Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నాగరాజా, ది సాఫ్ట్‌వేర్-అభ్యర్ధి

అమెరికా నేల, ఏవైనా నాగరాజా
మళ్ళీ క్లయింటు-పని వేట. నిన్న ఇంటర్వూ కోసం అని మిచిగాన్‌లోని ఆన్ ఆర్బర్ పట్టణం వెళ్ళాను. ఆన్ ఆర్బర్ అమెరికాలోని పది ఉత్తమ నగరాల్లో ఒకటి, నిజంగా అద్భుతం. పేరుగాంచిన యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఎప్పుడూ యవ్వనం తొలకిసలాడుతూనే ఉంటుంది. ఇంటర్వూ ముందుగా అనుకున్నదానికంటే, ఓ గంటన్నర ముందుగానే అయిపోయింది. మా ఇంటిల్లిపాదికీ యూనివర్సిటీ ఎదురుగా ఉన్న న్యూయర్క్ పిజ్జా డిపో అంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఓ నాలుగు/అయిదు [...]
పూర్తిగా చదవండి

వలస గొంతుక

అమెరికా నేల, ఏవైనా నాగరాజా
ఇమ్మిగ్రేషన్‌వాయిస్.ఆర్గ్ అనే సేవా సంస్థ కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్ ఓసే పట్టణంలో మొన్న (శనివారం, జూలై 14, 2007 నాడు) ఒక శాంతియుత ప్రదర్శనను జరిపింది. ముఖ్యంగా భారతీయులు, కొందరు చైనా తదితర జాతీయులు ఇందులో పాల్గొన్నారు. జూలై 2న జరిగిన ఇమిగ్రేషన్ భాగోతానికి సంబంధించి, చట్టబద్ధ వలసకారులలో అసంతృప్తి, అసహనం నెత్తికెక్కింది. చట్టబద్దంగా ఈ దేశంలో ఏండ్ల కొద్దీ ఉన్నా తమకు న్యాయబద్ధంగా రావలసిన హక్కులు రాలేదని ఫిర్యాదు. నిజానికి ఇటువంటి వాతావరణానికి మన వాళ్ళు [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం – 33, 34: వంటింట్లో దొంగ, తలపాగా

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
33. ముల్లా నసీరుద్దీన్ కుటుంబం అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న కాలం. ఒకరోజు ఆయన భార్య మధ్యరాత్రి నిద్ర లేపి చెవిలో గుసగుసలాడింది, “నసీరుద్దీన్, వంటింట్లో ఎవడో దొంగ చొరబడ్డాడు!” “ష్.. పిచ్చిదానా…!”, జవాబిచ్చాడు నసీరుద్దీన్, “వాడికి ఏదైనా దొరకనీ, అప్పుడు మనం దాన్ని లాక్కుందాం!” 34. ముల్లా నసీరుద్దీన్ తెలివి, చమత్కారం ఎప్పుడు కూడా అతనికి సహాయపడుతుండేది. చదువు రాని ఒకాయన ఉత్తరాన్ని పట్టుకొని వచ్చాడు. - ముల్లా, దయచేసి ఈ ఉత్తరాన్ని నాకు చదివిపెట్టగలవు. నసీరుద్దీన్‌కు ఆ ఉత్తరంలో ఒక్క ముక్క కూడా అర్థం [...]
పూర్తిగా చదవండి

బాపు రామాయణం

అమెరికా నేల, ఏవైనా, తెలుగు నేల నాగరాజా
ఎల్లలు లేని వాడు కళాకారుడు, సూర్యుని వలె ప్రకాశిస్తూనే ఉంటాడు! మచ్చుకు మన బాపును (మహాత్ముడు కాదు పరమాత్ముడు) గుర్తు చేసుకోవచ్చు. ఎక్కడో అమెరికా రాష్ట్రంలో, ఉత్తర ఇల్లినాయి విశ్వవిద్యాలయంలోని థాయ్ సాంస్కృతిక పత్రికలో బాపు బొమ్మల రామాయణాన్ని పెట్టుకొని చదువుకుంటున్నారు. ఔరా! బాపూని పొగడక, ఆ పేరును పలుకక పోతే అంతర్జాతీయంగా మన తెలుగు నాలుకలు చచ్చుబడ్డాయన్నట్టు, కాబట్టి ఎల్లప్పుడు మనం ఆయన్ని తలుస్తూనే… ఉండాలి. అలాగే మనం బాపూ ఫాంటును యూనికోడులో మార్చేందుకు ఎంత ఖర్చయినా ఫరవాలేదు [...]
పూర్తిగా చదవండి

డె.బ్లా.స: మొదటి ఫోనావేశం

అమెరికా నేల, ఏవైనా నాగరాజా
డెబ్లాస అనగా, డెట్రాయిట్ బ్లాగర్ల సమావేశం, అనగా మరేమిటో కాదు - నేను, కొత్తపాళీ గారు ఇద్దర్లో ఎవరైనా మరొకరిని ‘కాల్చేయడం’ :) కొత్తపాళీ గారు మన బిలాగరులు కొందరికి కొత్త కావచ్చు కానీ నాకు మాత్రం కాదు. 2000 చివర, మొట్టమొదటిసారి కవి, మిత్రుడు తమ్మినేని యదుకుల భూషణ్ సోపతితో (స్నేహితంతో) ఒక తెలుగు సాహితీ సమావేశానికి వెళ్ళాను. చక్కటి తెలుగు పుస్తకాలను చదవడం, అందులోని విషయాలను చర్చించి, అభిప్రాయాలు పంచుకొనే ఒక [...]
పూర్తిగా చదవండి

సవ్వడి కూర్పు #2 – ఆత్మశాంతి

అమెరికా నేల, ఏవైనా, సవ్వడి నాగరాజా
మన కలలు, కోరికలు గుర్రాలు కావచ్చు లేదా కార్లు కావచ్చు, ఏమయినా కావలసింది దక్కకపోయినప్పుడు పొందే దు:ఖం వర్ణనాతీతం. కోరికలను త్యజించమన్నది ఇందుకేనేమో? (బాణీ తయారీ పోయిన ఏడాది…) ఆత్మశాంతి అంకితం: యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ ఆండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు…
పూర్తిగా చదవండి

ఆయ్‌ఫోన్

అమెరికా నేల, ఏవైనా నాగరాజా

పూర్తిగా చదవండి

కొత్త పదం: త్రెలుగు

ఏవైనా, కొత్త పదాలు నాగరాజా
త్రెలుగు: 1. తెలుగు పదాలు ఉన్నా సంస్కృత పదాలను వాడుట. 2. సంస్కృత పదాలు వాసి, తెలుగు పదాలు నాసి అనే పాత భావాన్ని పాటించుట. ఇప్పుడు, ముఖ్యంగా బ్లాగులు వచ్చిన తరువాతి పరిస్థితులు వేరు కానీ, వెనుకట అంతా సముస్క్రుత పండితులే. వారు నేర్చుకున్న పాండిత్యం అంతా తెలుగు పుస్తకాల్లో పెట్టి, ప్రజలకు అర్ధం అయినా కాకున్నా పట్టించుకోక తెలుగు భాషను ఎన్నో రకాలుగా డొక్కు పట్టించారు. ఇప్పుడంటే ఆంగ్లం గురించి భయపడుతున్నాము కానీ, ఈ పండితులు కంప్యూటరు వైరసుల్లాగా [...]
పూర్తిగా చదవండి

గోడ మీది బొమ్మలు

ఏవైనా నాగరాజా
ఒక దేవుని పటం ఎలాగైతే భక్తిని కలిగిస్తుందో, అలాగే కంప్యూటరుపై చక్కని వాల్‌పేపరు మన మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. నేను చాలాకాలం నుండి ఈ సవిటులోని బొమ్మలతో నా ఆపిల్ మెకింటొష్ తదితర కంప్యూటర్లను అలంకరిస్తున్నాను. ఆపిల్ వాడి గ్రాఫిక్స్‌ను తలదన్నే రీతిలో ఈ వాల్‌పేపర్లు ఉంటాయి. మీకు ఇంతకన్నా మంచి వాల్‌పేపర్లు కనిపిస్తే నాకు చెప్పగలరు. లంకె: http://interfacelift.com/wallpaper/ వాల్‌పేపర్లకు సంబంధించి వాసిలో ఇటువంటి సవిటు మరొకటి నేను చూడలేదంటే [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం – 32: ఉద్యోగ పరిక్ష

అనువాదం, ఏవైనా, నవ్వులు నాగరాజా
ఒక కంప్యూటరు కంపెనీలోని ఒకే ఉద్యోగానికి ఇద్దరు యువ ఇంజనీర్లు పోటీపడ్డారు. వారిద్దరి అర్హతలు సరి సమానంగా ఉన్నాయి. ఎవరిని తీసుకోవాలో నిర్ణయించటానికి ప్రాజెక్టు మేనేజరు ఒక చిన్న పరిక్షను పెట్టాడు. పరిక్షలో ఇద్దరు ఒక ప్రశ్నకు మాత్రమే జవాబు తప్పుగా రాసారు. మొదటివాడి వద్దకు వెళ్ళి మేనేజరు, “మేము అతనికి ఈ ఉద్యోగాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము, మా కంపెనీలో చేరాలనుకున్నందుకు కృతజ్ఞతలు” అని చెప్పాడు. “మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, మా ఇద్దరికీ 9 ప్రశ్నలే కరెక్టుగా [...]
పూర్తిగా చదవండి

తాజ్ మహల్ -> తేజో మహాలయ్ (శివాలయం) ???

ఏవైనా, విశ్వకోశం నాగరాజా
మన తాజ్ మహల్ ప్రపంచపు ఏడు అద్భుతాల నుండి పోతుంది అని మన బ్లాగర్లు రాస్తే, ఎ.అర్.రెహమాన్ పాటను చూసి, ఆవేశంతో వోటు వేద్దామని బయలుదేరి, ఒకసారి తాజ్ మహల్ గురించి వెతికితే పురాతనమైన శివుని గుడి అని కనబడింది. కాసేపు పరిశోధన చేసి చివరికి హింస, మోసం లేకుండా (అని అనిపించిన) అద్భుతాలకు వోటు వేశాను. మీకు తప్పుగా అనిపిస్తే “సారీ” - s..o..r..r..i.. బొమ్మలతో సహా తాజ్ మహల్ శివుని గుడి అని ఇక్కడ చదివి సంపూర్ణంగా [...]
పూర్తిగా చదవండి

నాగాయణం: శ్రీ’మతి’ ఒక బహు-మతి

ఏవైనా, నాగాయణం నాగరాజా
మనం ఒక వస్తువును కొనేటప్పుడు ఆ వస్తువును గురించి రీసెర్చి చెయ్యడం సహజం, చెయ్యాలి కూడా. మన చదువులు ఇటువంటి బుద్ధిని ప్రోత్సహిస్తాయి. తప్పు లేదు. అయితే, చావుకీ పెళ్ళికీ ఒకే మంత్రం సామెత మాదిరిగా ప్రతీ విషయాన్ని ఒక ఫార్ములా లాగ పాటించడం జీవితానికి అంత ఉపయోగకరం కాదు అని నా అభిప్రాయం. సగటు బ్రహ్మచారి ఒక అమ్మయిని చూసి, మాట్లాడి లేదా రెండు మూడు ప్రశ్నలను అడిగి, ఆ తరువాత ఇంట్లో వాళ్ళకే కాక [...]
పూర్తిగా చదవండి

సడి కూర్పు (musical composition) #1 – ఓరుగల్లు

అమెరికా నేల, ఏవైనా, సవ్వడి నాగరాజా
మడిసన్నాకా కూస్తంత కళా పోసన ఉండాలి గదా అని గత సంవత్సరం ఈ కూర్పును తయారు చేశాను. ఇటువంటివి ఇంకా అయిదారు దాకా ఉన్నాయి (అసంపూర్తిగా), ఇది మీకు నచ్చి మిగతా వాటిని టపా పరం చెయ్యాలంటే, బ్లాగర్లు కొంచెం (చాలా) ప్రో-త్సాహం ఇవ్వక తప్పదు :) Orugallu.mp3 ఇకపోతే, ఆపిల్ సఫారీ బ్రౌజరుపై ఇది పాడటానికి మొరాయిస్తుంది, ఫైరుపాక్సులో ప్రయత్నిస్తే వినవచ్చు!
పూర్తిగా చదవండి

సెయింట్ ఇస్సా జీవితం

అనువాదం, ఏవైనా, పుస్తకాలు నాగరాజా
నాకు చిన్నప్పటి నుండి ఏసుక్రీస్తు అంటే ఎంతో గౌరవం, ప్రేమ మరియు ఆసక్తి. కొన్ని సందర్భాలలో నేను ఆ గౌరవం ప్రకటించినప్పుడు దాన్ని నా బలహీనతగా తీసుకొని మత ప్రచారం చేయబోయి భంగపడినవారు కూడా ఉన్నారు. పన్నెండు సంవత్సరాలకు ముందు కాశ్మీరులో అయిదారు సంవత్సరాలు గడిపి వచ్చిన ఉన్న కీ.శే. మా రమణ మామయ్యతో (పుస్తకాల్లో చదివినట్టు) ఏసుక్రీస్తుకు కాశ్మీరుతో సంబంధం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం విన్నప్పుడు నా తల దిమ్మతిరిగిపోయింది. నమ్మశక్యంగా అనిపించలేదు. అధికారికంగా [...]
పూర్తిగా చదవండి

నెక్కొండ.ఆర్గ్

ఏవైనా, తెలుగు నేల నాగరాజా
నెక్కొండ.ఆర్గ్ wordpress.com వారు వాడే wordpress multi-user సాఫ్టువేరుతో తయారుచేయబడిన సైటు. కొందరు రాత్రింబవళ్ళు వికీపీడియాల్లో పనిచేసేవారికి, ప్రముఖ బ్లాగర్లకు మరియు ముఖ్యంగా తెలుగు బాగా తెలిసి కంప్యూటర్లతో ఎక్కువ పరిచయం లేని ప్రముఖులకు ఇక్కడ చోటు… మొత్తం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి, తెలుగు అనువాదాలు, ప్లగిన్సు, పరికరాలు వగైరా వగైరాలు చేతనైన పని… మీ అభిప్రాయాలను ఇక్కడ తెలియజేయండి.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS