Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నెహ్రూ గారి మాటలు

eenadu_jokes CH Gowri Kumar
రాష్ట్రపతి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు. "నేను డాక్టర్‍ని అయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తా" అన్నడు రమణ. "నేను ఇంజినీరునై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా" చెప్పాడు గోవింద్ "నేను మంచి తల్లినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమైన తల్లి వల్లనే పిల్లలు మంచి పౌరులుగ రూపొంది దేశం
పూర్తిగా చదవండి

లింగం మావా - మజాకా?

eenadu_jokes CH Gowri Kumar
మొదటిసారి keyboard చూసి లింగం మావ ఏమనుకున్నాడు? తారుమారుగా ఉన్న అక్షరాలను సరిచేయాలనుకున్నాడు. Bus pass ఉన్నా లింగం మావ ticket ఎందుకు కొన్నాడు? Conductorని April Fool చేద్దామని. లింగం మావ తల ఎందుకు బొప్పి కట్టింది? గోడ మీద వాలిన్న దోమలను రాయితో కొడుతుంటే, అతడి స్నేహితుడు బుర్ర ఉపయోగించమని సలహా ఇచ్చాడు. స్నేహితుడు అప్పు చెల్లించకపోయినా లింగం మావ ఎందుకు సంతోషంగా ఉన్నాడు? కొత్త అప్పు అడగనని మాట
పూర్తిగా చదవండి

ఇద్దరూ దొంగలే

eenadu_jokes CH Gowri Kumar
ఇద్దరు స్నెహితులు పందెం పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్నారు. ఆట చివరికొచ్చాక బంతి కనిపించకుండా పోయింది. కాసేపు వెతికాక- "బాల్ లేదు కాబట్టి ఆట క్యాన్సిల్" ఓడిపోయేట్టున్న రాము. "ఇదిగో దొరికింది" తన జేబులో బంతిని పడేసి అరిచాడు సోము. "బోడి యాభై రూపాయల కోసం నన్ను మోసం చేస్తావా?" "నిజంరా నాకు దొరికింది" "ఎలా దొరుకుతుంది? నేను దానిమీద నిల్చుంటే?"
పూర్తిగా చదవండి

లింగం మావ - మూత్ర పరీక్ష

eenadu_jokes CH Gowri Kumar
కాస్తంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గిరికెళ్లాడు లింగం మావ. డాక్టర్ మూత్ర పరీక్ష చేయించుకురమ్మని రాస్తే ల్యాబ్‍కు వెళ్లాడు. తన వంతు కోసం వేచి చూస్తూంటే పక్కనే ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు "ఎందుకేడుస్తున్నావు " పలకరించాడు లింగం మావ. "Doctor నన్ను రక్త పరీక్ష చేయించుకు రమ్మన్నారు" "అయితే" "రక్తం కోసం సూదితో వేలి చివర పొడిచారు. నొప్పిగా ఉన్నది" అంతే.... ల్యాబ్ నుంచి ఒక్క పరుగున బయటికెళ్ళి పోయాడు లింగం
పూర్తిగా చదవండి

లింగం మావ - సినిమా ticket

eenadu_jokes CH Gowri Kumar
లింగం మావ సినిమాకెళ్లాడు. Tickets కోసం క్యూలో నిల్చున్నాడు. అతని ముందున్న వ్యక్తి టెకెట్లు తీసుకుంటున్నాడు. "Golden circle tickets అయిపోయాయి. Diamond circle మాత్రమే ఉన్నాయి" చెప్పాడు సినిమా హాల్ వ్యక్తి "సరే.. diamond circle ఇవ్వండి" ఆ తర్వాతి వ్యక్తితో.... "మిగతా tickets అన్నీ అయిపోయాయి. Only balcony" "సరే balconyయే ఇవ్వండి" ఇప్పుడు లింగం మావ వంతు. "house full" చెప్పాడు హాల్ వ్యక్తి. "సరే...
పూర్తిగా చదవండి

ఏదో ఒకటి

eenadu_jokes CH Gowri Kumar
ఏడేళ్ళ వాసవి సీరియస్‍గా బొమ్మ గీస్తోంది "ఏం చేస్తున్నావురా?" అడిగాడు నాన్న. "నీ బొమ్మ వేస్తున్నాను నాన్న" "అబ్బ గుడ్" కాసేపటికి... "బొమ్మ బాగా రావట్లేదు నాన్న" చెప్పింది వాసవి. "సరేలే. వదిలేయ్" "పోనీ తోక పెట్టేసి, కోతి అని కింద రాసేయనా?"
పూర్తిగా చదవండి

ఫలితం

eenadu_jokes CH Gowri Kumar
భార్యను ఆశ్చర్యపరుద్దామని ఆమె పుట్టింటికి వెళ్ళి వచ్చేలోగా ఓ చీరకు ఫాలు కుట్టాడు సంతోష్. భార్య ఎంతో సంతషించింది. గాఢంగా ముద్దు పెట్టింది. "ఇవి కూడా కాస్త కుట్టి పెడతారా? మీకు టైమున్నప్పుడే" మరో రెండు చీరలు భర్తకిస్తూ అందామె.
పూర్తిగా చదవండి

ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది

eenadu_jokes CH Gowri Kumar
ఓ ప్రాంతంలో దొంగలు ఎక్కువగా పడుతున్నారని వార్తలొచ్చాయి. గస్తీ కోసం night watchmanను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి watchmanku ఉండాల్సిన అర్హత లేమిటి? పని గంటలెన్ని? ఇత్యాది విధి విధానాలు ఖరారు చేసేందుకు ఒక commiteeని వేశారు ఇక watchman తన duty సరిగ్గా నిర్వహిస్తున్నాడని ఎలా తెలియాలి? అందుకని ఒక superviserని వేశారు. మరి వీళ్ళిద్దరికీ వేతనాలు ఇవ్వాలి కదా? ఓ accountant మరియు time
పూర్తిగా చదవండి

పిట్ట సాయం

eenadu_jokes CH Gowri Kumar
రాము సరదాగా చేపలు పట్టడానికి వెళ్లాడు. తీరా నది ఒడ్డికెళ్లాక చూసుకుంటే గలానికి అవసరమైన ఎరలు తీసుకురావడం మరిచిపోయినట్టు అర్థమైంది. దూరంగా ఓ చిన్న పిట్ట ఎరను తింటుండం చూశాడు. ఒడుపుగా దాన్ని పట్టేసి ముక్కున ఉన్న ఎరను లాక్కున్నాడు. కాస్తంత ఆలోచిస్తే దాని నోటి దగ్గర కూడు తాను బలవంతంగా తీసేసికొన్నట్లు అనిపించింది. తన దగ్గరున్న విస్కీని కాస్తంత దానికి పట్టించాడు. దాంతో తన గిల్టీ ఫీలింగ్ తొలగిపోగా
పూర్తిగా చదవండి

సినిమా టైటిళ్ళు

eenadu_jokes CH Gowri Kumar
వెంకట్రావ్ సాఫ్ట్ వేర్ నిపుణుదు. ఆయన రిజిష్టర్ చేయించిన సినిమా టాటిల్స్ ఇవీ.. శంకరదాదా M.C.Aచాట్టింగ్ చేద్దాం రాప్రోగామర్ నెం. 1వైరస్ స్టోరీఎవడి సిస్టమ్ వాడిదేసంపూర్ణ "జావా"యణంహ్యాకర్లకు మునగాడుసాఫ్ట్ వేర్ చిన్నోడుహ్యాకిరి80 జీబీ.... డాట్‍కాం కాలనీఆపరేషన బిల్ గేట్స్సీ ప్రోగ్రాం రహస్యాలుమెమరీలో ఆమె జ్ఞాపకాలుపాస్‍వార్డ్ లేని చిన్నది
పూర్తిగా చదవండి

Dustbin

eenadu_jokes CH Gowri Kumar
నలుగు ఆడపిల్లలున్న కుటుంబరావు పండక్కి ఇంటికి సున్నం వేయించాలనుకున్నాడు. సామాను బయటకు పెడుతుంటే సోఫా కుషన కింద ఈ వస్తువులు కనబడ్డాయి. మూడు చిన్న దువ్వెనలు ముప్పై నాలుగు గుండు పిన్నులు ఐదు సూదులు రెండి చీర పిన్నులు ఇరవై మూడు హెయిర్ పిన్నులు అప్పడాల ముక్కలు నాలుగు తలనొప్పి మాత్రలు ఇరవై టూత్‍పిక్స్ పదమూడు హుక్కులు తొమ్మిది గుండీలు బొట్టు బిళ్ళల ప్యాకెట్ (సగం వాడింది)
పూర్తిగా చదవండి

లింగం మావ ప్రమాణం

eenadu_jokes CH Gowri Kumar
ఓ కేసుకు సంబంధించి లింగం మావ కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది. ఆయనతో గుమాస్తా ప్రమాణం చేయిస్తున్నాడు. "దేవుడి మీద ప్రమాణం చేసి..." చెప్పాడు గుమాస్తా "దేవుడి మీద ప్రమాణం చేసి..." చెప్పాడు లింగం మావ "అంతా నిజమే చెబుతాను" "అంతా నిజమే చెబుతాను" "నేను చెప్పినట్టే అను" "నేను చెప్పినట్టే అను" "అది కాదు.. నేను చెప్పినట్టు చెప్పు" "ఏం చెప్పారు మీరు" "అంతా నిజమే చెబుతాను" "నిజమే
పూర్తిగా చదవండి

వెర్రి నాయన

eenadu_jokes CH Gowri Kumar
"అమ్మానాన్న ఆటాదుకుందామా?" పిలిచింది బుజ్జి. "అంటే ఏమి చెయ్యాలి?" అడిగాడు చంటి. "నేను సైగ చేస్తాను, నా మనసులో ఏముందో నువ్వు చెప్పాలి" "నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది?" "భలే, నాన్నా పాత్రకు నువ్వు సరిగ్గా సరిపోతావు".
పూర్తిగా చదవండి

నీకే సమస్యా?

eenadu_jokes CH Gowri Kumar
డాక్టర్ దగ్గరికి ఓ తాగుబోతు వెళ్ళాడు. "డాక్టర్... నాకు నెల్రోజుల నుంచీ నలతగా ఉంటోంది" "అలాగా?.. కానీ అనారోగ్య లక్షణాలేమీ కనిపించడంలేదే, బహుశా ఎక్కువగా తాగడం వల్ల కావొచ్చు" "అయితే మీరు కూడా తాగే ఉన్నారా? మత్తు దిగాక వస్తాలే".
పూర్తిగా చదవండి

డాక్టర్ చతురుడు

eenadu_jokes CH Gowri Kumar
చెకప్ కోసం పిల్లలను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు దంపతులు. భర్త ఒడిలో పిల్లాడున్నాడు, భార్య ఒడిలో పాప్. "బాబుది మీ పోలికే" నాడి చూస్తూ అన్నాడు డాక్టర్. నవ్వి ఊరుకున్నడు భర్త. "మీ పాప చాలా ముద్దుగా ఉంది" చెప్పాడు డాక్టర్. నవ్వి ఊరుకుంది భార్య. "వచ్చిన ప్రతివాళ్ళ్తో ఇలా ముద్దుగా ఉన్నారనే చెబుతారనుకుంటా" అన్నాడు భర్త. "లేదు. నిజంగా నాకు నచ్చిఏనే చెబుతాను" "నచ్చకపోతే?" "మీ పోలికే అంటాను"
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS