Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నేను చదివిన నవీన్

వి.బి.సౌమ్య, వ్యాసాలు పొద్దు
-వి.బి.సౌమ్య (http://vbsowmya.wordpress.com) ఆధునిక తెలుగు సాహిత్యం లో నవీన్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ” అంపశయ్య ” తో మొదలై ఇప్పటికీ సాగుతూ నవల , కథ , విమర్శ ఇలా వేర్వేరు పాయలు గా చీలినా ఒకటే అంతరాత్మ తో ఇంకా గలగలమంటూ ప్రవహిస్తున్న నది నవీన్. నేను సాహిత్యం, అందునా తెలుగులో, చదివింది తక్కువ. కానీ చదివినంత [...]
పూర్తిగా చదవండి

ఎర్రకోట

వ్యాసాలు పొద్దు
“భూమ్మీద స్వర్గమంటూ ఉంటే అది ఇక్కడే అది ఇక్కడే అది ఇక్కడే!!!” “If there is Heaven on the Earth, It is this, It is this, It is this” “అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్, హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.” అని అమీర్ ఖుస్రో పరవశించి పాడే నాటికి మొఘలులు భారతదేశంలోకి ఇంకా రాలేదు. ఎర్రకోట లాంటి బృహత్తర నిర్మాణమొకటి ఇక్కడ వెలుస్తుందని ఎవరూ ఊహించనైనా లేదు. ఐనా ఎర్రకోటలో షాజహాన్ ఆంతరంగిక [...]
పూర్తిగా చదవండి

చెర కవిత్వం - విప్లవ చైతన్యం

వ్యాసాలు ప్రజాకళ
- జె.సి. అదనపు విలువ దోపిడీని నిరంతరంగా కొనసాగించడానికి అనువుగా వర్గ సమాజం సృష్టించిన మార్మికత (mystification) ను సరుకులమాయ (commodity ferishism) ను అధిగమించి కవిత్వాన్ని తిరిగి నిజమైన విప్లవాచరణగా మార్చిన కొద్దిమంది కవుల్లో చెరబండరాజు అగ్రగణ్యుడు. దిగంబరకవిగా మొదలయి విప్లవ కవిగా ఆయనలో వచ్చిన మార్పు క్రమం విప్లవ గతితర్కానికి అనుగుణమైంది. ఈ మార్పు చెరబండరాజు విప్లవ కవుల్లో అగ్రగణ్యుడు కావడానికి ఎలా తోడ్పడిందో ఈ వ్యాసంలో చర్చిద్దాం. సామాజిక చైతన్యరూపమైన కవిత్వం గతి [...]
పూర్తిగా చదవండి

నెత్తుటి కళ్ళలో ఎత్తిన జెండా

వ్యాసాలు ప్రజాకళ
- శ్యామల చెర గురించి నన్ను రెండు మాటలు మాట్లాడమన్నారు. ఏం మాట్లాడను. మాట్లాడాలంటే చాలా భయంగా ఉంది. బాధగా ఉంది. ఆయన రాసిన కవిత్వం, పాటలు చాలా సహజంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో, ముఖ్యంగా కష్టజీవుల గురించి, కార్మికుల గురించి రాసేవాడు. తాను ఎప్పుడూ పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంట్లో ఉన్నా, బయట వున్నా, బస్సులో వున్నా, సైకిలు మీదున్నా, ఎక్కడ వున్నా కూడ ఆయనకు అదే ఆలోచన. అట్లా ఆలోచిస్తూ, [...]
పూర్తిగా చదవండి

మనుషులూ, జంతువులూ

ఆలోచనలు అవగాహన, వ్యాసాలు ప్రజాకళ
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ ఈనాడు మనుషులకు ఎదురవుతున్న సమస్యల మూలాలు చరిత్ర మొదలవని దశల్లోనే కనబడతాయి. వీటికి ముఖ్య కారణాలు సామాజికమే అయినప్పటికీ కొన్ని జీవశాస్త్రపరంగా కూడా పరిగణించదగ్గవి. మానవ ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి డార్విన్ ప్రతిపాదించిన పరిణామవాదం బాగా పనికొస్తుంది. ఒకటిన్నర శతాబ్దం కిందటి ఈ ప్రతిపాదనలకు ఆధునిక యుగంలో జన్యు విశ్లేషణ ద్వారా రుజువులు లభిస్తున్నాయి. ఈ వివరాలను స్థూలంగానైనా తెలుసుకుంటే ప్రకృతిలో మనిషి ఉనికిని గురించిన సరైన అవగాహన కలుగుతుంది. తక్కిన [...]
పూర్తిగా చదవండి

అంకెలతో పద్య సంకెలలు

వలబోజు జ్యోతి, వ్యాసాలు పొద్దు
-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com) అంకెలతో సాహిత్యానికి చాలా సంబంధం ఉంది. (ఈ మహా సృష్టిని అంకెల ఆధారంతోనే గుర్తిస్తాము.) జ్ఞానానికి సంఖ్య ఆధారం. కాని అంకెకు ప్రత్యేక అస్థిత్వమంటూ లేదు. అసలు అంకెల ఆధారిత పేర్లు, పదబంధాలు ఎన్నో ఉన్నాయి. ఏకావ్రతుడు, త్రివిక్రముడు,చతుర్ముఖుడు, పాంచాలి, సప్తాశ్వుడు, అష్టావక్రుడు, నవనాధుడు, దశకంఠుడు మొదలైనవి. మన కవులు కవితలల్లడానికి ఇదీ అని ఒక వస్తువు కాని, విషయం కాని ఆలోచించరు. కనపడ్డ ప్రతి దానిపై చమత్కార పద్యాలల్లగల ధీమంతులు. ఆద్యుడున్న యప్పు డందరు [...]
పూర్తిగా చదవండి

దళిత గోవిందం

వ్యాసాలు ప్రజాకళ
- రహ్మతుల్లా డాక్టర్ అంబేద్కర్ కుల నిర్ములన జరగాలని ఎందుకుకోరారు? బౌద్దమతాన్ని ఎందుకు స్వీకరించారు? హిందూ మతానికి ఈ రోజు కుల వ్యవస్థే ప్రధానశత్రువు. దళితులు, మైనారిటీలు తమకు జరిగే అవమానాలను దిగమింగుకోవాలి. తమ మానమర్యాదలు మంటగలిసినా ఊరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మెజారిటీ వర్గీయులను ఎదుర్కోలేరు కాబట్టి. వాళ్ళు ఏది చెబితే అది వినాలి.విధేయతతో మసలుకోవాలి. యుద్దం చేయటం కన్నా ఓర్పుతో ఉండడం చాలా తేలిక. సంకుచిత మనస్తత్వం గల పిడివాదులనీ వర్గ విభేదం సృష్ఠించే వాళ్ళనీ [...]
పూర్తిగా చదవండి

పుస్తక సమీక్షలు

వ్యాసాలు పొద్దు
సి.బి.రావు! తెలుగులో బ్లాగుసమీక్షలు రాయడం మొదలుపెట్టిందాయన. బ్లాగరుల సమావేశాలకు పెద్ద. తెలుగులో సశేష బ్లాగులు అశేషంగా రచించి, ఇంకా రచిస్తూ వస్తున్న సీరియల్ బ్లాగరి. ఆయన రాసే సచిత్ర సమావేశ నివేదికలు చదవడం కోసం తెలుగు బ్లాగరులు దీప్తిధార (రావుగారి బ్లాగు) వద్ద కాపు వేసి ఉంటారు. ఇప్పటికి ఎన్నో బ్లాగులను సమీక్షించిన సి.బి.రావుగారు ఈ వ్యాసంలో పుస్తకసమీక్షల గురించి వివరిస్తున్నారు. రావుగారు పక్షి వీక్షకుడు కూడా ————– దాదాపు అన్ని పత్రికల్లోనూ పుస్తక సమీక్షలు వస్తూ ఉంటాయి. ఒక [...]
పూర్తిగా చదవండి

విషయ సూచిక: నిశ్శబ్దంలో నీ నవ్వులు

నిశ్శబ్దంలో నీ నవ్వ, వ్యాసాలు సంపాదకులు
తమ్మినేని యదుకుల భూషణ్‌ గారు కథకుడిగా, కవిగా సమీక్షకుడిగా, అనువాదకుడిగా ఈమాట పాఠకులకు సుపరిచితులు. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే ఈ కవితాసంకలనం, “సముద్రం” అనే కథల సంపుటి కూడ ప్రచురించారు. జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. విషయ సూచిక ఇస్మాయిల్ గారి ముందుమాట– “భూషణీయం” ఎండ నల్లటి జ్ఞాపకాన్ని… ప్రేమ పదార్థం తడిచేతుల [...]
పూర్తిగా చదవండి

ఆదిమానవుల సైన్స్‌

ఆలోచనలు అవగాహన, వ్యాసాలు ప్రజాకళ
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ ‌ విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తూ కాదు. సమష్టిగా రోజువారీ జీవితాల్లో ఎదురయే కష్టాలను ఎదుర్కుంటూ, ప్రకృతిని గురించి నలుగురికీ పనికొచ్చే సమాచారాన్ని పోగుచెయ్యడం, దాన్ని విశ్లేషించి సత్యాలను రూఢిగా తెలుసుకోవడం మొదలైన ప్రయత్నాలు తొలి మానవసమాజాలన్నీ చేస్తూనే వచ్చాయి. ఇలా పోగుపడిన సమాచారమే రాబోయే తరాలు కనిపెట్టిన విషయాలకు పునాది అయింది. ఈ విషయాలన్నిటికీ ఎడతెగని సంబంధం ఉండేది. విజ్ఞానమంటే సక్రమంగా వ్యవస్థీకరించబడిన సమాచారమే గనక మొదట్లో అస్పష్టంగా గోచరించిన విషయాలే ఎన్నో [...]
పూర్తిగా చదవండి

చిత్తవృత్తికి భౌతిక వాస్తవికతను నేర్పేకథే “కుల వృత్తి”

వ్యాసాలు ప్రజాకళ
- డా. దార్ల వెంకటేశ్వరరావు 1.0. ప్రస్తావన: పవిత్రత - అపవిత్రతలనేవి ఒకదాన్ని ఒకటి వెన్నంటి ఉంటాయి. పవిత్రత అనేది ఒక భావన. మానవులు ఏర్పరుచుకున్న ఆచార సంప్రదాయాల నుండి రూపొందిన భావన. మానవుడు ఆదిమ కాలంలో ప్రకృతి శక్తులతో పోరాడి, తాత్కాలిక ఉపశమనం కోసం పంచభూతాలను దైవశక్తులుగా భావించుకున్నాడు. నిత్య జీవితంలో వాటి అవసరాన్ని గుర్తెరిగి వాటిని పరిరక్షించుకోవటానికి ఎంతగానో ప్రయత్నించాడు. వాటితో ప్రతి జీవికి గల సంబంధాన్ని విడదీయరానిదనీ త్వరలోనే గుర్తించగలిగాడు. అదిమ [...]
పూర్తిగా చదవండి

గూడెం నుండి బయట పడండి

వ్యాసాలు ప్రజాకళ
- సాంబయ్య గుండిమెడ కమ్యూనిస్ట్, నక్సలైట్, హేతువాద, దళిత, స్త్రీవాదులు నడిపిన సామాజిక, సాహిత్య ఉద్యమాలు తెలుగు జాతిని ముఖ్యంగా సామాజిక పీడనకు, రాజకీయ అణచివేతకు, ఆర్థిక దోపిడికి గురైన వర్గాలలో ఒక గొప్ప చైతన్య స్ఫూర్తిని ఆవిష్కరించాయి. ఈ ఉద్యమాల చైతన్య జవసత్వాల అధారంతో తరతరాలుగా సామాజిక అణచివేతకు, అవమానానికి గురై, అంధకారంలో అలమటించిన మాదిగలు ఏ కులం పేరుతో తాము అవమానించబడ్డారో అదే కులాన్ని భూమికగ ‘దండోరా’ పేరుతో ఒక మహోన్నతమైన సామాజిక ఉద్యమాన్ని [...]
పూర్తిగా చదవండి

రచనలే కాదు, జీవితమూ ఆదర్శప్రాయమే! - ఓల్గా

వ్యాసాలు ప్రజాకళ
ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, స్వయంకృషి, సృజనాత్మకత వీటన్నిటికీ కలిపి ఒక రూపం వస్తే ఆ మనిషి వాసిరెడ్డి సీతాదేవి. ఎంత పట్టుదల, తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలనే తపన లేకపోతే ఒక చిన్న గ్రామంలో, రోడ్డు దాటి బడికి వెళ్ళడం ఆడపిల్లలకు నిషేధమైన నిర్బంధ సంప్రదాయాల లోంచి మద్రాసు మహా నగరం చేరుతుంది ఒక అమ్మాయి! ఇల్లు విడిచి మహా నగరంచేరి ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ తృప్తిపడి ఊరుకోలేదా అమ్మాయి. ఉద్యోగం, సాహితీ వ్యాసంగం, ఉన్నత విద్య సాధించి తెలుగువారు [...]
పూర్తిగా చదవండి

తెలుగు వర్ణ నిర్మాణం (phonology) - రెండవ భాగం

అతిథి, వ్యాసాలు పొద్దు
గమనిక: ఈమాట సంపాదకులు సురేశ్ కొలిచాల గారు రాసిన ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఏడవ తేదీన ప్రచురించబడింది. హల్లులలో ప్రయత్న భేదాలు గాలిని నిరోధించడంలో ఉండే ప్రయత్న భేదాలను బట్టి హల్లులను ఇంకా సూక్ష్మంగా విభజించవచ్చు. స్పర్శాలు (stops/plosives): గాలిని క్షణకాలం పూర్తిగా నిరోధించి విడవడం వల్ల ఏర్పడే ధ్వనులు స్పర్శాలు. సంస్కృత వర్ణమాలలో క నుండి భ- వరకు ఉన్న అక్షరాలు స్పర్శాలు. అనునాసికలు (nasals): ఆస్య వివరం ద్వారా కాక, నాసికా [...]
పూర్తిగా చదవండి

గుజరాత్‌ సరే, ఇక్కడి ‘ ఎన్‌కౌంటర్ల’ మాటేమిటి?

వ్యాసాలు వరవరరావు
సోహ్రాబుద్దీన్‌ షేక్‌, కౌసర్‌బీ (గుజరాత్‌ పోలీసులచే ఎన్‌కౌంటర్‌ హత్యకు గురయిన భార్యాభర్తలు)ల ఉదంతం అనివార్యంగా ఒక ప్రశ్నకు తావిస్తుంది: ‘మన రాష్ట్రంలో అటువంటి బూటకపు ఎన్‌కౌంటర్‌లో పాత్ర ఉన్నప్పటికీ కనీసం ఎస్‌.ఐ. స్థాయి పోలీసు అధికారి అయినా ఎన్నడైనా నేరారోపణ నెదుర్కొన్నాడా?’ (ప్రస్తావిత గుజరాత్‌ ఎన్‌కౌంటర్‌ ముగ్గురు ఐపిఎస్‌ అధికారుల - ఇద్దరు గుజరాత్‌, మరొకరు రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన వారు- సస్పెన్షన్‌, అరెస్ట్‌కు దారితీసింది). సొహ్రబుద్దీన్‌, కౌసర్‌బీల ఎన్‌కౌంటర్‌ లో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకూ ప్రమేయం ఉందని [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS