Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నిషిధ్దాక్షరి

kavitvam, కవిత్వం kalpanarentala
మాట ఎప్పుడూ అంతే చెప్పిన మాట వినదు మాట కత్తిరిస్తుంది బంధాల్ని, బంధనాల్ని మాట కలుపుతుంది మనుష్యుల్ని, మనసుల్ని మరణానికి ముందో, వెనుకో ఓ మాట మాట్లాడవూ? ఫ్రేమకు ముందో, మోసం తర్వాతో ఓ మాట మాట్లాడవూ? వర్ణక్షరాలతో కాదు వొంటి మీద గాయాలతో నెత్తురోడుతున్న మనసుతో మాట్లాడవా రక్తస్రావం గురించో మనస్తాపం గురించొ మాట్లాడవా? *** దాక్కుంటున్నవా? దాచుకుంటున్నవా? ఏదో ఒకటి చెప్పు ఎగతాళైన తాళి గురించో ఓడిపోయిన అమ్మతనం గురించో మూసిన బాధల గుప్పెట్లొంచి రంగురంగుల సీతకోకచిలుకల్ని ఇక ఎగరేయి
పూర్తిగా చదవండి

రాలిపడ్డ జ్ఞాపకాలు

kavitvam, కవిత్వం kalpanarentala
  స్నానం దేహం మీంచి జారిపోయే నీటి బిందువులు జ్ఞాపకం ఘనీభవించి దేహమైంది నువ్ చేసిన గాయస్రావం రాత్రి నీకోసం విచ్చుకున్న పెదవి పొగడపూల పరిమళంతో నా నడుంగీత మీంచి నువ్వలా నడిచివస్తుంటావా ఒక్క క్షణం చూద్దును  కదా అరవిరిసిన నవ్వై నా వొళ్ళో వుంతావు ప్రాణమా ఎదురుగ వుంది దేహమా ఇక్కడే వుంది మరి కలయిక…. నిలువెత్తు పూలచెట్టులా నేను రాత్రి కౌగిలిలో నలిగి రాలిపడ్డ జ్ఞాపకాల పూలు
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS