Aug 03
అనుకోనివి కొన్ని…
మీకు తెలుసా! మీకు తెలుసా!
* థీరీటికల్ గా ఆలోచిస్తే టెలివిజన్ సాధ్యమేమోగానీ, నా దృష్టిలో దాని సృష్టి అసాధ్యం. దాని డెవలప్ మెంట్ గురించి ఆలోచించడం కూడా వేస్ట్. - 1926లో టెలివిజన్ లో ముఖ్యభాగమైన కేథోడ్ రే ట్యూబ్ సృష్టికర్త లీ డే ఫారెస్ట్
* ప్రపంచం మొత్తం మీద ఐదుకన్నా ఎక్కువ కంప్యూటర్లకు మార్కెట్ లేదు. - 1946లో ఐ.బి.యం. సంస్థ చైర్మన్ థామస్ జె. వాట్సన్.
* టెలిఫోన్ ను ఒక సమాచార సాధనంగా గుర్తించడానికి దానిలో చాలా లోపాలు వున్నాయి.ఇది మనకు ఏమాత్రం ఉపయోగం లేని వస్తువు. - 1876లో వెస్ట్రన్ యూనియన్ మేథావుల సంఘం
* నా కాలంలోనే కాదు, ఇంకా ఎన్నో సంవత్సరాలకు గానీ మహిళలకు ప్రధానమంత్రి అయ్యే యోగం రాదు. - మార్గరెట్ థాచర్
* అసలు ఆ సౌండే మాకు నచ్చలేదు. గిటార్ మ్యూజిక్ త్వరలో కనుమరుగైపోతుంది. - 1962లో డెక్కా రికార్డింగ్ కంపనీ (గిటార్ ను ప్రధాన సంగీత సాధనంగా వినియోగిస్తున్న బీటిల్స్ ను తిరస్కరిస్తూ)
* టీవీకున్న పెద్ద ప్రాబ్లెం ఏమిటంటే ప్రజలు టీవీ స్క్రీన్ కు కళ్ళప్పగించి చూడాలి. ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి