May 04
నేను సైతం…(55 పదాల్లో)
కబుర్లు Sriram
“పురుషాహంకారం! నాకు ఇష్టం లేదంటే వినరేం?”
“అది తప్పనిపిస్తోంది…భర్త మాట వినడం ధర్మం అనుకో కనీసం…”
“ఈ ధర్మపన్నాలు నాకు చెప్పకండి.రాముడు సుఖపడ్డాడా…రావణుడు సుఖపడ్డాడా? ఎందుకొచ్చిన ధర్మం?”
“ఇప్పుడు ఈ చర్చ అవసరమా?”
“సర్లెండి. అక్కడ హాల్లో పిల్లలు గోల చేస్తున్నారేమిటో చూడండొకసారి..”
“ఏముందీ…బుజ్జిగాడు వాళ్ళక్క దగ్గర చాక్లేట్ లాక్కున్నాడుట. అది ఏడుస్తోంది…”
“మీరు చేసిందే…మగ పిల్లాడు కదా అని గారం. తప్పురా అని చెప్పి రెండు తగిలించరు ఎప్పుడూ…”
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి