నీ అంత స్వచ్చంగా నవ్వలేకపోతున్నాను.
నవ్వడం మర్చిపొయినాను,
కానీ నవ్వుని మాత్రం కాదు.
నవ్వినప్పటి ఆనందపు జ్ఞాపకాన్ని కాదు,
నవ్వులోని తేలికతనాన్ని కాదు.
నీ అంత స్వచ్చంగా నవ్వలేకపోతున్నాను.
నీ కళ్ళు, పెదాలు, పళ్ళు
బుగ్గలు, చేతులు, కాళ్ళు
జుట్టు, నుదురు, తనువంతా
నవ్వుతుంది సహజంగా, స్వతహాగా.
నీ అంత స్వచ్చంగా నవ్వలేకపోతున్నాను.
నా బోటి నల్గురు నవ్రోగస్తులతో కలసి,
కాలనీ చివర పైన్ చెట్ల పార్క్ నీడలో
నవ్వును ప్రాక్టీస్ చెయ్యడం మొదలెట్టినాను
ఓ ఎక్సర్సైజులా, ఓ ఎక్కాల పుస్తకంలా!
(అయినా, )
నీ అంత స్వచ్చంగా నవ్వలేకపోతున్నాను.
ఇకఇకల నవ్వు, పకపకలనవ్వు,
చక్కిలిగింతల నవ్వు, సోడా నవ్వు,
పగలబడి నవ్వు, ముద్దుల [...]
పూర్తిగా చదవండి