Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Battle of Ellampalli oustees

Appeals, Godavari, Karimnagar, Telangana People, Telugu (తెలుగు), livelihoods Telangana Utsav
గోలివాడ బుచ్చమ్మ… అరవై ఏండ్లు… భర్త లింగయ్య మంచిర్యాల ఎసిసి సిమెంట్‌ కంపెనీలో పనిచేసి రెండేళ్ల క్రితం చనిపోయాడు… శవాన్ని వారి మామిడితోట తలాపునే పూడ్చిపెట్టి సమాధి కట్టారు… బుచ్చమ్మకు పదకొండున్నర ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఆ తోట స్థలాన్ని భర్త కంపెనీలో నౌకరి చేసేటప్పుడు ముర్ముర్‌ గాండ్లోల్ల దగ్గర బుచ్చమ్మ కొనుక్కున్నది… తోటలో పదేళ్ల వయస్సున్న 420 మామిడి చెట్లు ఉన్నయ్యి. పోయిన సంవత్సరం రూ.1.50 లక్షల మామిడికాయల దిగుబడి వచ్చింది… మాములు మామిడితోట కాదు… [...]
పూర్తిగా చదవండి

Woes of Singareni coal miners

Essays, Karimnagar, Telangana, Telugu (తెలుగు), livelihoods Telangana Utsav
నేను…రాజపోషవ్వను మాట్టాడుతున్నా….! 2008, ఫిబ్రవరి 15న రామగుండం ఓపెన్‌ కాస్టు-3 బొగ్గు గని విస్తరణలో భాగంగా మంగళపల్లి - పెద్దంపేట గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ఆ సభలో ప్రభుత్వ పర్యావరణ శాస్త్రవేత్తలతోపాటు కరీంనగర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, సంబంధిత సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, యూనియన్‌ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అక్కడికి మురికి బట్టలతో… నెరిసిపోయిన జుట్టుతో.. పీక్కుపోయిన మొహంతో ఓ అవ్వ అక్కడికి వచ్చింది. ఆమె పేరు రాజపోషవ్వ. అరవై ఏళ్ల [...]
పూర్తిగా చదవండి

Regional Inequalities in Education - Chukka Ramaiah

Essays, Fazal Ali Commission, Telangana, Telugu (తెలుగు) Telangana Utsav
విద్యలోనూ ప్రాంతీయ వివక్షే! - చుక్కా రామయ్య . కాలంతో పాటుగా వస్తోన్న అనేక రకాల కొత్త చదువులను తెలంగాణ యువత అందుకోలేకపోవడానికి కారణమేమిటి? దారిద్య్రం. తెలంగాణ వెనుకబాటుతనానికి, లేదా వెనుకబడేసిన సందర్భానికి కారణం ఆ ప్రాంతం లో తాండవిస్తున్న పేదరికాన్ని నామరూపాలు లేకుండా చేయలేకపోవడమే. నవాబులు, దొరల ఆధిపత్యం కింద శతాబ్దాలుగా నలిగిపోయిన తెలంగాణుల దుస్థితి ‘పోలీసు చర్య’ అనంతరం కూడా తొలగిపోలేదు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు హైదరాబాద్‌ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రలో విలీనం చేస్తూ సంతకం చేసిన ఐదు [...]
పూర్తిగా చదవండి

Saga of rural women & livelihoods - painting exhibition by G Bharath Bhushan

Articles, Invitations, Telangana People, Telugu (తెలుగు) mbbhushan
చిత్రకారుడు భరత్ భూషణ్ - C B Rao Inaguration of Exhibition Photo:cbrao శుక్రవారం, 23 నవంబరు 2007 సాయంత్రం ఆరున్నర గంటలకు, మాసాబ్ టాంక్ లోని లక్ష్మన్ ఆర్ట్ గాలరి లో, ఒక విచిత్రం జరిగింది. ఇంతవరకు ఛాయా చిత్రకారుడిగా చిరపరిచితమైన భరత్ భూషణ్ గుడిమిల్ల, రంగుల కాన్వాస్ తో కూడిన చిత్రకారుడిగా పరిచయ మయ్యారు. ఈ మార్పు ఆశ్చర్యకరమైనా, ఆహ్వానించతగినది. కొంతకాలం అనారోగ్యం, బయటకు కదల నీయక పోవటం తో, ఆ సమయాన్ని, సృజనాత్మకంగా, చిత్రలేఖనానికి [...]
పూర్తిగా చదవండి

ఎచ్చెమ్మ కతల యశోదమ్మ Yashoda Reddy

In News, Telangana People, Telugu (తెలుగు) Telangana Utsav
‘తెలంగాణ పిల్ల’ యశోదమ్మ - ముదిగంటి సుజాతారెడ్డి అభిమానం గల తెలం గాణ ముద్దుబిడ్డ యశోదారెడ్డి. 1929లో మహబూబ్‌నగరం జిల్లా బిజినేపల్లి గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పాకాల యశోదారెడ్డి తన సహజమైన ప్రతిభతో విశ్వవిద్యాలయం ఆచార్యులుగా ఎదిగారు. అంతేగాక అధికార తెలుగు భాషాసంఘం చైర్మన్‌ పదవిని అధిష్ఠించిన ఏకైక మహిళ ఆమె. మంచి వక్త. అటు సంస్కృత సమాసభరితమైన శైలిలో ఇటు తెలంగాణ జాతీయాలు, సామెతలు, పలుకుబడులు నిండిన శైలితో ఆమె సమానంగా ధారాళంగా వేదికల మీద [...]
పూర్తిగా చదవండి

మరో బ్లాగు తుఫాను సూచన?

Telugu, Telugu (తెలుగు), blogs, తెలుగు, తెలుగు బ్లాగులు వీవెన్
ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ? తెలుగువాడి సొమ్ముతో కట్టిన ప్రతీదానికి తెలుగువాడి పేరే పెట్టాలి ఆంద్రప్రదేశ్ …రాజీవ్ ప్రదేశ్….ఇందిరా ప్రదేశ్ [పాత బంగారం] వార్తల్లో విప్లవం - ఇందిరమ్మ టీవీ ఈ రోజు మా సహోద్యోగుల మధ్య చర్చలో వచ్చిన కొన్ని పేర్లు: ఇందిరాబాద్ రాహుల్‌గూడ ప్రియాంక నగర్ రాజీవ్ పేట రాజకీయం మరి! రాజ్యాంగబద్దంగా జనానికి కీడుచేసే యంత్రాంగం
పూర్తిగా చదవండి

తెలంగాణ వాసులార ఉద్యమించ లెండిరో

Poetry & Songs, Telangana, Telugu (తెలుగు) Telangana Utsav
తెలంగాణ వాసులార                                      - ఎన్నారు నర్సింహ తెలంగాణ వాసులార తెగువతొ లేవండిరో ఉప్పెనై  రండిరో తెలంగాణ వాసులార ఉద్యమించ లెండిరో తెలంగాణ తమ్ములార విశాలాంద్ర పేరున విషాదమె మిగిలెరో ..తెలంగాణ వాసులార తెలంగాణ వస్తె దప్ప వెలుగు మనకు లేదురో.. తెలంగాణ తమ్ములార పెద్దమనుషుల ఒప్పందం పేరుకె మనకు మిగిలిందిరో ..తెలంగాణ వాసులార ముల్కి నిబంధనలు మూలనపడ్డయిరో పాలకుల మాటలన్ని నీటి మూటలాయెరో ..తెలంగాణ వాసులార
పూర్తిగా చదవండి

ఏది సరి:’ళ్ళ’ లేదా ‘ళ్ల’?

Telugu, Telugu (తెలుగు), తెలుగు వీవెన్
నేను చిన్నప్పటినుండీ నేర్చుకున్నది ‘ళ్ళ’ అనే. ఉదాహరణకు ఇళ్ళు, పెళ్ళి, వెళ్ళు, మొదలైనవి. కానీ చాలాచోట్ల ‘ళ్ల’ వాడుతుండడం చూస్తున్నాం. ఇళ్లు, పెళ్లి, వెళ్లు, అని. బ్రౌణ్యంలో కూడా ఇళ్లు, పెళ్లి అనే వాడారు. ఈ రెండు రకాల వాడుకలూ సరైనవేనా? ఒకటే సరైనదైతే, ఏది? ఎందుకు? మీరేమంటారు? (ఈ చర్చ ఇంతకుముందెప్పుడో తెలుగుబ్లాగు సమావేశాల్లో వచ్చినట్టు లీలగా గుర్తుంది, కానీ వివరాలు గుర్తులేవు.)
పూర్తిగా చదవండి

తెలుగుపదం

Telugu, Telugu (తెలుగు), తెలుగు వీవెన్
తెలుగుపదం ముఖ్యంగా రెండు లక్ష్యాలతో ఏర్పడింది: చాన్నాళ్ళుగా మందగించిన కొత్త తెలుగు పదాలు తయారీని వేగవంతం చేయడం, ప్రోత్సహించడం, అందుకుకావాల్సిన సాముదాయిక వాతావరణాన్ని కల్పించడం. పలు చోట్ల (బ్లాగుల్లో, గుంపుల్లో, ఇతర చోట్ల) తయారౌతున్న తెలుగు పదాలను ఒకేచోట (వెతుకుకొనగలిగే సౌలభ్యంతో) క్రోడీకరించడం. ఈ లక్ష్యాలకు సాధనాలుగా తెలుగుపదం వికీ సైటు మరియు తెలుగుపదం గుంపులను స్థాపించాం. మీరెలా తోడ్పడవచ్చు? మీ బ్లాగులో, ఇతర రచనలలో తెలుగు పదాలు వాడుతుండండి. మీనుండి మేం ఆశించే పెద్ద సహాయం ఇదే. కొత్త తెలుగు పదాలు వాడడానికి మీరు [...]
పూర్తిగా చదవండి

ఏమి గోస తల్లీ నీకు?

Poetry & Songs, Telangana, Telugu (తెలుగు) Telangana Utsav
- సూరెపల్లి సుజాత పాలమూరు చెల్లి పొట్ట చేత పట్టుకొని దేశం కాని దేశాలల్ల పనియ్యమని ఊరూరా తిరుగుతున్నది కన్నవాల్లు కట్టుకొన్నవాడే పొత్తిల్ల బిడ్డని పాతిపెట్టుతుంటె చాతకాక చూస్తున్నది
పూర్తిగా చదవండి

Photographer with a difference- Ravindra Reddy

Articles, Photos, Telugu (తెలుగు) mbbhushan
డి. రవీంద్రరెడ్డి   రాత్రి పన్నెండు గంటల సమయంలో ఫోన్ లో తనకు వినిపించిన- ‘యు సేవ్ డ్ మై హెడ్ ‘ అంటూ కృతజ్ఞత ధ్వనించే పెన్ బర్తె మాటలను మరోసారి ఇష్టంగా జ్ఞాపకం చేసుకున్నారు డి.రవీంద్రరెడ్డి తన స్టూడియోలో. పెన్ బర్తె ఎవరంటారా? ‘యు సేవ్ డ్ మై హెడ్ ‘ అని ఆయన రవీంద్రరెడ్డితో ఎందుకన్నాడంటారా? అసలు రవీంద్రరెడ్డి ఎవరంటారా? ఆయన ఓ ఫోటోగ్రాఫర్ . ఆయన ఫెయిల్యూర్ స్టోరీయే ఇది
పూర్తిగా చదవండి

తొవ్వ !

Story, Telugu (తెలుగు) Jaya Prakash
గాలికి కిటికీలు టపటప కొట్టుకుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది. టైం ఎంతైందో అనుకుంటనే ఉన్న దూరంగ పదకొండు గంట్ల సీటీ ఇనొచ్చింది. వానకు ట్రాన్స్‌ఫార్మర్ పేలి కరంట్ పోయింది, దీపం పెట్టుకొని సంటోన్ని కాల్లమీద ఏసుకొని ఊపుతుంటె ఎప్పుడు కన్నంటుకున్నదో తెలువలే. రేకుల మీద రాల్లు పడ్డట్టు పడ్తాంది వాన, జర గట్టిగ ఇంకో గాలొస్తె ఎగిరిపోతయా అన్నట్టు ఉన్నయా రేకులు. “ఇయ్యాలేందో జోరుగ పడ్తాంది వాన!” అన్నది పక్క అర్రల నుంచి మా అత్త, గిప్పుడామె తోటి మాట్లాడుడు [...]
పూర్తిగా చదవండి

ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది!

Firefox, Telugu, Telugu (తెలుగు), తెలుగు వీవెన్
ఫైర్‌ఫాక్స్‌ ప్రియులకు శుభవార్త: ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది! ఫైర్‌ఫాక్స్‌౩ లో అమలు చేస్తున్న కొత్త టెక్స్టుఫ్రేమ్ వల్ల ఈ బగ్గు ఫిక్సయ్యింది. అయితే మనకేంటి? మనకేంటంటే, తెలుగు ఇక ఫైర్‌ఫాక్స్‌ ౩ నుండి చక్కగా కనిపిస్తుంది. తెలుగొక్కటేకాదు, ఇతర భారతీయ భాషలుకూడా చక్కగా కనిపిస్తాయి. అవును, XPలో ప్రాంతీయ మరియు భాషా ఎంపికల (Regional and Language Options) లో సంక్లిష్ట లిపులకొరకు ప్రత్యేక తోడ్పాటుని వ్యవస్థాపితం చేయపోయినా సరే ఫైర్‌ఫాక్స్‌౩ నుండి తెలుగు [...]
పూర్తిగా చదవండి

ఇన్‌స్క్రిప్ట్ చిట్కాలు

Telugu, Telugu (తెలుగు), inscript, typing, తెలుగు వీవెన్
తెలుగు కీబోర్డు లేఔట్లపై సౌమ్య టపా మరియు తెలుగుబ్లాగు సమూహాంలో కొందరడిగిన సందేహాలు కలిపి ఈ టపా రాయడానికి నాకు ప్రేరణనిచ్చాయి. మొదట, కీబోర్డు లేఔట్ అన్నది ఎవరికివారి వ్యక్తిగత ఎంపిక. నేను ఇన్‌స్క్రిప్ట్‌కి ఎందుకు మారానంటే నాకు RTS బాగా వచ్చేసింది కాబట్టి! ఇంకందులో మజాలేదు, కొత్తది నేర్చుకుందామని. మీరు ఇన్‌స్క్రిప్ట్‌కి మారాలంటే, మీ కారణాలు మీరు వెతుక్కోండి. మీరు ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే, మీకోసం కొన్ని చిట్కాలు. మీఅంత మీరే శోధించి సాధించాలనుకునే తత్వంమీదైతే, మీకిది [...]
పూర్తిగా చదవండి

తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం

Essays, Telugu (తెలుగు) Telangana Utsav
మనవి ఆహ్వానం - తడకమళ్ళ వివేక్‌ తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట చరిత్ర వక్రీకరణ - కె. జితేంద్రబాబు తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం ఆవశ్యకత- కొన్ని తక్షణ కర్తవ్యాలు - పరవస్తు లోకేశ్వర్ తెలంగాణ చరిత్ర రచనకు కొన్ని సూచనలు - డా. మలయశ్రీ చరిత్ర రచన / నిర్మాణం - డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ చరిత్రలోనైనా ముస్లింలకు న్యాయం జరగాలి - స్కైబాబ Click HERE to view complete list
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS