Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రచయితగా సత్యజిత్ రాయ్ - నా అభిప్రాయాలు

వ్యాసాలు, సెప్టెంబర్ 2007 కొడవటిగంటి రోహిణీప్రసాద్,సౌమ్య బాలకృష్ణ
ప్రపంచంలోని సినీదర్శకులలో అగ్రశ్రేణికి చెందిన సత్యజిత్ రాయ్ (1921-1992) గొప్పతనాన్ని వర్ణించడానికి బహుముఖప్రజ్ఞాశాలి అనే పదం కూడా సరిపోదేమో. దర్శకత్వం మటుకే కాక, కథారచన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమటోగ్రఫీ, సంగీత దర్శకత్వం, కళాదర్శకత్వం ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి శాఖలోనూ అత్యుత్తమ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించిన రాయ్ చిత్రకళలోనూ, సాహిత్యంలోనూ కూడా మేటి అనిపించుకున్నాడు.
పూర్తిగా చదవండి

ప్రాచీనత గురించే మరోసారి!

సంపాదకీయం, సెప్టెంబర్ 2007 సురేశ్ కొలిచాల
ఎంతో అనుభవజ్ఞులైన తెలుగు సాహితీ వేత్తలు, విశ్వవిద్యాలయాధికారులు కూడా ఈ రకమైన సిద్ధాంతాలకు వత్తాసు పలకడంతో ఈ వాదాల అశాస్త్రీయతను ఎత్తిచూపిస్తూ మరోసారి రాయడంలో తప్పులేదనిపించింది.
పూర్తిగా చదవండి

తిష్టతత్వం జ్వలించింది

వ్యాసాలు, సెప్టెంబర్ 2007 వేమూరి వేంకటేశ్వరరావు
కంటికి కనిపించే ప్రపంచమంతా నిజం కాదు; నిజమైన ప్రపంచం అంతా కంటికి కనిపించదు.
పూర్తిగా చదవండి

వాన-పాట

కవితలు, సెప్టెంబర్ 2007 విన్నకోట రవిశంకర్
వానలో తడిసినప్పుడు పాత గాయాలేవో సలపరించినట్టు నీ పాటలో తడిసినప్పుడు మానిన జ్ఞాపకాలు మళ్ళీ బాధ పెడతాయి.
పూర్తిగా చదవండి

అరణ్య కవితలు

కవితలు, సెప్టెంబర్ 2007 మూలా సుబ్రహ్మణ్యం
ఎంతదారి తప్పి ఎక్కడెక్కడో తిరిగినా ఎట్టకేలకు నీటి జాడ అడవిలో మరొక సారి తప్పిపోవాలనుంది దట్టమైన అడవి ఆకుల్లోంచి దూరి లోయల్లోకి ప్రాకి కిరణాలు తమని ముద్దాడుతుంటే గలగలలాడే సెలయేటి అలలన్నీ వెలిగిపోతూ… తనలో మునిగిన ప్రతి గులకరాయికీ ఓపిగ్గా సెలయేరు ఒక రూపాన్నిస్తోంది చూడ్డానికి ఒకేలా ఉన్నా దేని అందం దానిదే! ఏ సెలయేటిని చూసినా ఆ గలగలలు నాలోనూ వినిపించేవి. కొన్నాళ్ళకి నేను కవిత్వం మొదలు పెట్టాను ఒకరితో నిమిత్తం లేదు పూస్తాయి రాలిపోతాయి అడవిలో పూలు.
పూర్తిగా చదవండి

మా ఫ్రాన్స్ అనుభవాలు

వ్యాసాలు, సెప్టెంబర్ 2007 డా. విష్ణుభొట్ల లక్ష్మన్న
సిలికాన్ సెమీకండక్టర్ పై సాంకేతిక పరిశోధన నా వృత్తి. 2002 సంవత్సరంలో, ఆస్టిన్, టెక్సస్‌లో నేను పని చేస్తున్న మోటరోలా కంపెనీ, యూరప్‌లో రెండు పెద్ద కంపెనీలయిన ఫిలిప్స్ సెమీకండక్టర్, ఎస్. టి. మైక్రోఎలెక్ట్రానిక్స్ లతో పొత్తు కుదుర్చుకొని, అత్యాధునికమైన సిలికాన్ చిప్స్ తయారీ కోసం ఫ్రాన్స్‌లో ఒక పెద్ద రిసెర్చి భవనాన్ని నిర్మించింది! మోటరోలా తరఫున ఒక అరవై మందిని ఎంపికచేసి నన్నూ అందులో ఒకడిగా అక్కడకి కుటుంబంతో సహా పంపించారు. ఫ్రాన్స్ వెళ్ళే [...]
పూర్తిగా చదవండి

పుస్తక సమీక్ష: Girls for Sale, kanyasulkam

సమీక్షలు, సెప్టెంబర్ 2007 వేలూరి వేంకటేశ్వర రావు
ఈ వ్యాసం రాయడానికి ఉపయోగపడిన పుస్త కాలు: 1. మన గురజాడ — శ్రీశ్రీ (శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం -9 : కూర్పు చలసాని ప్రసాద్, 1988) 2. మళ్ళీ కన్యాశుల్కం గురించి — కేతవరపు రామకోటి శాస్త్రి (1992) 3. కన్యాశుల్క నాటక కళ — సర్దేశాయి తిరుమల రావు (1994) 4. కన్యాశుల్కం — నూరేళ్ళ సమాలోచనం — సంపాదకులు : మొదలి నాగభూషణ శర్మ, ఏటుకూరి ప్రసాద్ (1999) 5. మహోదయం — కె. వి. రమణా రెడ్డి (1958) 6. [...]
పూర్తిగా చదవండి

రచయితగా సత్యజిత్ రాయ్ - నా అనుభవం

వ్యాసాలు, సెప్టెంబర్ 2007 సౌమ్య బాలకృష్ణ
[ప్రపంచంలోని సినీదర్శకులలో అగ్రశ్రేణికి చెందిన సత్యజిత్ రాయ్ (1921-1992) గొప్పతనాన్ని వర్ణించడానికి బహుముఖప్రజ్ఞాశాలి అనే పదం కూడా సరిపోదేమో. దర్శకత్వం మటుకే కాక, కథారచన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమటోగ్రఫీ, సంగీత దర్శకత్వం, కళాదర్శకత్వం ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి శాఖలోనూ అత్యుత్తమ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించిన రాయ్ చిత్రకళలోనూ, సాహిత్యంలోనూ కూడా మేటి అనిపించుకున్నాడు. వీటిలో ఏ ఒక్క రంగంలో కృషి చేసినా అతను రాణించి ఉండేవాడని సమకాలీనులు ఆయనను ప్రశంసించారు. ద్రష్టగా, కళాస్రష్టగా ప్రపంచ [...]
పూర్తిగా చదవండి

కన్యాశుల్కం వ్యాసానికి అనుబంధం

సమీక్షలు, సెప్టెంబర్ 2007 వేలూరి వేంకటేశ్వర రావు
కన్యాశుల్కం నాటకం పై గత 50 సంవత్సరాలుగా వచ్చిన పొగడ్తలు, విమర్శలు, ప్రతివిమర్శలు నుండి పాఠకులకు పనికివచ్చే కొటేషన్లు పొందుపరచడం కోసం ఈ అనుబంధంలో నేను సాధ్యమైనంతవరకు మూల వ్యాసాలను చూడటానికి ప్రయత్నించాను.
పూర్తిగా చదవండి

కన్యాశుల్కానికి వెల్చేరు అనువాదం, వ్యాఖ్యానం

సమీక్షలు, సెప్టెంబర్ 2007 కె. వి. ఎస్. రామారావు
నూరేళ్ల సమగ్ర పరిశోధనల తర్వాత కూడా కన్యాశుల్కం గురించి మనకింకా తెలియని విషయాలున్నాయా? అది సంఘ సంస్కరణకు ఉద్దేశించిన నాటకం అని మనకు తెలుసు. ముఖ్యంగా కన్యాశుల్క దురాచారాన్ని రూపుమాపటానికే గురజాడ దాన్ని రాశాడని మనకు తెలుసు. తెలుగు సాహిత్యానికి గురజాడతో ఒక కొత్త యుగం మొదలైందని మనకు తెలుసు. ఆ యుగధర్మం ఆధునికత అని, పాత మూఢ వైదికభావాల్ని తోసిపుచ్చి కొత్త పాశ్చాత్య భావజాలానికి పెద్దపీట వెయ్యటం అని మనకు తెలుసు. దేశభక్తి, ప్రకృతి ఆరాధన, అడుగు [...]
పూర్తిగా చదవండి

నాకు నచ్చిన పద్యం - మనుచరిత్రలో సాయంకాల వర్ణన

వ్యాసాలు, సెప్టెంబర్ 2007 చీమలమర్రి బృందావనరావు
శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా శోణం బయ్యెఁ బతంగ బింబము; దిశా స్తోమంబు శోభాదరి ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్ ఆంధ్ర కవితా పితామహుడిగా పేరుపొందిన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము లోని తృతీయాశ్వాసం లోనిది ఈ పద్యం. ఇందులో కవి సాయంకాలాన్ని వర్ణిస్తున్నాడు. తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరిగిపోని పేర్లలో అల్లసాని పెద్దన పేరు చాలా ముఖ్యమైంది. కృష్ణదేవ రాయని ఆస్థానం లోని [...]
పూర్తిగా చదవండి

చంద్ర కవితలపై ఒక మతింపు

సమీక్షలు, సెప్టెంబర్ 2007 యన్‌. వి. రాయ్‌
ఫలానా కవిత బాగుంది, లేదా ఫలానా కవిత బాగా లేదు అనడం తేలిక. కానీ ఎవరన్నా నిలదీసి, ఎందుకు బాగుందో చెప్పు , ఎందుకు బాగాలేదో చెప్పు అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. ముఖ్యంగా ఎందుకు బాగాలేదో చెప్పడం మరీ కష్టం అనుకుంటాను. నామటుకు నాకు కవిత చదవగానే, ఆకవితలో మాటల ప్రతిమలు అంతకుపూర్వం హృ దయానికి హత్తుకొపోయిన బొమ్మలను గుర్తుచేస్తాయి. వెంటనే ఈ [...]
పూర్తిగా చదవండి

కవితల ఇంద్రధనుస్సు

సమీక్షలు, సెప్టెంబర్ 2007 విన్నకోట రవిశంకర్
వానా కాలమే కాదు, వాన పడిన సమయం కూడా కవులకు ముఖ్యమౌతుంది. చంద్ర కవితలను విడివిడిగా అనేక సంవత్సరాలుగా చూస్తూనేఉన్నా, అన్నిటినీ కలిపి ఒకచోట చదవటం మంచి అనుభవం.
పూర్తిగా చదవండి

“మనసున మనసై ” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ

సమీక్షలు, సెప్టెంబర్ 2007 డా. దార్ల వెంకటేశ్వర రావు
1.0 ప్రస్తావన అమ్మాయిలకు ఉన్నతవిద్య అవసరమా! ఏ వయసులో పెళ్ళిజరిగితే బాగుంటుంది? ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీలకెంత వరకూ ప్రయోజనకరం? ఆశయాలకూ, ఆచరణకూ పొంతన కనిపిస్తుందా? జీవితంలో సర్దుబాటు తప్పదా? అయితే, అది ఎలాంటి సర్దుబాటైతే బాగుంటుంది? సర్దుబాటు స్త్రీ, పురుషుల్లో ఇద్దరికీ ఉండాలా? లేక ఒక్కరికే ఉండాలా? మొదలైన ప్రశ్నలు - వాటికి సమాధానాలు డి. కామేశ్వరి గారు రాసిన ‘ మనసున మనసై ‘ నవలలో చాలా వరకు కనిపిస్తాయి. ఆ సమస్యలను నవల లోతుగా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS