Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పెళ్ళి తీర్చిన సమస్య!

కబుర్లు, తెలుగు పద్యం, తోటి బ్లాగర్లు Sriram
కొంతమందికి పెళ్ళికాక సమస్య. చాలా మందికి పెళ్ళయ్యాకా ప్రతీదీ సమస్యే. మరి పెళ్ళివల్ల సమస్య తీరడం ఏమిటి అంటారా, నేను చెప్పేది లోకకళ్యాణం కోసం జరిగిన పెళ్ళిగురించి. అదే సీతారామకళ్యాణం. అందుకే ఇప్పటికీ ఎవరికైనా సమస్యలొస్తే రాముడి గుడిలో కళ్యాణం చేయిస్తే తీరతాయి అని నమ్ముతారు. ఊకదంపుడుగారి దెబ్బకి నాకు కూడా నా బ్లాగులో ఇది జరపక తప్పలేదు. ఊకదంపుడు పేరే కానీ ఈయన పోటు చాలా గట్టిగా వేస్తారు. మచ్చుకి ఈయనిచ్చిన సమస్య చూడండి: “ధరణీసుతగనెను పతిని తరుణుల [...]
పూర్తిగా చదవండి

వానపాటులు

కబుర్లు, భారతదేశం, సంగీతం, సినిమా పాటలు, సినిమాలు Sriram
మొన్న రాత్రి మా ఊళ్ళో ఎడతెగని వర్షం. నేను ఇంటికి చేరుకున్నాకే మొదలవ్వడంతో నేను చాలా ఆస్వాదించాను. చదువరిగారు చెప్పినట్టు చీమచతురత చూసి కాదులెండి. నాకిష్టమైన వానపాటని గుర్తు చేసుకుంటూ.  ప్రపంచ చలనచిత్ర చరిత్ర లో భారతీయచిత్రాలకి మాత్రమే ప్రత్యేకమైన ఈ వానపాటల్లో, నాకు ఈ పాటలో నేను నటించి ఉంటే బాగుండును అని అనిపించిన పాట అది. ఏమిటీ? మీ దృష్టి ఎటుపోయిందీ? ఈ పాట అనుకుంటున్నారా? ఐతే మీరు ఇది చూడలేదన్నమాటే!    సలీల్ చౌధురి ఖమాజ్ రాగంలో [...]
పూర్తిగా చదవండి

క్రమాలంకారం కాళ్ళు మళ్ళీ పట్టుకుని…

కబుర్లు, తెలుగు పద్యం, తోటి బ్లాగర్లు Sriram
తాంత్రిక శాస్త్రం చదువుకునే రోజుల్లో మా కళాశాల విద్యార్ధులందరికీ గౌతమ బుద్ధుడు ఆదర్శం. నిజమైన జ్ఞానం చెట్టుకిందే లభిస్తుందని గట్టిగా నమ్మేవాళ్ళం. అందుకే ఎక్కువ సమయం కళాశాల ఆవరణలో మా విభాగపు భవనానికి ఎదురుగా ఉన్న చెట్టుకింద గడిపేవాళ్ళం. అలా చెట్టుకింద కూచుని జ్ఞానం కోసం ఎదురుచూసే రోజుల్లో మేము కాలక్షేపంకోసం చేసే పనుల్లో ముఖ్యమైనది Dumb Charades   (మూకాభినయం) అనే ఒక ఆట. దానికోసం ఎక్కడెక్కడ కష్టమైన సినిమాపేర్లూ వెతికి సంపాదించడం, వాటిని అమ్ములపొదిలో సిద్ధంగా ఉంచుకోడం మాకు అలవాటుగా [...]
పూర్తిగా చదవండి

మరింత వినోదం…

కబుర్లు, భారతదేశం, రాజకీయం Sriram
వయ్యస్సార్ ని రీడిఫ్ వాడు ప్రశ్నలు వేసాడు. వాళ్ళకేం తెలుసు, ఈయనకి మీడియా అంటే కోపం అని. అప్పటిదాకా బానే ఉన్నాయన చివరలో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగగానే ఎలా మారిపోయాడో. పాపం షీలా భట్!
పూర్తిగా చదవండి

ఇత్యర్ధలు కూరా, ఇతిభావలు పులుసూ…

కబుర్లు, పుక్కిటి పురాణాలు, భారతదేశం Sriram
అనగనగా గోదావరీ తీరాన ఒక గ్రామంలో ఒక వేదపండితుడు. మహా జ్ఞాని. పొద్దునే లేచి స్నానం,సంధ్యా కానిచ్చి అనుష్ఠానం,స్వాధ్యాయం(సెల్ఫ్ స్టడీ) చేసుకోడం - ఆ తర్వాత విద్యార్ధులకి వేదమూ, “ఇత్యర్ధః (ఇదీ దీని అర్ధం), ఇతి భావః (ఇదీ దీని భావము)” అంటూ దానికి అర్ధమూ పాఠాలు చెప్పుకోడం - ఇదీ ఆయన దైనందిక జీవితం.   ఉన్న కాస్త భూమిలో పండే గింజలూ, పెరట్లో పండే కూరలూ ఆ కుటుంబానికి భోజ్యం. ఎప్పుడూ బయటకెళ్ళి రూపాయి సంపాదించిన వ్యక్తి కాదు. [...]
పూర్తిగా చదవండి

స్వాతంత్ర్య ఫలాలు

కబుర్లు, భారతదేశం Sriram
ఈ మధ్యనే మన అరవయ్యో స్వాతంత్ర దినోత్సవం గట్టిగా జరిపేసుకున్నాం. బ్లాగుల్లో కూడా చాలామంది సందడి చేసారు. కానీ ఈ స్వాతంత్ర్యానికి సార్ధకత ఎంత వరకూ అంటూ గాఢ నిట్టూర్పులు విడిచిన వాళ్ళే ఎక్కువ. వీళ్ళందరినీ చూసి నేను కూడా కొంత సందిగ్ధంలో పడ్డాను కానీ, ఈరోజు బయటపడ్డ ఈ వార్త నా సందేహాన్ని పటాపంచలు చేసింది. స్వతంత్ర భారత న్యాయశాఖామంత్రివర్యులు నెహ్రూ కుటుంబానికి మన స్వాతంత్ర ఫలాలు రుచిచూపించారు. స్వయంగా ఖత్రోచిని ఇంటిదగ్గర దిగబెట్టి వచ్చారు. ఇంకా ఏమిటి [...]
పూర్తిగా చదవండి

టెల్గూ అంత వీజీయా…!

కబుర్లు, భాష Sriram
చిన్నప్పటినుంచీ నేను ఎక్కువగా చదివిన వార్తాపత్రిక “ఈనాడు”. పత్రిక రాగానే మొదటి పేజీని ఒక చూపుచూసి వెంటనే వెనక్కి తిప్పి క్రీడా వార్తలు చదవడం నాకు అలవాటు. అప్పట్లో క్రికెట్ అంటే కొంచెం ఎక్కువ పిచ్చే ఉండేది. దూరదర్శని మాధ్యమం ఇప్పట్లా అభివృద్ధి చెందలేదు కనక ఎక్కువగా వార్తలకోసం పత్రికల మీదే ఆధారపడేవాళ్ళం. “పీకల్లోతు కష్టాల్లో భారత్”, “భారత్ ఘోర పరాజయం” వంటి వార్తలే ఐనా ఎంతో ఆసక్తిగా చదివడం అలవాటయ్యింది అలాగే. అదే అలవాటున ఈరోజు పత్రిక [...]
పూర్తిగా చదవండి

కొత్త సమస్యలు

కబుర్లు, తెలుగు పద్యం, తోటి బ్లాగర్లు Sriram
పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడం. కొత్తపాళీగారిని చూసి నేను పద్యాలు రాయడం. రాసిన తర్వాత దురదకొద్దీ వాటిని బ్లాగడం. పర్యవసానంగా ఊకదంపుడుగారు ఈ బాంబు పట్టుకొచ్చి నా బ్లాగులో పడేసారు. మిడతంభొట్లు మీ చేతిలో చిక్కేసాడండీ అని పేరు చెప్పి శరణు కోరడానికి అహం అడ్డు. ఏమిటి కర్తవ్యం? పోరాడడం తప్ప వేరే మార్గం కనపడలేదు. తప్పదు, మీరు భరించాల్సిందే! సమస్య: “గర్భముదాల్చెను పురుషుడు గంగలొ మునగన్” నా పూరణ: కం|| గర్భాదానపు తంతును       నిర్భీతిగ శంతనుండు నీటనె నెరపెన్       గర్భము పండగ గంగకు        గర్భము దాల్చెను, [...]
పూర్తిగా చదవండి

ఆకాశదేశాన ఆషాఢమాసాన…

కబుర్లు, పుస్తకాలు, భారతీయ సాహిత్యం Sriram
తెలుగులో మనకి నెలల పేర్లు ఉన్నా, ఈ రోజుల్లో లౌకిక వ్యవహారాలలో వీట్లని మనం అనుసరించకపోవడం వల్ల, ఏ నెల ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో మనకి తెలీదు. కానీ వీటికి ఉన్న ఒక మినహాయింపు ఆషాఢమాసం. దానికి కారణం ఆషాఢమాసం పేరుతో దండిగా వ్యాపారం చేసుకునే బట్టల దుకాణాలవాళ్ళ వ్యాపార ప్రకటనలే. ఈ సంవత్సరం ఆషాఢమాసం వచ్చిందని తెలియగానే నాకు మేఘసందేశం సినిమాలోని ఈ పాట గుర్తొచ్చింది. దానితో కాళిదాసు మేఘసందేశం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. ఉండబట్టలేక [...]
పూర్తిగా చదవండి

సంచలనాత్మక నవల: ఆవరణ

కబుర్లు, పుస్తకాలు, భారతదేశం Sriram
పుస్తకాలు చదవడం అనే అలవాటు ఈరోజుల్లో ఎంత తగ్గిపోయిందో మనందరికీ తెలిసినదే. అందులోనూ పుస్తకాన్ని కొని చదవడమంటే! అభిమాన హీరో సినిమా ఎంత చెత్తగా ఉన్నా పదిహేనోసారి చూడడానికి ఎటువంటి ఆలోచనా చేయని జనాలు పుస్తకం మీద పది రూపాయలు ఖర్చుపెట్టడానికి కూడా ఇష్టపడటంలేదు. అలాంటిది ఒక ప్రాంతీయ భాషలో రాసిన నవల విడుదలైన నాలుగు నెలలోనే తొమ్మిది సార్లు పునర్ముద్రింపబడింది అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఆ నవలే ప్రముఖ కన్నడ రచయిత, చరిత్రకారుడు అయిన ఎస్.ఎల్.భైరప్ప [...]
పూర్తిగా చదవండి

సింహఘడ్, శివాజీ, సీసపద్యం…

కబుర్లు, భారతదేశం Sriram
గమనిక: ఈ పోస్ట్ సినిమాలగురించి కాదు. ఈ ఫోటోలో మీరు చూస్తున్నది పూనే సమీపంలోని సింహఘడ్ కోట ప్రవేశద్వారం (మరిన్ని చిత్రాలకై నా ఫోటోబ్లాగు చూడండి). ముష్కరమూకల దారుణాలని అడ్డుకుని భారతజాతికి ఆత్మగౌరవాన్ని గుర్తుచేసిన వీర శివాజీ అనుచరులు దుష్కరమైన పశ్చిమకనుమల ఇరుకు మార్గాలనుంచి ప్రయాణించి, ఉడుములని కోటగోడలెక్కించి, వాటిని పట్టుకు ఎక్కి, ఔరంగజేబు సైన్యాన్ని కకావికలం చేసిన అద్భుత సాహసకృత్యానికి నిలువెత్తు నిదర్శనం. అక్కడ కోటగోడలు చూసిన నాకు, వారి ధైర్యాన్ని, సాహసకృత్యాన్ని తలచుకుంటే వళ్ళు గగుర్పొడిచింది. గుండెధైర్యం అంటే [...]
పూర్తిగా చదవండి

తెనాలిరాముడి వికటకవిత్వం, నా పైత్యం (కొనసాగింపు…)

కబుర్లు, తెలుగు పద్యం, తోటి బ్లాగర్లు, పుక్కిటి పురాణాలు Sriram
“కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్” దోమ నోట్లో మదపుటేనుగులు దూరాయి అని దీనర్ధం. తెనాలి రామకృష్ణ సినిమా చూసిన తెలుగువారందరికీ ఈ సమస్య సుపరిచితమే. తెనాలి రాముడిని చూసి ఓర్వలేని కొంతమంది తోటి పండితులు ఒక కాపలా వాడిచేత ఈ సమస్యని అడిగిస్తారు. ఈ విషయాన్ని గ్రహించలేకపోతే ఆయన తెనాలిరాముడెందుకౌతాడు. అందుకే కాపలా వాడిని అడ్డంపెట్టి వాళ్ళని బండబూతులు తిడతాడు. గంజాయి తాగి నానా జాతులతోటీ కలిసి కల్లుతాగి పేలుతున్నావా లం*కొడకా, ఎక్కడరా దోమనోట్లో ఏనుగులు దూరాయి? అని ఇలా [...]
పూర్తిగా చదవండి

తెనాలి రాముడి వికటకవిత్వం, నా పైత్యం!

కబుర్లు, తెలుగు పద్యం, తోటి బ్లాగర్లు, పుక్కిటి పురాణాలు Sriram
తెనాలి రాముడి పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేవి చిన్నప్పుడు విన్న చమత్కారపు కధలూ అందులోని హాస్యమూను. నిజానికి ఇలా పిల్లలని ఆకట్టుకునే చారిత్రక పాత్రలు మనకి చాలానే ఉన్నాయి. బీర్బల్, మర్యాద రామన్న వగైరాలు. కానీ తెనాలి రాముడి ప్రత్యేకత ఏమిటంటే ఆయన పిల్లలతో పాటు పెరుగుతూ వస్తాడు. అమ్మ వారి చేతుల్లోని రెండు గిన్నెల్లో పాయసమూ తాగేసిన కధ వినే వయసు దాటేసరికి గూని చాకలి వాడి కధ దొరుకుతుంది. ఇంకొంచెం పెద్దయ్యేప్పటికి భావతురంగం కధ [...]
పూర్తిగా చదవండి

raajasekharaa nee pai mOju teeralEduraa

కబుర్లు Murali
రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా...మళ్ళీ సోమవారం వచ్చేసింది. Back to work... కనపడిన అందరూ, ఒకరితో ఒకరు, "మీ వా...
పూర్తిగా చదవండి

ఫలరాజం!

కబుర్లు, తెలుగు పద్యం Sriram
వేసవికాలం వచ్చిందంటే చాలు, ఆంధ్రదేశంలో ఏ ప్రాంతం నుండి బయలుదేరే రైలు ఎక్కినా మనలని స్వాగతించేవి మామిడి పళ్ళ ఘుమఘుమలూ, బెర్తులమీద ఆవకాయ డాగులూ! విశ్వవ్యాప్తమైన తెలుగువాడి “వాడికి” ఈ రెండు పదార్ధాలూ ముఖ్యకారణమని నాకు అనిపిస్తుంది. “వాడి” సంగతేమో కానీ ఎక్కువగా తింటే వేడి చేస్తాయని గిట్టనివాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు కానీ అది మనం పట్టించుకోవలసిన విషయం కాదు. ఈ విషయంలో నాకు మా పక్కింటి దివాకరం గాడు ఆదర్శం. ఒకేరోజు పరకన్నర మామిడి పళ్ళు [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS