Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కిమ్ కర్తవ్యమ్

వర్తమానం రానారె
ముఖ్యమంత్రి: "పాకిస్థాను, బంగ్లాదేశులలో మనకు నిఘావ్యవస్థలేదు. ఈ వైఫల్యం పోలీసుయంత్రాంగానిది కాదు." -- నేరం నాది కాదు, ఆకలిది. ప్రధానమంత్రి: "తీవ్రవాద బాధితులకోసం శాశ్వత సహాయ నిధిని ఏర్పాటు చేస్తా." -- ఏంజేస్తున్నావే కోడలా? ఉలగబోసి మల్లా ఎత్తుకుంటాండా అత్తమ్మా. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల అధికారి: "రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి." -- మొక్కై వంగనిది మానై వంగునా!? "ఈ ఘోరకలికి
పూర్తిగా చదవండి

సహనశీలతా? చేతగానితనమా?

నా ఏడుపు, వర్తమానం చరసాల
గుండెల మీద చెయ్యేసి చెప్పండి మనది సహనశీలతా? గుండె నిబ్బరమా? చేతగాని తనమా? ఖచ్చితంగా చేతగాని తనమే. ఇందుకు బోలెడన్ని ఋజువులు. నీవు తన్నగలిగిన వాడివై వుండికుడా తన్నలేదంటే అది సహనం. తన్నలేక శాంతి గురించి మాట్లాడితే అది బలహీనత. అప్పుడెప్పుడో అశోకుడు పటించింది అసలుసిసలు శాంతి మంత్రం. వాడెవ్వడో వచ్చి 18 సార్లు దండెత్తితే 17 సార్లు గెలిచామని చెప్పుకోవడం కాదు వాజమ్మల్లాగా, అసలు వాన్ని రెండోసారి మళ్ళి ఎలా తొంగిచూడనిచ్చామనేది అసలు ప్రశ్న. ఒక్కరా ఇద్దరా… రాజన్న [...]
పూర్తిగా చదవండి

ఉగ్రవాదం - ప్రభుత్వ వాదం

నా ఏడుపు, వర్తమానం చరసాల
హైదరాబాదులో లుంబీనీ పార్కు మరియు గోకుల్ చాట్ భండార్‌లలో జరిగిన బాంబు పేలుడులో అసువులు బాసిన ప్రతిఒక్కరికీ అశ్రునయనాలతో అంజలి ఘటిస్తూ… ***                               ***                                  *** మన ముఖ్యమంత్రిగారి స్పందన చూస్తుంటే రక్తం వుడికిపోతోంది. అసలీయన స్పందించడంలో (ప్రతిపక్షాలన్నట్లు ఎదురుదాడి చేయడంలో) సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. తర్వాతి ప్రభుత్వాలూ ఇదే పంధాలో వెళితే… అమ్మో భయమేస్తోంది. ప్రశ్న: ఈ సంఘటనకు భాధ్యులెవరు? ఇది ప్రభుత్వ నిఘా వైఫల్యం కాదా? జవాబు: ఎంతమాత్రం కాదు. దీనికి భాధ్యులు బంగ్లా/పాకిస్తానులో వున్న ఉగ్రవాద మూకలు. ఈ [...]
పూర్తిగా చదవండి

మనం పిల్లలకేమి నేర్పుతున్నాం?

నా ఏడుపు, వర్తమానం చరసాల
రోజూ హత్య వార్తలు, ఆత్మ హత్య వార్తలు, అత్యాచారాలు మామూలు విశయాలయిపోయి మనసు వాటికి స్పందించడం మానేసింది. అయితే ఇవాళ్టి ఈ వార్త “మితృణ్ని చంపిన పిల్లలు” చదివితే మన భవిష్యత్ సమాజం ఎలా వుండబోతోందో అన్న భయంకర వేదన మనసును మెలిపెడుతోంది. వాళ్ళ వయసు ఇంచుమించు ఎనిమిదేళ్ళు! కోపాలూ, తాపాలూ, శతృవులూ, మితృలూ అన్న భావనలు చిగురించే వయసు. ఉదయాన జరిగిన పోట్లాట సాయంత్రానికి మరచిపొయ్యే వయసు. ఆడుతూ పాడుతూ బతకాల్సిన ఈ వయసులో ఓ చిన్న [...]
పూర్తిగా చదవండి

వీడింకో విలన్

వర్తమానం చరసాల
మొన్న తస్లీమా తమకు వ్యతిరేకంగా రాసిందని ఆమె మీద భౌతికంగా మజ్లిస్ రౌడీలు ప్రెస్ క్లబ్ సాక్షిగా దాడికి పాల్పడితే ఇప్పుడు “ధాకరే”ను విలన్ అన్నందుకు “అవుట్‌లుక్” మీద శివసైనికుల మూక దాడి చేసింది. వీళ్ళు చేసే పనులన్నీ విలన్ పనులే కానీ ఆ మాట అంటే మాత్రం కోపం. థాకరే విలనో కాదో అతను లేదా అతని అనుచర మూక చేసే పనులే చెబుతున్నాయి. మళ్ళీ అదే మాట ఒక పత్రిక చెబితే అంత వులికిపాటు ఎందుకు? [...]
పూర్తిగా చదవండి

ఎవర్రా బేవకూఫ్ మతాన్ని కించపరిచింది?

వర్తమానం చరసాల
ఒరే ఒవైసీ, నీకు గానీ నీకు వంతపాడుతున్న ఆ వానరమూకకుగానీ అసలు బుద్దన్నది వుందా? ఓ మహిళ మీద అదీ విదేశీ మహిళ మీద భౌతికంగా దాడికి దిగి ఆ మతపు ప్రతినిధిగానో లేక ఆ మతావలంబుల ప్రతినిధిగానో చెప్పుకునే సిగ్గులేని XXX నీకు మతి అన్నది వుందా? మీరేమయినా తాలిబాను ప్రతినిధులమనుకుంటున్నారా? లేక లాడెను అనుచరులమనుకుంటున్నారా? ఇది భారతదేశమనుకుంటున్నారా లేక మీరుంటున్నది ఆఫ్ఘనిస్తాన్ పర్వత గుహల్లోనా? మీరు భారత ప్రజాస్వామ్యపు రాజ్యాంగం ప్రకారం ఎన్నికయిన ప్రతినిధులా [...]
పూర్తిగా చదవండి

వైవీయూలో ఎరుకల భాష

Telugu త్రివిక్రమ్ Trivikram

పూర్తిగా చదవండి

వైరం వర్ధిల్లు గాక!

వర్తమానం చరసాల
ఈనాడు, కాంగ్రెస్‌ల మద్య ఇంచుమించు యుద్ద వాతావరణం నెలకొన్నట్లే వుంది. దాడులు, ప్రతి దాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఈ వినోదం మనకు చూడటానికి బాగానూ వుంది. నాకైతే ఇలాంటి పరిస్థితి రాష్ట్రానికి ఆరోగ్యకరం అనిపిస్తోంది.
పూర్తిగా చదవండి

చందమామ రావే…జాబిల్లి రావే…

Telugu త్రివిక్రమ్ Trivikram

పూర్తిగా చదవండి

నా కళ్ళముందర పుట్టింది, పోనూ పోయింది

చరిత్ర, వర్తమానం చరసాల
లక్కిరెడ్డి పల్లె శాసనసభా నియోజక వర్గం నాకు వూహ తెలిసాక పుట్టింది. ముందది సమితిగా వుండేది. ఆ తర్వాత తాలూకా కేంద్రంగా, నియోజక కేంద్రంగా అయ్యింది. ముందునుంచీ కూడా రాజగోపాల్ రెడ్డి ఎక్కువ సార్లు గెలిచాడనుకుంటాను. సమితి ప్రెసిడెంటుగా ఒకసారి గెలిచిన గడికోట మోహన్ రెడ్డి ఈ ఒక్కసారే శాసన సభ్యుడుగా గెలిచారు. రామసుబ్బా రెడ్డి, రామసుభ్భా రెడ్డి కొడుకు హరినాధ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కొడుకు రమేశ్ రెడ్డిల యుగం వచ్చింది. ఇప్పుడిక పునర్విభజనలో లక్కిరెడ్డి పల్లె [...]
పూర్తిగా చదవండి

మాలల గోల దేనికి?

వర్తమానం చరసాల
మాదిగల పోరాటం ఎందుకో తెలిసిందే. SC రిజర్వేషన్లలో అధిక భాగం మాలలే అనుభవిస్తున్నారని తమ వాటా తమకు దక్కటం లేదని వారి బాధ. నిజంగా అలా జరుగుతుంటే వాళ్ళ గోడు వినవలసిందే. ఒకవేళ జరగట్లేదని అనుకుంటే ఇప్పుడు వర్గీకరణ వల్ల పోయేదేమీ లేదు. జరుగుతూ వుంటే వర్గీకరణ ద్వారా మాదిగల వాటా మాదిగలకు ఇచ్చినట్లవుతుంది. ఇది సరే మరి మాలల పోరాటం దేని మీద? ఏమి కావాలని? వర్గీకరణను ఎందుకని వ్యతిరేకిస్తున్నట్టు? ఇప్పుడు వీధి పోరాటాల ద్వారా జరగని [...]
పూర్తిగా చదవండి

వచ్చే నెలలో డిజిటల్ చందమామ!

Telugu త్రివిక్రమ్ Trivikram

పూర్తిగా చదవండి

డేరా సఛ్ఛా సౌద్

వర్తమానం చరసాల
అసలేమి జరుగుతోందక్కడ? ఈ గుర్మీత్ రామ్ రహీం సింగ్ గానీ, డేరా గానీ అసలు అవేంటో ఈ అల్లర్లు జరిగేదాకా తెలియదు. తీరా ఏంటని కాస్తా చరిత్ర పరికిస్తే 1978లో జరిగిన ఇలాంటి అల్లర్లే ఖలిస్తాన్ వుద్యమానికి వూపిరులూదాయని తెలిసింది. కాకుంటే ఇప్పుడు డేరా అప్పుడు నిరంకారి. ఇప్పుడు గుర్మీత్ రామ్ రహీం సింగ్ అప్పుడు బలదేవ్ సింగ్. అప్పుడు ఆయనా గురు గోబింద్ సింగ్ ను అనుకరించాడనీ సిక్కు మతాన్ని కించ పరిచాడనీ అల్లర్లు జరిగాయి. బలదేవ్ [...]
పూర్తిగా చదవండి

మన దారెటు

నా ఏడుపు, వర్తమానం చరసాల
మొన్న చంద్ర మోహన్ అన్న చిత్రకళను అభ్యసిస్తున్న తెలుగు విధ్యార్థిని గుజరాత్‌లో అరెస్టు చేసి నాలుగు రోజులు జైలులో పెట్టారట! కారణం అతను ఎవర్నో కొట్టాడనో, రాగింగ్ చేసి వేధించాడనో, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేశాడనో కాదు. అతను వేసిన చిత్రాలు హిందూ చాందసవాదులకు నచ్చక పోవడం వల్ల. అప్పుడొకసారి హుస్సేను గారు సరస్వతీ దేవిని అసభ్యంగా గీశారని ఆయన బొమ్మలన్నీ తగులబెట్టి నానా రాద్దాంతం చేశారు. ఎవ్వరూ వాలైంటైన్స్ రోజు జరుపుకోవద్దని ఓ సేనాధిపతి ఫత్వా జారి చేశారు. ఇప్పుడేమొ [...]
పూర్తిగా చదవండి

తల్లుల్ని తయారుచెయ్యాలి

నా ఏడుపు, వర్తమానం చరసాల
“తల్లుల్ని తయారుచెయ్యాలి” — అన్న ఈ అంభానాధ్ గారి మూల వ్యాసం మీరిక్కడ చదవచ్చు. ఏ విషయమైనా ఈయన కుండ బ్రద్దలు కొట్టినట్లు ఏ సంకోచమూ లేకుండా రాసేస్తారు. నాకు ఈయనలోని ఈ సుగుణాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. అయిటే ఈ గుణం వల్ల ఈయనలోని కుళ్ళు, అమాయకత్వం అన్నీ బట్ట బయలు అవుతాయి. ఈ మధ్య ఈయన రాసిన “భీమవరం బిక్కుబిక్కు” అనే కథనం చదవండి. ఈయన ఏ అభూత కల్పనలో నివసిస్తున్నారో అర్థం అవుతుంది. ఇక [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS