Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఉత్తమా యిల్లాలు

యెంకి పాటలు హాసిని
ఉత్తమా యిల్లాలి నోయీ! నన్నుసురు పెడితే దోస మోయీ! నిదరలో నిను సూసి సెదిరే నేమో మనసు! పొరుగు పోరంత నా సరస కురికారంట! ఉత్తమ యిల్లాలి నోయీ......... "ఏలనే నవ్వం"ట! "ఏడుపేలే " యంట పదిమంది ఆయింత పగలబడి నారంట ఉత్తమ యిల్లాలి నోయీ......... గాలెంట వోయమ్మ! దూళెంట వోయమ్మ! యిరుగు పొరుగోరంత యిరగబడి నారంట! ఉత్తమా యిల్లాలి నోయీ........ యీబూది ఒకతెట్టే! యీ పింకొకతె తట్టె, నీలు సిలికె దొకతె! నిలిసి సూసే దొకతె!
పూర్తిగా చదవండి

పిల్లోడు

యెంకి పాటలు హాసిని
యెంకితో తీర్తాని కెల్లాలి సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెల్లాలి! నెత్తిమూటల నెత్తుకోవాలి! కొత్త మడతలు దీసి కట్టాలి! అడవి దారుల యెంట నడవాలి! బరువు మారుసుకొంట పక్కున నవ్వాలి! తాతనాటి పూవు తలవాలి! దారిపొడుగున కీసు లాడాలి! ’తప్పు నీదే ’ యంట దెప్పాలి! దైవ మున్నాడాని దడిపించుకోవాలి! యెంకితో తీర్తాని కెల్లాలి సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెల్లాలి! కతకాడ
పూర్తిగా చదవండి

పంట సేలకే పయనం

యెంకి పాటలు హాసిని
యీ యేపునో యావు ఆ యేపునో యావు జోడావులకు నడుమ నా యెంకి యూడు జోడుగా నిలుసుంటె నా యెంకి ఆట లాడతా కలిసుంటె నా యెంకి నన్నె సూడుమన్నట్లుండు నా యెంకి! యీ యేపునో యేరు ఆ యేపునో యేరు యేళ్ళ రెంటికి నడుమ నా యెంకి తలను పాలకడ వెత్తుకొని నా యెంకి సేత పూలు పుణుకుకొంట నా యెంకి నన్నె పోలుండుమంటాది నా యెంకి యీ కాడనో కొండ ఆ కాడనో కొండ కొండ కోనల నడుమ నా యెంకి పాల కుండ దించుకొని నా యెంకి గుడికి దండ మెడతా వుంటె
పూర్తిగా చదవండి

సాటేలా

యెంకి పాటలు హాసిని
సాటేలా ? నీకు మాటేలా? సిన్న తనమేలా? సిగ్గేలా? ఆ సీమ యీ సీమ అంద చందాలు తిన్నంగ నిను సూసె దిద్దుకుంటారు ! సాటేలా ? నీకు మాటేలా? సిన్న తనమేలా? సిగ్గేలా? ముందు మన పాపణ్ణి కింద దిగనీరు యెంకి కో వంటారు! యెత్తుకుంటారు! సాటేలా ? నీకు మాటేలా? సిన్న తనమేలా? సిగ్గేలా? యెంకొక్క దేవతై యెలిసె నంటారు యింటింట పెడతారు యెంకి నీ పేరు! సాటేలా ? నీకు మాటేలా? సిన్న తనమేలా? సిగ్గేలా? రచన : నండూరి సుబ్బారావు
పూర్తిగా చదవండి

కనుపాప

యెంకి పాటలు హాసిని
అద్దమే లంటాది అద్దాలు తెలుప ముద్దు మాటల కెంకిదే ముందు నడక కంటెదర నా కాడ కనిపాపలో నీడ సూసుకుంటా నొసట సుక్కెట్టుకుంటాది! అద్దమే లంటాది అద్దాలు తెలుప ముద్దు మాటల కెంకిదే ముందు నడక కనిపాపలో నీడగని నవ్వుకుంటాది మొకము సిటిలిస్తాది రకరకము లవుతాది! అద్దమే లంటాది అద్దాలు తెలుప ముద్దు మాటల కెంకిదే ముందు నడక కంటి దరి నా కాడ కంట నీ రెడతాది కనిపాపలో నీడ మన నదరగొడతాది! అద్దమే లంటాది అద్దాలు తెలుప
పూర్తిగా చదవండి

పడవ

యెంకి పాటలు హాసిని
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు! పాడలేనే యెంకి పదము లీ రొదలో! పడవ సల్లగ నడిపి పదము సదు వంటావు! కస్సుమంటూ యేరు గాలి నెగదోసింది! ఆపలేనే యెంకి యీ పడవ యిసురు! వోరుగాలే పాట దారి కడతా వుంది ! బేటి కురికే పాట నోట నోట గొడతా వుంది! ఆపలేనే యెంకి యీ పడవ యిసురు! తల మలుపుకొని పాట తరలింది కామోసు! దేముడల్లే లోనె తిరుగుతున్నా దేటో! ఆపలేనే యెంకి యీ పడవ యిసురు! యెన్నెలంటే పాట కెంత మనసవుతాదో పాట సాగేతలికి పయన
పూర్తిగా చదవండి

ముందు గతి

యెంకి పాటలు హాసిని
ఎక్కవే, కొండ నెక్కవే! నా సక్క నెంకి యెక్కవే! కొండ నెక్కవే! పక్క సూపులు మాని పయికెల్లి పోదాము! యెక్కవే,కొండ నెక్కవే! నా సక్క నెంకి నెక్కవే! ముందు నువ్వుంటే నే కిందా నిలబడగలను నీ నీడనే తొక్కు కొని సులువుగ రాగల యెక్కవే,కొండ నెక్కవే! నా సక్క నెంకి నెక్కవే! నాలు గడుగు లేసి నవ్వుతో పిలు యెంకి పిలుపు నవ్వే నాకు ములగఱ్ఱ కాగలదు! యెక్కవే,కొండ నెక్కవే! నా సక్క నెంకి నెక్కవే! తెల్లని నీ పైట సల్లంగ
పూర్తిగా చదవండి

గోవు మా లచ్చిమి

యెంకి పాటలు హాసిని
గోవు మా లచ్చిమికి కోటి దణ్ణాలు! మనిషికైనా లేని మంచి పోకిళ్ళు! యెంకితో కూకుండి యింత సెపుతుంటే తనతోటి మనిసల్లె తల తిప్పుతాదీ! గోవు మా లచ్చిమికి కోటి దణ్ణాలు! మనిషికైనా లేని మంచి పోకిళ్ళు! యెంకి సరసాలాడ జంకుతా వుంటే సూసి సూడక కన్ను మూసి తెరిసేదీ! గోవు మా లచ్చిమికి కోటి దణ్ణాలు! మనిషికైనా లేని మంచి పోకిళ్ళు! కోరి కూకుని నేనె పోరు పెడుతుంటే తల్లిడిపి పిల్లల్లె తెల్ల పోతాదీ! గోవు మా లచ్చిమికి
పూర్తిగా చదవండి

ఆనాటి నావోడు

యెంకి పాటలు హాసిని
ఆనాటి నావోడు సెందురూడా! అలిగి రాలేదోయి సెందురూడా! "యెంకి మనమిద్దరమే యెవ్వరొ"ద్దన్నాడు; "యీ సేలు యీ తోట లింక నీ"వన్నాడు-- మాటాడుతుండంగ సెందురూడా! మచిదా పోయేవు సెందురూదా! "కలకాల మీదినమె నిలుసు మన" కన్నాడు "గాలికైనా తాను కవుగిలీ"నన్నాడు-- నను చూసి నవ్వేవు సెందురూడా! నాయనా నా ముద్దు సెందురూడా! నా కాసి సూశాడు నీ కాసి సూశాడు "మద్దె సెంద్రుడె మనకు పెద్దమని"సన్నాడు-- కన్నీరు నీకేల సెందూరూడా!
పూర్తిగా చదవండి

వుత్త మాటలు

యెంకి పాటలు హాసిని
"వుత్త మాటలు నీవి పొ"మ్మందిరా యెంకి "కొత్త్ పాటలు పాడుకొ"మ్మందిరా వూరెల్త నని పలికి మా రేస వేసుకొని "సకినాల పా లొచ్చు సకిన మడు" గన్నాను "వుత్త మాటలు నీవి పొ"మ్మందిరా యెంకి "కొత్త పాటలు పాడుకొ"మ్మందిరా "యీ రోజు నీ రాజు వూరెల్లినా"డంటి "యేరాపులో రూపు మారిపోయిం"దంటి "వుత్త మాటలు నీవి పొ"మ్మందిరా యెంకి "కొత్త్ పాటలు పాడుకొ"మ్మందిరా
పూర్తిగా చదవండి

తెరచాటు

యెంకి పాటలు హాసిని
లేపకే నా యెంకి లేపకే నిదరా యీపాటి సుకము నేనింతవర కెరుగనే లేపకే నా యెంకి.... కలలోన నా యెంకి కతలు సెపుతున్నాది వులికులికి పడుకొంట ’ఊ’కొట్టుతున్నాను! లేపకే... కతలోని మనిసల్లె కాసింతలో మారి కనికట్టు పనులతో కత నడుపుతున్నాది! లేపకే... రెక్కలతో పైకెగిరి సుక్కల్లే దిగుతాది కొత్త నవ్వుల కులుకు కొత్త మెరుపుల తళుకు లేపకే... తెలివి రానీయకే కల కరిగిపోతాది ఒక్క నేనే నీకు పెక్కు నీవులు నాకు! లేపకే...
పూర్తిగా చదవండి

త బ్బి బ్బు

యెంకి పాటలు జ్యోతి
రవల వెలుగుల గంగ రమ్మందిరా... యెంకి... శివమెత్తి తానాలు చేసిందిరా! సిరులతో ముత్యాల సరుల చెల్లాటతో సిరిసిరీ మువ్వలా చిందులా గంతులూ రవల వెలుగుల గంగ రమ్మందిరా... యెంకి... శివమెత్తి తానాలు చేసిందిరా! సికలోన సిక కలిపి మొకము మొకమూ కలిపి వెలుగు దేవతకు చ క్కిలిగింత లెట్టింది! రచన: నండూరి సుబ్బారావు ప్రచురణ:నవరత్నబుక్ హౌస్
పూర్తిగా చదవండి

సంద్రం

యెంకి పాటలు జ్యోతి
యింతేనటే సంద్ర మెంతో యనుకొంటి మనకూ సూరీడుకూ మద్దెనుందేనా! నా వీతి నా జాతి నా వారె పోనాడ మరిగి నా మనసు సా గరమాయె నన్నారు ఇంతే... నా రాజె నా కాసి వేరు సూపులు సూడ కడలివలె నా గుండె కలతబడె నన్నారు ఇంతే... సత్తె మెరిగిన పాప పొత్తిళ్ళలో దాగి కన్నీరు మున్నీరు కరిగిస్తి నన్నారు అంచు దరి లేదంటె అమృత ముంటాదంటె దేము డంతుంటాదొ ఏమొ యనుకొన్నాను ఇంతే... రచన :నండూరి సుబ్బారావు ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
పూర్తిగా చదవండి

కుచ్చితాలు

యెంకి పాటలు జ్యోతి
ఎంకి పులకల కలలు కెడమీయ గోరి అడగడుగు నిలిచేను ఆలకించేను పెదవి సివురాకులను కదలింప గోరి అడిగిందే అడిగేను ఆలకించేను ఎంకి కళ్ళను జారు జంకు కనగోరి పయనాలు నటియించి బయలు దేరేను రచన : నండూరి సుబ్బారావు ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
పూర్తిగా చదవండి

కో కో కో

యెంకి పాటలు జ్యోతి
కొండ తిరిగీ కోన తిరిగీ చీర చెరుగున కూరిచితిరా గరికపూలా కంఠమాలా! ఆవు నడిగీ అడవి నడిగీ పూల గిన్నెల పొందు పరచితి గుమ్మ పాటు కొమ్మ తేనె చాయవన్నెల లోయ బయలా పచ్చిక మెత్తల పానుపు పైన ’కో క’ యందు’కో’ యనరా రచన : నండూరి సుబ్బారావు ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS