Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కనుగొనే ఛానెలు

అమెరికా నేల, ఏవైనా నాగరాజా
చదువుకుంటూ ఉండి, రిమోటు వెతికే ఓపికలేని కారణాన, అర్థరాత్రి ఓ రెండు గంటలు డిస్కవరి సైన్సు ఛానెల్ పాకుతూనే ఉంది. ఈ మధ్య కేవలం పిల్లల కార్టూన్లు చూసే అదృష్టం తప్ప మిగతా ఛానెళ్ళ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసుకునే అవకాశం రాలేదు, సరే అని అప్పుడప్పుడూ ఓ కన్నేసి ఉంచాను. ఏమేం ప్రోగ్రాంలు వస్తున్నాయీ…? + మొదట స్పెయిన్‌లో ఒక పెద్ద కట్టడం! ఒక అంతస్థును కట్టడంలో మన కనుగొనె-ఛానెల్-వాడు పాల్గొని దాన్ని [...]
పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్ణారావు: అయిదు తెల్లని గుర్రాలు

ఏవైనా, ధీ యానం నాగరాజా
07.12.1993: ఈ రోజు గురువు గారైన శ్రీ సుభాష్ పత్రి గారు గుంతకల్‌కు విచ్చేసి ధ్యానం గురించి అందరికి ఎన్నో విధాలుగా బోధించారు. నేను అంతా విన్నాను. అందరితో పాటు ధ్యానం చేయడానికి కూర్చున్నాను. నాకు ధ్యానంలో ఈ విధంగా కనపడింది. నేను నడుస్తూ కొంత దూరం వెళ్తూ వుండగా ఎదురుగా ఏడు తెల్లని గుర్రాలు గల ఒక రధం చాలా వేగంగా పరుగెత్తుతూ వున్నది. నేను దానిని పట్టుకోవాలని దాని వెంబడి పరుగెత్తుతూ వున్నాను. కానీ పట్టుకోలేకపోయాను. [...]
పూర్తిగా చదవండి

కృష్ణుడి గుడి నుండి బుద్ధుడి గుడి వరకు – 2

ఆధ్యాత్మికం, ఏవైనా, జ్ఞాపకాలు, సింగపూరు నేల నాగరాజా
[ మొదటి భాగం టపా, విపస్సన టపా ] 1999 చివర అనుకుంటాను: చిన్నప్పటి నుండీ అర్థం కాని విసుగుతో వెతుకులాడుతూ…నే… ఉన్నాను, కానీ ఒకనాడు సాయంత్రం బాగా తిక్క రేగిపోయి ఆఫీసు నుండి సూటిగా కృష్ణుని గుడికి వెళ్ళి, బయట ఉన్న గద్దెపై కూర్చున్నాను. గుళ్ళోకి మాత్రం రానని మాత్రం భీష్మించుకున్నాను. ఒక ముప్పావు గంట కాలం గడిచినట్టుంది కానీ పట్టు వీడలేదు. “లోపలికి పోవడం - అతి వినయం ప్రదర్శించడం - కొద్ది [...]
పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్ణారావు: ధ్యానంలో ధ్యానం

ఏవైనా, ధీ యానం నాగరాజా
5.12.1993: ఇంకొక రోజు ఇంటిలో ధ్యానం చేయడానికి కూర్చున్నాను. ముందుసారి చూచిన దృశ్యమే మళ్ళీ కన్పించింది. నేను ఆ ఇంటిలోనికి వెళ్ళి బయటికి వచ్చాను. అలా రెండు మార్లు చేసి మళ్ళీ వెనుకకు తిరిగాను. అక్కడ నేను ఆ కుటీరంలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను. నేను కూర్చున్న కొంచెం దూరంలో భూమి రెండు భాగాలుగా చీలి దాని నుండి ఎర్రటి అగ్ని, మంటలు, పొగ, గాలి, నీరు అన్నీ బయటికి రాసాగాయి. నాకు భయమై కళ్ళు తెరిచాను. ఈ [...]
పూర్తిగా చదవండి

నాగలోకం: డెమాక్రసి… బాంబులు… ధర్మం…

ఏవైనా, తెలుగు నేల, నాగలోకం నాగరాజా
పౌరుషం, పోరాటం వగైరాలను మగతనంతో - సహనం, ప్రేమ వగైరాలను ఆడతనంతో మన వాళ్ళు వెనకట్నుంచీ పోలుస్తూ వస్తున్నారు. దీనిపై నాకు అంత నమ్మకం లేకపోయినా, ఇందులో కొంత ఉప్పు ఉండే ఉంటుందని అనిపిస్తుంది - ఈ రెండూ లేని భారత పాలకులను చూస్తుంటే… రాచరికంలో విషయాలు సూటిగా, సాదాగా, ఆలోచనలకు అందే విధంగా ఉండేవి. * ప్రధానమంత్రి - “ప్రభూ మన రాజ్యంలో గోకేస్తాన్ దేశం వారు బాంబులు పేల్చారు. ఇద్దరు మరణించారు, నలుగురు గాయపడ్డారు.” * మహారాజు మొహం [...]
పూర్తిగా చదవండి

నాగలోకం: డెమాక్రసి… ఉత్తమ బ్లాగులు…

ఏవైనా, తెలుగు నేల, నాగలోకం నాగరాజా
నేడు డెమాక్రసి (ప్రజాస్వామ్యం) మరియు ఓట్ల పద్ధతి ప్రపంచంలో బాగా అభిమానింపబడుతున్నది. అయితే, రాజకీయంగా మరియు బ్లాజకీయంగా ఉత్తుత్తినీ, ఉత్తమాన్నీ ఎన్నుకోవలసిన సుస్సందర్భాన, ఎంత వరకు మనము ఆ పనిని సవ్యంగా నెరవేర్చగలుగుతున్నాము అన్నది చిక్కు ప్రశ్న? * రాజకీయంగా మనం ఎంతో మంది వెధవలను ఎగువ దిగువ సభల్లోకి పంపిస్తున్నామన్నది బ్లాగ్ముఖంగా మనం చదివి,చూస్తున్నదే! మానవ సమాజానికి ప్రజాస్వామ్యం అన్నింటిలోనికీ ఉత్తమమైనదని మనం ఒక్క కంఠంతో ఒప్పుకోవలసిన విషయమే అయినా, దాని యొక్క వాడకంలో ఎన్నో లోపాలు [...]
పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్టా రావు: ధ్యానం నేర్చుకున్నాను

ఏవైనా, ధీ యానం నాగరాజా
2004న ఆదోని పిరిమిడ్ మాస్టర్ ప్రేమ్‌నాథ్ గారు డెట్రాయిట్ వచ్చి ఉన్న కాలములో నాకు ఎమ్. ఎస్. కృష్టా రావు అనే ఇంటర్మీడియట్/డిగ్రీ యువకుడు (ది గుంతకల్ స్పిరిచ్యువల్ సొసైటీ వారు) ప్రచురించిన “ధ్యానంలో నా అంతర్ యాత్రలు” అనే పుస్తకాన్ని (ద్వితీయ ముద్రణ) నాకు ఇచ్చారు. ఓ రెండున్నర ఏండ్లు నా స్నేహితుని డెస్కులో పడుకొని ఇవాళే మళ్ళీ నా చేతిలోకి వచ్చింది. అందులో నుండి కొన్ని భాగాలను ప్రచురించాలని సంకల్పించాను. ధ్యానంలో నా అంతర్ యాత్రలు [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం – 36,37: సత్యం, కూడలి

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
సత్యం: “సత్యం అంటే ఏమిటి?” శిష్యుడు నసీరుద్దీన్‌ను ప్రశ్నించాడు. “నాడు - నేడు - ఎన్నడూ నేను మాట్లాడనిది, ఇక మాట్లాడబోనిది!” కూడలి: “ఈ కూడలి దగ్గర ఎందుకు కూర్చున్నావు ముల్లా?” “ఏనాటికైనా ఇక్కడ ఏదో ఒకటి జరగకపోదు, అప్పుడిక్కడ ఒక పెద్ద గుంపు పోగవుతుంది. అప్పుడు ఇంత దగ్గరగా చూసే అవకాశం రాకపోవచ్చు, అందుకని నేనిప్పుడే కూర్చొని చూస్తున్నాను.” అనువాద మూలం
పూర్తిగా చదవండి

తస్లిమా… థాకరే… సొతంత్రం… కోపం ఎందుకు వస్తుంది?

ఇండియా నేల, ఏవైనా, తెలంగాణ, తెలుగు నేల నాగరాజా
నిన్న గాక మొన్న ప్రవక్తను, ఇస్లాంను అవమానించిందని ఒక్క ఆడదానిని కొట్టడానికి 40 మంది “మగవాళ్ళ” ఠీ.వీ. ప్రదర్శన చూసాం కదా! అది మొదటి ఎపిసోడ్ అయితే, రెండవ ఎపిసోడ్ థాకరే గురించి ఎదో రాసారని ఔట్‌లుక్ పత్రికపై మరికొందరు (మగవాళ్ళు?) దాడి చేసారు. భేష్! మిగతా రాజకీలు ఎక్కువ శాతం చూస్తూ ఉన్నాయి కానీ మొరగడం లేదు, ఫరవాలేదు. భారత్ ‘మత’కీ జయ్. మర్చిపోయాను సొంతంత్రం వచ్చి 60 ఏండ్లయ్యిన సందర్భంగా (తెలంగాణా వారికి మినహా) [...]
పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్ణారావు: మొట్టమొదటి అనుభవాలు

ఏవైనా, ధీ యానం నాగరాజా
నిజం దేవుని కెఱుక. ఇతరులను నిందించి రాళ్ళు విసరడం,అవమానించడం అన్నది మానవ చరిత్రకు కొత్తేమీ కాదు. ఎందరో మహాత్కులు కూడా ఎదుర్కొన్నదే - బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదు ప్రవక్తకు కూడా ఈ ద్వేషం దాడులు తప్ప లేదు. తస్లిమా నస్రీన్ ఒక ప్రవక్త కాకపోయినా - దాడి చేసిన వారు మాత్రం నీచులే అందులో సందేహం లేదు. ఓట్లు, మత రాజకీయాల వల్ల నేడు దోషులు స్వేచ్ఛగా తిరుగుతుండవచ్చు, అంత మాత్రాన పాఠకులు వారి భవిష్యత్తు గురించి అనుమానాలు [...]
పూర్తిగా చదవండి

తెలుగు ఫాంట్ల తయారీ పద్ధతి

ఏవైనా, తెలుగు ఫాంట్లు నాగరాజా
కావలసిన వస్తువులు: 1. ఫాంట్ క్రియేటర్ (30 రోజులకు ఉచితం :) 2. ఫాంటు / ఫాంట్ల సాఫ్టువేరు 3. ఒక ఇమేజి ఎడిటరు - విండోస్ ఎక్షపీ పెయింట్ లేదా పెయింట్.నెట్ (నేను వాడింది) తయారీ: • ముందు మీకు కావలసిన ఫాంటులో అక్షరాలను టైపు చేసుకోండి. మచ్చుకు: అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ… క కా కి కీ కు కూ కె కే కై కొ కో కౌ… • ఆ తరువాత టైపు చేసుకున్నది కాపాడుకొని (సేవ్ చేసుకొని) ఫాంటు సైజును [...]
పూర్తిగా చదవండి

తెలుగు యూనికోడు ఫాంటు – సృజన

ఏవైనా, తెలుగు నేల, తెలుగు ఫాంట్లు నాగరాజా
ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారు ఇదివరకు సృజన అనే ఓపెన్ టైప్ ఫాంటును విడుదల చేసారు [[లంకె]]. అది నా కంప్యూటర్‌లోనికి ఎలా , ఎప్పుడువచ్చిందో గుర్తుకురావడం లేదు. srujana.otf నా కంప్యూటరులో పనిచేయలేదు. ఓ.టీ.ఎఫ్ నుండి టి.టి.ఎఫ్‌కు మార్చి విడుదల చేస్తున్నాను. కొద్ది మార్పు-చేర్పులతో మరో అందమైన ఫాంటుగా మార్చుకోవచ్చును. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ కాబట్టి జి.పి.ఎల్ లైసెన్సుతో విడుదల చేసి ఉంటారు అని ఊహిస్తున్నాను. ప్రస్తుత స్థితిలోని ఫాంటులో కేవలం తెలుగు అక్షరాలు మాత్రమే ఉన్నాయి, [...]
పూర్తిగా చదవండి

కొత్త యూనికోడు ఫాంటు – బాపు

ఏవైనా, తెలుగు నేల, ఫాంటు నాగరాజా
ఇటీవలే యూనికోడులో బాపు ఫాంటును తయారుచెయ్యాలి అని అనుకున్నాం కదా! కాబట్టి దాని తాలూకు ప్రయత్నాలు మొదలుపెట్టాను. 0.1 వెర్షను తయారయ్యింది. కేవలం ఎప్పుడో కానీ వాడని, (ఫాంటు ఫైల్లో లేని :-) బండి ర - ‘ఱ’ లు కొన్ని సంస్కృతంలో వాడే క్లిష్టమైన వత్తులు తప్ప మిగతావన్నీ తయారయ్యాయి. పోతనను ఆధారం చేసుకొని తయారుచేయడం జరిగింది. ఈ యూనికోడు ఫాంటులోని అక్షరాలను బొమ్మల రూపంలోకి మార్చి తిరిగి ఫాంటు రూపానికి మార్చినా, ఆ అక్షరాల మూలాలు, [...]
పూర్తిగా చదవండి

నాగలోకం: సినిమా శరణం గచ్చామి

ఏవైనా, జ్ఞాపకాలు, తెలుగు నేల, నాగలోకం నాగరాజా
ఈ మధ్య మన వాళ్ళు (బిలాగరులు) కొందరు సినిమాల గురించి బాగా విశ్లేషిస్తూ ఆసక్తికరంగా రాస్తున్నారు. ఆలోచనలలో ఎంతో నిజాయితీ, విశ్లేషణలో ఎంతో లోతు కనిపిస్తుంది. ఈ సందర్భంగా తెలుగు సినిమా వాళ్ళ గురించి నా రెండు అణాలు: మనకు మన సినిమాల గురించి ఉన్నంత అవగాహన మన సినిమా వాళ్ళ గురించి లేదనడం పెద్ద ఆశ్చర్యమయిన విషయమేమీ కాదు. హాలీవుడ్ పత్రికలు వ్రాసినంతగా మన పత్రికలు సినిమా రంగానికి చెందిన వారి గురించి రాయకపొవడమో, లేక బూతు [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం – 35: బాలుని ఉత్తరం

ఏవైనా, నవ్వులు నాగరాజా
ఒక చిట్టి బాలుడు వెయ్యి రూపాయలు కావాలని రెండు వారాలు దీక్షగా ప్రార్థన చేసాడు. ఏమీ కాలేదు. ఆ తరువాత వెయ్యి రూ. కోసమని దేవునికి ఉత్తరం వ్రాద్దామని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే తపాలా కార్యాలయం వారు దేవుడు, ఇండియా అనే అడ్రసును చూసారో, వెంటనే దానిని ప్రెసిడెంటుకు మళ్ళించారు. దేశాధ్యక్షుడు అది చూసి ఎంతో సంతోషించి, ముచ్చటతో ఆ బాలునికి 50 రూ. పంపించమని సెక్రటరీని ఆదేశించాడు. ఆ బాలునికి 50 రూపాయలు చాలు అని ఆయన [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS