Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెలియ రాదా నాకు తెలుగే రాదా

స్వగతం lalithag
తెలియ రాదా? నాకు తెలుగే రాదా? తెలివైన వారు, తెలిసిన వారు తెలుసుకుంటున్నారు మర్మములను నేనేరుగలేనైతినే! అవి నే నొప్పలేనైతినే!  భాష ఏమో భావమేమొ ఆవేశమేమో ఆలోచనేమో నిజమేమో నిరూపణలేమొ ఏమో ఏమి ఈ అయోమయమో వేదమే అది యౌనో కావ్యమే మరి ఏమో మాటలేమో అనుకుంటి మూఢురాల నేనైతి భాషనే నేర్వ వలెనో  నే మరల బడికే పోవలెనో ఓనమాలు నేర్వ వలెనో నేను మరి ఒంటరినేలైతినో ఒంటి బ్రాహ్మణుండొకనాడు వెంట మేక పిల్ల గొనిబోవ వెంటబడి నలుగురది కుక్కపిల్లంటిరే, కాని వారు దొంగ వారైతిరే స్తంభమన్నారు ఒకరు, కాదు పాము అన్నారు కానలేక కాలు, తొండము తడిమి చూసిన వారు ఏనుగని వారు దానిని ఎరుగకుండుట [...]
పూర్తిగా చదవండి

బ్లాగావేశాలు

స్వగతం lalithag
రాయాలని ఉంది ఎంతో చెప్పాలని ఉంది ఆలోచనలు పంచుకోవాలని ఉంది అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది మార్గం అన్వేషించాలని ఉంది మార్పును ఆహ్వానించాలని ఉంది ఆత్మావలోకనం చేసుకోవాలనుంది అభ్యంతరాలను తెలపాలని ఉంది మాట నేర్చిన మనిషి మనసుకిన్ని మెలికలెందుకో రాయ నేర్చిన వారికి చదివి ఎరుగుట కష్టమెందుకో నచ్చిన మాట నెత్తికెత్తుకుని నచ్చనివన్నీ తప్పులందురు మాట మాటకు బదులు చెప్పినా ముందు మాటను విడువకుందురు పేరు చెప్పక పరువు తీస్తే స్వేచ్ఛ అని సమర్థింతురు పేరు చెప్పి ప్రశ్నిస్తే అవమానమని ఆక్షేపింతురు ఏమి చెప్ప వలె ఇక ఏమి రాయ వలె చెప్పినది ఒకటైతే చెప్పుకునేది ఇంకొకటి ఆశలన్నీ ఇంతేనా ఆశయాలిక అడుగంటెనా?  
పూర్తిగా చదవండి

చిన్ననాటి జ్ఞాపకాలు - 1

స్వగతం lalithag
ఇప్పుడు మా పిల్లలకు చదువు నేర్పుతుంటే నేను చిన్నప్పుడు చదువు నేర్చుకున్న విధానం గుర్తుకు వస్తుంటుంది అప్పుడప్పుడు.   అక్షరాలు నేర్చుకున్నది మా అమ్మమ్మ దగ్గర. ఒక అక్షర మాల పట్టిక నాకు కొనివ్వడం బాగా గుర్తుంది నాకు. దాని మీద వేలుతో అక్షరాలు దిద్దుతూ, మధ్యలో తప్పయ్యిందని ఆ ఊహా అక్షరాన్నే చెరిపేసి మళ్ళీ దిద్దిన విషయం, అది చూసి మా మామయ్యలు నన్ను ఏడిపించడం గుర్తుకు వస్తూ ఉంటుంది. పలక మీద అక్షరాలు దిద్దటం గుర్తుంది. అంతకు [...]
పూర్తిగా చదవండి

ఆడ వాళ్ళూ, స్వేచ్ఛ

స్వగతం lalithag
ఒక గమనిక: ప్రస్తుత చర్చ మధ్య తరగతి కుటుంబాల స్త్రీల “స్వేచ్ఛ” గురించి. స్వేచ్ఛ ఒకరు ఇచ్చేదీ, పుచ్చుకునేదీ కాదు. స్వంత ఇష్టం. ప్రతి ఒక్కరికీ వారి స్వంత ఇష్టం ఉంటుంది. ఆ స్వంత ఇష్టం ప్రకారం నడుచుకో గలిగే హక్కూ, దానిని సక్రమంగా వాడుకునే బాధ్యతా ఉంటాయి. సరే, తమ ఇష్టానుసారం బాధ్యతనెరిగి చేసే పనులకు అనుమతి తీసుకోనవసరం లేని  స్వాతంత్ర్యం ఎంతమంది ఆడ వాళ్ళకు ఉంటుంది? ముందు పిల్లల స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. పిల్లల అభిప్రాయాన్ని వినిపించుకోవడం, కొన్ని విషయాలలో [...]
పూర్తిగా చదవండి

ఎందుకిలా?

స్వగతం lalithag
కన్నీరు కార్చ గలరు కబుర్లు చెప్పగలరు కలలు నిజం చెయ్యగలరు కలిమి కూర్చగలరు కల్పనకందని భావాలను కవితలలోని మర్మాలను తలదన్నే తలపులను తమలోనే కలిగుంటారు కొమ్మలు, అయ్యలారా! మీ మనసులు దోచుకుంటారు మాటలు   నేర్పిస్తారు కావ్యాలను ప్రేరేపిస్తారు చేయి పట్టి పేరు మార్చి కల నిజమయ్యాక కలల్లోనే ఉంటున్నావంటారు కవితలు అల్లుతారు కథలు రాస్తారు రచయితలు ఎక్కువగా మగవాళ్ళే ఉంటారు మగవాళ్ళూ, మగువల మనసులనేలే మహరాజులూ మాటలు దోచుకుంటారు మౌనంగా ఉంటే మర్మమేదో ఉందంటారు మెచ్చుకోలు మచ్చుకుండదు తప్పులేవీ తప్పిపోవు అండ మీరంటే అందలం ఎక్కుతారు అందుకోమంటే “అందుకే అబలలు” అంటారు చేయందిస్తామంటే చిన్నబుచ్చుకుంటారు చెప్పకుండా చేస్తుంటే చెయ్యకేం చేస్తారంటారు మగవారూ, మీరు ఎందుకిలా చేస్తారు మగువలని మీరు మనుషులని ఎప్పుడంటారు?
పూర్తిగా చదవండి

God’s job

స్వగతం lalithag
It is a strange coincidence. Please refer to Murali garu’s choice padyam at కొత్తపాళీ The following was my conversation with my elder son. My son: ”Amma, does god bless everyone?” Me: “yes”  My son: ”Amma, does god bless me?” Me: “yes”  My son: ”Amma, does god bless everything?” Me: “yes”  My son: ”Isn’t it a lot of work?” Me: “yes”  It is a night time ritual for me to [...]
పూర్తిగా చదవండి

వ్యర్థ కలహం పెంచబోకోయి!

స్వగతం lalithag
కులం, మతం, ఆస్తికత్వం, నాస్తికత్వం, ప్రాంతీయ తత్వం, ఆడ వారు, మగ వారు ఎన్ని విధాలుగానో విడిపోతున్నాం. ఎన్నో అభిప్రాయాలు వెలిబుచ్చుకుంటున్నాం. బ్లాగాస్త్రాలు ప్రయోగించుకుంటున్నాం. ఈ వివాదాలు ఒక్కోసారి కొంచెం శ్రుతి  మించుతున్నాయి అనిపిస్తోంది. నా ఆవేదనను పంచుకోవడానికి ఒక ప్రయత్నం. మానవత్వం ఉత్తమ మతం దైవ చింతన స్వంత అభిమతం కులం, గోత్రం, పేరు - పరిచయం వృత్తి, ఆదాయం, అధికారం - అసలు బలం మాటల తూటాలెందుకు వాద వివాదా లెవరి కొరకు రాజకీయాల దోబూచాటలో పావులం కావొద్దు వేదికలమీద చెప్పేసి మార్పునూహించొద్దు బుద్ధుడు, క్రీస్తు, ప్రవక్త చెప్పారు [...]
పూర్తిగా చదవండి

Rural development

Uncategorized, స్వగతం lalithag
The following poem and slokam got impressed on my mind since a very ealry age.  అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పాఱు నేఱును ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ! In my father’s words, ” bank, medical service, irrigation and  education are the basic needs of every village”.  “కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సశ్యశాలినీ లోకోయం క్షోభ రహితం, బ్రాహ్మణా స్సంతు నిర్భయాః సర్వేత్రః సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు [...]
పూర్తిగా చదవండి

మనిషి ఇక్కడ, మనసు అక్కడ

స్వగతం lalithag
పై చదువుల కోసమో, లాభదాయకమైన ఉద్యోగాలకోసమో, ప్రతిభ కు తగిన ఫలం కోసమో లేక పెళ్ళి తరువాత భర్తను అనుసరించో, విదేశాలకు వచ్చి స్థిర పడ్డాము,ప్రవాసాంధ్రులమైనాము. ప్రవాసంలో ముందు రోజులు గడ్డుగా గడిచిన వాళ్ళూ ఉన్నారు, పూల బాట మీద నడిచి వచ్చిన వాళ్ళూ ఉన్నారు. ఇంకా ఇప్పుడే వస్తున్న వాళ్ళూ ఉన్నారు. రావాలని ఆశపడే వాళ్ళూ ఉన్నారు. ఏమైతేనేం, విదేశావకాశం చాలామందికి ఒక రంగుల కల. కల నిజమైనా, నిజం కల కాదు. కలలో మసకగా కనిపించిన వివరాలెన్నో నిజంలో కొట్టొచ్చినట్టు కళ్ళముందుకు వచ్చి నిలబడతాయి. ప్రవాసంలో స్థిరపడ్డాక [...]
పూర్తిగా చదవండి

శ్రీనివాసీయం - 1

స్వగతం శ్రీనివాస
ఇంతకు ముందు పనిచేసిన కంపెనీకి రోజూ వెళ్ళే ముందు పంజాగుట్ట జంక్షన్‌లో ఒక హోటల్‌లో ప్లేటు ఇడ్లీ తిని వెళ్ళడం అలవాటు. మనకి గునపాలతోనూ, పారలతోనూ (అంటే ఫోర్క్‌లూ, స్పూన్‌లన్నమాట) తినడం అలవాటు లేదు. ముందు ఏమీ పట్టించుకోకుండా తినేసేవాడిని. తర్వాత ఒక రోజు గబగబా తింటున్న నాకు పక్కనే తింటున్న ముసలతను కనిపించాడు. రెండు స్పూన్లతో ఇడ్లీని చీల్చి చెండాడుతున్నాడు. ఒకసారి చుట్టూ చూసా; ఒకడైతే దోశెని చిన్న చిన్న ముక్కలు చేసి సాంబారులో [...]
పూర్తిగా చదవండి

ఎటు వైపు ఈ పయనం?

స్వగతం lalithag
మాటలనే అడుగులతో ఆలోచన అనే నడక సాగుతోంది అచరణలో సాధ్యమేనా అనే అనుమానం వెంటాడుతోంది మాటలలో ఇమడని ఆశయాలెన్నో ఓపికగా ఎదురు చూస్తున్నాయి తమ వంతు ఎప్పుడు వస్తుందో తన్నుకు బయటికి వద్దామని ఉత్సాహం ఉరకలు వేసే యువకులెందరో ఉవ్విళ్ళూరుతున్నారు ఉచితమైన గమ్యం వైపు ఊ.. అంటే దూసుకు వెళ్దామని స్వఛ్ఛమైన సేవలతో స్వఛ్ఛంద సంస్థలు సందేశాలు ఇస్తున్నాయి సాధించి చూపుతున్నాయి దాతలెందరో ఉదారంగా డబ్బులు ఇస్తున్నారు రక్తదానాలు చేసేవారూ చాలా మంది ఉన్నారు ప్రభుత్వమూ తక్కువ తినలేదు పథకాలకు కొదువ లేదు నిధులకూ ప్రణాళిక ఉంది ప్రతినిధులనూ నెలకొల్పింది ఆపదలో ఉన్న వారికి ఆలోచనకు సమయం లేదు ఆదుకుందామనుకున్న వారికి అవసరమైనవి తెలియట్లేదు వనరులు ఇన్ని ఉన్నాయి ఆశలు ఆకాశం అంటుతున్నాయి అయినా ఇంకా సందేహం ఎందుకో ఈ పయనం [...]
పూర్తిగా చదవండి

నేనెవరు? (ఒకటి)

స్వగతం gsnaveen
గతాన్ని పట్టుకొని వేలాడే గబ్బిలాన్ని నేను
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS