Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఆనంద తాండవ మాడే

సినారె, సుశీల హాసిని
ఆ..ఆ..ఆ.. ఆనంద తాండవ మాడే - శివుడు అనంతలయుడు - చిదంబర నిలయుడు నగరాజ సుత - చిరునగవులు చిలుకంగ సిగలోన ఒగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ ప్రణవ నాదం ప్రాణం కాగా - ప్రకృతి మూలం తానం కాగా భువనములే రంగ భూమికలు కాగా భుజంగ భూషణుడు - అనంగ భీషణుడు పరమ విభుడు - గరళధరుడు భావ రాగ తాళ మయుడు సదయుడు ఏమి శాంభవ లీల - ఏమి తాండవ హేల అణువణువులోన దివ్యానంద రసడోల సుర గరుడులు - ఖేచరులు - విద్యాధ్రులు నిటల తట ఘటిత -
పూర్తిగా చదవండి

చక్కనయ్యా చందమామా

ఆత్రేయ, మహదేవన్, సుశీల హాసిని
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ.. గొల్లుమన్నాము //చక్క// మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ.. వెతుకుతున్నామూ //చక్క// దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో.. రాలేకవున్నావో... //చక్క// చిత్రం :
పూర్తిగా చదవండి

తొలికోడి కూసింది

సినారె, సుశీల హాసిని
తొలికోడి కూసింది - తెల తెలవారింది వెలుగులలొ జగమంతా జలకాలాడింది //తొలి// దూరాల ఆకాశ తీరాల బంగారు హారాలు వేసెను కిరణాలు ఈ వేళ విరిసే భావాల మెరిసే శ్రీ వేంకటేశుని చరణాలు//తొలి// అనురాగవల్లి - ఆతీగవల్లి - అలరారె తనపూల పాపలతో తొలిచూరులేగ తలవూపి రాగ - పులకించె గోమాత చేవులతో//తొలి// చిత్రం : తిక్క శంకరయ్య గానం : పి.సుశీల రచన : డా.సి.నారాయణరెడ్డి సంగీతం : టి.వి.రాజు
పూర్తిగా చదవండి

అందాల బొమ్మతో ఆడాడవా?

దాశరథి, సుశీల హాసిని
అందాల బొమ్మతో ఆడాడవా? పసందైన ఈ రేయి నీదోయి స్వామీ కనులు చేపలై గంతులు వేసె మనసు తోటలొ మల్లెలు పూసె దోసిట వలపుల పూవులు నింపీ నీ కోసము వేచితి రావోయీ చల్ల గాలిలో కబురంపితి నోయి చందమామలో వెదకితి నోయీ తార తారనూ అడిగితి నోయీ దాగెద వేలా? రావోయీ నల్లని మేఘము జల్లు కురియగా ఘల్లన ఆడే నీలినెమలినై నిను గని పరవశమందెద నోయీ కనికరించి ఇటు రావోయీ చిత్రం : అమరశిల్పి జక్కన్న గానం : పి.సుశీల రచన : దాశరథి
పూర్తిగా చదవండి

నిను చేర మనసాయెరా !

శ్రీ శ్రీ, సుశీల హాసిని
నిను చేర మనసాయెరా ! నా స్వామి చనువార దయసేయరా! విడిదికి రమ్మని చాల వేడితిరా బిడియము నీకేలరా _ దొరా సరసుడవని నిన్నే పదిమంది పొగడ మరిమరి కోర్కెలు విరిసెను ప్రియుడా వయసు నీకొరకె పలువరించెరా తనువు నిన్ను దలచి పులకరించెరా మగువ కోర మొగమాట మేలరా బిగువు మాని జవరాలి నేలరా సొగసు చూచి ఎదురు కాచి నిలచి పగలు రేలు దిగులు చెందు చెలికి చిత్రం : బొబ్బిలి యుద్ధం గానం : పి.సుశీల రచన : శ్రీశ్రీ సంగీతం : ఎస్.
పూర్తిగా చదవండి

ముత్యాల చెమ్మచెక్క

ఆరుద్ర, సుశీల హాసిని
ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగల లాడ //ముత్యాల// తళ తళ తళ తళ మెరిసే సొగసు ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ పరువము వేసిన పందిరిలో బుజబుజ రేకులు పూయవలె //ముత్యాల// ఒప్పులకుప్ప - వయ్యారి భామా సన్నబియ్యం - చాయపప్పు చిన్నమువ్వ - సన్నగాజు కొబ్బరికోరు - బెల్లప్పచ్చు గూట్లో రూపాయ్ - నీ మొగుడు సిపాయ్ రోట్లో తవుడు - నీ మొగుడెవడు ఘుమ ఘుమ ఘుమ ఘుమ
పూర్తిగా చదవండి

జోహారు శిఖిపించమౌళి

ఘంటసాల, సినారె, సుశీల హాసిని
జోహారు శిఖిపించమౌళి జోహారు రసరమ్య గుణశాలి! వనమాలి! కలికి చూపులతోనే చెలులను కరగించి కరకు చూపులతోనే అరులను జడిపించి నయగార మొకకంట! జయవీర మొకకంట! చిలకరించి చెలువుమించి నిలిచిన శ్రీకర నరవర! సిరిదొర //జోహారు// నీ నాదలహరిలో నిదురించు భువనాలు నీ నాట్యకేళిలో నినదించు గగనాలు నిగమాలకే నీవు సిగబంతివైనావు యుగయుగాల దివ్యలీల నెరసిన అవతారమూర్తి! ఘనసార కీర్తి //జోహారు// చకిత చకిత హరిణేక్షణా వదన చంద్రాకాంతు
పూర్తిగా చదవండి

ఓ రంగయో పూలరంగయో

ఘంటసాల, సుశీల హాసిని
ఓ రంగయో పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో పొద్దువాలి పోతున్నదోయి ఇంత మొద్దు నడక నీకెందుకోయి పగలనక రేయనక పడుతున్న శ్రమనంత పరులకొరకే దారపోయి మూగజీవులు ఆటలలొ పాటలలొ ఆయాసం మరచిపోయి ఆనందం పొందగలుగు ధన్యజీవులు కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని యీ దీనుల జీవితాలు మారుటెన్నడో కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి కనిపెట్టి మేలు చేయ గలిగినప్పుడే చిత్రం : వెలుగు నీడలు గానం : ఘంటసాల, పి.సుశీల
పూర్తిగా చదవండి

చిగురాకులలో చిలకమ్మా

ఘంటసాల, సుశీల హాసిని
ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట విన రావమ్మా మరు మల్లెలలో మామయ్యా మంచి మాట సెలవీవయ్యా పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా ఎవరన్నారో ఈ మాటా వింటున్నాను నీ నోట తెలిసి తొణికిన వినవేలా వలపే కోమలి వయ్యారాలకు తలపే మనసుల తియ్యదనాలకు కలవారి కలువలు సెలవియ్య పై మెరుగులకే భ్రమ పడకయ్యా మనసే మాయని సొగసయ్యా గుణమే తరగని ధనమయ్యా చిత్రం :దొంగరాముడు గానం : ఘంటసాల
పూర్తిగా చదవండి

కొనుమిదే కుసుమాంజలి

సుశీల హాసిని
కొనుమిదే కుసుమాంజలి అమరులా ప్రణయాంజలీ రసికా నటలోక సార్వభౌమ నాదలోల విజయగోపాల కాళీయ ఫణిరాజు పడగలపైనా కాలియందియలు ఘల్లుమనా లీలా నాట్యము చేసి చూపినా తాండవ కృష్ణా జోహార్ జోహార్ నీ మధు మురళీ గానము విన్నా భామలు మోహము మీరి దీనలై రారా మదిని వగదీర మరులు నెరవేర మనసు తనివార కౌగిలి వీర నెరా దొరా మాపై నెనరు గొనర మారుకేళి దేలుపు మను మగువల మహానందమయ మలయోల్లాస గతులా దివ్య రాస కేళి మహిమ జూపి మురియజేసి నిదవధి
పూర్తిగా చదవండి

పాండవులు పాండవులు తుమ్మెదా

ఆత్రేయ, మహదేవన్, సుశీల హాసిని
పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా కన్నెగానె బతుకు గడిచిపోతుంది నన్నెవరేలుకుంటారో అనుకున్నది జానకి అనుకున్నది శ్రీరామచంద్రుడె చేసుకుంటాడని విన్నదీ ఒళ్లంతా ఝల్లన్నదీ నవ మన్మధుని వంటి నాధుని కనులారా ఒక్కసారి చూడగ వుబలాటపడ్డది తుమ్మెదా వుబలాటపడ్డది పెళ్ళి పీటల మీద వెళ్ళి కూర్చున్నది కళ్లలో.. కాని సిగ్గు కమ్మేసింది ఓయమ్మా బుగ్గలకుపాకింది నీ గుండెలోన
పూర్తిగా చదవండి

దీపాలు వెలిగె..

శ్రీశ్రీ, సుశీల హాసిని
దీపాలు వెలిగె.. పరదాలు తొలిగె ప్రియురాలు పిలిచె రావోయీ ప్రియురాలు పిలిచె రావోయీ నా వయసు నీది .. నీ వలపు నాది మన మనసులు కలసిన వోయీ నీ అడుగు జాడ .. నా పూల మేడ మన మిరువుర మొకటే లేవోయీ నా తోడు నీవు .. నీ నీడ నేను మన యిరువురిదే యీ రేయీ యిక జాగుసేయ తగదోయి నీకు నా చల్లని రాజా రావోయీ చిత్రం : పునర్జన్మ గానం : పి.సుశీల రచన: శ్రీశ్రీ సంగీతం : టి.చలపతిరావు
పూర్తిగా చదవండి

ఎగిరే పావురమా

కృష్నశాస్త్రి, సుశీల హాసిని
ఎగిరే పావురమా దిగులెరగని పావురమా దిగిరావా ఒక్కసారి ప్రతి రాత్రికి పగలుందని ఎరుగుదువా మోముపైని ఏ నీడలు ముసరరాదని చంద మామపైని ఏ మబ్బులు మసలరాదని - ఎరుగుదువా పావురమా మాకన్నా నీవు నయం మూసే చీకటుల దారిచేసి పోవాలని ఎదుగుదువా అటుపచ్చని తోటుందని అటు వెచ్చని గూడుందని అటూ ఇటూ అడుగడుగున చుక్కదీపముంటుందని ఎగురుదువా పావురమా ఒక్క గడియగాని, నీ రెక్క ముడవగూడదనీ దూరాన ధ్రువతారను చేరే తీరాలని ఎరుగుదువా..
పూర్తిగా చదవండి

ఏమండోయ్ శ్రీవారు

ఆరుద్ర, మహదేవన్, సుశీల హాసిని
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు? ఏదీ కాని వేళ పసివాని చూచుట కీ తొందరా? మైమరచి ముద్దాడి లాలింతురా? శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో ఇచ్చేందుకేముంది మీ దగ్గరా అబ్బాయి పోలిక ఈ తండ్రిదా? అపురూపమైన ఆ తల్లిదా? అయ్యగారి అందాలు రానిచ్చినా ఈ బుద్ధి రానీకు భగవంతుడా.. ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే కపటాలు మానేసి నా మదిలోన కాపురం చేయండి కలకాలము చిత్రం : మంచి మనసులు
పూర్తిగా చదవండి

నీలమోహనా రారా…

కృష్ణశాస్త్రి, మహదేవన్, సుశీల హాసిని
నీలమోహనా రారా... నిన్ను పిలిచె నెమలి నెరజాణ జారువలపు జడివాన కురిసెరా జాజిలత మేను తడసెరా లతలాగే నా మనసు తడిసెరా //నీల// ఏలాగే మతిమాలి ఏడే నీ వనమాలి అతడేనేమో అనుకున్నానే అంత దవుల శ్రావణ మేఘముల గనీ ప్రతి మబ్బు ప్రభువైతే ప్రతి కొమ్మా మురళైతే ఏలాగే ఆ...ఆ...ఆ..ఆ... సారెకు దాగెద వేమి? నీ రూపము దాచి దాచి మురియుటకా స్వామీ? నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా అటు..అటు...ఇటు.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS