Aug 10
వాళ్ళంతా నిద్రపోతున్నారు
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు chavakiran
వాళ్ళంతా నిద్రపోతున్నారు
ప్రశాంతంగా, శాస్వతంగా
రాతి గోడల క్రింద
పిడుగులు పడ్డా, ఉరుములుకైనా,
ఇంచకూడా కదలకుండా
వాళ్ళంతా నిద్రపోతున్నారు.
గతమంతా మర్చిపోయి
భవిష్యత్తు పై దిగులు లేకుండా,
జాగా కోసం పోట్లాటలు లేకుండా
కూటికోసం కోటి కోసం తిప్పలు లేకుండా,
వాళ్ళంతా నిద్రపోతున్నారు,
ప్రశాంతంగా, శాశ్వతంగా
నాక్కూడా అక్కడో రిజర్వేషనుంది!
ఏదో ఓ రోజు వెళ్ళి నిద్రపోవాలి
ప్రశాంతంగా, శాశ్వతంగా.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి