Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మెమరీని తరచు క్లీన్ చేయడానికి

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
మీ కంప్యూటర్లో ఎంత మెమరీ ఉన్నా, ఎంత శక్తివంతమైన కంప్యుటర్ అయినా ఒకేసారి పలు అప్లికేషన్ ప్రోగ్రాములను సుదీర్ఘ కాలం పాటు ఓపెన్ చేసి పెట్టడం వల్ల సమయం గడిచేకొద్దీ పనితీరు నెమ్మదిస్తుంది. అలాంటప్పుడు కంప్యుటర్ ని రీస్టార్ట్ చేస్తేనే తిరిగి ఊపండుకుంటుంది. ఇలా స్లో అయినప్పుడు రీస్టార్ట్ చేసే అవసరం లేకుండా ఒ చిట్కా పాటించవచ్చు. డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకుని
పూర్తిగా చదవండి

కొన్ని వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా బ్లాక్ చేయడం

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండి ఇంటర్నెట్ ద్వారా వారు Orkutలో స్క్రాప్‍లు చేయడానికో , ఐడిల్ బ్రెయిన్‍లో వాల్ పేపర్లు వెదకడానికో టైమ్ వేస్ట్ చేస్తున్నారనుకోండి. ఆయా సైట్లు మీ కంఫ్యూటర్‍లో ఓపెన్ కాకుండా నిరోధించవచ్చు. దీనికి ఎలాటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ అవసరం లేదు. మీ హార్డ్ డిస్క్ లో C:\Windows\System32\drivers\etc అనే ఫోల్డర్ లోకి వెళ్ళి HOSTS అనే ఫైల్‍ని మౌస్‍తో రైట్ క్లిక్ చేసి Open అనే
పూర్తిగా చదవండి

విండోస్ సెటప్ తో పాటే అన్ని ప్రొగ్రాములూ …

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
వైరస్ ఇన్ ఫెక్ట్ అయినప్పుడు మనం అందరం వేరే మార్గం లేకపోతే హార్డ్ డిస్క్ ని ఫార్మేట్ చేసి విండోస్‍ని తాజగా ఇన్ స్టాల్ చేస్తుంటాం. విండోస్ ఇన్‍స్టలేషన్ పూర్తయి, మనకు కావలసిన ఫోటోషాప్, ఎం.ఎస్. ఆఫీస్ వంటి అన్ని సాఫ్ట్ వేర్లు, ప్రింటర్, లాన్ కార్డ్ వంటి డివైజ్ డ్రైవర్లు అన్నీ వెదికిపట్టుకుని ఇన్‍స్టాల్ చేసుకునేసరికి తలప్రాణం తోకకు వస్తుంది. ఈ ఇబ్బందిని Windows Reload అనే సాఫ్ట్ వేర్ సాయంతొ చిటికెలో
పూర్తిగా చదవండి

Lime Wire ఉపయోగించడం చాలా ఈజీ..

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
సాంగ్స్, ఫోటోలు, వీడియోలు.. వంటి ఏ కంటెంట్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయి ఉన్న ఇతరుల సిస్టమ్‌లో ఉన్న వారి సిస్టమ్ నుండి నేరుగా మన సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవడానికి LimeWire వంటి Peer-to-Peer ప్రోగ్రాములు అవకాశం కల్పిస్తాయి. దీన్ని డౌన్ లోడ్ చేసుకున్న వెంటనే మన సిస్టమ్‌లో ఒక ఫోల్డర్‌ని ఇతరులు యాక్సెస్ చెయ్యడానికి అనువుగా స్పెసిఫై చేయాలి. ఇక మనకు కావలసిన Typeని ఎంచుకుని Keyword టైప్ చేసి Search అనే
పూర్తిగా చదవండి

ఆటోమేటిక్ గా జిప్ చేసే ప్లగ్ ఇన్ వాడండి…

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
Outlook ప్రోగ్రాం ద్వారా మనం మెయిల్ మెసేజ్ లు పంపిస్తూ, స్వీకరిస్తూ ఉంటాం. అధిక సందర్భాల్లో మనం పంపించే మెయిల్స్ తో పాటు ఫైలు అటాచ్ మెంట్లు కూడా పంపించవలసి వచ్చినపుడు ఎక్కువ పరిమాణం కలిగిన ఫైల్లని పంపించడానికి అధిక సమయం తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో మెయిల్ తో పాటు మనం పంపించే ప్రతీ అటాచ్‌మెంట్‌ని ఆటోమెటిక్‌గా జిప్ చేసి పంపించే ప్లగ్ ఇన్ ఒకటి లబిస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల మెయిల్స్ వేగంగా
పూర్తిగా చదవండి

సమయం గురించి అన్ని కోణాలలో వివరాలు

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
ప్రస్తుతం న్యూజెర్సీలో సమయం ఎంత అయిన్దన్నది తెలుసుకోవాలనుకున్తున్నారు, లేదా ఎ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ అయినా చూదాలనుకున్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు ? నెట్ లో కుస్తీపడతారు కదూ. ఆయితే టైం కి సంబంధించిన ప్రతీ పనికి వేర్వేరు వెబ్ సైట్లని వెదికి పట్టుకోవలసిన పని లేకుండా నేరుగా టైం తెలుసుకోవచ్చు. ఇందులో టైం జోన్ క్యాలిక్యు లెటర్ , మీటింగ్ ప్లానర్, సూర్యోదయ, సూర్యాస్తమయ వివరాలు ...
పూర్తిగా చదవండి

వేర్వేరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెర్షన్లు వాడాలా ??

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
మీరు IE 5.5,IE6, IE7 వంటి వేర్వేరు ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ వెర్షన్లలో ఏదో ఒకదానిని మాత్రమే ఒకేసారి ఉపయోగించడానికి వీలుపడుతుంది. ఒకవేళ ఒకే వెబ్‌సైట్‌ని IE3,4.01, 5.01,5.5, 6.0వంటి వేర్వేరు వెర్షన్లలో ఏ విధంగా కనిపిస్తుందో తనిఖీ చేయాలంటే Multiple IE Installer అనే ప్రోగ్రామ్‌ని ఇన్‌స్టాల్ చేయండి. Vista ఆపరేటింగ్ సిస్టం మినహాయించి ఇతర అన్ని వెర్షన్లలో ఇది బాగా పని చేస్తుంది. ఏ వెర్షన్ కావాలో ముందే
పూర్తిగా చదవండి

ఎ కలర్ పేరేమిటో మీకు తెలుసా ?

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
చాలా మంది ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, ఆకుపచ్చ, నలుపు, మేజెంటా వంటి రంగులు మాత్రమే చెప్పగలుగుతారు. మనం తరచుగా చూస్తూ కూడా వాటి పేర్లు తెలియని అనేక రంగుల పేర్లు తెలుసుకోదలుచుకుంటే name-that color -అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి డ్రాప్ డౌన్ లిస్టు లో కన్పించే వేర్వేరు వర్ణాలను తనివితీరా వీక్షించి వాటి పేర్లు తెలుసుకోవచ్చు. అలాగే ఏవైనా వర్ణాల యొక్క RGB విలువలను ఇచ్చినా వాటి పేరు లభిస్తుంది. చిరాగ్ మెహతా
పూర్తిగా చదవండి

ఎ వెబ్ సైట్లో ఎ టెక్నాలజీ వాడబడింది

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
వెబ్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి, లేదా తమకు తాము స్వంతంగా వెబ్ సైట్లని రూపొందించుకోదలుచుకున్న వారికినెట్‍లో వివిధ ఆకర్షణీయమైన వెబ్ సైట్లని చూసినప్పుడు అవి ఏ వెబ్ టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడ్డాయన్న ఆసక్తి కలగడం సహజం. మీకు తారసపడే ఏ వెబ్‍సైట్ అయినా ఏయే టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడిందో తెలుసుకోవాలనుకుంటే builtwith అనే వెబ్ సైట్‍ని ఓపెన్ చేసి అక్కడి అడ్రస్ బార్‍లో మీరు ఏ సైట్ గురించి
పూర్తిగా చదవండి

అన్ని రకాల కాలిక్యులేషన్స్ చేయాలంటే

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
ఒక అంగుళానికి ఎన్ని మిల్లిమీటర్లు, ఎన్ని సెంటిమీటర్లు, ఒక మైలుకి ఎన్ని సెంటిమీటర్లు, అంగుళాలు ఉంటాయి వంటి ధర్మసందేహాలు వస్తే మీ వద్ద ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే వెంటనే worldwide metric అనే వెబ్ పేజిని ఓపెన్ చేయండి. ఇందులో నిడివి, బరువు, వత్తిడి, పరిమాణం, ఉష్ణోగ్రత వంటి వేర్వేరు అంశాలను వేర్వేరు ప్రమాణాల్లో కొలిచే సదుపాయం లభిస్తోంది. ఏదైనా బాక్శ్ లో మీకు కావలసిన విలువని టైప్ చేసి Calculate
పూర్తిగా చదవండి

గూగుల్లో సురక్షితంగా సెర్చ్ చేయడానికి

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
గుగుల్ సెర్చ్ ఇంజిన్‍లో మీరు ఏ పదం వెదికినా మీకు తెలియకుండానే మీ IP అడ్రస్, ఏ పదం కోసం వెదికారు, సమయం తదితర వివరాలు గూగుల్ యొక్క డేటాబేస్‍లో భద్రపరచబడతాయి. దీనివల్ల మీ ప్రవసీకి ఇబ్బంది కలగవచ్చు. మీ వివరాలు రికార్డ్ చేయబడకుండా నిరోధించడానికి googlonymous ద్వారా వెదకండి. గూగుల్ లోనే మీ వివరాలేమీ రికార్డ్ అవకుండా ఇది సెర్చ్ చేసి పెడుతుంది.
పూర్తిగా చదవండి

Dual Core కి Core2Duo కి తేడా ఏమిటి??

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. రెండు సిపియులతో కూడిన ఏ ప్రాసెసర్‍నైనా Dual Core శ్రేణికి చెందినదిగా చెప్పుకోవచ్చు. అంటే Dual Core అనేది ప్రాసెసర్ మోడల్ కాదు. ప్రాసెసర్ ప్యాకేజింగ్ టెక్నాలజీ అన్నమాట. Pentium D, Core Duo, Core2Duo, Athlon X2 వంటి వివిధ రకాల ప్రాసెసర్లు ఈ డ్యూయల్ కోర్ టెక్నాలజీని అనుసరించి రూపొందించబడుతున్నాయి. వీటిలో Core Duo అనేది మొదటి తరం ప్రాసెసర్ కాగా Core2Duo అనేది
పూర్తిగా చదవండి

మ్యూజిక్‍కి కంటెంట్ ప్రొటెక్షన్ వద్దనుకుంటే…

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
WInXP తో పాటు పొందుపరచబడిన విండోస్ మీడియా ప్లేయర్‍లో మ్యూజిక్ సిడిలను కాపీ చేసుకునే సదుపాయం కూడా అందించబడింది. అయితే ఎవరు బడితే వారు ఆ సిడిలోని మ్యూజిక్‍ని కాపీ చేయడానికి వీల్లేకుండా ’లైసెన్సింగ్’సదుపాయం సైతం అందించబడింది. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు మీడియాప్లేయర్ Tools మెనూలో ఉండే Copy Music అనే విభాగంలో Copy Settings క్రింద Protect Content అనే బటన్‍ని డిసేబుల్ చేస్తే సరిపోతుంది.
పూర్తిగా చదవండి

Read - only ఫైళ్ళుగా మారితే సేవ్ చేయడం…

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైళ్ళని ఎప్పుడైనా నిరభ్యంతరంగా వివిధ అప్లికేషన్ ప్రోగ్రాముల ద్వారా ఓపెన్ చేసుకుని ఎడిట్/సేవ్ చేసుకోవచ్చు. అయితే హార్డ్ డిస్క్ స్పేస్ ని ఆదా చేసుకునే ఉద్దేశ్యంతో డిస్క్ లోని ఫైళ్లని సిడి రైటర్ ద్వారా సిడిల్లోకి రికార్డ్ చేసినప్పుడు ఆ ఫైళ్లని తిరిగి సిడి నుండి సిస్టమ్ లోకి కాపీ చేసుకుని ఎడిట్ చేసి సేవ్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు cannot save అని ఎర్రర్ చూపించబడుతుంది.
పూర్తిగా చదవండి

Hibernation అవసరం లేదనుకుంటే..

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
ప్రస్తుతం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ స్థితిలొ ఉందో ( ఏయే ప్రోగ్రాములు, సర్వీసులు రన్ అవుతున్నాయన్నది) ఆ స్థితిలోకి తీసుకురావడానికి ఉపయోగపడే Hibernation అనే సదుపాయం పెద్దగా ఉపయోగించనివారు దాన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్‍లో C డ్రైవ్‍లో hiberfil.sys అనే హిడెన్ ఫైల్ గనుక ఉన్నట్లయితే మీ సిస్టమ్‍లో Hibernation ఎనేబుల్ చేసి ఉన్నట్లు భావించాలి. దీన్ని డిసేబుల్ చెయ్యడానికి Control Panel>
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS