Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చిరంజీవులు

Religion/telugu Carani Narayana Rao
'షేక్‌స్పియర్‌ నాటకాలు- అన్నీ షేక్‌స్పియరే రాసి ఉండకపోవచ్చు' అని ఒకాయన తెగ వాదిస్తున్నాడు. విని విని శ్రోతకు విసుగొచ్చింది. 'ఇదిలా తేలదు, నేను చచ్చి స్వర్గానికి వెళ్ళాక ఆయననే అడిగి కనుక్కోవాలి' అని లేచి పోబోయాడు. మొదటాయన వదలలేదు- 'షేక్‌స్పియర్‌ స్వర్గంలోనే ఉంటాడని నమ్మకం ఏముంది? నరకంలో ఉండొచ్చుగా' అని ఎదురు తిరిగాడు. శ్రోత తాపీగా లేచి 'అయితే పేచీ ఏముంది? మీరే స్వయంగా ఆయనతో తేల్చుకుందురుగాని'
పూర్తిగా చదవండి

మనిషి- మనసు

Religion/telugu, Self development/Telugu Carani Narayana Rao
- డాక్టర్‌ డి.చంద్రకళమనిషి ఎంత ఎత్తు ఎదిగినా మనసు చేతిలో మాత్రం కీలుబొమ్మే. మనసు మనిషిని గొప్పవాడిగానూ చెయ్యగలదు, అధఃపాతాళానికి తోసెయ్యనూగలదు. బహు చంచలమైన మనసు మనిషిని ఇంద్రియ సుఖాలవైపు లాగి పతనావస్థకు చేరుస్తుంది. మనిషి తన వివేకంతో కోరికలనే గుర్రాలకు బుద్ధి అనే కళ్ళెం వేసి మంచి మార్గంవైపు నడిపించాలి.'ఎవరు వివేకంతో తన మనసును తాను జయిస్తాడో ఆ గెలిచిన మనసు తనకు బంధువవుతుంది, ఓడిపోతే అదే తన
పూర్తిగా చదవండి

ధీమంతులు

Life/telugu, Religion/telugu Carani Narayana Rao
కమ్మని కలలొచ్చే వేళ మేలుకోకు... అని బుజ్జగిస్తుంది కవిత్వం. కాలం కలిసొచ్చేవేళ నిదురపోకు... అని హెచ్చరిస్తుంది జీవితం. ఆ రెండింటి మధ్యగల వైరుధ్యాన్ని పరిష్కరించలేక సగటు మనిషి నిత్యం సతమతమవుతూ ఉంటాడు. మనసుకూ బుద్ధికీ మధ్యా మనిషికి ఇదే బాపతు ఊగిసలాట. మనసు నిద్రనూ, బుద్ధి మెలకువనూ సమర్థిస్తాయి. కంటికి నచ్చిందల్లా కావాలంటుంది మనసు. నిజంగా దాంతో అవసరం ఉందో లేదో ముందు తేల్చుకొమ్మంటుంది బుద్ధి. దేనిమాట
పూర్తిగా చదవండి

ఎవరిని ధ్యానించాలి?

Religion/telugu Carani Narayana Rao
- ఆచార్య మసన చెన్నప్పకర్మ చేయడంలో మనం స్వతంత్రులం. కాని, కర్మఫలాన్ని అనుభవించడంలో అస్వతంత్రులం. దీన్నిబట్టి కర్మఫలాలు ఇచ్చేవాడు ఒకడున్నాడని తెలుస్తుంది. అతనికే పరమాత్మ అని పేరు.ఎవరు ఈ మానవజన్మతో పాటు, సమస్త శక్తుల్ని మనకు ప్రసాదిస్తున్నారో, ఎవరిని ఈ విశ్వమంతా ఎల్లవేళల ఉపాసిస్తుందో, ఎవరి ఆజ్ఞను సమస్త దేవతలు శిరసా వహిస్తున్నారో, ఎవరిని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుందో, ఎవరిని ఆశ్రయించకపోతే మళ్లీమళ్లీ
పూర్తిగా చదవండి

వాసనాత్రయం

Religion/telugu Carani Narayana Rao
- ఎర్రాప్రగడ రామకృష్ణ జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది జ్ఞానా దేవతు కైవల్యమ్‌ అని శ్రుతులు చెప్పాయి. కనుక మన పెద్దలు జ్ఞానాన్ని మోక్ష సాధనంగా భావన చేశారు. మోక్షాన్ని సాధించే నిమిత్తం జ్ఞానాన్ని అలవరచుకొమ్మని బోధించారు. అదెలాగో కూడా ఎన్నో రకాలుగా వివరించారు. జ్ఞాన సాధనకు ఆటంకంగా నిలుస్తున్నవాటిని గుర్తించి, ఆ అడ్డంకుల విషయంలో జాగరూకత వహించవలసిందిగా చెప్పారు. అలాంటివాటిలో వాసనాత్రయం ముఖ్యమైనది.
పూర్తిగా చదవండి

అందం

Religion/telugu Carani Narayana Rao
- కిల్లాన మోహన్‌బాబు ... బాహ్య రూపానికి హృదయ సౌందర్యం తోడైతే బంగారానికి తావి అబ్బినట్టే. అంతఃసౌందర్యం పెంపొందించుకోవడం మన చేతుల్లో, చేతల్లోనే ఉంది... అందం అనేది ఎంతో అందమైన మాట. మన నిత్యజీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ మాట వాడకుండా ఉండలేం. అసలింతకీ అందం అంటే ఏమిటి? బాహ్యరూపమా, కనిపించే దృశ్యమా? ప్రకృతి మొత్తం రమణీయం అయితే 'యదృశ్యం తన్నశ్యం' అనే నానుడి ఎందుకొచ్చింది? పసివాడి నవ్వులు, వసివాడని
పూర్తిగా చదవండి

భ్రాతృ విదియ

Religion/telugu Carani Narayana Rao
- చిమ్మపూడి శ్రీరామమూర్తి ...పర్వదినాల్లో 'యమ ద్వితీయ' ఎంతో ప్రముఖమైనది. కార్తీక శుద్ధ విదియనాడీ పర్వం వస్తుంది. దీన్ని 'భ్రాతృవిదియ'గా కూడా పేర్కొంటారు. కార్తీక శుక్ల విదియనాడు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతివంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం నివారణ జరుగుతాయంటారు. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది నేటి మహత్తర
పూర్తిగా చదవండి

ఘర్మజలం

Religion/telugu Carani Narayana Rao
- బులుసు-జీ-ప్రకాష్‌ శ్రీకృష్ణుని వద్దకు కుచేలుడు వెళ్లినపుడు ''ఇక్కడికి నువ్వు వస్తున్నప్పుడు నా మీద భక్తికొద్దీ ఏదో కానుక తెచ్చి ఉంటావు. అది కొంచెమైనాసరే, పదివేలుగా అంగీకరిస్తాను. భక్తి హీనుడై, నీచవర్తనుడైన దుష్టాత్ముడు మేరుపర్వత సమానమైన పదార్థం ఇచ్చినా అది నాకు సమ్మతం కాదు'' అంటాడు కృష్ణ పరమాత్మ. ఈ విషయాన్నే భగవద్గీత నవమాధ్యాయంలో ధ్రువీకరిస్తాడు. 'పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా
పూర్తిగా చదవండి

కృణ్వంతో విశ్వమార్యం

Religion/telugu Carani Narayana Rao
- పారుపల్లి వెంకటేశ్వరరావు సౌజన్యం, సత్యనిరతి, సదాచరణగల జ్ఞానులు పూజనీయులు. అటువంటి వారికి వర్తించే పదం ఆర్యులు. వారు ఏమతం వారైనా, ఏజాతివారైనా, ఏదేశం వారైనా, ఏఖండంవారైనా, ఆర్య పదం అటువంటి జ్ఞానులకు వర్తిస్తుంది. కుల, మత, భేదాలతో పనిలేదు. స్త్రీ, పురుష విచక్షణ లేదు. ఆర్యపదం గౌరవవాచకం, సంస్కారగుణ సూచకం! కారణజన్ములుగా మన పురాణాలు, కావ్యాలు కీర్తించే మహామనీషులు, మహా రుషులు, విశ్వమానవ సమాజాన్ని
పూర్తిగా చదవండి

పరమార్థం

Religion/telugu Carani Narayana Rao
- డాక్టర్‌ సంధ్యావందనం లక్ష్మీదేవి భగవంతుడు సర్వవ్యాపకుడనే విశ్వాసం అందరిలో ఉండాలి. కించిత్‌ పాపకార్యమైనా చేయకూడదు. ధర్మబుద్ధి పవిత్రాచరణ కలిగి ఉండాలి. జీవన పరమార్థమంటే ఈ జన్మలో భగవత్‌ సాక్షాత్కారం చేసుకోవడమే. అందుకు కావలసిన సాధన అభ్యాసం చేయాలి. పూర్వం ధర్మబుద్ధి కలిగిన ఓ రాజు ఉండేవాడు. అతడు భగవద్భక్తుడు. శాస్త్ర పఠనంలో అతనికి ప్రీతి ఎక్కువ. ఆధ్యాత్మ క్షేత్రంలో కొన్ని సందేహాలు ఆ రాజును
పూర్తిగా చదవండి

యద్భావం తద్భవతి!

Religion/telugu Carani Narayana Rao
- డాక్టర్‌ ఎమ్‌.సుగుణరావు ఒక సన్యాసి, దేవుడి కోసం తపస్సు చేశాడు. అతడి దీక్ష ఫలించి దేవుడు ప్రత్యక్షమై- మూడుసార్లు అతను మనసులో ఏది తలచుకుంటే అదే జరుగుతుందనే వరమిచ్చాడు. వెంటనే ఆ సన్యాసి సకల సదుపాయాలతో ఒక రాజభవనం లాంటి భవంతి కావాలనుకున్నాడు. వెంటనే భవంతి ప్రత్యక్షమయింది. అందమైన యువతితో వివాహం జరగాలి అనుకున్నాడు. అదీ జరిగింది. ఒక్కసారిగా సంప్రాప్తించిన సుఖభోగాలకు తట్టుకోలేని ఆ వ్యక్తి 'కొంపదీసి
పూర్తిగా చదవండి

దాత మనసు

Religion/telugu Carani Narayana Rao
- ఎర్రాప్రగడ రామకృష్ణ దానగుణంగల వ్యక్తులను మన పెద్దలు మూడు రకాలుగా వర్గీకరించారు. మొదటివాడు దాత. అవసరానికి ఆదుకోవాలని ఎవరైనా వచ్చి అడిగితే కాదనకుండా తృణమో పణమో ఇచ్చి పంపేవాడు దాత. రెండోవాడు ఉదారుడు. అడిగినవారి అవసరాన్ని చక్కగా గుర్తించి, అడిగినదానికన్నా కాస్త ఎక్కువ ముట్టజెప్పి మరీ పంపేవాడు ఉదారుడు. ఇక వదాన్యుడు అనే మూడోస్థాయి వ్యక్తి- అవతలవాడు అడిగేదాకా కూడా చూడకుండా, అవసరం వచ్చిందని, లేదా ఆపద
పూర్తిగా చదవండి

జీవితం ఏమిటి?

Religion/telugu Carani Narayana Rao
- ఎర్రాప్రగడ రామకృష్ణ ''కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది గాని, దాని ఫలితంపట్ల లేదు''- అని గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. ఫలితం సంగతి అలా ఉంచి, అధికారం ఉంది కదా- అని, కర్మలను విడిచిపెట్టేయడం మనిషికి సాధ్యమేనా? అదీ చాలా కష్టమైనదిగానే తోస్తుంది. కర్మలనుంచి దూరంగా ఉండటం అనేది మనిషికి దాదాపుగా అసాధ్యమని ఈ కథ మనకు తెలియజేస్తోంది. ఒకాయన వయసులో ఉండగానే వైరాగ్యం పెంచుకుని, ఊరికి దూరంగా ఒక నిర్జనమైన
పూర్తిగా చదవండి

భయం లేని చోటు

Religion/telugu Carani Narayana Rao
ఆహార, నిద్రా, భయ, మైధునాలు జీవులన్నిటిలో సాధారణమే అయినప్పటికీ, మానవుల్లో వీటి గురించిన చింతన కొంచెం ఎక్కువ. ఆహార, నిద్రా, మైధునాలు- వాటి అవసరం తీరాక అవి శాంతిస్తాయి. కానీ, మూడోదైన భయం మాత్రం మనిషిని నిత్యం వెన్నంటి ఉంటూనే ఉంటుంది. రోజుల శిశువు కూడా నిద్రలో ఉలికులికిపడటం మనం చూస్తుంటాం. అది మొదలు- ఏదో కారణంగా, ఈ భయం మనిషిని బాధిస్తూనే ఉంటుంది. 'నేనెవరికీ భయపడను. భయం అనేది నా నిఘంటువులోనే లేదు'
పూర్తిగా చదవండి

రెండో పురుషార్థం

Religion/telugu Carani Narayana Rao
- డాక్టర్‌ ఎమ్‌.సుగుణరావు ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు. దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి ''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో అద్భుతంగా ఉండాలి'' అన్నాడు.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS