Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పాతది

jandhyala_jokes CH Gowri Kumar
"అయ్యయ్యో ఇప్పుడు మీరు పగలకొట్టిన గ్లాసు ఐదు వేల సంవత్సరాల నాటిది" ఘొల్లుమన్నాడు మ్యూజియం ఉద్యోగి పాపారావుతో. "హమ్మయ్య... బ్రతికించారు ఇంకా కొత్తదేమోనని భయపది చచ్చాను" నిట్టూరుస్తూ అన్నాడు పాపారావు.
పూర్తిగా చదవండి

ఉచితం

jandhyala_jokes CH Gowri Kumar
"డాక్టర్ గారూ... నెను చాలా పేద వాడినండీ.... మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. ఎట్టాగైనా నాకు వైద్యం చేయండి బాబూ... కానీ జీవితాంతం నేను పైసా పుచ్చుకోకుండా మీ కుటుంబం అంతటికీ పని చేసి పెడతాను" వినయంగా అన్నాడా వ్యక్తి. "సరే... ఇంతకూ నువ్వేం పని చేస్తుంటావు?" అడిగాడు డాక్టర్. "కాటికాపరినండీ... శవాలు తగలబెడుతుంటాను" అన్నాడతను.
పూర్తిగా చదవండి

ప్రేమ

jandhyala_jokes CH Gowri Kumar
"నాకు పదిమంది పిల్లలు పుట్టిన తరువాత తెలిసింది మాఆయనకు నా మీద ప్రేమ అనేది బొత్తిగా లేదని" అంది కమల "ఇంకా నయం ప్రేమ ఉంటే ఇంకా ఎంత సంతానభాగ్యం కలిగేదో" అంది రాగిణి.
పూర్తిగా చదవండి

చండశాసనుడు

jandhyala_jokes CH Gowri Kumar
"నేను చండశాసనుణ్ణి, ఏ చిన్న పొరబాటునూ సహించలేను. నిన్న నా భార్య కాఫీలో పంచదార తక్కువేసింది. వెంటనే దవడలు వాయించాను" అన్నాడు చిదంబరం. "నువ్వు చాలా అదృష్టవంతుడివి గురూ. నీకు చాలా మంచి కలలు వస్తుంటాయి" తలమీద బొప్పిని తడుముకుంటూ అన్నాడు సారధి.
పూర్తిగా చదవండి

గుడిలో

jandhyala_jokes CH Gowri Kumar
"నువ్వు ప్రతి అమ్మాయినీ ఏ పార్కుకో, బీచికో తీసుకెళ్ళకుండా గుడిలోకి తీసుకెళ్ళి 'I Love You' అని చెబుతావెందుకు?" సందేహంగా అడిగాడు శేఖర్. "గుడిలో అయితే చెప్పులేసుకోవడానికి వీలుకాదు కదా" చెప్పాడు రాజు
పూర్తిగా చదవండి

సెలవు

jandhyala_jokes CH Gowri Kumar
"ఈరోజు స్కూలుకు సైకిల్ మీద వస్తుంటే లారీ గుద్దిందిరా. చచ్చేవాడిని. క్షణంలో ప్రాణగండం తప్పింది" పిల్లలతో చెప్పాడు టీచర్. "అయ్యయ్యో... ఎంత పని జరిగింది సార్.... మాకు సెలవు యోగం క్షణంలో తప్పింది" విచారంగా అన్నారు పిల్లలు
పూర్తిగా చదవండి

నిద్ర

jandhyala_jokes CH Gowri Kumar
"ఏమిటయ్యా సాయీ, ఆఫీసుకు ఇంత లేటుగా వచ్చావు?" కోపంగా అడిగాడు ఆఫీసర్. "నిద్ర లేవటం ఆలస్యమైంది సార్" చేతులు నలుపుకుంటూ అన్నాడు సాయి. "వాట్! ఇంటి దగ్గర కూడా నిద్రపోతున్నావా?" ఆశ్చర్యంగా అన్నాడు ఆఫీసర్.
పూర్తిగా చదవండి

వేలం

jandhyala_jokes CH Gowri Kumar
బస్సు వెళ్తోంది. హఠాత్తుగా కనకరావు కేకపెట్టాడు. "బాబూ.. నా పర్సు పోయింది. దాన్లో పదివేల రూపాయలున్నాయి. నా పర్సు నాకిస్తే వారికి వంద రూపాయలిస్తాను" ఏడుస్తూ అన్నాడు. "నాకిస్తే ఐదొందలిస్తాను" మరో వ్యక్తి అరిచాడు. "నాకిస్తే వెయ్యి" "నాకిస్తే రెండు వేలు..." "నాకిస్తే నాలుగు వేలు..." "అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగా" అన్నాడొక ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ.
పూర్తిగా చదవండి

అందం

jandhyala_jokes CH Gowri Kumar
"ఏంటీ వెధవ పని, అడుక్కునే వాడికెవరైనా రూపాయో, రెండో వేస్తారు. నువ్వు పది రూపాయలు వేశావేంటి?" కోపంగా అన్నడు భర్త. "నువ్వు అచ్చం రంభలా ఉన్నావు అన్నాడు వాడు. పాతికేళ్ళనుంచి కాపురం చేస్తున్నా ఎనాడైనా ఈ విషయం కనిపెట్టారా మీరు? ఒక్కసారి చూడగానే గ్రహించాడువాడు" అన్నిది కామేశ్వరి.
పూర్తిగా చదవండి

పోయినోళ్ళు

jandhyala_jokes CH Gowri Kumar
"మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ... ఒక్కో నెహ్రూ... ఒకో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి" ఆవేశంగా పాఠం చెబుతున్నాడు మాస్టారు. "అంటే మేమందరం చావాలనా మీ ఉద్దేశ్యం?" లేచి కోపంగా అడిగాడో విద్యార్ధి.
పూర్తిగా చదవండి

మానసిక వేదన

jandhyala_jokes CH Gowri Kumar
"మానసిక వేదన తగ్గడానికేమైనా tablets ఉన్నాయా uncle" shop అతడిని అడిగాడో కుర్రాడు. "ఇవిగో బాబూ.. ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికలో మయమౌతుంది" బిళ్ళలిస్తూ అన్నాడు షాపతను. "Thanks uncle" వెళ్తూ అన్నాడు కుర్రాడు. "ఇంతకూ ఎవరికో చెప్పలేదు?" అన్నాడు షాపతను. "మా నాన్నకే. ఇవాళ నా progress report చూపించాలి, వస్తా" వెళ్ళాడు కుర్రాడు.
పూర్తిగా చదవండి

“పెద్ద” Family

jandhyala_jokes CH Gowri Kumar
"మాది చాలా పెద్ద Family అంటే నమ్మి పెళ్ళిచేసుకున్న తరువాత తెలిసింది మోసపోయామని" విచారంగా అన్నాడు ముత్యాలరావు. "ఏమైంది వాళ్ళు పేదవారా?" అడిగాడు మణి. "అంతేకాదు, ఆమెకు ఆరుగురు అన్నలు, ఏడుగురు చెల్లెళ్ళు, అమ్మమ్మ తాతయ్య, బామ్మ అట అందరూ ఒకే Familyలో ఉంటారట" భోరుమన్న ముత్యాలరావు.
పూర్తిగా చదవండి

ఏడుపు

jandhyala_jokes CH Gowri Kumar
"ఏమండీ.... నేను చచ్చిపోతే ఏడుస్తారా?" గారంగా అడిగింది భార్య. "హు... ఇప్పుడు నవ్వుతున్నాను గనుకనా సరోజా..." అన్నాడు భర్త.
పూర్తిగా చదవండి

అలవాట్లో పొరపాటు

jandhyala_jokes CH Gowri Kumar
"ఏవండీ... మీ హోటల్లో మంచి గదులు ఉన్నాయా?" "ఉన్నాయండీ" "మంచి టిఫిన్, కాఫీ..." "supply చేస్తాం సార్" "భోజనం అదీ...." "supply చేస్తాం సార్" "కావాలంటే మందూ..." "supply చేస్తాం సార్" "వెరీ గుడ్... అయితే ఒక రూమివ్వండి." రూమ్‍లో దోమలున్నాయా? "లేవు సార్.... supply చేస్తాం సార్"
పూర్తిగా చదవండి

తొక్క

jandhyala_jokes CH Gowri Kumar
"ఎంతోయ్ ఒక్కో అరటిపండు?" అడిగాడు శివకోటి పండ్లు అమ్మేకుర్రాడిని. "ఒక్కోటి రూపాయి సార్" చెప్పాడతను. "ముప్పావలాకిస్తావా?" "ముప్పావలాకు తొక్కవస్తుంది." "సరే.... అయితే ఈ పావలా తీసుకుని తొక్క నువ్వుంచుకుని పండు నాకివ్వు" అన్నాడు శివకోటి.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS