Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నాదు జాతి నాదు దేశము నాదు భాష -2

వ్యాసాలు teluguhcu
కవి, సమాజం ఎన్నటికీ వేరు కాదు. రాసేది ధనుర్భంగమనే అంశమే అయినా, నాడు తన చుట్టూ ఉన్న ఉద్యమ స్ఫూర్తి కరుణశ్రీ ‘ఉదయశ్రీ’ కావ్యంలో ఎంత చక్కగా ధ్వనింపజేశాడో చూడండి. “చెల్లరే విల్లువవిరుచునే నల్లవాడు పది పదారేండ్లయెల రాచ పడుచువాడు సిగ్గు సిగ్గంచు లేచి గర్జించినారు కనులు గుట్టిన తెల్ల మొగాల వారు” “’నల్లవాడను’ పదమును భారతజాతీయ వీరునికి ‘తెల్లమొగాల వార’న్న పదమును ఇంగ్లీషు దొరలకు సంకేతముగా గ్రహింపవచ్చున”ని సినారె అభిప్రాయపడ్డారు.
పూర్తిగా చదవండి

ప్రపంచ మాండలీకం – గ్లోబిష్!

వ్యాసాలు teluguhcu
డా//పమ్మి పవన్ కుమార్ హైదరాబాదు విశ్వవిద్యాలయం.      రకరకాల ఆధిపత్యాల నుంచి ఒక్క ఉదుటున బయటపడగలిగే తారకమంత్రం  ఏదీ మన దగ్గర లేదిప్పిడు. వ్యక్తిగానైనా, వ్యవస్థకైనా ఈ సూత్రం పనిచేస్తుంది. ఆధిపత్యం బలవత్తరమయినప్పుడు వ్యక్తులు, వ్యవస్థలు దాని వెంటబడిపోవడం సహజం. కాలక్రమంలో అదెంతటి తిరోగమన శక్తిగా పనిచేయగలదన్న తర్కానికి ఇక్కడ తావు లేదు. మనుగడ కోసం పోరాటంలో అంతా సహజంగానే కనిపిస్తుంది. భావ ప్రసారానికి, భావ గ్రహణానికి వాహికగా  ఉండే భాషల విషయంలోనూ ఇదే జరగబోతుందా? అవుననే అంటున్నారు గ్లోబిష్ [...]
పూర్తిగా చదవండి

లజ్జాకరం

వ్యాసాలు ప్రజాకళ
- ఓల్గా ప్రెస్‌క్లబ్‌లో తస్లీమా నస్రీన్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించారు. నిజంగా అది హైదరాబాద్ నగర సంస్క­ృతికి, సాహిత్య వాతావరణానికి మచ్చ తెచ్చే సంఘటన. ఆ సంఘటనను ఖండించి ప్రజాస్వామిక విలువలకోసం నిలబడిన వారందరినీ అభినందించాలి. గురువారం జరిగిన పుస్తకావిష్కరణ సభకు తస్లీమా నస్రీన్ వస్తున్నారన్న విషయం ఆవిడొచ్చేవరకూ అక్కడున్న ఎవరికీ తెలియదు. నేనామెను చూసి ఆశ్చర్యపోయాను. ఆమె వస్తున్నారని తెలిస్తే మరికొంతమంది రచయిత్రులను పిలిచే పనిగదా అంటే ఈ విషయం బైటికి పొక్కితే గొడవలవుతాయని రహస్యంగా [...]
పూర్తిగా చదవండి

దేశ కాలావసరాలకు అనుగుణంగా ఎంచుకున్న రచనా ప్రక్రియలు – వరవరరావు

వ్యాసాలు ప్రజాకళ
తను చేస్తున్న పని యొక్క స్థూల ప్రయోజనాన్ని ఏ కళాకారుడూ సంపూర్ణంగా తోసివెయ్యరాదు… కవి తన రచన యొక్క ఆశయాన్ని తృణీకరించరాదు. భోజనం దగ్గర ఎంత నాజూకూ, అభిరుచీ ఉన్నా అభ్యంతరం లేదు- భోజనం చెయ్యటం యొక్క ఉద్దేశాన్ని ఏమరకుండా ఉంటే సరి. -కొ.కు., 1940 సమాజం గురించి నిర్దిష్టమైన అభిప్రాయలు ఉండి, సమాజానికి తాము అందివ్వవలసిన సందేశం ఉన్నదనుకొన్నప్పుడు లేదా, సమాజంలో నిర్వహించ వలసిన తక్షణ, అనివార్య కర్తవ్యం ఉన్నదనుకొన్నప్పుడు- రచయితలు ఎక్కువకాలం కాల్పనిక కళారూపాలకే అంటిపెట్టుకొని ఉండడం [...]
పూర్తిగా చదవండి

సిద్ధాంతాలు – నిత్య జీవితం : కొడవటిగంటి రోహిణీప్రసాద్

వ్యాసాలు ప్రజాకళ
నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ మా నాన్నగారిని, ఏ వ్యాపకము లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోగా చూసినట్లు గుర్తు లేదు. నిద్రపోయినప్పుడు తప్ప తక్కిన సమయంలో చదవడమో, రాయడమో, తోటపనో ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. మనస్సుకూ, దేహానికీ సోమరితనం అనేది లేకపోవడం ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్య లక్షణం అనుకుంటాను. ప్రసిద్ధ వ్యక్తులు తమ ఆంతరంగిక జీవితంలో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలని సామాన్యంగా అందరికీ కుతూహలంగా ఉంటుంది. మా నాన్నగారి విషయంలో ఈ సంగతి చెప్పడం చాలా సులభం. [...]
పూర్తిగా చదవండి

ఉద్యమాలు నిర్వహించడమే తప్పా? – జి. హరగోపాల్

వ్యాసాలు ప్రజాకళ
నక్సలైట్ ఉద్యమాల మీద గత 35 ఏళ్ళుగా జరుగుతున్న చట్టాతీత బలప్రయోగాన్ని ఏ కారణంచేత సమర్థించినా, అంగీకరించినా ఆ విచ్చలవిడి బలప్రయోగాన్ని సమాజంలోని ఏ ఉద్యమంమీదైనా, ఏ రాజకీయ వర్గం మీదైనా ఉపయోగించే ప్రమాదం ఉన్నదని హక్కుల సం ఘాలు పదేపదే చెబుతూ వస్తున్నాయి. చట్టవ్యతిరేక రాజ్య బలప్రయోగం ఎవ్వరిమీద జరిగినా దాన్ని వ్యతిరేకించే ప్రజాస్వామిక స్పృహ కొరవడితే ఆ బలప్రయోగమే అధికారంలో ఉన్నవారిని ఎవరిని ప్రశ్నించినా, విభేదించినా ఆ అణచివేత ప్రశ్నించేవారి దాకా వస్తుందని హక్కుల ఉద్య [...]
పూర్తిగా చదవండి

కుటుంబరావు – విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 1

వ్యాసాలు ప్రజాకళ
- త్రిపురనేని మధుసూదనరావు సాహిత్యంలో మూఢవిశ్వాసాల్ని గురించి బాధపడేవాళ్ళు చాలామంది వున్నారు. ప్రకృతి మీదా, సమాజం మీదా శాస్త్రీయమైన అవగాహన కలిగించవలసిన సాహిత్యం మూఢవిశ్వాసాల్ని ప్రచారం చేయటం అన్యాయమే. కులాల్నీ, మతాల్నీ సమర్థించడం, దేవుళ్ళనీ, దెయ్యాల్నీ ఆవాహన చేయటం, స్త్రీని కించపరచటం వంటి పనుల్ని సాహిత్యం ద్వారా చెయ్యటం సామాజిక ద్రోహమే. ప్రగతిశీలవాదుల్లో ఈ విషయంలో ఏకాభిప్రాయం వుండటం కూడా సంతోషించదగ్గ విషయమే. గురజాడ వంటి సంస్కరణవాదుల కంటే పూర్వం వున్న కవులందరూ సాహిత్యంలో మూఢవిశ్వాసాల్ని చెప్పినవాళ్ళే. మనిషి కంటే [...]
పూర్తిగా చదవండి

కుటుంబరావు – విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 2

వ్యాసాలు ప్రజాకళ
- త్రిపురనేని మధుసూదనరావు “ఈనాడు రచయితలకు పెద్దగా భాషాజ్ఞానమూ, పాండిత్యమూ ప్రాచీన సాహిత్య పరిచయమూ అవసరం లేదన్నది ఏనాడో నిర్ణయమయింది. కానీ వారికి ప్రపంచజ్ఞానమూ జీవితానుభవమూ, సామాజిక దృక్పథమూ కూడా అవసరం లేదన్నది రానురాను రుజు వవుతున్నది, ఇతివృత్తాలలోగాని, పాత్రపోషణలోగాని, సన్నివేశాలలోగాని ఎలాటి వాస్తవికతా అవసరం లేదు” (కొ.కు.) అని వ్యంగ్యంగా అన్నాడు. భాషాజ్ఞానం, పాండిత్యం, ప్రాచీన సాహిత్య పరిచయం ఈనాటి కవులకి అవసరం అనేది కొ.కు. అభిప్రాయం. వీటికంటే ముఖ్యం ప్రపంచజ్ఞానం, జీవితానుభవం, సామాజిక దృక్పథం వాస్తవిక రచనలు [...]
పూర్తిగా చదవండి

సలీం వెండిమేఘం నవల – ముస్లిం స్త్రీ జీవిత చిత్రణ

పుస్తక సమీక్షలు, వ్యాసాలు ప్రజాకళ
- డా. దార్ల వెంకటేశ్వరరావు ముస్లిం జీవితాల్లోనూ కనిపించని చీకటి కోణాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పటికే చాలామంది కవిత్వం రూపంలో బలంగానే అభివ్యక్తీకరించగలుగుతున్నారు. కేవలం కవిత్వంలోనే కాకుండా మిగిలిన ప్రక్రియల్లో కూడా ముస్లిం సాహిత్యం విస్తరిల్లుతున్నది. సలీం ‘వెండి మేఘం’ పేరుతో ఒక గొప్ప నవల రాశారు. ముస్లిం జీవితాలతో మమేకం కాలేకపోతున్న దూదేకుల జీవితాల్ని, ముస్లిం స్త్రీ స్థితిగతుల్ని చూపుతూ ఈ నవలను వర్ణించగలిగారు. ‘అన్వర్’ అనే స్త్రీ పాత్ర చుట్టూనే కథ [...]
పూర్తిగా చదవండి

Online లో ఆరుద్ర – సాహిత్యం

అభిప్రాయాలు, ఉత్తరం, చర్చ, వ్యాసాలు, సమీక్షలు డా.వి.ఆర్ . దార్ల
నాగరాజు గారు ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని విల్‌డ్యూరాంట్ రచించిన స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ ...
పూర్తిగా చదవండి

పీడితుల పక్షాన నిలబడి యుద్ధం చేయడమే కవి కర్తవ్యం…

జూలై 2007, వ్యాసాలు గుంటూరు శేషేంద్ర శర్మ
తెలుగు సాహిత్యంలో విలక్షణ గుంటూరు కవి శేషేంద్ర శర్మ. పలు భారతీయ భాషల్లో అనువాదమై పలు దేశాల్లో వినిపిస్తున్న భారతీయ ఆధునిక వాణి ఆయనది. శ్రీశ్రీ తెచ్చిన కావ్య వస్తువునకు నూతనాభివ్యక్తిని సంతరించిన యుగకవి శేషేంద్ర. కావ్యాత్మక రచనా శైలితో పద్య కవిత్వం నుంచి వచన కవిత్వం వరకు, చివరికి విమర్శ వరకు సాగిన ఆయన శైలి కవిత్వానికే పట్టం కట్టింది. కలం పట్తిన నాటి నుంచి కవిత్వం పంటను యాభైకి మించి పండించి రాశులుగా [...]
పూర్తిగా చదవండి

గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్

జూలై 2007, వ్యాసాలు డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఉస్తాద్ అమీర్ ఖాన్ మనదేశంలో స్వాతంత్ర్యానంతరకాలంలో హిందుస్తానీ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధుడుగా వెలిగిన గాయకుడు. అగ్ర గాయకుడైన బడేగులాం అలీఖాన్ కు దాదాపు సమ ఉజ్జీగా ఆయన పేరు పొందాడు. ఆయన సంగీతాన్ని పరిచయం చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.
పూర్తిగా చదవండి

నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు

జూలై 2007, వ్యాసాలు వేలూరి వేంకటేశ్వర రావు
తానా వారు వెల్చేరు నారాయణరావుగారికి Lifetime Achievement Award ఇస్తున్న సందర్భంలో, తెలుగునాడి సంపాదకులు జంపాల చౌదరి గారి ప్రేరణ పై జూలై 2007 తెలుగునాడి సంచికకి రాసిన సంక్షిప్త వ్యాసం ఈ వ్యాసానికి మూలం.
పూర్తిగా చదవండి

Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi)

జూలై 2007, వ్యాసాలు Rajeshwar Mittapalli
Ra.Vi.Sastri’s Alpajeevi, together with Buchibabu’s Chivaraku Migiledi (That Which Remains at the End), heralded modernism in Telugu fiction by lending it a new psychological depth. Prior to their publication Telugu novels tended to be patently romantic in orientation and thus hardly served the purpose of truth—psychological or social.
పూర్తిగా చదవండి

చిత్తవృత్తికి భౌతిక వాస్తవికతను నేర్పేకథే “కుల వృత్తి”

వ్యాసాలు డా.వి.ఆర్ . దార్ల
( ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ప్రజాసాహితి మాస పత్రికలో " కులవృత్తి " పేరుతో ఒక కథ రాశారు. దీనిపై ఆ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS