Nov 14
ప్రాభాతి
Uncategorized, సూర్యోదయ కిరణాలు వెన్నెల
రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్
ప్రోగులు వోయగా నిదురపోవు దయామయి! నా యెడందలో
ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెతో
దాగుడు మూత లాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా!
ఈ గిజిగాని గూడు వలెనే మలయానిల రాగడోలలో
నూగుచునుండె నా తలపు లూరక; నీ కబరీ భరమ్ములో
మాగిన కేతకీ సుమ సమంచిత సౌరభవీచి పై పయిన్
మూగి స్పృజించి నా హృదయమున్ కదిలించుచునుండె ప్రేయసీ
రాగము నందుకొన్నది తరంగిణి; బాలమరీచి మాలికిన్
స్వాగతమిచ్చె పద్మిని; హసన్ముఖియై మన దొడ్డిలోని పు
న్నాగము కుప్పవోసె [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి