడినట్టు, కేసియ్యార్ తాగినా పడిపోనట్టూ ఎంటో… ఒహటే మెరుపు కలలు… ఒకాహీరో రెణ్ణిముషాలు రెండు కాళ్ళూ కుదురుగా పెట్టినట్టూ, ఇంకొకాయన ‘చంపేస్తా’ అని వత్తులు సరిగ్గా పలికినట్టు, మరొకాయన సినిమాలో ఫైట్లే లేనట్టూ, మరో స్టారు సిక్స్‌ప్యాక్ తెచ్చుకుమరీ ఎక్ష్‌పోజింగు చేసినట్టు ఎంటో… ఒహటే మెరుపు కలలు…
పూర్తిగా చదవండి

చిర్రెత్తించిన “చిరుత”

సినిమాలు రాజారావు తాడిమేటి
ఈ సినిమాను చూసి దాదాపు రెండు వారాలు కావస్తున్నా, పని వత్తిడిలో పడి సమీక్ష రాయడం కుదరలేదు. చిరంజీవి కొడుకు సినిమా అన్న ఒక్క కారణం తప్ప, ఈ సినిమాలో చూడడానికి ఏమీ లేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ, హాలీవుడ్ సినిమానుంచి కాపీ కొట్టిన కథనం, ఒక పాట, ఒక పైటు, ఒక సీను.. ఇలా అతుకులబొంతలా సినిమా మొత్తం సాగిపోయింది. సినిమా సాగుతున్నంత సేపూ జనాలనుంచి అసహనంతో కూడిన నిట్టూర్పులు,  “ఎలాంటి సినిమాకొచ్చామురా భగవంతుడా..!!” [...]
పూర్తిగా చదవండి

కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చిన “హ్యాపీ డేస్”

సినిమాలు రాజారావు తాడిమేటి
ఎవరినైనా “నీ జీవితంలో ఆనందకరమైన రోజులు ఏవి..?” అని ప్రశ్నిస్తే, చాలామంది చెప్పే సమాధానం “కాలేజీ రోజులు” అనే. అదే ఆ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ అయితే ఆ అనుభూతులే ప్రత్యేకంగా ఉంటాయి. వాటినే రెండున్నర గంటల సినిమాగా మలచాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. కథ విషయానికి వస్తే, నాలుగు జంటల ఇంజనీరింగ్ కాలేజీ  అనుభవాలే “హ్యాపీ డేస్”. ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు రోజూ ఎదురయ్యే అన్ని అనుభవాలనీ రంగరించి కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు. కాలేజీ తొలినాళ్ళలో [...]
పూర్తిగా చదవండి

అందమైన అనుభవం

సినిమాలు సిరిసిరిమువ్వ
చాలారోజుల తరువాత ఇవాళ టి.వి. లో అందమైన అనుభవం సినిమా చూసాను. అప్పట్లో గొప్ప మ్యూజికల్ హిట్ ఈ సి...
పూర్తిగా చదవండి

మహేష్ బాబు

మీతో నేను, సినిమాలు శ్రవణ్
నాకు మహేష్ బాబు అంటే కొంత ఇష్టం. ఎందుకంటే, “మడిసన్న తర్వాత కూసంత కలా పోసనుండాల”న్నట్టు హీరో అన్న తర్వాత కాస్త వొడ్డూ, పొడుగూ, అందం, ఠీవీ, విగ్రహం వుండాలి. మహేష్ బాబు లో ఇవి పుష్కలంగా వున్నాయి.(బాబోయ్, మిగతావాళ్ళ గురించి నేనేమీ కమెంట్ చెయ్యలేదు, నన్నొదిలెయ్యండి). south heroes ని తెగ తిట్టే north వాళ్ళు మహేష్ బాబు దగ్గరికొచ్చేప్పటికి నోరు ముయ్యాల్సిందే. ఆ విధంగా అంధ్రాదే కాకుండా మొత్తం south india  పరువు కాపాడుతున్నాడు. ఇహ [...]
పూర్తిగా చదవండి

“డింగుటకా” — 2037 లో ఒక సినిమా రివ్యూ by Yo!man™

Uncategorized, మీతో నేను, సరదాకి, సినిమాలు శ్రవణ్
Dude, thanks for visiting blog.yo!man.com. ఇవాళ ఒక తెలుగు సినిమా చూసాను, పేరు “డింగుటకా”. అసలీరోజుల్లో ఎలాంటి సినిమాలొస్తున్నాYo!. మా టైంలో అయితే “బ్యాండ్ లీడర్” అనీ, “పరమ హింసా రెడ్డి” అనీ, ”దొరికితే చంపుతా” అనీ మంచి మంచి సినిమాలు వచ్చేవి. ఇప్పుడంతా ట్రాష్. “డింగుటకా” అంట అదొక పేరు, అదొక సినిమా. ఇక సంగీతం గురించి, అసలు ఒకప్పుడు ఎంత మంచి సంగీతం, ఎంత మంచి వచ్చేదనీ!. “బ్యాండ్ లీడర్” సినిమాలో అయితే “బీ యే ఎన్ [...]
పూర్తిగా చదవండి

హేపీ డేస్ - పాటల పరిచయం

సంగీతం, సినిమా పాటలు, సినిమాలు Sriram
తెలుగునాట మిగిలిన ఏకైక కళ సినిమా అంటూ వాపోయాడు రాకేశ్వరుడు ఈమధ్యే. ఐతే, ఈ సినిమా అనేది 64 కళల సమ్మేళనం అన్న విషయం తెలియని వాళ్ళందరూ సినిమాలు తీస్తుండడమే పెద్ద సమస్య అనిపిస్తుంది నాకు. తెలుగుసినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఈ విషయాన్ని కాస్త వంటబట్టించుకున్నది శేఖర్ కమ్ముల అనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన వేరే విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, సంగీతం విషయంలో మాత్రం తన ఉత్తమ అభిరుచిని శేఖర్ తన సినిమాల ద్వారా [...]
పూర్తిగా చదవండి

వానపాటులు

కబుర్లు, భారతదేశం, సంగీతం, సినిమా పాటలు, సినిమాలు Sriram
మొన్న రాత్రి మా ఊళ్ళో ఎడతెగని వర్షం. నేను ఇంటికి చేరుకున్నాకే మొదలవ్వడంతో నేను చాలా ఆస్వాదించాను. చదువరిగారు చెప్పినట్టు చీమచతురత చూసి కాదులెండి. నాకిష్టమైన వానపాటని గుర్తు చేసుకుంటూ.  ప్రపంచ చలనచిత్ర చరిత్ర లో భారతీయచిత్రాలకి మాత్రమే ప్రత్యేకమైన ఈ వానపాటల్లో, నాకు ఈ పాటలో నేను నటించి ఉంటే బాగుండును అని అనిపించిన పాట అది. ఏమిటీ? మీ దృష్టి ఎటుపోయిందీ? ఈ పాట అనుకుంటున్నారా? ఐతే మీరు ఇది చూడలేదన్నమాటే!    సలీల్ చౌధురి ఖమాజ్ రాగంలో [...]
పూర్తిగా చదవండి

“చందమామ” కి అంత సీనేం లేదు..!!

చాకిరేవు, సినిమాలు రాజారావు తాడిమేటి
కృష్ణవంశీ చాలాకాలం తరువాత కుటుంబ, ప్రేమ కథా చిత్రం తీసాడని ఎగురుకుంటూ రిలీజయిన రోజునే వెళ్ళి చూసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. సినిమా మొదటినుంచి చివరివరకు గోల గోల. హీరో నవదీప్, రెండో హీరోయిన్ (పేరు తెలీదు), సినిమా మొత్తం అరుఫులు, వెకిలి, కోతి చేష్టలతో చెత్త చెత్త చేసి పారేసి ఇరిటేషన్‌తో నేను జుట్టు పీక్కునేలా చేసారు. మొత్తం సినిమాలో ఆహుతి ప్రసాద్ చేసిన కొద్దిపాటి కామెడీ తప్పితే చెప్పుకోదగినదేమీ లేదు. “మురారి”, “నిన్నే [...]
పూర్తిగా చదవండి

“చక్ దే ఇండియా..” - ఒక మంచి చిత్రం

సినిమాలు రాజారావు తాడిమేటి
నిన్ననే “చక్ దే ఇండియా” చిత్రం చూసాను. చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రాన్నిచూసిన అనుభూతి, తృప్తి కలిగాయి. దీనిని పోలిన కథాంశం కలిగిన చిత్రాలు గతంలో చూసి ఉన్నా, ఎక్కడా విసుగు కలుగలేదు. నాకు ఈ చిత్రంలో బాగా నచ్చిన అంశం అతిగా భావావేశాలను ప్రదర్శించకపోవడం. నేను సాధారణంగా షారుఖ్ ఖాన్ చిత్రాలను ఇష్టపడను. కారణం అతను చేసే “అతి” నటన. కానీ ఈ సినిమాలో షారుఖ్ ను చూస్తే ముచ్చట వేసింది. చాలా సున్నిత [...]
పూర్తిగా చదవండి

“యమదొంగ” Vs “యముడికి మొగుడు”..!!

చాకిరేవు, సినిమాలు రాజారావు తాడిమేటి
యమదొంగ సినిమాపై “కొత్త పాళీ” గారు మరియు “జ్యోతి” గారు రాసిన టపాలు చదివాను. కాని వాటిలో అన్ని విషయాలను ప్రస్తావించలేదని అనిపించి ఈ టపా రాస్తున్నాను. మొదటగా ఈ సినిమాకి “యమగోల” తో కన్నా “యముడికి మొగుడు” తో ఎక్కువ పోలికలు కనిపించాయి నాకు. ఈ రెండు సినిమాలకు ఉన్న సారూప్యాన్నీ, భేదాన్నీ ఇక్కడ వివరిస్తాను. “యముడికి మొగుడు” లో హీరో పేదలకు సహాయపడే ఒక కిరాయి రౌడీ. “యమదొంగ” లో హీరో ఒక దొంగ. అందులో హీరో [...]
పూర్తిగా చదవండి

ఆపాతమధురం - 3

సంగీతం, సినిమాలు Sriram
“వసంతగాలికి వలపులు రేగా, వలచిన బాలిక మయూరి కాగా…“, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు చిత్రంలోని ఈ పాటని బాలమురళీకృష్ణ గారూ, జానకి గారూ పాడారు. పెండ్యాల నాగేశ్వర్రావు గారి సంగీతం. పింగళి వారి అద్భుతమైన సాహిత్యానికి పెండ్యాలగారు అతి మధురమైన బాణీ కట్టారు. పెండ్యాల వారికి హిందూస్తానీ కళాకారుల సంగీతం ఎక్కువ ప్రేరణగా ఉండేదని చెప్పుకోడం విన్నాను. అందుకే కాబోలు ఈ పాట కూడా “కళావతి” అనే హిందూస్తానీ రాగంలో ఉంది. కర్ణాటక సంగీతంలో దీనికి సమానమైన రాగం [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS