Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నేను చదివిన మంచి పుస్తకం-4

pustaka paricayamu కస్తూరి మురళీకృష్ణ
కాళీ పట్ణం రామారావు గారి పేరు వినని తెలుగు పాఠకులు వుండరు.ముఖ్యంగా,కథ పయిన ఏమాత్రం ఆసక్తి వున్నవారయినా ఆయన గురించి,కథానిలయం పేరిట ఆయన కథకు చేస్తున్న సేవ గురించి వినే వుంటారు.ఇటీవలె కథా నిలయం వెళ్ళినప్పుడు ఆయన నాకు బహుమతిగ ఇచ్చిన పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను.ఈ పరిచయం రెండు భాగాలలో చేస్తాను.మొదటి భాగంలో పుస్తక పరిచయం వుంటుంది.రెండవ భాగంలో కథల విశ్లేశణ,నిర్మొహమాటమయిన విశ్లేషణ వుంటుంది. ఇంతకీ కాళీ పట్నం గారు నాకు బహుమతిగా ఇచ్చిన పుస్తకం పేరు [...]
పూర్తిగా చదవండి

నేను చదివిన మంచిపుస్తకం-3

pustaka paricayamu కస్తూరి మురళీకృష్ణ
సాహిత్య ప్రక్రియలలో అతి కఠినమయినది,ఎంత బాగా చేసినా అందరి ఆమోదమూ పొందలేనిది అయిన ప్రక్రియ అనువాదం.కానీ,అనువాదం అత్యవసరమయిన ప్రక్రియ.ఒక భాశలోని రచనలు మరొక భాశవారికి తెలియాలంటే అనువాదం తప్ప వేరే గత్యంతరం లేదు.లేదా,ఆ భాషను నేర్చుకోవటం తప్ప మరో మార్గం లేదు.కాబట్టి అనువాదాల ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మూలం సూర్యుడయితే,అనువాదం చంద్రుడి వంటిది.మూలంలోని వాడి,వేడి లేకున్నా,ఆ కిరణాల లోని వెలుతురు ప్రసరింప చేయగలగాలి అనువాదాలు.వేడి కిరణాలను ప్రతిఫలిస్తూ,వాటిని చల్లగా అందరికీ అందించాలి.మూల భాషలోని నుడికారాలు,చమత్కారాలు,పలుకుబడులు పరాయి [...]
పూర్తిగా చదవండి

నేను చదివిన మంచి పుస్తకం-2

pustaka paricayamu కస్తూరి మురళీకృష్ణ
క్రితం సారి నేను పరిచయం చేసిన పుస్తకం వివరాలు అమ్మకు అభినందన, రచయిత్రి-ఎం.హేమలత ప్రతులకు-202,గాయత్రి అపర్ట్మెంట్స్. ర్ద్.నొ 1,బంజారా హిల్స్.హైదెరాబద్-34. వెల-రూ.120/- ఈ సారి నేను రెండు పుస్తకాలను ఒకే సారి పరిచయం చేస్తున్నాను.ఎందుకంటే,ఈ రెండు పుస్తకాలలో ఒక సారూప్యత వుంది. సాధారణంగా,మాండలీకంలో రచనలు అనగానే కొంతమందిలో చిన్న చూపు వుంది.సరిగా అర్ధం కావని,చదవటానికి కష్టంగా వుంటాయని ఇలా కొన్ని అపోహలు వున్నాయి.చాలా మటుకు వారి అపోహలలు నిజం కూడా.ఈ అభిప్రాయాన్ని తప్పని,నామిని సుబ్రహ్మణ్యం తన కథల ద్వారా నిరూపించాడు.అయితే,ఆ కథలు కూడా,ఒక స్థాయిలో వున్న వారి [...]
పూర్తిగా చదవండి

నేను చదివిన మంచి పుస్తకం-1

pustaka paricayamu, పుస్తక పరిచయము కస్తూరి మురళీకృష్ణ
మన తెలుగు సాహిత్య ప్రపంచములో విమర్శ అన్నది అంతగా విశాలం కాలేదు.దీనికి అనేక కారణాలు వున్నాయి.వుద్యమ సాహిత్యానికిచ్చిన ప్రాధాన్యం మానవతా విలువలున్న సాహిత్యానికి ఇవ్వటంలేదు.పేరున్న రచయితలకు ఇచ్చిన ప్రాధన్యం కొత్త రచయితలకు ఇవ్వటం లేదు.తెలిసినవారు,ఎవరినయినా పొగిడితే లాభం వుండేవారు,తాము నమ్మిన ఇజాన్నే నమ్మేవారు ఇటువంటి వారి రచనలను ఆకాశానికి అర్హత లేకున్న ఎత్తేయటం జరుగుతొంది.ఇవన్నే లేకపోతే మంచి రచన చేసినా అవి మరుగున పడిపోతున్నాయి.ఎందుకంతే విమర్శకులు వాటిని పాథకుల ద్రిష్టికి తేవటం లేదు.వారికి తమ లాభం తప్ప [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS