Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఐడియా – సరికొత్త ఆక్సిజెన్

Amazing, Self development/Telugu Carani Narayana Rao
కాఫీ తాగుతున్నప్పుడో పేపర్‌ తిరగేస్తున్నప్పుడో షేవింగ్‌ చేసుకుంటున్నప్పుడో షవర్‌ కింద తలంటుకుంటున్నప్పుడోఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఐడియా మీ బుర్రలో తళుక్కుమంటుంది. అదొక్కటి చాలు, మీ జీవితాన్ని మార్చేయడానికి!నీఖాతాలో డబ్బుందా?నీ పేరుతో ఫ్లాటుందా?పార్కింగ్‌లో కారుందా?ఖరీదైన సెల్‌ఫోన్‌ ఉందా?ఛీ..ఛీ..!ఎప్పుడూ ఇవే ప్రశ్నలేనా? కాలంచెల్లిన ఆలోచనలన్నీ కట్టగట్టి చెత్తబుట్టలో పడేయండి. గాలికి
పూర్తిగా చదవండి

మనిషి- మనసు

Religion/telugu, Self development/Telugu Carani Narayana Rao
- డాక్టర్‌ డి.చంద్రకళమనిషి ఎంత ఎత్తు ఎదిగినా మనసు చేతిలో మాత్రం కీలుబొమ్మే. మనసు మనిషిని గొప్పవాడిగానూ చెయ్యగలదు, అధఃపాతాళానికి తోసెయ్యనూగలదు. బహు చంచలమైన మనసు మనిషిని ఇంద్రియ సుఖాలవైపు లాగి పతనావస్థకు చేరుస్తుంది. మనిషి తన వివేకంతో కోరికలనే గుర్రాలకు బుద్ధి అనే కళ్ళెం వేసి మంచి మార్గంవైపు నడిపించాలి.'ఎవరు వివేకంతో తన మనసును తాను జయిస్తాడో ఆ గెలిచిన మనసు తనకు బంధువవుతుంది, ఓడిపోతే అదే తన
పూర్తిగా చదవండి

‘గెలుపు’ పుస్తకాల జాతర!

Books, Self development/Telugu Carani Narayana Rao
ఒంటరితనంతో బాధపడిపోతుంటే 'స్నేహితుల్ని సంపాదించుకోవడం ఎలా' అనే పుస్తకం చదవండి. ఏకాంతాన్ని ఆస్వాదించడం ఎలా?' అనే పుస్తకాన్ని ముందేసుకోండి. ఆ పుస్తకాల దొంతర్లలో దేన్ని ఎంచుకోవాలో అర్థంకానప్పుడు, 'మంచి పుస్తకాన్ని ఎంచుకోవడం ఎలా?' ఉండనే ఉంది.సాహిత్య స్వభావమే వికాసం.ఎంత చిన్న పుస్తకమైనా, ఎంత చెత్త పుస్తకమైనా...అందులోంచి నేర్చుకోవాల్సిందీ తెలుసుకోవాల్సిందీ ఎంతోకొంత ఉంటుంది.ఆ పరిజ్ఞానం వ్యక్తిత్వ
పూర్తిగా చదవండి

మంచి నోట్సు… మార్కుల గని!

Self development, Self development/Telugu Carani Narayana Rao
సత్య స్వయంగా నోట్సు రాసుకునేవారు ఉత్తమ విద్యార్థుల కోవలోకి వస్తారు. అసలు నోట్సు జోలికే పోనివారు సగటు విద్యార్థులని ఇట్టే అంచనాకు వచ్చెయ్యవచ్చు. నోట్సు రాసుకునేవారిలో కూడా 95 శాతం విద్యార్థులు పాటించేది- సంప్రదాయ బద్ధమైన 'లీనియర్‌ నోట్సు'. దీని ప్రయోజనాలు పరిమితమే!సివిల్స్‌, గ్రూప్స్‌ లాంటి ఉన్నతశ్రేణి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఇతరుల విజయ రహస్యాన్ని ఆరా తీస్తుంటారు. తాము ఎన్నిసార్లు
పూర్తిగా చదవండి

ఎంత చదివినా గుర్తుండదా?

Self development/Telugu Carani Narayana Rao
సత్య మన పరీక్షలు చాలావరకూ జ్ఞాపకశక్తిని పరీక్షించేవే! అందుకే చదివిన విషయాలను గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. 'ఎంత కష్టపడి చదివినా నాకసలు గుర్తుండదు' అంటూ బాధపడే విద్యార్థుల సంఖ్య తక్కువేమీ కాదు. కొన్ని శాస్త్రీయమైన సూత్రాలు సాధన చేస్తే ఏ విద్యార్థికైనా జ్ఞాపకశక్తి అద్భుతంగా మెరుగుపడుతుంది. చదివిన విషయాలను తేలిగ్గా మర్చిపోవటం వల్ల ఈ పోటీ ప్రపంచంలో చాలా వెనకబడాల్సివస్తుంది. జ్ఞాపకశక్తి
పూర్తిగా చదవండి

సాటిలేని సాధనం… మైండ్‌ మ్యాపింగ్‌

Self development/Telugu Carani Narayana Rao
సత్య ఎంత విస్తృతమైన విషయాలనైనా కొన్ని గీతలూ, పదాల్లోకి మార్చి గుర్తుపెట్టుకోవచ్చంటే మీరు నమ్మగలరా? దాన్ని సాధ్యం చేసేదే మైండ్‌ మ్యాపింగ్‌. అభ్యాసం చేస్తే విద్యార్థులకు ఇది ప్రయోజనకరం.ఎంతో ఉపయోగకరమైన 'కార్నల్‌ నోట్సు'కు కూడా కొన్ని పరిమితులున్నాయి. అవి- వాక్యపూరణకు అవసరమైన వ్యర్థపదాలు చోటుచేసుకోవటం, జ్ఞాపకశక్తి వినియోగానికి తక్కువ అవకాశం ఉండటం. ఈ లోపాలను సవరించి మంచి ఫలితాలనిచ్చే
పూర్తిగా చదవండి

ఉన్నతాశయం

Self development/Telugu Carani Narayana Rao
ప్రతి మనిషికీ ఒక ఆశయమంటూ ఉండాలి. అది ఉన్నతమైనదై ఉండాలి. అది శరీరానికి రాసుకున్న సుగంధద్రవ్యంలా కృత్రిమమైనది, తెచ్చిపెట్టుకుంటే వచ్చేదిగా కాక, పూవు పుట్టగానే వచ్చే పరిమళంలా సహజసిద్ధమైనదై ఉండాలి. అప్పుడే ఆ ఆశయం సిద్ధిస్తుంది. ఆ విషయంలో విజయం చేకూరుతుంది. ఒక పిల్లవాడు బడికి వెళ్లే తోవలో ఒక సైనిక శిబిరం ఉంది. అక్కడ సైనికులను, వారి విన్యాసాలను ఆరాధనగా చూసేవాడా పిల్లవాడు. చూసి ముగ్ధుడయ్యేవాడు.
పూర్తిగా చదవండి

నేడు విశ్వ కారుణ్య దినోత్సవం

Self development/Telugu Carani Narayana Rao
కరుణ చూపించు.. సంతోషం సంపాదించు! నోరు మంచిదయితే వూరు మంచిదవుతుంది. ఓ చిరునవ్వు... ఆత్మీయులను సంపాదించి పెడుతుంది. కరుణ చూపిస్తే పాషాణ హృదయమూ కరుగుతుంది. ప్రతి ఒక్కరూ కరుణను అలవర్చుకుంటే ప్రపంచమంతా సంతోషమయమవుతుంది. కరుణ చూపించడానికి కోట్లు కుమ్మరించాల్సిన పనిలేదు. పెద్దపెద్ద త్యాగాలూ అవసరం లేదు. కాస్తంత ఉదారం చూపితే చాలు. కోపం అణుచుకుంటే చాలు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు కాస్తంత
పూర్తిగా చదవండి

మరల మరల ప్రయత్నించు!

Self development/Telugu Carani Narayana Rao
- అయ్యగారి శ్రీనివాసరావు ప్రతిపనికీ ఒక ప్రారంభం. ఆ పని పూర్తికావాలంటే కొంత ప్రయత్నం. ఆ ప్రయత్నంలో జయం కలగొచ్చు. అపజయమైనా కలగొచ్చు. అపజయం కలిగినపుడు నిరాశపడి అక్కడితో ఆగిపోతే ఆ కథ అక్కడితో ముగిసిపోతుంది. అలా కథ ముగిసిపోయినవారంతా చరిత్రగతిలో కలిసిపోయిన ఎందరో చరిత్రహీనులతో కలసిపోతారు. కాని- అక్కడితో ఆగిపోకుండా మరోసారి, ఆపై ఇంకోసారి ప్రయత్నం చేస్తే ఒకసారి కాకపోయినా మరొకసారైనా విజయం చేకూరడం తథ్యం.
పూర్తిగా చదవండి

ఇడ్‌, ఈగో, సూపర్‌ ఈగో

Self development/Telugu Carani Narayana Rao
.............మనిషి వ్యక్తిత్వంలో ఇడ్‌, ఈగో, సూపర్‌ ఈగో అనే మూడు కంపొనెంట్స్‌ ఉంటాయి. ‌ ఇడ్‌ కోరికలకు నిలయం. అది మంచి చెడులను పట్టించుకోదు. సమాజ నిబంధనల గురించి ఆలోచించనివ్వదు. కోరికలు తీర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది. ఈగో పరిసరాలకు, నిబంధనలకు ...ప్రాముఖ్యతనిస్తాయి. సూపర్‌ ఈగో నీతి, నియమాలకు ప్రాముఖ్యతనిస్తాయి. ఇవి మనిషి మనిషి తప్పు చేస్తే పశ్చాత్తాప భావనలను కలిగిస్తాయి. అయితే ప్రతి మనిషిలో
పూర్తిగా చదవండి

ఇవ్వడంలో ఆనందం

Self development/Telugu Carani Narayana Rao
1985లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ 'అమెరికా ప్రెసిడెన్షియల్‌ ఫ్రీడం మెడల్‌'ను మదర్‌థెరీసాకు బహూకరిస్తూ, 'ఈమె దీన్ని భారత్‌కు తీసుకెళ్లి, కరిగించి ఆ డబ్బుల్ని పేదలకోసం ఖర్చు చేస్తుందేవో' అని చమత్కారంగా వ్యాఖ్యానించారు. అవును మరి, ఇచ్చే మనసున్నవారికి ఇవ్వడంలో లభించే తృప్తి మరెందులోనూ దొరకదు. దానం ఇవ్వడాన్ని వ్యక్తిగత బాధ్యతగా బోధిస్తుంది రుగ్వేదం. తమ ఆస్తిలో పదోవంతు ఆదాయాన్ని దానంగా
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS