Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వాకపల్లి టు లుంబిని

Andhra Jyothi, Telugu ఎన్.వేణుగోపాల్
ఇటీవల రాష్ట్రంలో జరిగిన రెండు దారుణాలు వేరువేరుగా కనిపించినప్పటికీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ఒక టి విశాఖపట్నంజిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంలో పదకొండుమంది ఆదివాసి మహిళలపై గ్రేహౌండ్స్‌ పోలీసులు చేసిన అత్యాచారాల ఘటన. మరొకటి హైదరాబా దులో లుంబినీ పార్క్‌లోను, గోకుల్‌ చాట్‌ భండార్‌లోను పేలుళ్ళు జరిపి అమానుషంగా నలభైరెండు మంది ప్రాణాలు తీసిన దుర్ఘటన. ఇవి రెండూ భిన్నస్థాయిలవి కావచ్చు. భిన్న నేపధ్యాల నుంచి జరిగి ఉండవచ్చు. భిన్నమైన స్పందనలను కలిగిస్తుండవచ్చు. కాని మౌలికంగా [...]
పూర్తిగా చదవండి

ముదిగొండ మారణకాండ ప్రశ్నలు

Andhra Jyothi, Telugu, Vartamaanam telugublogger
ఈ దేశంలో పేదప్రజల ప్రాణాలు కారుచౌక అయిపోయాయి. ఎక్కడ పోలీసు తుపాకి గర్జించినా పోయేవి అమాయక, నిస్సహాయ పేదప్రజల ప్రాణాలే. ఎక్కడ పాలక దుర్మార్గపు కాల్పులు జరిగినా వినబడే సమర్థన ఒకటే. ఎక్కడ రాజ్య దౌర్జన్యానికి అమాయకులు అసువులు బాసినా కనబడేవి నిజాయితీ లేని రాజకీయ నాయకుల పలకరింపులే, పరామర్శలే, గ్లిసరిన్ కన్నీళ్లే.
పూర్తిగా చదవండి

అనుమానం తయారీ

Andhra Jyothi, Telugu, Vartamaanam ఎన్.వేణుగోపాల్
హిందూ పూజాస్థలం సాయిబాబా గుడిమీద దాడి జరిగినా, ముస్లిం ప్రార్థనాస్థలం మక్కామసీదుమీద దాడి జరిగినా, లౌకిక రాజ్యపు ప్రజాప్రతినిధుల సభాస్థలంమీద దాడి జరిగినా అనుమానం ఒకవైపే ఎక్కుపెట్టబడుతుంది. కనీసం ఒకరి మీద జరిగిన దాడికి వారి ప్రత్యర్థులమీదికి అనుమానం పోవాలనే సహజసూత్రం కూడా మారిపోతున్న సందర్భం ఇది. సహజసూత్రం మారిపోవడం కాదేమో, బలవంతాన మన అనుమానాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతున్నదేమో. అనుమానబీజాలు నాటడం జరుగుతున్నదేమో. తీవ్రంగా, నిశితంగా పరిశోధించి అనుమానితుల పేర్లు ప్రకటించవలసిన సంస్థలు అటువంటి పరిశోధన [...]
పూర్తిగా చదవండి

ఈ ఇంద్రధనుస్సు రంగేమిటి?

Andhra Jyothi, Telugu, Vartamaanam nvenugopal
దేశమంతా ఉత్కంఠతో నిరీక్షించిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాజకీయ పండితుల, పరిణామాల జ్యోతిష్యుల అంచనాలను తలకిందులు చేస్తూ మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌పార్టీ సొంతంగా ప్రభుత్వం స్థాపించగల జనాదేశాన్ని పొందింది. మాయవతి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించారు. గతంలో మూడుసార్లు మిశ్రమ, ఐక్యసంఘటన ప్రభుత్వాల్లో వరుసగా నాలుగు నెలలు, ఆరునెలలు, పదిహేను నెల లు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన మాయావతి ఈసారి సం పూర్ణ బహుమతి వల్ల పూర్తికాలం కొనసాగవచ్చు. తొలి దళితమహిళా ముఖ్యమంత్రిగా 1995లో [...]
పూర్తిగా చదవండి

మన గీతాజోహ్రీ ఎక్కడ?

Andhra Jyothi, Telugu, Vartamaanam nvenugopal
యునాని చికిత్స కోసం భార్య కౌసర్‌ బీని హైదరాబాద్‌నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తీసుకువెళుతున్న ఒక సాధారణ ముస్లిం యువకుడు సొహ్రాబుద్దీన్‌ షేక్‌ను 2005 నవంబర్‌ 22 రాత్రి మార్గమధ్యంలో ఆగంతకులు అడ్డుకున్నారు. వారివెంట ఉన్న సొహ్రాబుద్దీన్‌ స్నేహితుడు తులసీరాం ప్రజాపతిని కూడా పట్టుకుపోయారు. ఆ ఆగంతకులు తాము పోలీసులమని చెప్పినమాట మినహా వారు నిజంగా ఎవరో, ఆ ముగ్గురినీ ఎక్కడికి పట్టుకుపోయారో అప్పటికి ఎవరికీ తెలియదు. కాని మూడు రోజుల తర్వాత సొహ్రాబుద్దీన్‌ అహ్మదాబాద్‌ శివార్లలో ఎన్‌కౌంటర్‌లో [...]
పూర్తిగా చదవండి

ఏమవుతున్నదీ జాతికి?

Andhra Jyothi, Telugu, Vartamaanam nvenugopal
..అటువంటి పని ఒక్కసారి కూడా చేయడం అలవాటు లేని పోలీసులు, ఎంతో కాలంగా తాము కక్షపెట్టుకుని ఉన్న ఒకవ్యక్తి పెళ్ళి ఖర్చులకోసం ఇంట్లోడబ్బు ఉన్నదని తెలుసుకుని దాడిచేసి, ఆ డబ్బుకు రంగు అంటగట్టడం, దాని ఆధారంగా నేరారోపణ చేయడం కక్ష సాధింపే అవుతుంది తప్ప చట్టబద్ధపాలన కాదు. ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఒకపక్కన అమాయకులైన సాధారణ ప్రజానీకంమీదా, భిన్నమైన రాజకీయ, తాత్విక అభిప్రాయాలున్న వాళ్ళమీదా నేరారోపణలూ బెదిరింపులూ విచారణలూ శిక్షలూ కక్షలూ నిరాటంకంగా సాగిపోతున్నాయి.మరోపక్కన నిజమైన నేరస్తులు [...]
పూర్తిగా చదవండి

మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు

Andhra Jyothi, Telugu, Vartamaanam nvenugopal
దేశంలోని అసంఖ్యాక జనబాహుళ్యంపట్ల వర్ణాశ్రమధర్మ దుర్మార్గాన్ని సైద్ధాంతీకరించిన మనుస్మృతికీ, సమసమాజ భావనను, సామాజిక న్యాయాన్ని ప్రతిపాదించిన రాజ్యాంగం కింద నడవవలసిన సుప్రీంకోర్టుకూ ఏమీ తేడా లేదని గత శుక్రవారం నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రకటిస్తున్నాయి. శూద్రులకు విద్యను నిషేధించిన రెండువేల ఏళ్లకింది మనుస్మృతినే మరొక మాటల్లో అనుసరించిన ఆధునిక, సర్వసత్తాక, ప్రజాస్వామిక, లౌకిక రాజ్యపు సుప్రీంకోర్టు ఈ దేశంలో ఉన్నత విద్యావకాశాలమీద గుత్తాధిపత్యం అగ్రవర్ణాలదేనని మరొకసారి చెప్పింది. జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌, [...]
పూర్తిగా చదవండి

నెత్తురు చిందిన నందిగ్రామ్‌

Andhra Jyothi, Telugu, Vartamaanam nvenugopal
దేశంలోకెల్లా నిజమైన ఏకైక వామపక్షమని తనకుతాను కితాబులిచ్చుకుంటున్న పార్టీ నాయకులు ఏమన్నారో సరిగ్గా అవే మాటలను ఆ రాష్ట్రపు పోలీసు ఉన్నతాధికారులు కూడా అంటున్నారంటే అది ఆ పోలీసధికారులు వామపక్ష భావజాలం నేర్చుకున్నందుకు గుర్తా? పశ్చిమబెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌ జిల్లా నందిగ్రామ్‌లో తమ భూమిని మరొకరు ఆక్రమించకూడదన్నందుకు, ఆ ఆకాంక్షను సమరశీలంగా ప్రకటించినందుకు రైతుకూలీల నెత్తురు చిందింది. హల్దీనదికి దక్షిణభాగం నుంచి ఒక కొన్నెత్తుటి నది ఉప నదిగా చేరింది. ప్రభుత్వం చెబుతున్నట్టు పదకొండు మందా, పద్నాలుగుమందా, [...]
పూర్తిగా చదవండి

ప్రపంచ బ్యాంకుకు అతివిశ్వాస ప్రకటన

Andhra Jyothi, Telugu, Vartamaanam nvenugopal
ప్రపంచబ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి అందనున్న ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థా సంస్కరణల రుణం మూడవ విడత గురించి ఒక్కొక్క వివరమూ క్రమక్రమంగా బయటపడుతున్నాయి. తనకు ముందరి ఏలికను “ప్రపంచబ్యాంకు జీతగాడి”గా అభివర్ణించి, గంభీరోపన్యాసాలుచేసి అధికారపీఠం అధిరోహించినవారు మరెంత పెద్ద డిటో గా మారుతున్నారో ఆ వివరాలు రుజువుచేస్తున్నాయి. 1996 సెప్టెంబర్ లో రహస్య పత్రంగా తయారయి, 1997 జనవరిలో బహిరంగంగా వెలువడిన ‘ఆంధ్రప్రదేశ్ – ఎజెండా ఫర్ ఎకనమిక్ రిఫార్మ్స్’ అనే పత్రంద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం [...]
పూర్తిగా చదవండి

ఎన్ కౌంటర్ వీరులపై హత్యానేరం

Andhra Jyothi, Telugu, Vartamaanam nvenugopal
పాపం ఎప్పటికయినా పండుతుందంటారు. ఎట్టకేలకు కాశ్మీర్ లో అబ్దుల్ రహమాన్ పద్దర్ ను చంపేసి, దానికి ఎన్ కౌంటర్ అని పేరు పెట్టిన వీరులమీద హత్యకేసు నమోదయింది. ఈ దేశంలో ప్రభుత్వ సాయుధబలగాలు పథకం ప్రకారం, ఉద్దేశ్యపూర్వక పాలనా విధానంగా ఎన్ కౌంటర్ల పేరిట రాజకీయ ప్రత్యర్థులమీద, ప్రజలమీద జరుపుతున్న హత్యలను మిగిలిన సాధారణమైన హత్యలలాగనే పరిగణించి న్యాయస్థానాలలో విచారణ జరపాలని ఎన్నోసంవత్సరాలుగా వినిపిస్తున్న డిమాండ్ కు చిట్టచివరికి జవాబు దొరికింది. ఎన్నోసార్లు సుప్రీంకోర్టు, జాతీయ మానవహక్కులసంఘం, [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS